1. అవలోకనం

ఈ-ఫైలింగ్ పోర్టల్ (లాగిన్ తరువాత)లో నమోదు చేసుకున్న CAలకు ఈ సేవ అందుబాటులో ఉంటుంది. ఇ - ఫైలింగ్ డ్యాష్ బోర్డుసంక్షిప్త వీక్షణను చూపుతుంది:

  • పోర్టల్‌లో రిజిస్టర్ అయిన వినియోగదారు ప్రొఫైల్, గణాంకాలు మరియు ఇతర కార్యకలాపాలు (ఉదా. IT రిటర్న్ / ఫారమ్, ఫిర్యాదు దాఖలు)
  • నమోదు చేయబడిన వినియోగదారుల ఆదాయపు పన్ను సంబంధిత కార్యకలాపాల కోసం అవసరమైన వివిధ సేవల లింక్‌లు

2. ఈ సేవను పొందటానికి ముందస్తు అవసరాలు

  • చెల్లుబాటు అయ్యే యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన వినియోగదారు

3. దశల వారీ మార్గదర్శిని

3.1 డ్యాష్‌బోర్డ్‌ను యాక్సెస్ చేయండి

దశ1:మీ యూజర్ ID మరియు పాస్వర్డ్ ని ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.

Data responsive


దశ 2: లాగిన్ అయిన తర్వాత, మీరు ఇ - ఫైలింగ్ డ్యాష్ బోర్డు కు వెళ్తారు. మీ ఇ-ఫైలింగ్‌ డ్యాష్‌బోర్డ్‌లో ముందస్తుగా లభించే సమాచారాన్ని చూడండి.

Data responsive


గమనిక:

  • ఒకవేళ మీ తప్పనిసరి ప్రొఫైల్ వివరాలు అప్‌డేట్ చేయబడకపోతే, లాగిన్ చేయడం ద్వారా వాటిని పూరించవచ్చు.
  • మీరు ప్రాంప్ట్ చేసినప్పుడు మీ వివరాలను నవీకరించాలని ఎంచుకుంటే, మీరు మీ వివరాలను సమర్పించిన తర్వాత మీరు డ్యాష్‌బోర్డ్‌కి వెళ్తారు.
  • మీరు ప్రాంప్ట్ చేసినప్పుడు మీ వివరాలను అప్‌డేట్ చేయకూడదని ఎంచుకుంటే, మీరు నేరుగా మీ డాష్‌బోర్డ్‌కి వెళ్లవచ్చు. మీ వివరాలను తరువాత ప్రొఫైల్‌లో నవీకరించవచ్చు

పన్ను వృత్తినిపుణులకు సంబంధించిన డాష్‌బోర్డ్ క్రింది విభాగాలను కలిగి ఉంటుంది:

1. ప్రొఫైల్ స్నాప్‌షాట్: ఈ విభాగంలో మీ పేరు, వినియోగదారు ID, ప్రాథమిక మొబైల్ సంఖ్య, మరియు ప్రాథమిక ఇ-మెయిల్ ID మరియు ప్రొఫైల్ పూర్తి స్థితి కనిపిస్తాయి. ఈ ఫీల్డ్‌లు నా ప్రొఫైల్ నుండి ముందే నింపబడతాయి.

Data responsive


2. సంప్రదింపు వివరాలు: నవీకరించండి క్లిక్ చేయడం ద్వారా, మీరు నా ప్రొఫైల్ > లో సంప్రదింపు వివరాలు (సవరించదగిన) పేజీకి వెళ్తారు.

Data responsive


3. ఇ-ఫైలింగ్ వాల్ట్ అధిక భద్రత: ఈ ఫీచర్ మీ ఖాతాకు ఉన్న భద్రతా స్థాయిని మీకు తెలియజేస్తుంది, మీ భద్రతా స్థాయిని బట్టి ఈ క్రింది విధంగా చూపిస్తుంది:

  • మీ ఖాతా సురక్షితం కాదు: మీరు ఎటువంటి ఉన్నతమైన భద్రతా ఎంపికను ఎంచుకోకపోతే ఈ సందేశం కనిపిస్తుంది. ఖాతాను సెక్యూర్ చేయండిక్లిక్ చేసినప్పుడు, మీరుఇ-ఫైలింగ్ వాల్ట్ అధిక భద్రతపేజీకి వెళ్తారు.
  • మీ ఖాతా పాక్షికంగా సురక్షితం: మీరు లాగిన్ లేదా రీసెట్ పాస్వర్డ్‌ లలో ఏదో ఒక దానికి మాత్రమే ఉన్నతమైన భద్రతా ఎంపికను ఎంచుకుంటే ఈ సందేశం కనిపిస్తుంది. ఖాతాను సెక్యూర్ చేయండిక్లిక్ చేసినప్పుడు, మీరుఇ-ఫైలింగ్ వాల్ట్ అధిక భద్రతపేజీకి వెళ్తారు.
  • మీ ఖాతా సురక్షితం: మీరు లాగిన్ మరియు రీసెట్ పాస్వర్డ్‌ రెండింటి కోసం ఉన్నతమైన భద్రతా ఎంపికను ఎంచుకుంటే ఈ సందేశం కనిపిస్తుంది. భద్రత ఎంపికలను అప్‌డేట్ చేయండి క్లిక్ చేసినప్పుడు, మీరు ఇ-ఫైలింగ్ వాల్ట్ అధిక భద్రత పేజీకి వెళ్తారు.
Data responsive


4. కార్యాచరణ లాగ్: కార్యాచరణ లాగ్ చివరి లాగిన్, లాగ్ అవుట్, చివరి అప్‌లోడ్ మరియు చివరి డౌన్‌లోడ్‌కు సంబంధించిన సమాచారాన్ని కార్యాచరణ లాగ్ చూపిస్తుంది. అన్నీ వీక్షించండి క్లిక్ చేసినపుడు, మీరు వివరణాత్మక కార్యాచరణ లాగ్‌ చూస్తారు.

Data responsive


5. గత 3 సంవత్సరాల దాఖలు: మీరు దీనిని క్లిక్ చేసినప్పుడు ఈ సెక్షన్ అదే పేజీలో విస్తరిస్తుంది. ఇది నిర్దిష్ట ఆర్థిక సంవత్సరాలలో మీరు దాఖలు చేసిన రిటర్న్ మరియు ఫారాలు మొత్తం ఎన్ని ఉన్నాయో గ్రాఫికల్ లేదా పట్టిక రూపంలో చూపుతుంది. ఈ విభాగంలో ఫారమ్ పేరు డ్రాప్‌డౌన్ ఉంటుంది. డిఫాల్ట్‌గా, అప్‌లోడ్ చేసిన అన్ని ఫారాల వివరాలు చూపిస్తాయి. నిర్దిష్ట ఫారం యొక్క వివరాలను వీక్షించడానికి డ్రాప్‌డౌన్ నుండి ఒక ఫారమ్‌ను ఎంచుకోండి.

Data responsive


6. పెండింగ్‌లో ఉన్న చర్యలు: మీరు దీనిని క్లిక్ చేసినప్పుడు ఈ విభాగం అదే పేజీలో విస్తరిస్తుంది. ఇది మీ పనిజాబితాలో పెండింగ్‌లో ఉన్న అన్ని పని అంశాలను (అవరోహణ క్రమంలో) పట్టిక రూపంలో చూపిస్తుంది. టేబుల్ కాలమ్ హెడ్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి:

  • మదింపుదారు పేరు: మీ పనిజాబితాకు సంబంధించి పెండింగ్‌ చర్యలు ఉన్న మదింపుదారుల పేర్లు ఇక్కడ ఇవ్వబడ్డాయి (ఉదా., దాఖలు చేయడానికి పెండింగ్‌లో ఉన్నవిలేదా వెరిఫికేషన్ కోసం పెండింగ్‌లో ఉన్నవి వంటి వర్గాలు). మదింపుదారు పేరు మీద క్లిక్ చేసినపుడు, మీరు మదింపుదారు పేరుపై ఫిల్టర్‌తో మీ పనిజాబితాకు వెళ్తారు.
  • మదింపుదారు PAN: మీ పనిజాబితాకు సంబంధించి పెండింగ్‌ చర్యలు ఉన్న మదింపుదారుల PANలు ఇక్కడ ఇవ్వబడ్డాయి (ఉదా., దాఖలు చేయడానికి పెండింగ్‌లో ఉన్నవి లేదా ధృవీకరణ కోసం పెండింగ్‌లో ఉన్నవి వంటి వర్గాలు).
  • అభ్యర్థన జాబితా: ప్రతి మదింపుదారుని పెండింగ్ అభ్యర్థన జాబితా లెక్కింపు సంఖ్య ఇక్కడ చూపబడుతుంది. ఆ సంఖ్యను క్లిక్ చేసినపుడు, మీరు ఈ వర్గపు మదింపుదారు పనిజాబితా లో అన్నింటిని వీక్షించండి పేజీకి వెళ్తారు.
  • దాఖలు చేయడానికి పెండింగ్‌లో ఉన్నవి: ప్రతి మదింపుదారు దాఖలు చేయడానికి పెండింగ్‌లో ఉన్న వాటి సంఖ్య ఇక్కడ కనిపిస్తాయి. ఆ సంఖ్యను క్లిక్ చేసినపుడు, మీరు ఈ వర్గపు మదింపుదారు పనిజాబితా లో అన్నింటిని వీక్షించండి పేజీకి వెళ్తారు.
  • ధృవీకరణ కోసం పెండింగ్‌లో ఉన్నవి: ధృవీకరణ కోసం ప్రతి మదింపుదారునికి సంబంధించి పెండింగ్‌లో ఉన్న వాటి సంఖ్య ఇక్కడ కనిపిస్తుంది. ఆ సంఖ్యను క్లిక్ చేసినపుడు, మీరు ఈ వర్గపు మదింపుదారు పనిజాబితా లో అన్నింటిని వీక్షించండి పేజీకి వెళ్తారు.
  • పని జాబితాను వీక్షించండి: పని జాబితాను వీక్షించండి క్లిక్ చేస్తే, మీరు అక్కడికి తీసుకెళ్ళబడతారు.
Data responsive


గమనిక: ఒక నిర్దిష్ట వర్గం (పైన పేర్కొన్నది) మీకు వర్తించకపోతే, ఆ వర్గం మీకు చూపబడదు.


7. ఇటీవల దాఖలు చేయబడ్డ ఫారమ్‌లు: మీరు దీనిని క్లిక్ చేసినప్పుడు ఈ విభాగం అదే పేజీలో విస్తరిస్తుంది. ఇది మీరు దాఖలు చేసిన చివరి నాలుగు ఫారాల వివరాలను (ఫారమ్‌ల పేర్లు, వివరణలు, దాఖలు చేసిన తేదీలు) అవరోహణ క్రమంలో చూపిస్తుంది. అన్నింటిని వీక్షించండి క్లిక్ చేసినపుడు, మీరు దాఖలు చేసిన ఫారములు వీక్షించండి పేజీకి వెళ్తారు.

Data responsive


8. ఫిర్యాదులు: మీరు దీనిని క్లిక్ చేసినప్పుడు ఈ విభాగం అదే పేజీలో విస్తరిస్తుంది. మీరు చేసిన ఫిర్యాదుల వివరాలు గత రెండేళ్లవి మాత్రమే కనిపిస్తాయి. చేసిన మొత్తం ఫిర్యాదులు క్లిక్ చేసినపుడు, పట్టిక రూపంలో ఫిర్యాదుల వివరాలు చూపబడుతాయి.

Data responsive


మెనూ బార్

డ్యాష్‌బోర్డ్‌తో పాటు, పన్ను నిపుణుల మెను బార్‌లో ఈ క్రింది మెను అంశాలు కూడా ఉన్నాయి:

  • ఇ-ఫైల్: ఈ మెను ఆదాయపు పన్ను ఫారమ్‌లను దాఖలు చేయడానికి, చూడడానికి, ఎక్కువ మొత్తంలో అప్‌లోడ్ చేయడానికి లింక్‌లను అందిస్తుంది.
  • పెండింగ్ చర్యలు: ఈ మెనులో పనిజాబితా (వర్క్ లిస్ట్)కు సంబంధించిన లింక్‌లు ఉంటాయి.
  • ఫిర్యాదులు: ఈ మెను టిక్కెట్లు / ఫిర్యాదులను సృష్టించడానికి మరియు వాటి స్థితిని చూడటానికి అవసరమైన లింక్‌లు అందిస్తుంది.
  • సహాయం: ఇది లాగిన్ ముందు మరియు పోస్టు-లాగిన్ రెండింటిలోనూ అందుబాటులో ఉంటుంది. ఇది వినియోగదారులందరికీ ఇ-ఫైలింగ్‌కు సంబంధించిన అంశాలపై మార్గనిర్దేశం అందిస్తుంది (రిజిస్టర్ చేసిన లేదా రిజిస్టర్ చేయని).
Data responsive


3.2 ఇ-ఫైల్ మెను

ఇ-దాఖలు మెనులో ఈ క్రింది మెను ఎంపికలు మరియు ఉప-మెనూలు ఉన్నాయి:

  • ఆదాయపు పన్ను ఫారాలు
    • ఇది లాగిన్‌కు ముందు, తర్వాత కూడా అందుబాటులో ఉంటుంది. ఇది వినియోగదారులందరికీ (రిజిస్టర్ అయిన లేదా రిజిస్టర్ కాని) ఇ-ఫైలింగ్‌కు సంబంధించిన అంశాలపై మార్గనిర్దేశం అందిస్తుంది.: ఇది మిమ్మల్ని ఆదాయపు పన్ను ఫారమ్ దాఖలు చేయండి పేజీకి తీసుకెళుతుంది, అది మిమ్మల్ని మీ క్లయింట్‌ల ఆదాయపు పన్ను ఫారమ్‌ను దాఖలు చేయడానికి అనుమతిస్తుంది.
    • ఆదాయపు పన్ను ఫారమ్ బల్క్ అప్‌లోడ్: ఇది మిమ్మల్ని ఆదాయపు పన్ను ఫారమ్ బల్క్ అప్‌లోడ్ పేజీకి తీసుకెళ్తుంది, ఇక్కడ మీరు మీ క్లయింట్‌ల ఆదాయపు పన్ను ఫారమ్‌లను పెద్దమొత్తంలో అప్‌లోడ్ చేయవచ్చు.
    • దాఖలు చేసిన ఫారమ్‌లను చూడండి: ఇది మీ క్లయింట్‌ల తరపున మీరు దాఖలు చేసిన ఫారమ్‌లను చూడటానికి మిమ్మల్ని దాఖలు చేసిన ఫారమ్‌లను చూడండి పేజీకి దారితీస్తుంది.
Data responsive


3.3 పెండింగ్‌లో ఉన్న చర్యల మెను

పెండింగ్ చర్యల మెనులో ఈ క్రింది మెను ఎంపికలు మరియు ఉప-మెనూలు ఉన్నాయి:

  • వర్క్‌లిస్ట్: ఇది మిమ్మల్ని వర్క్‌లిస్ట్ కి తీసుకువెళుతుంది, అక్కడ మీరు పెండింగ్‌లో ఉన్న కార్యాచరణ అంశాలను చూసి వాటికి ప్రతిస్పందించవచ్చు.
Data responsive


3.4 ఫిర్యాదుల మెను

ఫిర్యాదులు మెనులో ఈ క్రింది మెను ఎంపికలు ఉన్నాయి:

  • ఫిర్యాదులను సమర్పించండి: ఇది మీరు ఫిర్యాదులను సమర్పించడానికి ఫిర్యాదు సమర్పించండి పేజీకి తీసుకువెళుతుంది.
  • ఫిర్యాదుల స్థితి: ఇది మీరు గతంలో సమర్పించిన ఏదైనా ఫిర్యాదుల స్థితిని వీక్షించడానికి ఫిర్యాదుల స్థితిపేజీకి తీసుకువెళుతుంది.
Data responsive


3.5 సహాయ మెను

సహాయ మెను అన్ని వర్గాల వినియోగదారులకు లెర్నింగ్ ఆర్టెఫాక్ట్స్ అందిస్తుంది. మీరు ఈ విభాగంలో తరచుగా అడిగే ప్రశ్నలు, వినియోగదారు మాన్యువల్‌లు, వీడియోలు, మరియు అలాంటి ఇతర మెటీరియల్‌లను ప్రవేశము చేయవచ్చు.

Data responsive


3.6 వర్క్‌లిస్ట్

పనిజాబితా సేవ సి.ఎ. లకు వారి పెండింగ్ చర్యలను వీక్షించడానికి మరియు వాటిపై చర్య తీసుకోవడానికి వీలు కల్పిస్తుంది. దీని కొరకు, పనిజాబితాలో పెండింగ్‌లో ఉన్న అంశాలు ఉండాలి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అయిన తరువాత, పెండింగ్‌లో ఉన్న చర్యలు > లో పనిజాబితా క్లిక్ చేయండి. పనిజాబితాలో, మీరు మీ చర్య కోసం మరియు మీ సమాచారం కోసం ట్యాబ్‌లు చూడవచ్చు.

మీ చర్య కోసం

మీ చర్య కోసం ట్యాబ్‌లో మీరు అనుసరించాల్సిన పెండింగ్ అంశాలు ఉన్నాయి. పెండింగ్‌లో ఉన్న ఏదైనా చర్య అంశాలను క్లిక్ చేసిన తర్వాత, మీరు సంబంధిత ఇ-ఫైలింగ్ సేవకు వెళ్తారు.

  • క్లయింట్ అభ్యర్థనల జాబితా: ఈ విభాగంలో, స్వీకరించిన మరియు అంగీకారం కోసం పెండింగ్‌లో ఉన్న క్లయింట్ అభ్యర్థనలను మీరు చూడవచ్చు. చర్య తీసుకోవడానికి అంగీకరించు లేదా నిరాకరించు క్లిక్ చేయండి.
Data responsive

 

  • ఫారమ్‌ల అభ్యర్థన జాబితా: ఈ విభాగంలో, స్వీకరించిన మరియు అంగీకారం కోసం పెండింగ్‌లో ఉన్న ఫారమ్‌ల అభ్యర్థనలను చూడవచ్చు (ఉదా., ఫారం 29B, 10BA, 26A, 10A, 10CCB). చర్య తీసుకోవడానికి అంగీకరించు లేదా తిరస్కరించు క్లిక్ చేయండి.
Data responsive

 

  • దాఖలు చేయడానికి పెండింగ్‌లో ఉన్నవి: ఈ విభాగంలో, అందుకున్న, అంగీకరించబడిన దాఖలు అభ్యర్థనలు (ఉదా., ఫారమ్ 26A / 27BA), దాఖలుకు పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలను చూడగలరు. చర్య తీసుకోవడానికి ఫారమ్‌ దాఖలు చేయండి క్లిక్ చేయండి.
Data responsive

 

  • ధృవీకరణ కోసం పెండింగ్‌లో ఉన్నవి: ఈ విభాగంలో, ధృవీకరణ కోసం పెండింగ్‌లో ఉన్న ఫారమ్‌లను (ఉదా., ఫారం 62) మీరు చూడవచ్చు. చర్య తీసుకోవడానికి ఫారమ్‌ను ధృవీకరించండి లేదా ఫారమ్‌ను నిరాకరించండి క్లిక్ చేయండి.
Data responsive

 

  • మిమ్మల్ని అధీకృత ప్రతినిధిగా జోడించడానికి పెండింగ్‌లో ఉన్న అభ్యర్థనలు: ఈ విభాగంలో, అంగీకారం కోసం పెండింగ్‌లో ఉన్న అధీకృత ప్రతినిధి అభ్యర్థనలను మీరు చూడవచ్చు. చర్య తీసుకోవడానికి అంగీకరించండి లేదా నిరాకరించండి క్లిక్ చేయండి.
Data responsive

 

మీ సమాచారం కోసం

మీ సమాచారం కోసం ట్యాబ్‌లో మీ కార్యాచరణ అంశాలకు సంబంధించిన ముఖ్యమైన నవీకరణలు ఉన్నాయి. అంశాలను చూడగలరు లేదా డౌన్‌లోడ్ చేసుకోగలరు, కానీ చర్య తీసుకోవడానికి వీలుపడదు. సమాచార అంశాలు ఈ క్రింది విధంగా ఉంటాయి:

  • ఖాతాదారుని అభ్యర్థన వివరాలు: ఈ విభాగంలో, ఖాతాదారుని అభ్యర్థనల వివరాలను మీరు చూడవచ్చు.
Data responsive

 

  • అప్‌లోడ్ చేసిన ఫారమ్ వివరాలు: ఈ విభాగంలో, మీరు కేటాయించిన / అప్‌లోడ్ చేసిన ఫారమ్‌ల వివరాలను మరియు మదింపుదారు నుండి ప్రతిస్పందనను మీరు చూస్తారు.
Data responsive

 

  • స్వీకరించబడిన అధీకృత ప్రతినిధి అభ్యర్థనలు: ఈ విభాగంలో, స్థితి మరియు తేదీతో పాటు మీరు స్వీకరించిన అధీకృత ప్రతినిధి అభ్యర్థనల మొత్తం సంఖ్యను మీరు చూస్తారు.
Data responsive

4. సంబంధిత విషయాలు