1.ఇ-ప్రొసీడింగ్స్ అంటే ఏమిటి?
ఇ-ప్రొసీడింగ్స్ అనేది ఇ-ఫైలింగ్ పోర్టల్‌ ఉపయోగించి ఎండ్ టు ఎండ్ పద్దతిలో కార్యకలాపాలని నిర్వహించడానికి తయారు చేయబడిన ఒక ఎలక్ట్రానిక్ ప్లాట్‌ఫారం. ఈ సేవను ఉపయోగించి ఏ నమోదిత వినియోగదారుడైనా (లేదా అతని అధీకృత ప్రతినిధి) ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన ఏదైనా నోటీసు / సమాచారం / లేఖను విక్షించవచ్చు మరియు ప్రతిస్పందనను సమర్పించవచ్చు

2.ఇ-ప్రొసీడింగ్స్ యొక్క ప్రయోజనాలు ఏమిటి?
ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన అన్ని నోటీసులు / సమాచారం / లేఖలకు ఎలక్ట్రానికల్ ప్రతిస్పందన అందించుటకు ఇ-ప్రొసీడింగ్స్ ఒక సులభమైన మార్గం. ఆదాయపు పన్ను కార్యాలయానికి వెళ్లే అవసరం లేనందున ఇది పన్ను చెల్లింపుదారులకు సమ్మతి పొందే భారాన్ని తగ్గిస్తుంది. అంతేగాకుండా, సమర్పణలను ట్రాక్ చేయుటకు మరియు భవిష్యత్ సూచన కోసం రికార్డ్ కీపింగ్ కోసం ఇది సులభంగా ఉంటుంది.

3. నాకు జారీ చేసిన నోటీసుకు నేను నా ప్రతిస్పందనను సమర్పించిన తర్వాత నేను నా ప్రతిస్పందనను చూడవచ్చా?
అవును, మీరు లేదా మీ అధీకృత ప్రతినిధి సమర్పించిన ప్రతిస్పందనను మీరు చూడవచ్చు.

4.143(1)(a) సెక్షన్ ప్రకారం నాకు జారీ చేయబడిన సర్దుబాటు గురించి నా స్పందనకు వ్యతిరేకంగా ఏదైనా ప్రశ్న లేవనెత్తబడినదా అనేది నేను ఎక్కడ చూసుకోగలను?
మీరు ఇ-ప్రొసీడింగ్స్ కింద ఆదాయపు పన్ను శాఖ ద్వారా లేవనెత్తబడిన ప్రశ్నలను చూడవచ్చు.

5. నా సబ్మిట్ రెస్పాన్స్ బటన్ ఎందుకు నిష్క్రియంగా ఉంది?
సబ్మిట్ రెస్పాన్స్ బటన్ కింది కారణాల వల్ల నిష్క్రియంగా ఉండవచ్చు
CPC నోటీసుల కోసం - ప్రతిస్పందన గడువు ముగిసినట్లయితే.
ITBA నోటీసుల కోసం - ఆదాయపు పన్ను అథారిటీ ద్వారా ప్రొసీడింగ్స్ స్థితి ముగించబడితే/బ్లాక్ చేయబడితే.

6. ఇ-ఫైలింగ్ పోర్టల్‌పై నోటీసుకు ప్రతిస్పందించిన తర్వాత నేను నా ప్రతిస్పందనను సవరించవచ్చా?
లేదు, ఇ-ఫైలింగ్ పోర్టల్‌పై మీ ప్రతిస్పందనను సమర్పించిన తరువాత మీరు దానిని సవరించలేరు.

7.ఇ-ప్రొసీడింగ్స్ కింద నేను స్పందించగల నోటీసులు ఏమిటి?

ఆదాయపు పన్ను శాఖ మరియు CPC జారీ చేసిన అన్ని నోటీసులు / సమాచారం / లేఖలు ఇ-ప్రొసీడింగ్స్ క్రింద అందుబాటులో ఉంచబడ్డాయి, ఇక్కడ మీరు వాటిని చూడవచ్చు అలాగే ఇ-ఫైలింగ్ పోర్టల్‌పై వాటిని అప్‌లోడ్ చేయడం ద్వారా అటాచ్‌మెంట్‌లతో పాటుగా మీ ప్రతిస్పందనను సమర్పించవచ్చు. మీరు ఈ సేవ ద్వారా క్రింది నోటీసులను చూడవచ్చు అలాగే వాటికి మీ ప్రతిస్పందనను సమర్పించవచ్చు

  • సెక్షన్ 139(9) ప్రకారం లోపభూయిష్ట నోటీసు
  • సెక్షన్ 143(1)(a) ప్రకారం ప్రైమా ఫేసీ సర్దుబాటు
  • సెక్షన్ 154 ప్రకారం మోటోగా సవరించడం
  • ఆదాయపు పన్ను శాఖ అధికారుల ద్వారా జారీ అయిన నోటీసులు
  • సమాచారం గురించి వివరణ ఇవ్వమని కోరండి

ప్రకరణము
డాష్‌బోర్డ్/పెండింగ్ యాక్షన్/ఇ-ప్రొసీడింగ్

 

8. ప్రతిస్పందనను సమర్పించు సామర్థ్యం కింద అటాచ్‌మెంట్స్‌ సంఖ్య/సైజు అనుమతించిన పరిమితి కంటే ఎక్కువగా ఉంటే, నేను ఏమి చేయాలి?
ఒక అటాచ్‌మెంట్ కోసం అనుమతించబడిన గరిష్ట సైజు 5 MB. 1 కంటే ఎక్కువ పత్రాలను మీరు అప్‌లోడ్ చేయాల్సి ఉంటే, మీరు అటాచ్‌మెంట్స్‌ సంఖ్యను 10 వరకు ఎంచుకోవచ్చు. అన్ని అటాచ్‌మెంట్స్‌ కోసం మొత్తం సైజు గరిష్టంగా 50MB కి మించరాదు. ఒక పత్రం యొక్క సైజు అనుమతించిన పరిమితిని మించి ఉంటే, మీరు ఫైల్ పరిమాణాన్ని తగ్గించడం ద్వారా ఆ పత్రాన్ని ఆప్టిమైజ్ చేయవచ్చు.

9. లోపభూయిష్ట రిటర్న్ అంటే ఏమిటి?
రిటర్న్‌లో లేదా షెడ్యూల్‌లలో అసంపూర్ణమైన లేదా అస్థిరమైన సమాచారం ఇవ్వబడిన కారణంగా లేదా మరేదైనా కారణాల వల్ల ఆ రిటర్న్ లోపభూయిష్టమైనదిగా పరిగణించబడుతుంది.

10.నా రిటర్న్ లోపభూయిష్టమైనదని నాకు ఎలా తెలుస్తుంది?
మీ రిటర్న్ లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించినట్లయితే, ఆదాయపు పన్ను శాఖ మీకు ఆదాయపు పన్ను చట్టం యొక్క 139(9) సెక్షన్ ప్రకారం మీ రిజిస్టర్డ్ ఇమెయిల్ IDకి ఇమెయిల్ ద్వారా ఒక లోపభూయిష్ట నోటీసును పంపుతుంది దానిని మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవడం ద్వారా చూడవచ్చు.


11.ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ప్రతిస్పందనను సమర్పించిన తర్వాత నేను నా ప్రతిస్పందనను అప్‌డేట్ చేయవచ్చా లేదా దానిని ఉపసంహరించుకోవచ్చా?
లేదు, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో సమర్పించిన తర్వాత మీరు మీ ప్రతిస్పందనను అప్‌డేట్ లేదా ఉపసంహరించుకోవడం చేయలేరు.

12. నా లోపభూయిష్ట నోటీసుకు ప్రతిస్పందించే అధికారం నేను మరొక వ్యక్తికి ఇవ్వవచ్చా?
అవును, మీరు 139 [9] సెక్షన్ ప్రకారం లోపభూయిష్ట నోటీసుకు ప్రతిస్పందించే అధికారం మరొక వ్యక్తికి ఇవ్వవచ్చు.

13. నేను ITR ఫారంలోని లోపాన్ని ఆన్‌లైన్‌లో సరిచేయవచ్చా?
అవును, మీరు ITR ఫారంలోని లోపాన్ని ఆన్‌లైన్‌లో సరిదిద్దడం ద్వారా మీ ప్రతిస్పందనను సమర్పించవచ్చు.

14. ఆదాయపు పన్ను శాఖ పంపిన లోపభూయిష్ట నోటీసుకు నేను ప్రతిస్పందించేందుకు నాకు ఎంత గడువు ఉంటుంది?
మీ రిటర్న్ లోపభూయిష్టంగా ఉన్నట్లు గుర్తించినట్లయితే, మీరు దాఖలు చేసిన రిటర్న్‌లో లోపాన్ని సరిదిద్దడానికి నోటీసును స్వీకరించిన తేదీ నుండి లేదా నోటీసులో పేర్కొన్న సమయ వ్యవధి నుండి మీకు 15 రోజుల గడువు లభిస్తుంది. అయితే, మీరు వాయిదాను కోరవచ్చు మరియు గడువు పొడిగింపు కోసం అభ్యర్థించవచ్చు.

15. నేను లోపభూయిష్ట నోటీసుకు ప్రతిస్పందించకపోతే ఏమి జరుగుతుంది?
మీరు నిర్ణీత గడువులో లోపభూయిష్ట నోటీసుకు ప్రతిస్పందించడంలో విఫలమైతే, మీ రిటర్న్ చెల్లనిదిగా పరిగణించబడుతుంది అందువల్ల ఆదాయపు పన్ను చట్టం ప్రకారం జరిమానా, వడ్డీ, నష్టాలు క్యారీ ఫార్వార్డ్ చేయబడకపోవడం, నిర్దిష్ట మినహాయింపులను కోల్పోవడం వంటి పర్యవసానాలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

16. 139 [9] సెక్షన్ ప్రకారం లోపభూయిష్ట రిటర్న్ గురించి నాకు తెలియజేయబడింది. నేను ఆ మదింపు సంవత్సరానికి రిటర్న్ తాజా రిటర్న్‌గా దాఖలు చేయవచ్చా?
అవును, ఒక నిర్దిష్ట మదింపు సంవత్సరంలో రిటర్న్‌ను దాఖలు చేయడానికి అందించిన గడువు ముగియనట్లయితే మీరు రిటర్న్‌ను తాజా / సవరించిన రిటర్న్‌గా దాఖలు చేయవచ్చు లేదా ప్రత్యామ్నాయంగా మీరు 139 సెక్షన్ ప్రకారం మీరు నోటీసుకు ప్రతిస్పందించాలని కూడా ఎంచుకోవచ్చు. అయితే, ఒక నిర్దిష్ట మదింపు సంవత్సరానికి రిటర్న్‌ దాఖలు చేయడానికి అందించిన గడువు ముగిసిన తర్వాత, మీరు రిటర్న్‌ను తాజా/సవరించిన రిటర్న్‌గా దాఖలు చేయలేరు మరియు మీరు 139 [9] సెక్షన్ ప్రకారం నోటీసుకి ప్రతిస్పందించవలసి ఉంటుంది. మీరు నోటీసుకు ప్రతిస్పందించలేకపోతే, ఆ రిటర్న్ చెల్లనిదిగా పరిగణించబడుతుంది లేదా ఆ మదింపు సంవత్సరం కోసం దాఖలు చేయబడనిదిగా పరిగణించబడుతుంది.

17. రిటర్న్ లోపభూయిష్టం కావడానికి కారణమయ్యే కొన్ని సాధారణ తప్పులు ఏమిటి?
రిటర్న్ లోపభూయిష్టం కావడానికి కారణమయ్యే కొన్ని సాధారణ తప్పులు క్రింది విధంగా ఉంటాయి:

  • TDS జమ కోసం క్లెయిమ్ చేశారు కానీ సంబంధిత రశీదులు/ఆదాయాన్ని పన్నుల కోసం చూపించలేదు.
  • TDS జమ చేయుటకు క్లెయిమ్ చేయబడిన ఫారం 26ASలో చూపబడిన స్థూల రసీదులు, ఆదాయ రిటర్న్‌లో అన్ని ఆదాయ పద్దుల క్రింద చూపబడిన రశీదుల మొత్తం కంటే ఎక్కువగా ఉండడం.
  • మొత్తం స్థూల ఆదాయం మరియు అన్ని ఆదాయ పద్దులు శూన్యం లేదా 0 గా నమోదు చేయబడినవి కానీ చెల్లించాల్సిన పన్ను గణించబడింది మరియు చెల్లించబడింది.
  • ITRలోని పన్ను చెల్లింపుదారుల పేరు PAN డేటాబేస్ ప్రకారం గల పేరుతో సరిపోలడం లేదు.
  • వ్యాపారం లేదా వృత్తి నుండి లాభాలు మరియు రాబడులు అనే ఆదాయ పద్దు కింద పన్ను చెల్లింపుదారులు ఆదాయాన్ని కలిగి ఉన్నారు కానీ బ్యాలెన్స్ షీట్ మరియు లాభ నష్టాల ఖాతాను పూరించలేదు.

18. స్పష్టీకరణ సమాచారం కోరడం అంటే ఏమిటి?
షెడ్యూల్ లేదా రిటర్న్ యొక్క అనుబంధాల క్రింద అందించబడిన సమాచారం సరిపోనిదిగా లేదా తగినవిధంగా లేని సందర్భాలు మరియు పన్ను చెల్లింపుదారు చేసిన కొన్ని క్లెయిమ్‌లపై స్పష్టత అవసరమైతే, స్పష్టీకరణ సమాచారం కొరడానికి పన్ను చెల్లింపుదారుకి పంపబడుతుంది.

19. ఇ-ప్రొసీడింగ్స్ సేవను ఉపయోగించి ప్రతిస్పందనను చూసేందుకు మరియు సమర్పించడానికి నేను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవాల్సి ఉంటుందా?
అవును, ఇ-ప్రొసీడింగ్స్ సేవను ఉపయోగించి ప్రతిస్పందనను చూడటానికి మరియు సమర్పించడానికి మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ అవ్వాలి.

20.నేను చేసిన ప్రతిస్పందన / సమర్పణను ఇ-వెరిఫై చేయాల్సి ఉంటుందా?
లేదు, మీరు సమర్పించిన ప్రతిస్పందనను ఇ-వెరిఫై చేయాల్సిన అవసరం లేదు.

21. నేను ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయకుండానే స్పష్టీకరణ నోటీసు కోరడానికి ప్రతిస్పందించవచ్చా?
లేదు, మీరు స్పష్టమైన సమాచారం కోరడానికి ప్రతిస్పందించడానికి లాగిన్ అవ్వాలి. మీరు నోటీసును చూడలేరు లేదా మీకు జారీ చేయబడిన నోటీసుకు ప్రతిస్పందనను సమర్పించలేరు.

22.ఆదాయపు పన్ను అథారిటీ ద్వారా నాకు జారీ చేయబడిన నోటీసులకు ఇ-ప్రొసీడింగ్స్ సేవను ఉపయోగించి నా తరపున వేరొకరు స్పందించవచ్చా?
అవును, ఇ-ప్రొసీడింగ్స్ సేవను ఉపయోగించి మీ తరపున నోటీసుకు ప్రతిస్పందించడానికి మీరు అధికారం ఇచ్చిన ప్రతినిధిని మీరు జోడించవచ్చు.

23. నేను ఇప్పటికే జోడించిన / ఇప్పటికే కలిగి ఉన్న అధీకృత ప్రతినిధిని తొలగించవచ్చా?
అవును, మీ ద్వారా అధికారం పొందిన ప్రతినిధిని మీరు తొలగించవచ్చు లేదా ఉపసంహరించుకోవచ్చు.

24. నాకు జారీ చేసిన నోటీసుకు ప్రతిస్పందించడానికి నేను ఇద్దరు అధీకృత ప్రతినిధులను జోడించవచ్చా?
లేదు, మీరు ఒక ప్రొసీడింగ్ కోసం ఒక అధీకృత ప్రతినిధిని మాత్రమే క్రియాశీలంగా కలిగి ఉండవచ్చు.

25. నేను సవరించిన రిటర్న్ దాఖలు చేసాను. నాకు జారీ చేయబడిన స్పష్టీకరణ సమాచారం కోరడానికి నేను ఇంకా ప్రతిస్పందించాల్సిన అవసరం ఉందా?
లేదు, మీరు ఇప్పటికే అదే మదింపు సంవత్సరానికి సవరించిన రిటర్న్ దాఖలు చేసినట్లయితే మీరు మీ ప్రతిస్పందనను సమర్పించడానికి ఇది అనుమతించదు. 'ఈ నోటీసుకు వ్యతిరేకంగా సవరించిన రిటర్న్ దాఖలు చేయబడింది; తదుపరి చర్య అవసరం లేదు' అనే సందేశం కనిపిస్తుంది.

26. నాకు జారీ చేయబడిన స్పష్టీకరణ సమాచారం కోరడానికి నేను తప్పనిసరిగా ప్రతిస్పందించాలా? అవును అయితే, నేను నా ప్రతిస్పందనను సమర్పించే సమయ పరిమితి ఎంత?
మీకు జారీ చేసిన కమ్యూనికేషన్‌లో పేర్కొన్న గడువు తేదీ ప్రకారం మీరు మీ ప్రతిస్పందనను సమర్పించాలి / అందించాలి. ఒకవేళ గడువు తేదీ మించిపోయినా, ఎటువంటి ప్రతిస్పందనను అందించనట్లయితే, CPC వారి వద్ద అందుబాటులో ఉన్న సమాచారంతో రిటర్న్‌ను ప్రాసెస్ చేస్తుంది.