అధీకృత సంతకందారుని జోడించండి -యూజర్ మాన్యువల్
1. అవలోకనం
ఈ సేవ, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వినియోగదారులందరికీ అందుబాటులో ఉంటుంది. దేశం వెలుపల ఉండటంవలన, ప్రవాస భారతీయులు కావడంవలన లేదా మరే ఇతర కారణం వల్లనైనా తమ ITRలు, ఫారాలు లేదా సేవా అభ్యర్థనలను స్వయంగా ధ్రువీకరించుకోలేని వినియోగదారులు—తమ తరపున ఆ ధ్రువీకరణ ప్రక్రియను పూర్తి చేయడానికి మరొక వ్యక్తికి అధికారం ఇవ్వడానికి ఈ సేవ వీలు కల్పిస్తుంది. అంతేకాకుండా, వినియోగదారులు రిప్రజెంటేటివ్ పన్ను చెల్లింపుదారులుగా నమోదు చేసుకుని, మరొక వ్యక్తి తరపున వ్యవహరించడానికి కూడా ఈ సేవ అనుమతిస్తుంది.
2. ఈ సేవను పొందడానికి కావలసిన ముందస్తు అర్హతలు
-
చెల్లుబాటయ్యే యూజర్ ID మరియు పాస్‌వర్డ్
-
PAN ఆధార్ నంబర్‌తో అనుసంధానించబడింది
3. ప్రక్రియ / దశలవారీ మార్గదర్శిని
3.1 మరొక వ్యక్తి తరపున వ్యవహరించడానికి నమోదు చేసుకోండి
దశ 1:ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లండి.
దశ 2:వినియోగదారుని ID మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
దశ 3: అధికారిక భాగస్వాములు విభాగానికి వెళ్లి, తన తరపున వ్యవహరించడానికి మరొక వ్యక్తికి అధికారం ఇవ్వడం పై క్లిక్ చేయండి
దశ 4: మొదలుపెడదాం పై క్లిక్ చేయండి
దశ 5: + అధీకృత సంతకం చేసేవారిని యాడ్ చేయండి పై క్లిక్ చేయండి
దశ 6: అధీకృత సంతకం చేసేవారిని యాడ్ చేయడానికి గల కారణాన్ని ఎంచుకోండి, ఆ వ్యక్తి యొక్క PAN వివరాలను నమోదు చేయండి మరియు మీరు అధికారం ఇస్తున్న కాల వ్యవధిని (ప్రారంభ తేదీ - నుండి - ముగింపు తేదీ) లేదా పనిని ఎంచుకోండి.
గమనిక:
దిగువ పనుల కోసం అధీకృత సంతకం చేసేవారిని యాడ్ చేయవచ్చు:
- ఆదాయపు పన్ను రిటర్న్ సమర్పణ మరియు ధ్రువీకరణ
- ఆదాయపు పన్ను రిటర్న్ ధ్రువీకరణ
- ఫారం సమర్పణ
- సేవా అభ్యర్థన సమర్పణ
దశ 7: ఇప్పుడు, అభ్యర్థనను ధ్రువీకరించడానికి, ఈ-ఫైలింగ్ లో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ IDకి వచ్చిన 6-అంకెల OTPని నమోదు చేయండి
దశ 8:అభ్యర్థన విజయవంతంగా సమర్పించబడింది. ఇప్పుడు అధీకృత సంతకం చేసేవారు 7 రోజులలోపు ఈ అభ్యర్థనను ఆమోదిస్తారు. ఆదాయపు పన్ను శాఖ దీనిని 7 రోజులలోపు ప్రాసెస్ చేస్తుంది.
అభ్యర్థనను చూడటానికి వీవ్ రిక్వెస్ట్ పై క్లిక్ చేయండి.
3.2 అధీకృత సంతకం చేసేవారిచే అభ్యర్థన ఆమోదం:
దశ 1:ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లండి.
దశ 2:వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
దశ 3: పెండింగ్ యాక్షన్స్ కు వెళ్లి, వర్క్ లిస్ట్ పై క్లిక్ చేయండి.
దశ 4: వర్క్‌లిస్ట్ తెరుచుకుంటుంది, అక్కడ అధీకృత సంతకం చేసేవారిని జోడించండి కోసం అసెస్సీ లేవనెత్తిన అభ్యర్థనను మీరు చూడవచ్చు. అభ్యర్థనను ఆమోదించడానికి అంగీకరించు పై క్లిక్ చేయండి.
దశ 5: ఇప్పుడు 'అటాచ్ ఫైల్' పై క్లిక్ చేసి, పవర్ ఆఫ్ అటార్నీని జత చేయండి; ఆపై 'కంటిన్యూ టు వెరిఫికేషన్' పై క్లిక్ చేయండి.
గమనిక:
1) గరిష్ట ఫైల్ పరిమాణం 5 MB ఉండవచ్చు.
2) ఫైళ్లను PDF రూపంలో మాత్రమే అప్‌లోడ్ చేయగలరు.
దశ 6: ఇప్పుడు, దిగువ పేర్కొన్న ధ్రువీకరణ పద్ధతుల ద్వారా అభ్యర్థనను ధ్రువీకరించండి:

దశ 7: 'ఆధార్ వివరాలను ధ్రువీకరించండి' పై క్లిక్ చేయండి, 'ఆధార్ OTPని రూపొందించండి' ని ఎంచుకోండి మరియు మీ నమోదిత మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPని నమోదు చేయండి.

దశ 8:ఈ-ధ్రువీకరణ విజయవంతమైన తర్వాత, ఒక నిర్ధారణ సందేశం కనిపిస్తుంది. ఫారాన్ని సమర్పించడానికి 'అవును' పై క్లిక్ చేయండి.
ధ్రువీకరణ పూర్తయిన తర్వాత, ఆదాయపు పన్ను శాఖ అభ్యర్థనను ప్రాసెస్ చేస్తుంది; ఈ ప్రామాణీకరణ అమలులోకి రావడానికి 24 నుండి 72 గంటల సమయం పడుతుంది.
సంబంధిత అంశాలు
పదకోశం
|
సంక్షిప్త నామం / సంక్షిప్త రూపం |
వివరణ/పూర్తి రూపం |
|
AO |
మదింపు అధికారి |
|
AY |
మదింపు సంవత్సరం |
|
AOP |
వ్యక్తుల సంఘం |
|
BOI |
వ్యక్తుల సమూహం |
|
CA |
ఛార్టర్డ్ అకౌంటెంట్ |
|
CPC |
సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్ |
|
ERI |
ఇ-రిటర్న్ మధ్యవర్తి |
|
LA |
స్థానిక అధికారం |
|
TDS |
మూలం నుంచి మినహాయించిన పన్ను |
|
EXTA |
బాహ్య ఏజెన్సీ |
|
ITDREIN |
ఆదాయపు పన్ను శాఖ నివేదించే సంస్థ గుర్తింపు సంఖ్య |
|
HUF |
హిందూ అవిభక్త కుటుంబం |
|
EVC |
ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ |
|
DSC |
డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికెట్ |
|
ITD |
ఆదాయపు పన్ను శాఖ |
|
ITR |
ఆదాయపు పన్ను రిటర్న్ |