మీ పాస్‌వర్డ్ మార్చండి - తరచుగా అడిగే ప్రశ్నలు
1. నా వినియోగదారు ఐ.డి నాకు గుర్తు లేదు. నేను నా ఖాతాలోకి ఎలా లాగిన్ అవ్వగలను?
ఇ-ఫైలింగ్ పోర్టల్ కొరకు మీ పాన్ ను మీ వినియోదారు ఐ.డి. గా వినియోగించండి మీ ఆధార్ నంబర్‌ను వినియోగదారు ఐ.డి.గా కూడా మీరు ఉపయోగించవచ్చు, ఇది ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీ పాన్‌తో లింక్ చేయబడి ఉంటే మాత్రమే.
2. నా పాస్‌వర్డ్‌ను నా మునుపటి పాస్‌వర్డ్‌లలో ఒకదానికి మార్చవచ్చా?
అవును, మీరు మార్చుకోవచ్చు. అయితే కొత్త పాస్‌వర్డ్ మీ మునుపటి మూడు పాస్‌వర్డ్‌ల మాదిరిగా ఉండకూడదు.
3. నా పాస్‌వర్డ్ అప్‌డేట్ చేయబడిందని నాకు ఎలా తెలుస్తుంది?
మీ లావాదేవీ విజయవంతమైనట్టుగా లావాదేవీ ఐ.డి. తో సహా మీకు సందేశం వస్తుంది. అంతేకాదు, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో నమోదు చేయబడిన మీ మొబైల్ నంబర్ కు మరియు ఇ-మెయిల్ ఐ.డికి ధృవీకరణ సందేశం కూడా వస్తుంది.
4. పాస్‌వర్డ్ మార్పు విఫలమైతే నేను ఏమి చేయాలి?
క్రింది దశలను అనుసరించండి:
- మీ వెబ్ బ్రౌజర్ నుండి మీ తాత్కాలిక ఫైళ్ళను తొలగించండి
- మీ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ చేసి, మీ పాస్‌వర్డ్‌ను మళ్లీ మార్చడానికి ప్రయత్నించండి.
5. "పాస్‌వర్డ్ మార్పు" పేజీలో ఉన్నప్పుడు నేను "రద్దు" బటన్‌ను నొక్కినట్లయితే ఏమవుతుంది?
మీ పాస్‌వర్డ్ అప్‌డేట్ చేయకుండానే మీరు మీ డ్యాష్‌బోర్డ్‌కు మళ్లించబడతారు.
6. నేను నా వినియోగారు ఐ.డి మరియు పాస్‌వర్డ్‌ను మరచిపోయాను. నేను వాటిని తిరిగి ఎలా పొందగలను?
మీ పాన్ నంబరే (లేదా ఆధార్ నంబర్, మీ పాన్ మరియు ఆధార్ నంబర్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లింక్ చేయబడితే) మీ వినియోగదారు ఐ.డి.
మీరు మీ పాస్‌వర్డ్‌ను తిరిగి పొందడానికి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పాస్‌వర్డ్ మర్చిపోయాను ఫీచర్‌ను ఉపయోగించవచ్చు:
- ఆధార్ ఓ.టి.పి; లేదా
- ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన మీ మొబైల్ నంబర్‌పై ఓ.టి.పి స్వీకరించబడింది; లేదా
- ముందే ధృవీకరించిన బ్యాంక్ ఖాతా/డీమాట్ ఖాతా ద్వారా జనరేట్ చేయబడిన ఇ.వి.సి (ఎలక్ట్రానిక్ ధృవీకరణ కోడ్); లేదా
- డి.ఎస్.సి (డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్) ద్వారా జనరేట్ చేయబడుతుంది