ఫారమ్ 1 (52/2023) యూజర్ మాన్యువల్

 

1. అవలోకనం

ఫారం నెం.1 అనేది అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రం (IFSC)లో నెలకొని ఉన్న విమానాలను అద్దెకు ఇచ్చే కంపెనీలు ఉపయోగించే ఒక సాధారణ ధ్రువీకరణ పత్రం.
IFSC లో నెలకొని ఉన్న కంపెనీ నుండి వారు పొందే నిర్దిష్ట డివిడెండ్ చెల్లింపులపై TDS (పన్ను మినహాయింపు)ను నివారించడానికి ఈ ఫారం వీలు కల్పిస్తుంది.
IFSC లో తమ విభాగాలను కలిగి ఉన్న కంపెనీలు మరియు వాటి అధీకృత సంతకందారు లేదా ప్రతినిధులు ఈ ఫారంను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ విధానం ద్వారా దాఖలు చేయవచ్చు. మరియు డబ్బు పొందే వ్యక్తి తాను దాఖలు చేసిన ఫారం యొక్క PDF మరియు రసీదును డబ్బు చెల్లింపుదారుకి సమర్పించాల్సి ఉంటుంది. దీని ఆధారంగా, డబ్బు చెల్లించే వ్యక్తి తాను చేసిన డివిడెండ్ చెల్లింపులపై TDS పన్ను కోతను నిలిపివేస్తారు.

2. ఫారం దాఖలు చేయడానికి ముందుగా కావలసినవి

ఒక కంపెనీ 'ఫారం నం. 1'ను దాఖలు చేయడానికి ముందు, ఈ క్రింది షరతులు తప్పనిసరిగా పాటించబడాలి:
కంపెనీ:
•    IFSCలోనెలకొని ఉండాలి.
•    ప్రధానంగావిమానాల లీజింగ్వ్యాపారాన్ని నిర్వహిస్తూ ఉండాలి. 
వారు పొందే డివిడెండ్:
•    ఆదాయపు పన్ను చట్టం 2025లోనిషెడ్యూల్ VI (పట్టిక క్రమ సంఖ్య 11)ప్రకారం పన్ను మినహాయింపునకు అర్హత కలిగి ఉండాలి.
ఈ ఫారం:
•    అధికారిక వ్యక్తి(ఆదాయపు పన్ను చట్టం 2025లోని సెక్షన్ 265 ప్రకారం) ద్వారా సంతకం చేయబడి ఉండాలి.
•    డివిడెండ్చెల్లించే కంపెనీకి సమర్పించబడాలి. చెల్లింపు చేసే కంపెనీకి ఈ ఫారం అందిన తర్వాత, ఆ డివిడెండ్ చెల్లింపులపై అదిTDSను మినహాయించదు.

3. ఫారం గురించి

ఫారం 1 యొక్క ఉద్దేశం
ఈ ఫారం క్రింది విషయాలను ధ్రువీకరించడానికి ఉపయోగించబడుతుంది:
• ఈ ఫారాన్ని దాఖలు చేస్తున్న కంపెనీతనకు వచ్చే డివిడెండ్ ఆదాయంపైపన్ను మినహాయింపు పొందడానికి అర్హత కలిగి ఉంటుంది
• ఇది ఇప్పటికీ IFSC లోనే పని చేస్తోంది మరియు ఇప్పటికీ విమానాల అద్దె వ్యాపారం లోనే నిమగ్నమై ఉంది
• ఈ ఫారాన్ని సమర్పించిన తర్వాత, చెల్లింపుదారు కంపెనీ ఆ డివిడెండ్ చెల్లింపులపైTDS చేయడం నిలిపివేయవచ్చు
ఈ ఫారం ఎందుకు ఉంది
IFSC విమానాల ఆద్దె విభాగాల మధ్య జరిగే కొన్ని నిర్దిష్ట లాభాల వాటా చెల్లింపులపై TDS మినహాయించబడకుండాచూసుకోవడానికి ప్రభుత్వం నోటిఫికేషన్ 52/2023ను జారీ చేసింది.
ఫారం నెం.1(52/2023)ని ఎవరు దాఖలు చేయవచ్చు
ఫారం నెం.1 ను ఎవరు దాఖలు చేయవచ్చు ఆంటే
ఆదాయాన్ని పొందే కంపెనీ
ఒక కంపెనీ అది
• అంతర్జాతీయ ఆర్థిక సేవల కేంద్రంలో నెలకొని ఉన్నటువంటిది
•ప్రధానంగా విమానాల ఆద్దె వ్యాపారం లో నిమగ్నమై ఉన్నటువంటిదిమరియు
• మరొక సారూప్యమైన IFSC సంస్థ నుండి డివిడెండ్ పొందుతున్నటువంటిది
అధీకృత సంతకందారు
ఆ కంపెనీ యొక్క ఆదాయపు పన్ను రిటర్నులను ధ్రువీకరించడానికి ఎవరికైతే చట్టబద్ధమైన అనుమతి ఉందో, ఆ వ్యక్తి మాత్రమే ఈ ఫారంపై సంతకం చేయాలి (ఆదాయపు పన్ను చట్టం 2025 లోని సెక్షన్ 265 ప్రకారం).

4.ఫారం నెం.1 ని దాఖలు చేయడానికి దశలవారీ మార్గదర్శిని

స్టెప్ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి

Data responsive

స్టెప్ 2: యూజర్ ఐడీ (PAN) మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

Data responsive

స్టెప్ 3: "ఇ-ఫైల్" మెనూలోకి వెళ్లండి, ఆపై "ఆదాయపు పన్ను ఫారాలు"కు వెళ్లండి, ఆ తర్వాత "ఆదాయపు పన్ను ఫారాల దాఖలు" కు వెళ్లండి

Data responsive

స్టెప్ 4: "ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం ఫారాలు" అనే ట్యాబును ఎంచుకోండి

Data responsive

స్టెప్ 5ఎంచుకోండి / వెతకండి ఫారం 1 (52/2023) [షెడ్యూల్ VI (టేబుల్: క్ర.సం. 11) కింద మినహాయింపు డివిడెండ్]
 

Data responsive

స్టెప్ 6: పన్ను సంవత్సరాన్ని ఎంచుకుని, ఆపై "కొనసాగించు" బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

స్టెప్ 7 "లెట్స్ గెట్ స్టార్టెడ్" అనే బటన్‌పై క్లిక్ చేయండి

Data responsive

స్టెప్ 8: "లెట్స్ గెట్ స్టార్టెడ్" ను వినియోగదారు క్లిక్ చేసినప్పుడు ఫారం 1 (52/2023) స్క్రీన్ పైన కనిపిస్తుంది.
వినియోగదారులు అన్ని ఖాళీ ఫీల్డ్ లను నింపాలి. నక్షత్ర గుర్తు (*) ఉన్న ఫీల్డ్ లను పూరించడం తప్పనిసరి.

తప్పనిసరి సమాచారం
వినియోగదారు ఈ క్రింది వివరాలను నమోదు చేయాలి:
•    చెల్లింపుదారు యొక్క IFSCలో ఉన్న యూనిట్ పేరు,అలాగేచిరునామావిభాగం మరియు ప్రదేశంలోని తప్పనిసరి వివరాలు.
ముందే నింపబడిన సమాచారం
ఫారంలో కొన్ని వివరాలు ఆటోమేటిక్‌గా ముందే నింపబడి ఉంటాయి, ఉదాహరణకు:
•    చెల్లింపుదారు పేరు, PAN, చిరునామా, ఈమెయిల్ ID, మొబైల్ నంబర్.
ముందే నింపిన వివరాలను అప్‌డేట్ చేయడం
వినియోగదారు ముందే నింపిన సమాచారంలో దేనినైనా అప్‌డేట్ చేయాలనుకుంటే:
•    “మై ప్రొఫైల్”హైపర్‌లింక్‌పై క్లిక్ చేసి, అవసరమైన ప్రాథమిక వివరాలను అప్‌డేట్ చేయండి.
•    అప్‌డేట్ చేసిన వివరాలు ఫారంలో కనిపిస్తాయి.
ప్రకటన మరియు ధ్రువీకరణ
మై ప్రొఫైల్లో అందుబాటులో ఉన్నప్రధాన వ్యక్తిసమాచారం ఆధారంగాప్రధాన సంప్రదింపు వ్యక్తివివరాలు కూడా ముందే నింపబడతాయి.
ఒకవేళ వినియోగదారు ప్రధాన సంప్రదింపు వ్యక్తి వివరాలను అప్‌డేట్ చేయాల్సి వస్తే:
•    ప్యానెల్‌లో అందించిన హైపర్‌లింక్ ద్వారా మై ప్రొఫైల్ విభాగానికి వెళ్లండి.
•    అవసరమైన సమాచారాన్ని తదనుగుణంగా అప్‌డేట్ చేయండి.

Data responsiveData responsiveData responsive

స్టెప్ 9 మీరు "ప్రివ్యూ" పై క్లిక్ చేసినప్పుడు, అది మిమ్మల్ని ప్రివ్యూ స్క్రీన్‌కు తీసుకెళ్తుంది. అక్కడ మీరు ఇచ్చిన వివరాలన్నింటినీ మరొకసారి సరిచూసుకుని, "ప్రొసీడ్ టు ఈ-వెరిఫై" బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

స్టెప్ 10: "ప్రొసీడ్ టు ఈ-వెరిఫై" పై క్లిక్ చేసిన తర్వాత, స్క్రీన్ మీద ఒక పాప్-అప్ సందేశం వస్తుంది. అందులో ‘అవును’ అని ఎంచుకోండి.

Data responsive

స్టెప్ 11 "అవును" పై క్లిక్ చేయగానే, మీరు నేరుగా ఇ-వెరిఫై పేజీకి చేరుకుంటారు.

Data responsiveData responsive

డ్రాప్‌డౌన్ నుండి DSC లోని "ప్రొవైడర్ మరియు సర్టిఫికేట్‌"ను ఎంచుకోండి, ఆ తర్వాత DSC పాస్‌వర్డ్ ఇచ్చి ‘సైన్’ పై క్లిక్ చేయండి.

Data responsive

మీరు ‘సైన్’ బటన్‌పై క్లిక్ చేయగానే స్క్రీన్ మీద ఒక కన్ఫర్మేషన్ పాప్-అప్ కనిపిస్తుంది. కొనసాగడానికి వినియోగదారు అందులో ‘అవును’ను ఎంచుకోవాలి

Data responsive

గమనిక: మరింత సమాచారం తెలుసుకోవడానికి 'ఇ-వెరిఫై ఎలా చేయాలి అనే వినియోగదారుల మాన్యువల్‌ను చూడండి.

ఇ-వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, స్క్రీన్ మీద విజయవంతమైందనే సందేశంతో పాటు ‘ట్రాన్సాక్షన్ ID’ మరియు ‘అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్’ కనిపిస్తాయి. భవిష్యత్తు అవసరాల కోసం దయచేసి ఆ ట్రాన్సాక్షన్ ID మరియు అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ను రాసి పెట్టుకోండి. అలాగే, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయి ఉన్న మీ ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్లకు కూడా దీనికి సంబంధించిన నిర్ధారణ సమాచారం వస్తుంది.

స్టెప్ 12 ‘అవును’ పై క్లిక్ చేయగానే, ఫారం విజయవంతంగా సమర్పించబడుతుంది.

Data responsive