రీఫండ్ తిరిగి జారీ యూజర్ మాన్యువల్

 

1. అవలోకనం

ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు అయిన వినియోగదారుల కోసం రీఫండ్ రీఇష్యూ అభ్యర్థన సదుపాయం అందుబాటులో ఉంది. జారీ చేసిన రీఫండ్ విఫలమైనట్లయితే ఈ సదుపాయం ద్వారా మీరు రీఫండ్ రీఇష్యూ అభ్యర్థనను సమర్పించవచ్చు.

2. ఈ సేవను పొందడానికి అవసరమైన ముందస్తు అవసరాలు

  1. చెల్లుబాటు అయ్యే యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న వినియోగదారు
  2. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయబడింది మరియు రీఫండ్ విఫలమయింది
  3. ఇ-ఫైలింగ్ పోర్టల్ లో ధ్రువీకరించబడిన బ్యాంకు ఖాతా
  4. వెరిఫికేషన్ పద్ధతులలో ఏదో ఒకదానికి యాక్సెస్ కలిగి ఉండటం:

 •  ఆధార్‌తో లింక్ అయిన మొబైల్ నంబర్ 
 •  చెల్లుబాటు అయ్యే మరియు ఇ-ఫైలింగ్‌లో నమోదైన DSC
 •  బ్యాంక్ ఖాతా / డీమ్యాట్ ఖాతా / నెట్ బ్యాంకింగ్ ద్వారా EVC

3. దశలవారీ మార్గదర్శిని

రీఫండ్ రీఇష్యూ అభ్యర్థన

దశ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్ లోకి లాగిన్ అవ్వండి.

Data responsive

దశ 2: మీ డ్యాష్‌బోర్డ్ లో, సేవలు విభాగానికి వెళ్ళిరీఫండ్ రీఇష్యూపై క్లిక్ చేయండి

Data responsive

దశ 3: కొత్త రీఫండ్ రీఇష్యూ అభ్యర్థనను సృష్టించడానికి, ‘+క్రియేట్ రీఫండ్ రీఇష్యూ అభ్యర్థన’ పై క్లిక్ చేయండి

Data responsive

దశ 4: క్రియేట్ రీఫండ్ రీఇష్యూ అభ్యర్థన పేజీలో, మీరు ఏ రికార్డుకైతే అభ్యర్థనను సమర్పించాలనుకుంటున్నారో దానిని ఎంచుకుని, ‘కంటిన్యూ’ పై క్లిక్ చేయండి

Data responsive

దశ 5: బ్యాంక్ అకౌంట్ పేజీని ఎంచుకోండి, మీరు ఏ బ్యాంక్ ఖాతాలోనైతే రీఫండ్ పొందాలనుకుంటున్నారో ఆ ఖాతాను ఎంచుకుని, ‘వెరిఫికేషన్ కు కొనసాగండి’ పై క్లిక్ చేయండి."

Data responsive

గమనిక: ఇక్కడ ధ్రువీకరించబడిన బ్యాంక్ ఖాతా వివరాలు మాత్రమే చూపబడతాయి. ధ్రువీకరణ చేయబడిన ఖాతా కాకుండా వేరే బ్యాంక్ ఖాతాలో రీఫండ్ పొందాలనుకుంటే, దయచేసి పైన పేర్కొన్న స్క్రీన్‌లో హైలైట్ చేయబడిన “ బ్యాంక్ ఖాతాను జోడించండి ”లింక్‌పై క్లిక్ చేయండి లేదా ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని “బ్యాంక్ ఖాతాను జోడించండి” సదుపాయాన్ని ఉపయోగించండి.

దశ 6: బ్యాంక్ ఖాతాను ఎంచుకున్న తర్వాత, ‘ఇ-వెరిఫై’ పేజీలో వెరిఫికేషన్ కోసం మీకు నచ్చిన ఆప్షన్‌ను ఎంచుకోండి. ఆపై ‘కొనసాగించు’ పై క్లిక్ చేయండి

Data responsive

గమనిక:  ఈ-వెరిఫై చేయడం ఎలామరింత సమాచారం కోసం యూజర్ మాన్యువల్ ను చూడండి.

విజయవంతంగా ఇ-వెరిఫికేషన్ పూర్తయిన తర్వాత, ఒక విజయ సందేశంతో పాటు లావాదేవి గుర్తింపు ID స్క్రీన్‌పై కనపడుతుంది. భవిష్యత్తు అవసరాల కోసం దయచేసి ఆ లావాదేవి గుర్తింపు ID ని రాసి పెట్టుకోండి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన మీ ఇమెయిల్ ID మరియు మొబైల్ నెంబర్‌కు కూడా ఒక నిర్ధారణ సందేశం వస్తుంది

Data responsive

గమనిక: మీరు రీఫండ్ రీఇష్యూ అభ్యర్థనను చూడాలనుకుంటే, ‘రీఫండ్ రీఇష్యూ అభ్యర్థనను చూడండి’ పై క్లిక్ చేయండి, అప్పుడు మీరు ‘రీఫండ్ రీఇష్యూ అభ్యర్థనను చూడండి’ పేజీకి వెళ్తారు. అక్కడ మీరు సమర్పించిన అభ్యర్థనల పరిస్థితిని తెలుసుకోవచ్చు.

4. సంబంధిత అంశాలు