ఇ-ఫైలింగ్ (పన్ను మినహాయింపుదారు మరియు వసూలు చేయు ఉద్యోగి) కోసం రిజిస్టర్ చేసుకోవడం గురించి యూజర్ మాన్యువల్
1. అవలోకనం
ఈ 'ప్రీ-లాగిన్' సేవ, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకోవాలనుకునే మరియు దానిని వినియోగించుకోవాలనుకునే పన్ను మినహాయింపుదారులు/వసూలుదారులందరికీ అందుబాటులో ఉంది. ఈ నమోదు సేవ, పన్నుకు సంబంధించిన అన్ని కార్యకలాపాలను యాక్సెస్ చేయడానికి మరియు వాటి స్థితిని పర్యవేక్షించడానికి వినియోగదారుకు వీలు కల్పిస్తుంది.
2. ఈ సేవను పొందడానికి అవసరమైన ముందస్తు అర్హతలు
- చెల్లుబాటు అయ్యే మరియు క్రియాశీల TAN
- ప్రధాన సంప్రదింపు వ్యక్తి యొక్క PAN వివరాలు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడి ఉండాలి.
3. దశలవారీ మార్గదర్శిని
దశ 1:ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి,రిజిస్టర్‌పై క్లిక్ చేయండి.
దశ 2:ఇతరాలుపై క్లిక్ చేసి, వర్గాన్ని పన్ను మినహాయింపుదారు మరియు వసూలుదారుగా ఎంచుకోండి.

దశ 3:సంస్థ యొక్క TANనమోదు చేసి, ధ్రువీకరించు పై క్లిక్ చేయండి.

దశ 4a: ఒకవేళ TAN డేటాబేస్‌లో అందుబాటులో ఉండి, TRACES వద్ద నమోదై ఉండి, మరియు దాని కోసం ఇంతకు ముందే ఎటువంటి నమోదు అభ్యర్థన చేయబడి ఆమోదం కోసం పెండింగ్‌లో లేనట్లయితే:
- ప్రాథమిక వివరాల పేజీని వీక్షించడానికి కొనసాగించు పై క్లిక్ చేయండి.
- ప్రాథమిక వివరాలు ముందుగానే నింపబడి ఉన్నాయి.కంటిన్యూపై క్లిక్ చేయండి.
దశ 4b:ఒకవేళ TAN డేటాబేస్‌లో అందుబాటులో ఉండి, TRACES వద్ద నమోదు కాకుండా ఉండి, అలాగే నమోదు అభ్యర్థన ఇంకా చేయబడకుండా లేదా ఆమోదం కోసం పెండింగ్‌లో లేకుండా ఉన్నట్లయితే:
- TRACES పేజీని వీక్షించడానికి కంటిన్యూ పై క్లిక్ చేయండి.
- ప్రాథమిక వివరాలు పేజీని వీక్షించడానికి TRACESలో ఈ-ఫైలింగ్ లో నమోదు చేసుకోండి పై క్లిక్ చేయండి.
- అవసరమైన ప్రాథమిక వివరాలను నమోదు చేసి, కంటిన్యూ పై క్లిక్ చేయండి.
గమనిక:మీరు ముందుగా TRACESలో నమోదు చేసుకోవాలి. అక్కడ,ఈ-ఫైలింగ్ లో నమోదు చేసుకోండిపై క్లిక్ చేయడం ద్వారా మీరుఈ-ఫైలింగ్ నమోదుపేజీకి వెళ్తారు.
దశ 4c:ఒకవేళ డేటాబేస్‌లో TAN అందుబాటులో ఉండి, నమోదు అభ్యర్థన ఇప్పటికే సమర్పించబడి, ఆమోదం కోసం పెండింగ్‌లో ఉన్నట్లయితే:
- ఒక దోష సందేశం కనిపిస్తుంది మరియు మీరు నమోదు ప్రక్రియను ఉపసంహరించుకోవడాన్ని ఎంచుకోవచ్చు.
దశ 5:చెల్లింపులు చేస్తున్న లేదా పన్ను వసూలు చేస్తున్న వ్యక్తి వివరాలను నమోదు చేసి,కంటిన్యూపై క్లిక్ చేయండి.
దశ 6:ప్రధాన మొబైల్ నంబర్, ఈమెయిల్ ఐడి మరియు పోస్టల్ చిరునామాతో సహా సంప్రదింపు వివరాలను అందించండి.కంటిన్యూపై క్లిక్ చేయండి.
దశ 7:దశ 6లో మీరు నమోదు చేసిన మీ ప్రధాన మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ IDకి రెండు వేర్వేరు OTPలు పంపబడతాయి. మీ మొబైల్ నంబర్ మరియు ఈమెయిల్ IDకి వచ్చిన ఆ వేర్వేరు 6-అంకెల OTPలను నమోదు చేసి,కంటిన్యూపై క్లిక్ చేయండి.
గమనిక:
- OTP 15 నిమిషాల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
- సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉన్నాయి.
- స్క్రీన్‌పై ఉన్న OTP గడువు ముగింపు కౌంట్‌డౌన్ టైమర్, OTP గడువు ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
- రీసెండ్ OTP పై క్లిక్ చేసినప్పుడు, ఒక కొత్త OTP రూపొందించబడి పంపబడుతుంది.
దశ 8: వివరాలను సరిచూసుకోండి పేజీలో, అందించిన వివరాలను పరిశీలించి, అవసరమైతే వాటిని సవరించండి. ధ్రువీకరించండి పై క్లిక్ చేయండి.
దశ 9: పాస్వర్డ్ సెట్ చేయండిపేజీలో,సెట్ చేయండి మరియుపాస్వార్డ్ ను ధ్రువీకరించుఅనే టెక్స్ట్ బాక్సులలో మీకు కావలసిన పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి, మీపర్సనలైజ్డ్ మెసేజ్(వ్యక్తిగతీకరించిన సందేశం)ను సెట్ చేయండి మరియురిజిస్టర్పై క్లిక్ చేయండి.

గమనిక:
- రిఫ్రెష్ లేదా బ్యాక్ పై క్లిక్ చేయవద్దు.
- మీ కొత్త పాస్‌వర్డ్‌ను నమోదు చేసేటప్పుడు, పాస్వర్డ్ విధానం పట్ల జాగ్రత్త వహించండి:
- ఇది కనీసం 8 అక్షరాలు నుంచి గరిష్టంగా 14 అక్షరాలు ఉండాలి.
- ఇందులో పెద్ద అక్షరాలు మరియు చిన్న అక్షరాలు రెండూ ఉండాలి.
- ఇందులో ఒక సంఖ్య ఉండాలి.
- ఇందులో ఒక ప్రత్యేక అక్షరం (ఉదాహరణకు @#$%) ఉండాలి.
లావాదేవీ IDతో పాటు విజయవంతమైనట్లు తెలిపే సందేశం కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దయచేసి ఆ లావాదేవీ IDని నోట్ చేసుకోండి. సంబంధిత అధికారం నుండి ఆమోదం పొందిన తర్వాత నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
4. సంబంధిత అంశాలు