1. అవలోకనం
ఈ ప్రీ-లాగిన్ సేవ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకొని యాక్సెస్ చేయాలనుకునే చార్టర్డ్ అకౌంటెంట్స్ (CAలు) లకు అందుబాటులో ఉంటుంది.రిజిస్ట్రేషన్ సేవ వినియోగదారుని అన్ని పన్ను సంబంధిత కార్యకలాపాలను యాక్సెస్ చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.
2. ఈ సేవను పొందటానికి ముందస్తు అవసరాలు
- CA సభ్యత్వ సంఖ్య
- CA గా రిజిస్టర్ చేసుకోవడానికి నమోదు తేదీ
- ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన PAN
- పేర్కొన్న PANతో రిజిస్టర్ చేయబడిన చెల్లుబాటు అయ్యే యాక్టివ్ DSC
3. దశల వారీ మార్గదర్శిని
దశ 1: ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి, రిజిస్టర్ పైన క్లిక్ చేయండి.
దశ 2: ఇతరులు క్లిక్ చేసి, వర్గం నుండి చార్టర్డ్ అకౌంటెంట్ ఎంచుకొని కొనసాగించండి. క్లిక్ చేయండి
దశ 3: ప్రాథమిక వివరాలు పేజీలో PAN, పేరు, పుట్టినతేదీ, సభ్యత్వ సంఖ్య మరియునమోదు తేదీవంటి అన్ని తప్పనిసరి వివరాలను నమోదు చేసి కొనసాగించండి క్లిక్ చేయండి.
గమనిక:
- మీ PAN ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ కాకపోతే, లోపం ఉందనే సందేశం కనిపిస్తుంది. మీ PAN నమోదై ఉన్నట్లయితే మాత్రమే మీరు సి.ఎ. గా నమోదు చేసుకోగలరు.
- ఈ దశలో, సిస్టమ్ పేర్కొన్న PANకి DSC లింక్ చేయబడిందో లేదో తనిఖీ చేస్తుంది. DSC రిజిస్టర్ కాకపోయినా లేదా PANతో లింక్ చేయబడిన DSC గడువు ముగిసినా, లోపం సందేశం వస్తుంది. కొనసాగడానికి PANకు మీ DSCని నమోదు చేయండి/నవీకరించండి.
దశ 4: ICAI డేటాబేస్‌తో విజయవంతంగా ధృవీకరణ చేసిన తరువాత, సంప్రదింపు వివరాలు పేజీ కనిపిస్తుంది. ప్రాథమిక మొబైల్ సంఖ్య, ఇ-మెయిల్ ID మరియుచిరునామా వంటి అన్ని తప్పనిసరి వివరాలను నమోదు చేసి కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 5: దశ4లో నమోదు చేసిన మీ మొబైల్ సంఖ్య, ఇ-మెయిల్ IDలకు రెండు వేర్వేరు OTPలు పంపించబడ్డాయి. మీ మొబైల్ నెంబర్, ఇ-మెయిల్ ID లకు వచ్చిన 6-అంకెల వేర్వేరు OTPలను నమోదు చేసి కొనసాగించండి క్లిక్ చేయండి
గమనిక:
- OTP కేవలం 15 నిమిషాలు మాత్రమే పని చేస్తుంది.
- సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉంటాయి.
- స్క్రీన్‌పై OTP గడువు ముగిసే కౌంట్ డౌన్ టైమర్ OTP ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
- OTPని మళ్ళీ పంపండి పై క్లిక్ చేసిన తరువాత, కొత్త OTP జనరేట్ అయ్యి పంపించబడుతుంది.
దశ 6: నమోదు చేసిన అన్ని వివరాలు సరైనవేనా అని తనిఖీ చేయండి. అవసరమైతే, స్క్రీన్‌లో వివరాలను సవరించండి, ఆపై ధృవీకరించండి. క్లిక్ చేయండి
దశ 7: పాస్వర్డ్ సెట్ చేయండి పేజీలో, మీకు కావలసిన పాస్వర్డ్‌ను పాస్వర్డ్ సెట్ చేయండి అలాగే ధృవీకరించిన పాస్వర్డ్ టెక్స్ట్‌బాక్స్‌లలో నమోదు చేసి, వ్యక్తిగత సందేశం సెట్ చేసి రిజిస్టర్ చేయండి క్లిక్ చేయండి.
గమనిక:
- రిఫ్రెష్ లేదా వెనక్కి క్లిక్ చేయవద్దు.
- మీ కొత్త పాస్వర్డ్‌ను నమోదు చేస్తున్నప్పుడు, పాస్వర్డ్ విధానం పట్ల శ్రద్ధ వహించండి:
- ఇది కనీసం 8 అక్షరాలు మరియు అత్యధికంగా 14 అక్షరాలు ఉండాలి.
- ఇది పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాల సమూహం అయి ఉండాలి.
- దీనిలో ఒక సంఖ్య ఉండాలి.
- అంధులొ ప్రత్యేక గుర్తు ఉండాలి [ఉదా. @#$%]
దశ 8: లాగిన్ ప్రక్రియను ప్రారంభించడానికి లాగిన్‌కు వెళ్లండి క్లిక్ చేయండి. మీ లాగిన్ వివరాలు మీ ప్రాథమిక ఇ-మెయిల్ IDకి ఇ-మెయిల్ చేయబడతాయి.
గమనిక: ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీకు అందుబాటులో ఉన్న అన్ని ఫీచర్లు యాక్సెస్ చేయడానికి లాగిన్ చేయండి మరియు మీ ప్రొఫైల్‌ను అప్‌డేట్ చేయండి.