1.ఈ-ప్రొసీడింగ్స్ అంటే ఏమిటి?

ఈ-ప్రొసీడింగ్స్ అనేది ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో పూర్తి స్థాయిలో ఎలక్ట్రానిక్ విధానంలో విచారణలను నిర్వహించడానికి ఉపయోగించే వేదిక. ఈ సేవను ఉపయోగించి, నమోదు చేయబడిన ఏ వినియోగదారుడైనా (లేదా అతని అధీకృత ప్రతినిధి) ఆదాయ పన్ను శాఖ జారీ చేసిన ఏదైనా నోటీసు / సమాచారం / లేఖను వీక్షించి, దానికి ప్రతిస్పందనను సమర్పించవచ్చు.

2. ఈ-ప్రొసీడింగ్స్ వల్ల కలిగే ప్రయోజనాలు ఏమిటి?

ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన అన్ని నోటీసులు / సమాచారాలు / లేఖలకు ఎలక్ట్రానిక్‌గా స్పందించడానికి ఈ-ప్రొసీడింగ్స్ ఒక సులభమైన మార్గం. ఆదాయపు పన్ను కార్యాలయానికి వెళ్లవలసిన అవసరం లేనందున, ఇది పన్ను చెల్లింపుదారుపై నిబంధనల పాటింపు భారాన్ని తగ్గిస్తుంది. అంతేకాకుండా, సమర్పణలను పర్యవేక్షించడం మరియు భవిష్యత్తు అవసరాల కోసం రికార్డులను భద్రపరచడం సులభం.

3. నాకు జారీ చేసిన నోటీసుకు నా సమాధానాన్ని ఇచ్చిన తర్వాత, నేను ఆ సమాధానాన్ని చూడగలనా?

అవును, ఈ-ప్రొసీడింగ్స్‌లో మీరు లేదా మీ అధీకృత ప్రతినిధి సమర్పించిన ప్రతిస్పందనను మీరు చూడవచ్చు.

మార్గం: డాష్‌బోర్డ్ >>పెండింగ్‌లో ఉన్న చర్య >> ఈ-ప్రొసీడింగ్ >> మీ సమాచారం కోసం

4. ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని u/s 143(1)(a) / ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని 270(1)(a) ప్రకారం చేసిన సర్దుబాటుపై నేను సమర్పించిన ప్రతిస్పందనకు సంబంధించి ఏవైనా ప్రశ్నలు లేవనెత్తబడితే, వాటిని నేను ఎక్కడ చూడగలను?

ఆదాయపు పన్ను శాఖ లేవనెత్తిన ప్రశ్నలను మీరు ఈ-ప్రొసీడింగ్స్ కింద చూడవచ్చు.

మార్గం: డాష్‌బోర్డ్ >> పెండింగ్‌లో ఉన్న చర్య >> ఈ-ప్రొసీడింగ్ >> మీ తదుపర చర్య కోసం

5. ప్రొసీడింగ్ గడువు తేదీకి ఇంకా 4 రోజులు మిగిలి ఉన్నప్పటికీ, నేను నా ప్రతిస్పందనను ఎందుకు సమర్పించలేకపోతున్నాను?

మీ ప్రొసీడింగ్ స్టేటస్ ఓపెన్‌లో ఉంటే, ప్రొసీడింగ్ లిమిటేషన్ తేదీకి 7 రోజుల ముందు వరకు, సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే సబ్మిట్ రెస్పాన్స్ ఆప్షన్ అందుబాటులో ఉంటుంది. ప్రొసీడింగ్ లిమిటేషన్ తేదీ లేకపోతే, ఆదాయపు పన్ను అథారిటీ ఇ-సబ్మిషన్ ఆప్షన్‌ను మూసివేయవచ్చు. అయితే, ఆదాయపు పన్ను అథారిటీ విచక్షణ మేరకు, ప్రొసీడింగ్ లిమిటేషన్ తేదీ వరకు సబ్మిషన్ విండోను తిరిగి ఎనేబుల్ చేయవచ్చు.

6. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నోటీసుకు ప్రతిస్పందించిన తర్వాత, నేను నా సమాధానాన్ని సవరించవచ్చా?

లేదు, ఈ-ఫైలింగ్ పోర్టల్‌పై మీ ప్రతిస్పందనను సమర్పించిన తరువాత మీరు దానిని సవరించలేరు.

7. ఆదాయపు పన్ను చట్టం, 1961 మరియు ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం ఈ-ప్రొసీడింగ్స్ కింద నేను ఏ నోటీసులు/ఆదేశాలకు ప్రతిస్పందించవచ్చు?

ఆదాయపు పన్ను శాఖ మరియు CPC జారీ చేసిన అన్ని నోటీసులు / సమాచారం / లేఖలు ఈ-ప్రొసీడింగ్స్ క్రింద అందుబాటులో ఉంచబడ్డాయి. అక్కడ మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో వాటిని అప్లోడ్ చేయడం ద్వారా అటాచ్‌మెంట్‌లతో పాటు ప్రతిస్పందనలను వీక్షించి సమర్పించవచ్చు. ఈ సేవ ద్వారా మీరు క్రింది నోటీసులకు సంబంధించిన ప్రతిస్పందనలను వీక్షించి సమర్పించవచ్చు.

  • ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని u/s 139(9) లేదా ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని 263(7) ప్రకారం లోపభూయిష్ట నోటీసు
  • ఆదాయ పన్ను చట్టం, 1961 లోని u/s 143(1)(a) లేదా ఆదాయ పన్ను చట్టం, 2025 లోని 270(1)(a) ప్రకారం ప్రాథమిక సర్దుబాటు.
  • ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని u/s 154 లేదా ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని 284 ప్రకారం సుమోటోగా సవరణ
  • మదింపు అధికారి జారీ చేసిన నోటీసులు
  • ‘వివరణ కోరండి’ సమాచారం

మార్గం: డాష్‌బోర్డ్ >> పెండింగ్‌లో ఉన్న చర్య >> ఈ-ప్రొసీడింగ్ >> మీ చర్య కోసం

8. AO జారీ చేసిన నోటీసుకు సమాధానం ఇచ్చేటప్పుడు, జతపరచాల్సిన ఫైళ్ల సంఖ్య/పరిమాణం అనుమతించబడిన పరిమితిని మించి ఉంటే, నేను ఏమి చేయాలి?

సమాధానం:

ఒక అటాచ్‌మెంట్‌కు అనుమతించబడిన గరిష్ట పరిమాణం 5 MB. మీరు అప్లోడ్ చేయడానికి ఒకటి కంటే ఎక్కువ పత్రాలు కలిగి ఉంటే, గరిష్టంగా 10 అటాచ్‌మెంట్‌లను ఎంచుకోవచ్చు. అన్ని అటాచ్‌మెంట్‌ల మొత్తం పరిమాణం 50 MB మించకూడదు. ఒకే పత్రం పరిమాణం అనుమతించబడిన పరిమితిని మించి ఉంటే, ఫైల్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా ఆ పత్రాన్ని ఆప్టిమైజ్ చేయవచ్చు.

9. లోపభూయిష్ట రిటర్న్ అంటే ఏమిటి?

ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139(9) లేదా ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని 263(7) ప్రకారం, రిటర్న్‌లో లేదా షెడ్యూల్‌లలో అసంపూర్ణమైన లేదా అసంగతమైన సమాచారం ఉండడం వల్ల లేదా ఇతర ఏ కారణం చేతనైనా రిటర్న్‌ను లోపభూయిష్టమైనదిగా పరిగణించవచ్చు.

10. నా రిటర్న్ లోపభూయిష్టమైనదో కాదో నేను ఎలా తెలుసుకోగలను?

మీ ఆదాయపు పన్ను రిటర్న్ లోపభూయిష్టమైనదిగా గుర్తించబడితే, ఆదాయపు పన్ను శాఖ ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139(9) లేదా ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని సెక్షన్ 263(7) ప్రకారం మీ నమోదిత ఈ-మెయిల్ ID కి లోపభూయిష్ట నోటీసును పంపుతుంది. అదే నోటీసును మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయి కూడా చూడవచ్చు.

మార్గం: డాష్‌బోర్డ్ >> పెండింగ్‌లో ఉన్న చర్య >> ఈ-ప్రొసీడింగ్ >> మీ చర్య కోసం

11. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నా సమాధానాన్ని సమర్పించిన తర్వాత, నేను దానిని అప్‌డేట్ చేయవచ్చా లేదా ఉపసంహరించుకోవచ్చా?

లేదు, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో సమర్పించిన తర్వాత మీరు మీ ప్రతిస్పందనను అప్‌డేట్ లేదా ఉపసంహరించుకోవడం చేయలేరు.

12. నా లోపభూయిష్ట నోటీసుకు సమాధానం ఇవ్వడానికి నేను వేరొక వ్యక్తికి అధికారం ఇవ్వవచ్చా?

అవును, ఆదాయ పన్ను చట్టం, 1961 లోని u/s 139(9) లేదా ఆదాయ పన్ను చట్టం, 2025 లోని 263(7) ప్రకారం జారీ చేయబడిన లోపభూయిష్టమైన నోటీసుకు సమాధానం ఇవ్వడానికి మీరు మరొక వ్యక్తికి అధికారం ఇవ్వవచ్చు.

13. ఆదాయ పన్ను శాఖ పంపిన లోపభూయిష్టమైన నోటీసుకు నేను ఎంత సమయంలోపు సమాధానం ఇవ్వవచ్చు?

మీ రిటర్న్ లోపభూయిష్టమైనదిగా గుర్తించబడితే, మీరు దాఖలు చేసిన రిటర్న్‌లోని లోపాన్ని సరిదిద్దడానికి, నోటీసు అందిన తేదీ నుండి 15 రోజుల గడువు లేదా నోటీసులో పేర్కొన్న గడువు సమయం లభిస్తుంది. అయితే, మీరు వాయిదా కోరుతూ గడువు పొడిగింపు కోసం అభ్యర్థించవచ్చు.

మార్గం: డాష్‌బోర్డ్ >> పెండింగ్‌లో ఉన్న చర్య >> ఈ-ప్రొసీడింగ్ >> మీ చర్య కోసం

14. నేను లోపభూయిష్ట నోటీసుకు స్పందించకపోతే ఏమవుతుంది?

నిర్దేశిత గడువులోగా లోపభూయిష్ట నోటీసుకు  మీరు స్పందించకపోతే, మీ రిటర్న్ చెల్లనిదిగా పరిగణించబడవచ్చు. తద్వారా, ఆదాయ పన్ను చట్టం, 1961 లేదా ఆదాయ పన్ను చట్టం, 2025 ప్రకారం, జరిమానా, వడ్డీ, నష్టాలను తదుపరి సంవత్సరాలకు ముందుకు తీసుకెళ్లలేకపోవడం నిర్దిష్ట మినహాయింపులను కోల్పోవడం వంటి పరిణామాలు సంభవించవచ్చు.

15. ఆదాయ పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139(9) లేదా ఆదాయ పన్ను చట్టం, 2025 లోని సెక్షన్ 263(7) ప్రకారం నాకు లోపభూయిష్టమైన నోటీసు జారీ చేయబడింది. ఆ నిర్దిష్ట అసెస్‌మెంట్ సంవత్సరం/పన్ను సంవత్సరం కోసం నేను తాజా రిటర్నును దాఖలు చేయవచ్చా?

అవును, ఒక నిర్దిష్ట అసెస్‌మెంట్ సంవత్సరం / పన్ను సంవత్సరంలో రిటర్న్ దాఖలు చేయడానికి అనుమతించబడిన గడువు ముగియని పక్షంలో, మీరు రిటర్న్‌ను తాజా / సవరించిన రిటర్న్‌గా దాఖలు చేయవచ్చు. ప్రత్యామ్నాయంగా, మీరు u/s 139/263 ప్రకారం నోటీసుకు ప్రతిస్పందించడాన్ని ఎంచుకోవచ్చు.

అయితే, ఒక నిర్దిష్ట అసెస్‌మెంట్ సంవత్సరం / పన్ను సంవత్సరానికి సంబంధించి రిటర్న్ దాఖలు చేయడానికి అనుమతించబడిన గడువు ముగిసిన తర్వాత, మీరు రిటర్న్‌ను తాజా / సవరించిన రిటర్న్‌గా దాఖలు చేయలేరు. అప్పుడు మీరు u/s 139(9) లేదా ఆదాయ పన్ను చట్టం, 2025 లోని 263(7) ప్రకారం జారీ చేయబడిన నోటీసుకు ప్రతిస్పందించాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు ఆ నోటీసుకు ప్రతిస్పందించలేకపోతే, ఆ అసెస్‌మెంట్ సంవత్సరానికి సంబంధించి మీ రిటర్న్ చెల్లనిదిగా లేదా దాఖలు చేయనిదిగా పరిగణించబడుతుంది.

మార్గం: డాష్‌బోర్డ్ >> పెండింగ్‌లో ఉన్న చర్య >> ఈ-ప్రొసీడింగ్ >> మీ చర్య కోసం

16. రిటర్న్‌ను లోపభూయిష్టంగా మార్చే కొన్ని సాధారణ తప్పులు ఏమిటి?

రిటర్న్ లోపభూయిష్టం కావడానికి కారణమయ్యే కొన్ని సాధారణ తప్పులు క్రింది విధంగా ఉంటాయి:

  • TDS క్రెడిట్ క్లెయిమ్ చేయబడింది, కానీ దానికి సంబంధించిన ఆదాయం లేదా రసీదులను పన్ను పరిధిలోకి చూపించడం విస్మరించబడింది.
  • TDS క్రెడిట్ క్లెయిమ్ చేయబడిన ఫారం 26AS మరియు AIS లో చూపిన స్థూల రసీదులు, ఆదాయపు రిటర్న్‌లో అన్ని ఆదాయ శీర్షికల కింద చూపిన మొత్తం రసీదుల కంటే ఎక్కువగా ఉన్నాయి.
  • స్థూల మొత్తం ఆదాయం మరియు అన్ని ఆదాయ శీర్షికలు శూన్యం లేదా 0 గా నమోదు చేయబడినప్పటికీ, పన్ను భారాన్ని లెక్కించి చెల్లించడం జరిగింది.
  • ITRలోని పన్ను చెల్లింపుదారు పేరు, PAN డేటాబేస్‌లోని పేరుతో సరిపోలడం లేదు.
  • పన్ను చెల్లింపుదారులకు వ్యాపారం లేదా వృత్తి ద్వారా లాభాలు మరియు ఆదాయాలు శీర్షిక కింద ఆదాయం ఉన్నప్పటికీ, వారు బ్యాలెన్స్ షీట్ మరియు లాభనష్టాల ఖాతాను నింపలేదు.

17. ‘వివరణ కోరండి’ అనే కమ్యూనికేషన్ అంటే ఏమిటి?

రిటర్న్‌లోని షెడ్యూల్ లేదా అనుబంధాల కింద అందించిన సమాచారం సరిపోని లేదా తగినంతగా లేని సందర్భాలలో మరియు పన్ను చెల్లింపుదారుడు చేసిన కొన్ని క్లెయిమ్‌లపై వివరణ అవసరమైనప్పుడు, పన్ను చెల్లింపుదారుడికి ' వివరణ కోరండి’ కమ్యూనికేషన్ పంపబడుతుంది.

అనుసరించాల్సిన మార్గం: డ్యాష్‌బోర్డ్ >> పెండింగ్‌లో ఉన్న చర్య >> ఈ-ప్రొసీడింగ్ >> మీ చర్య కోసం

18. ఈ ప్రొసీడింగ్స్ సేవను ఉపయోగించి ప్రతిస్పందనలను చూడడానికి, సమర్పించడానికి నేను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ కావాలా?

అవును, ఈ-ప్రొసీడింగ్స్ సేవను ఉపయోగించి ప్రతిస్పందనలను చూడడానికి, సమర్పించడానికి మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ కావాలి.

మార్గం: డాష్‌బోర్డ్ >> పెండింగ్ చర్య >> ఈ-ప్రొసీడింగ్

19. ఈ-ప్రొసీడింగ్స్ సేవను ఉపయోగించి సమర్పించిన సమాధానం/ సబ్మిషన్‌ను నేను ఈ-వేరిఫై చేయాలా?

లేదు, మీరు ఈ-ప్రొసీడింగ్స్ సేవను ఉపయోగించి సమర్పించిన ప్రతిస్పందనను ఈ-వెరిఫై చేయాల్సిన అవసరం లేదు.

20. నేను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ కాకుండానే ‘వివరణ కోరండి’ నోటీసుకు స్పందించవచ్చా?

లేదు, 'వివరణ కోరండి' అని వచ్చిన సందేశానికి సమాధానం ఇవ్వడానికి మీరు తప్పనిసరిగా లాగిన్ అవ్వాల్సి ఉంటుంది. మీకు జారీ చేసిన నోటీసును చూడటం గానీ, లేదా ఆ నోటీసుకు సమాధానాన్ని సమర్పించడం గానీ మీరు చేయలేరు.

మార్గం: డాష్‌బోర్డ్ >> పెండింగ్‌లో ఉన్న చర్య >> ఈ-ప్రొసీడింగ్ >> మీ చర్య కోసం

21. ఆదాయ పన్ను శాఖ నాకు జారీ చేసిన నోటీసులకు నా తరపున వేరొకరు ఈ-ప్రొసీడింగ్స్ సేవను ఉపయోగించి సమాధానం ఇవ్వవచ్చా?

అవును, మీరు ఈ-ప్రొసీడింగ్స్ సేవను ఉపయోగించి మీ తరపున నోటీసుకు ప్రతిస్పందించడానికి ఒక అధీకృత ప్రతినిధిని జోడించవచ్చు.

22. ఇప్పటికే జోడించిన / ఉన్న అధీకృత ప్రతినిధిని నేను తొలగించవచ్చా?

అవును, మీరు మీ ద్వారా అధికారం ఇవ్వబడిన ప్రతినిధిని తొలగించవచ్చు.

23. నాకు జారీ చేసిన నోటీసుకు ప్రతిస్పందించడానికి నేను ఇద్దరు అధీకృత ప్రతినిధులను జోడించవచ్చా?

లేదు, కార్యకలాపాలు కొనసాగించడానికి మీరు ఒకరిని మాత్రమే అధీకృత ప్రతినిధిగా కలిగి ఉండవచ్చు.

24. నేను సవరించిన రిటర్న్‌ను దాఖలు చేశాను.నాకు జారీ చేయబడిన ‘వివరణ కోరండి’ కమ్యూనికేషన్‌కు నేను ఇంకా స్పందించాలా?

లేదు, మీరు అదే అసెస్‌మెంట్ సంవత్సరం / పన్ను సంవత్సరానికి ఇప్పటికే సవరించిన రిటర్న్‌ను దాఖలు చేసి ఉంటే, ప్రతిస్పందనను సమర్పించడానికి అనుమతించబడదు. ‘ఈ నోటీసుకు సంబంధించి సవరించిన రిటర్న్ దాఖలు చేయబడింది; ఇకపై ఎలాంటి చర్య అవసరం లేదు’ అనే సందేశం ప్రదర్శించబడుతుంది.

25. నాకు జారీ చేయబడిన ‘వివరణ కోరండి’ సమాచారానికి నేను స్పందించడం తప్పనిసరా? ఒకవేళ అవును అయితే, నా సమాధానాన్ని నేను ఎంత సమయంలోగా సమర్పించాలి?

మీకు జారీ చేసిన సమాచారంలో పేర్కొన్న గడువు తేదీ ప్రకారం మీరు మీ ప్రతిస్పందనను సమర్పించాలి / అందించాలి. ఒకవేళ గడువు తేదీ ముగిసిపోయి, ఎటువంటి ప్రతిస్పందన అందించబడకపోతే, CPC తమ వద్ద అందుబాటులో ఉన్న సమాచారంతోనే రిటర్న్‌ను ప్రాసెస్ చేస్తుంది.

26. వెబ్‌సైట్‌లో సబ్మిట్ రెస్పాన్స్ బటన్ ఎందుకు పనిచేయడం లేదు?

సబ్మిట్ రెస్పాన్స్ బటన్ కింది కారణాల వల్ల పని చేయకపోవచ్చు.

  • CPC నోటీసుల కోసం - ప్రతిస్పందన గడువు తేదీ ముగిసిపోయినట్లయితే
  • ITBA నోటీసుల కోసం - ఆదాయపు పన్ను అధికారం ద్వారా ప్రొసీడింగ్స్ స్థితి మూసివేయబడినా/నిరోధించబడినా.