అంతర్జాల బ్యాంకింగ్‌తో లాగిన్ అవ్వండి యూజర్ మాన్యువల్

 

1. అవలోకనం

లాగిన్ సేవ ద్వారా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వినియోగదారు తన ఖాతాలోకి ప్రవేశించి, పోర్టల్‌లో అందుబాటులో ఉన్న అన్ని సేవలను ఉపయోగించుకోవచ్చు.

ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడానికి వివిధ పద్ధతులు ఉన్నాయి. నమోదు చేయవలసిన ఆధారాలతో పాటు అన్ని లాగిన్ పద్ధతులు క్రింద ఇవ్వబడ్డాయి:
 

లాగిన్ విధానం నమోదు చేయవలసిన ఆధారాలు

నెట్ బ్యాంకింగ్

ఈ-ఫైలింగ్ వాల్ట్ అధిక భద్రత ప్రారంభించబడలేదు
నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్

నెట్ బ్యాంకింగ్

ఈ-ఫైలింగ్ వాల్ట్ అధిక భద్రత ప్రారంభించబడింది
యూజర్ ఐడి (PAN) మరియు పాస్‌వర్డ్‌తో పాటు, రెండో స్థాయి ధ్రువీకరణ కోసం నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌ను ఉపయోగించి లాగిన్ చేయాలి.

బ్యాంక్/డీమ్యాట్ ఖాతా EVC

ఈ-ఫైలింగ్ వాల్ట్ అధిక భద్రత ప్రారంభించబడింది
రెండవ కారక ప్రమాణీకరణ కోసం యూజర్ ఐడి (PAN) & పాస్‌వర్డ్ + బ్యాంక్ ఈవీసీ
 DSC రెండవ కారక ప్రమాణీకరణ కోసం యూజర్ ఐడి (PAN) & పాస్‌వర్డ్ + DSC
యూజర్ ఐడిని ఉపయోగించి లాగిన్ చేయండి – CA, TAN యూజర్, ERI, బాహ్య ఏజెన్సీ, ITDREIN యూజర్ కోసం యూజర్ ఐడి & పాస్‌వర్డ్

చాలా ప్రధాన బ్యాంకులు తమ నెట్ బ్యాంకింగ్ సేవల ద్వారా -ఫైలింగ్ పోర్టల్‌ను యాక్సెస్ చేయడానికి మిమ్మల్ని అనుమతిస్తాయి. పన్ను సంబంధిత సేవల కోసం ఈ-ఫైలింగ్ ఖాతాలలోకి లాగిన్ అవ్వడానికి ఇది ఒక సురక్షితమైన మరియు సులభమైన మార్గం.
మీ బ్యాంకు ఈ సదుపాయాన్ని అందిస్తుందో లేదో తనిఖీ చేయడానికి, మీరు ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌లో నెట్ బ్యాంకింగ్ ఎంపిక కోసం చూడవచ్చు.
ఈ యూజర్ మాన్యువల్‌లో, నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి ఎలా లాగిన్ అవ్వాలో మనం చర్చిస్తాము (ఈ-ఫైలింగ్ వాల్ట్ హయ్యర్ సెక్యూరిటీ ఎనేబుల్ చేయబడి ఉంటే/లేకపోతే).

2. ముందస్తు అవసరాలు

1. ఈ-ఫైలింగ్ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్ (నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ కోసం ఈ-ఫైలింగ్ వాల్ట్ ఎనేబుల్ చేయబడి ఉంటే)
2. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించబడిన మరియు నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ కోసం నామినేట్ చేయబడిన బ్యాంక్ ఖాతాలు ఎనేబుల్ చేయబడి ఉండాలి.
3. నెట్ బ్యాంకింగ్ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్.
4. నెట్ బ్యాంకింగ్ ద్వారా ఈ-ఫైలింగ్ ఖాతాకు లాగిన్ చేయడానికి ముందు, పన్ను చెల్లింపుదారుడు కనీసం ఒక్కసారైనా నెట్ బ్యాంకింగ్‌లో లాగిన్ చేసి ఉండాలి.

3. దశలవారీ ప్రక్రియ:

దశ 1: ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి, ‘లాగిన్’ పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 2: లాగిన్ పేజీలో, ‘నెట్ బ్యాంకింగ్’ పై క్లిక్ చేయండి.

Data responsive

దయచేసి గమనించండి:
1. నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వడానికి ఈ-ఫైలింగ్ వాల్ట్ హయ్యర్ సెక్యూరిటీ ఎనేబుల్ చేయబడి ఉంటే- ముందుగా, మీరు ఈ-ఫైలింగ్ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, ఆపై నెట్ బ్యాంకింగ్ బ్యాంకును ఎంచుకోవాలి.
2. నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వడానికి ఈ-ఫైలింగ్ వాల్ట్ హయ్యర్ సెక్యూరిటీ ఎనేబుల్ చేయబడకపోతే- లాగిన్ పేజీలో, నెట్ బ్యాంకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి.

దశ 3: నెట్ బ్యాంకింగ్‌తో లాగిన్ పేజీలో బ్యాంకును ఎంచుకోండి.

Data responsive

దశ 4: బ్యాంకును ఎంచుకోగానే, ‘మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్ నుండి నిష్క్రమించి, ఇతర పార్టీలచే నిర్వహించబడే వెబ్‌సైట్‌లోకి ప్రవేశిస్తున్నారు’ అనే పాప్-అప్ సందేశం వస్తుంది. 'కంటిన్యూ' (కొనసాగించు) పై క్లిక్ చేయండి

Data responsive

దశ 5: మీ నెట్ బ్యాంకింగ్ ఆధారాలను ఉపయోగించి నెట్ బ్యాంకింగ్ వెబ్‌సైట్‌కు లాగిన్ అవ్వండి.

Data responsive

దయచేసి గమనించండి: నెట్ బ్యాంకింగ్ బ్యాంక్ ఖాతాను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ధ్రువీకరించి, నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ కోసం నామినేట్ చేయాలి.

దశ 6: బ్యాంకు వెబ్‌సైట్‌లో ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్ ట్యాబ్‌ను గుర్తించండి (బ్యాంకు వెబ్‌సైట్‌లోని నావిగేషన్ బ్యాంకును బట్టి మారుతుంది) బ్యాంకు వెబ్‌సైట్‌లో ‘ఆదాయపు పన్ను ఈ-ఫైలింగ్‌కు లాగిన్ అవ్వండి’ పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 7: ఇక్కడ నుండి మీరు నేరుగా ఈ-ఫైలింగ్ వెబ్‌సైట్‌కు మళ్ళించబడతారు

Data responsive