1. నేను ఇ-ఫైలింగ్‌లో రిజిస్టర్ చేసుకున్న జీతం పొందే ఉద్యోగిని. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నా పన్నుకు సంబంధించిన సమాచారం మొత్తం నేను ఎక్కడ పొందగలను?
మీరు మీ ఇ-ఫైలింగ్ డ్యాష్‌బోర్డ్‌లో మీ పన్ను సంబంధిత సమాచారం మరియు చేయవలసిన అంశాలన్నింటినీ యాక్సెస్ చేయవచ్చు. మీ ఆదాయపు పన్ను ప్రయాణంలో మీకు అవసరమైన ముఖ్యమైన సేవలకు లింక్‌లు డాష్‌బోర్డ్‌లో ఉన్నాయి. ఒకసారి చూస్తే, మీరు చేయగలరు:

  • మీ చెల్లుబాటు అయ్యే పాన్, ఆధార్ మరియు ఫోటోతో మీ ప్రొఫైల్‌ను నవీకరించండి.
  • మీ ఆధార్ మరియు పాన్ లింక్ చేయండి.
  • మీ పరిచయ వివరాలను చూసి నవీకరించండి.
  • ఇ-ఫైలింగ్ వాల్ట్ అధిక భద్రతా సేవతో మీ ఖాతాను భద్రపరచండి.
  • చెల్లించవలసిన బకాయి డిమాండ్‌ని చూసి ప్రతిస్పందించండి.
  • అనేక ఆర్థిక సంవత్సరాలు / మదింపు సంవత్సరాల కోసం మీ ఆదాయపు పన్ను పద్దు పుస్తకమును వీక్షించండి.
  • మీ ITR ఫైలింగ్‌కు సంబంధించి చేయవలసిన అంశాలను వీక్షించండి మరియు వాటికి ప్రతిస్పందించండి.
  • రావలసిన రీఫండు, డిమాండ్ అంచనాతో సహా మీ ఫైలింగ్ స్థితిని వీక్షించండి.
  • సవరించిన రిటర్న్‌ దాఖలు చేయండి, మరియు దాఖలు చేసిన రిటర్న్‌లను డౌన్‌లోడ్ చేసుకోండి.
  • TDS, ముందస్తు పన్ను, స్వీయ మదింపు పన్ను వంటి మీ పన్ను డిపాజిట్ వివరాలను చూడండి.
  • మీ పని జాబితాలో ఉన్న పెండింగ్ చర్యలకు ప్రతిస్పందించండి
  • గత 3 సంవత్సరాల' రిటర్న్‌లను మరియు ఇటీవల దాఖలు చేసిన ఫారమ్‌లను చూడండి.
  • మీ ఫిర్యాదు వివరాలను వీక్షించండి.


2. నేను పన్ను చెల్లింపుదారుని. నా ఇ-ఫైలింగ్ పనిజాబితాలో నాకు అందుబాటులో ఉన్న సేవలు ఏవి?
క్రింది సేవలు వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు, HUF, కంపెనీ, సంస్థ, ట్రస్ట్, AJP, AOP, BOI, స్థానిక అధికారం, ప్రభుత్వం వారి ఇ-ఫైలింగ్ పనిజాబితాలో అందుబాటులో ఉన్నాయి:

  • మీ చర్య కోసం:
    • అంగీకారం కోసం ఫారాలు పెండింగ్‌లో ఉన్నాయి
    • రీఫండ్‌లు చెల్లించబడలేదు
    • ITDREIN అభ్యర్థన
    • ఇ-వెరిఫికేషన్ కోసం పెండింగ్‌లో ఉంది/ITR-V అందలేదు/తిరస్కరించబడలేదు
    • మిమ్మల్ని అధీకృత సంతకందారుగా చేర్చడానికి అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి (వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మాత్రమే)
    • మిమ్మల్ని అధీకృత ప్రతినిధిగా చేర్చడానికి అభ్యర్థనలు పెండింగ్‌లో ఉన్నాయి (వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం మాత్రమే)
    • గడువు తేదీ తర్వాత ITR-V స్వీకరించబడింది
    • దాఖలు చేయడం పెండింగ్‌లో ఉంది
    • పన్ను మినహాయింపుదారు మరియు పన్ను వసూలు చేయు వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆమోదం మరియు సవరణ (సంస్థ PAN కోసం)
  • మీ సమాచారం కోసం:
    • అప్‌లోడ్ చేసిన ఫారాల వివరాలను వీక్షించండి
    • ప్రతినిధి మదింపుదారుడిగా జోడించడానికి అభ్యర్థనలు సమర్పించబడ్డాయి
    • అధీకృత సంతకదారునిగా జోడించడానికి అభ్యర్థనలు సమర్పించబడ్డాయి
    • అధీకృత ప్రతినిధిగా జోడించడానికి అభ్యర్థనలు సమర్పించబడ్డాయి
    • అధీకృత సంతకదారుని అభ్యర్థనలు స్వీకరించబడ్డాయి [వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం మాత్రమే)
    • అధీకృత ప్రతినిధి అభ్యర్థనలు స్వీకరించబడ్డాయి ( వ్యక్తిగత పన్ను చెల్లింపుదారుల కోసం మాత్రమే)
    • ITDREIN అభ్యర్థన వివరాలను వీక్షించండి (రిపోర్టింగ్ సంస్థ ద్వారా అధీకృత PANగా చేర్చబడిన వ్యక్తుల కోసం)
    • ఆమోదించబడిన / తిరస్కరించబడిన TAN నమోదు వివరాలను వీక్షించండి ( సంస్థ PAN కోసం )


3. నా డాష్‌బోర్డ్‌ను చూడటానికి లాగిన్ అవ్వాల్సిన అవసరం వుందా?
అవును. ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అయిన తర్వాత మాత్రమే డాష్‌బోర్డ్ చూడగలరు అది లాగిన్ అయిన PANకు సంబంధించిన సమాచారాన్ని కలిగి ఉంటుంది.

4. క్రొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని డాష్‌బోర్డ్ ఎంత భిన్నంగా ఉంది?
మునుపటి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో పన్ను చెల్లింపుదారుల కోసం రెండు విధులు ఉన్నాయి: ఆదాయపు పన్ను రిటర్న్ ఫైల్ చేయండి మరియు ఇ-ఫైల్ చేసిన రిటర్న్స్/ఫారమ్‌లను చూడండి.కొత్త ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో, డ్యాష్‌బోర్డ్‌ మరిన్ని సేవలను కలిగి ఉంది. ఇది మీ ప్రొఫైల్, రిజిస్టర్ చేయబడిన సంప్రదింపు వివరాలు, రిటర్న్ స్థితి, ఆదాయపు పన్ను డిపాజిట్లు, పెండింగ్ చర్యలు, ఇటీవలి ఫైలింగ్లు మరియు ఫిర్యాదుల వివరాలను ముందుగానే చూపించడం ద్వారా వినియోగదారునికి చాలా సులువుగా ఉంటుంది.

5. నా PAN పనిచేయడం లేదు లేదా ఆధార్‌తో లింక్ చేయలేదు. నేను డాష్‌బోర్డ్‌లో అందుబాటులో ఉన్న వివిధ సేవలను యాక్సెస్ చేయవచ్చా?

నమోదు చేసిన PAN పని చేయనప్పుడు, కొన్ని యాక్సెస్‌లు పరిమితం కావచ్చు. పనిచేయని PANతో లాగిన్ అయిన తర్వాత, దిగువ హెచ్చరిక పాప్-అప్ డ్యాష్‌బోర్డ్‌లో ప్రదర్శించబడుతుంది: “మీ PAN మీ ఆధార్‌తో లింక్ చేయబడనందున అది పనిచేయదు. కొన్ని యాక్సెస్‌లు పరిమితం కావచ్చు. 234హెచ్ సెక్షన్ ప్రకారం చెల్లించిన తర్వాత మీరు మీ పాన్‌ను లింక్ చేసి ఆపరేటివ్‌గా చేసుకోవచ్చు.”

6. PAN పనిచేయనప్పుడు వినియోగదారుకు ఎలా తెలియజేయబడుతుంది?

"మీ PAN మీ ఆధార్‌తో లింక్ చేయబడనందున అది పనిచేయడం లేదు" అనే పాప్-అప్ మరియు టిక్కర్ మెసేజ్ వినియోగదారు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయిన తర్వాత లేదా డ్యాష్‌బోర్డ్ పేజీలో ల్యాండ్ చేసిన తర్వాత ప్రదర్శించబడుతుంది.