1. అవలోకనం

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 115JB కింద పేర్కొన్న నిబంధనల ప్రకారం ఒక నిర్దిష్ట మదింపు సంవత్సరానికి CA ధృవీకరించిన స్థూల లాభాలను వెల్లడించడానికి ఫారం 29B కంపెనీలకు అనుమతిస్తుంది. ఈ ఫారమ్‌ను ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ పద్ధతుల్లో దాఖలు చేయవచ్చు. సెక్షన్ 139(1) కింద రిటర్న్ దాఖలు చేయడానికి గడువు తేదీకి ఒక నెల ముందు లేదా సెక్షన్ 142(1)(i) కింద నోటీసుకు ప్రతిస్పందనగా అందించిన ఆదాయ రిటర్న్‌తో పాటు, ఫారమ్ 29B దాఖలు చేయాలి.


2. ఈ సేవ పొందడానికి ముందస్తు అవసరాలు

  • పన్ను చెల్లింపుదారుడు మరియు CA చెల్లుబాటు అయ్యే యూజర్ ID, పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ కావాలి
  • పన్ను చెల్లింపుదారుడు, CA ల పాన్ స్థితి క్రియాశీలకంగా ఉంది
  • పన్ను చెల్లింపుదారుడు ఫారం 29B కోసం నా CA కింద చార్టర్డ్ అకౌంటెంట్ ను కేటాయించి ఉండాలి
  • CA ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయబడిన చెల్లుబాటు అయ్యే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC) కలిగి ఉండాలి, దీని గడువు ముగిసి ఉండకూడదు


3. ఫారం గురించి


3.1 ఉద్దేశం


ఆదాయపు పన్ను చట్టం, 1961లోని నిబంధనలకు అనుగుణంగా స్థూల లాభాలు లెక్కించబడ్డాయని ధృవీకరిస్తూ అన్ని కంపెనీలు అధీకృత CA ద్వారాఫారం 29Bలో ఒక నివేదికను పొందాలి.


3.2 దాన్ని ఎవరు ఉపయోగించవచ్చు?


ఫారం 29B రూపంలో ఆడిట్ నివేదికను అందించడానికి (నా CA సేవను ఉపయోగించి లాగిన్ అయిన తరువాత) కంపెనీలు చార్టర్డ్ అకౌంటెంట్ కు కేటాయించాలి.ఆ తర్వాత, ఒక రిజిస్టర్డ్ CA ఆడిట్ నివేదికను అందించడానికి అభ్యర్థనను అంగీకరించవచ్చు లేదా తిరస్కరించవచ్చు మరియు (అంగీకరించినట్లయితే) ఫారమ్ 29Bని సిద్ధం చేసి సమర్పించాల్సి ఉంటుంది.


4. ఫారం గురించి క్లుప్తంగా

ఫారం 29B మూడు భాగాలు - పార్ట్ A పార్ట్ B / పార్ట్ C మరియు ఆడిట్ నివేదిక. ఫారమ్‌లో మూడు భాగాలతో అనుబంధాలు ఉన్నాయి. మొదటి భాగం అన్ని కంపెనీలకు వర్తిస్తుంది, రెండవ మరియు మూడవ భాగాలు కొన్ని షరతుల ఆధారంగా వర్తిస్తాయి.


ఫారమ్‌ను పూరించడం ప్రారంభించే ముందు, పార్ట్ B మరియు పార్ట్ C వర్తింపజేస్తే రిజిస్టర్డ్ CA ప్రాంప్ట్ చేయబడతారు మరియు తదనుగుణంగా భాగాలు పూరించడానికి అందుబాటులో ఉంటాయి.
 

Data responsive

 

4.1 భాగం A

మొదటి భాగంలో అన్ని కంపెనీలకు వర్తించే స్థూల లాభాల సాధారణ వివరాలు ఉన్నాయి.

Data responsive


4.2 భాగం B / భాగం C


పార్ట్ Bలో సెక్షన్ 115JB లోని ఉప సెక్షన్ (2 A) ప్రకారం పెంచాల్సిన / తగ్గించాల్సిన మొత్తం యొక్క వివరాలు ఉన్నాయి. పార్ట్ Cలో సెక్షన్ 115JB లోని ఉప సెక్షన్ (2C) ప్రకారం పెంచాల్సిన / తగ్గించాల్సిన మొత్తం యొక్క వివరాలు ఉన్నాయి.

Data responsive


4.3 అకౌంటెంట్ నివేదిక


చివరి భాగం CA ఇవ్వాల్సిన ఆడిట్ నివేదిక.

Data responsive


5. ఎలా యాక్సెస్ చేసి సమర్పించాలి?


ఫారం 29B ని పూర్తి చేసి క్రింది పద్ధతుల ద్వారా సమర్పించవచ్చు:

  • ఆన్‌లైన్ విధానం- ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా
  • ఆఫ్‌లైన్ పద్ధతిని అనుసరించడం - ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఆఫ్‌లైన్ యుటిలిటీ ( చట్టబద్ధమైన ఫారమ్‌లు) యూజర్ మాన్యువల్‌ను చూడండి.

ఫారమ్ 29B ని ఆన్‌లైన్ విధానం ద్వారా దాఖలు చేసి, సమర్పించడానికి క్రింది దశలను అనుసరించండి.


5.1 పన్ను చెల్లింపుదారుచే ఫారం 29B ని కేటాయించడం


దశ 1: మీ యూజర్ ID, పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.

Data responsive

2: మీ డాష్‌బోర్డ్లో, ఇ-ఫైల్> ఆదాయపు పన్ను ఫారమ్‌లు> ఆదాయపు పన్ను ఫారమ్‌లు ఫైల్ చేయండి క్లిక్ చేయండి.

Data responsive

దశ 3: అందుబాటులో ఉన్న ఫారం టైల్స్ నుండి 29B ఫారంను ఎంచుకోండి. నా CA సేవను ఉపయోగించి CAని కేటాయించండి (మీకు చార్టర్డ్ అకౌంటెంట్ ని కేటాయించబడకపోతే).

Data responsive


గమనిక: మరింత తెలుసుకోవడానికి నా CA యూజర్ మాన్యువల్ చూడండి.

దశ 4: మదింపు సంవత్సరం అందించండి మరియు నా CA సేవను ఉపయోగించి చార్టర్డ్ అకౌంటెంట్ ని కేటాయించండి. సహాయక పత్రాలను జత చేసి కొనసాగించు పై క్లిక్ చేయండి.

Data responsive


ఫారమ్ విజయవంతంగా CAకి సమర్పించబడింది. లావాదేవీ IDతో పాటు విజయవంతమైన సందేశం ప్రదర్శించబడుతుంది. దయచేసి భవిష్యత్ సూచన కోసం లావాదేవీ ID యొక్క గమనికను ఉంచండి.

Data responsive


5.2 చార్టర్డ్ అకౌంటెంట్ ద్వారా ఫారం 29B దాఖలు చేయటం


దశ 1: మీ యూజర్ ID, పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.

Data responsive

దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, పెండింగ్ చర్యలు> వర్క్‌లిస్ట్ పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 3: ఫారం 29B దాఖలు చేయడానికి అభ్యర్థనను ఆమోదించండి లేదా తిరస్కరించండి క్లిక్ చేయండి.

Data responsive


గమనిక:

  • మీరు తిరస్కరించాలని ఎంచుకుంటే, సంబంధిత కారణాన్ని అందించవచ్చు.
  • తిరస్కరణపై, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయబడిన ఇ-మెయిల్ ID, మొబైల్ నంబర్‌ లకు పన్ను చెల్లింపుదారునికి ఇ-మెయిల్, SMS సమాచారం పంపబడుతుంది, తిరస్కరణకు గల కారణాల వివరాలను అందిస్తుంది.

అంగీకరించిన తరువాత విజయవంతమైనదన్న సందేశం ప్రదర్శించబడుతుంది.

Data responsive

 

దశ 4: మీ వర్క్ లిస్ట్ పై ఫైల్ ఫారం ను ఎంచుకోండి.

Data responsive


దశ 5: వివరాలను వెరిఫై చేసి, కొనసాగించండి పై క్లిక్ చేయండి

Data responsive


దశ 6: సూచనల పేజీలో, ప్రారంభించండి అని క్లిక్ చేయండి.

 

Data responsive


దశ 7: సంబంధిత ఎంపికలపై క్లిక్ చేయడం ద్వారా ఫారం 29B యొక్క పార్ట్ B మరియు C యొక్క వర్తింపును ఎంచుకోండి మరియు కొనసాగండి పై క్లిక్ చేయండి.
 

Data responsive


గమనిక: మీ ఎంపిక ప్రకారం, వర్తించే భాగాలు మాత్రమే ఫారం సంఖ్య 29B పేజీలో కనిపిస్తాయి.

 

దశ 8: వర్తించే విభాగాలలో అవసరమైన అన్ని ఖాళీలను నింపండి - పార్ట్ A, పార్ట్ B / పార్ట్ C మరియు అకౌంటెంట్ నివేదిక మరియు ప్రివ్యూ పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 9: ప్రివ్యూ పేజీలో, ఇ-వెరిఫైకి కొనసాగండి పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 10: నిర్ధారించడానికి అవును క్లిక్ చేయండి.

Data responsive


దశ 11: అవును క్లిక్ చేయడం ద్వారా, మీరు ఇ-వెరిఫై పేజీకి వెళ్తారు.


గమనిక: మరింత తెలుసుకోవడానికి ఎలా ఇ-వెరిఫై చేయాలి యూజర్ మాన్యువల్‌ను చూడండి.


విజయవంతమైన ఇ-వెరిఫికేషన్ తరువాత, లావాదేవీ IDతో పాటు ఒక విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. విజయవంతంగా సమర్పించిన తరువాత, పన్ను చెల్లింపుదారు అంగీకారం / తిరస్కరణ కోసం ఇ-ఫైలింగ్ పోర్టల్లో రిజిస్టర్ చేయబడిన పన్ను చెల్లింపుదారు ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు ధృవీకరణ సందేశం పంపబడుతుంది.

Data responsive


5.3. పన్ను చెల్లింపుదారు నింపిన ఫారం 29Bకి ఆమోదం


దశ 1: యూజర్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.

Data responsive

దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, పెండింగ్ చర్యలు> వర్క్‌లిస్ట్ పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 3: CA అప్‌లోడ్ చేసిన ఫారంను అంగీకరించడానికిఅంగీకరించండి ఎంచుకోండి / తిరస్కరించండి ఎంచుకోండి మరియు ఫారం తిరస్కరించడానికి తిరస్కరణ వ్యాఖ్యలను తెలియజేయండి.

Data responsive


గమనిక:

  • మీరు తిరస్కరించాలని ఎంచుకుంటే, సంబంధిత కారణాన్ని అందించవచ్చు.
  • తిరస్కరణపై, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయబడిన ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు ఇమెయిల్ మరియు SMS కమ్యూనికేషన్ తిరస్కరణకు గల కారణాల వివరాలను అందించడం ద్వారా CAకి పంపబడుతుంది.

దశ 5: అంగీకరించండి అనే ఎంపికను ఎంచుకున్న తర్వాత, మీరు అప్‌లోడ్ చేసిన ఫారమ్‌ను ధృవీకరించగల ఇ-వెరిఫై పేజీకి తీసుకెళ్లబడతారు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఎలా ఇ-ధృవీకరణ చెయ్యాలి తెలుసుకోవడానికి వినియోగదారు మాన్యువల్‌ను చూడండి.


ఇ-వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత, రశీదు సంఖ్యతో పాటు విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. మీ ఫారమ్‌ను విజయవంతంగా సమర్పించినట్లు నిర్ధారిస్తూ ఒక ఇ-మెయిల్ పన్ను చెల్లింపుదారుల ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు మరియు ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో నమోదు చేసుకున్న CAకి పంపబడుతుంది.

Data responsive


6. సంబంధిత అంశాలు