ఫారమ్ 29B యూజర్ మాన్యువల్
1. అవలోకనం
ఫారం 29B అనేది ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 115JB ప్రకారం నిర్దిష్ట అంచనా సంవత్సరానికి సంబంధించిన బుక్ ప్రాఫిట్స్‌ను CA ధ్రువీకరించిన విధంగా కంపెనీలు ప్రకటించడానికి ఉపయోగించే ఫారం. ఈ ఫారాన్ని ఆన్‌లైన్ మరియు ఆఫ్‌లైన్ విధానాలలో రెండింటిలోనూ సమర్పించవచ్చు. ఫారం 29B ను సెక్షన్ 139(1) ప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయాల్సిన గడువు తేదీకి ఒక నెల ముందు లేదా సెక్షన్ 142(1)(i) కింద జారీ చేసిన నోటీసుకు ప్రతిస్పందనగా సమర్పించే ఆదాయపు రిటర్న్‌తో పాటు దాఖలు చేయాలి.
2. ఈ సేవను పొందడానికి అవసరమైన ముందస్తు అర్హతలు
- పన్నుచెల్లింపుదారుడు మరియు CA ఇద్దరూ చెల్లుబాటు అయ్యే యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదై ఉండాలి.
- పన్నుచెల్లింపుదారుడు మరియు CA యొక్క PAN స్థితి యాక్టివ్‌గా ఉండాలి.
- పన్నుచెల్లింపుదారుడు My CA విభాగంలో ఫారం 29B కోసం CAను నియమించి ఉండాలి.
- CA ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన, గడువు ముగియని చెల్లుబాటు అయ్యే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC) ను కలిగి ఉండాలి.
3. ఫారం గురించి
3.1 ఉద్దేశం
ఆదాయపు పన్ను చట్టం, 1961 నిబంధనల ప్రకారమే బుక్ ప్రాఫిట్స్ (పుస్తక లాభాలు) లెక్కించబడ్డాయని ధ్రువీకరిస్తూ, గుర్తింపు పొందిన CA నుండి కంపెనీలన్నీ ఫామ్ 29B లో నివేదికను పొందడం తప్పనిసరి.
3.2 దీన్ని ఎవరు ఉపయోగించవచ్చు?
కంపెనీలు ఒక చార్టర్డ్ అకౌంటెంట్ (CA)ను కేటాయించాల్సి ఉంటుంది(లాగిన్ అయిన తర్వాత My CA సేవను ఉపయోగించి)సదరు CA ఫామ్ 29B రూపంలో ఆడిట్ నివేదికను సమర్పిస్తారు. ఆ తర్వాత, రిజిస్టర్డ్ CA ఈ ఆడిట్ నివేదిక సమర్పణ అభ్యర్థనను ఆమోదించవచ్చు లేదా తిరస్కరించవచ్చు మరియు (ఒకవేళ ఆమోదిస్తే) ఫామ్ 29Bని సిద్ధం చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది.
4. ఫారం సంక్షిప్త అవలోకనం
ఫారం 29B లో మూడు భాగాలు ఉంటాయి – పార్ట్ ఎ, పార్ట్ బి / పార్ట్ సి మరియు ఆడిట్ రిపోర్ట్. ఈ ఫారానికి అనుబంధాలుగా కూడా మూడు భాగాలు ఉంటాయి. మొదటి భాగం అన్ని కంపెనీలకు వర్తిస్తుంది. రెండవ మరియు మూడవ భాగాలు నిర్దిష్ట షరతుల ఆధారంగా వర్తిస్తాయి.
ఫారాన్ని పూరించడం ప్రారంభించే ముందు, నమోదైన CAకు పార్ట్ బి మరియు పార్ట్ సి వర్తిస్తాయా లేదా అనే విషయం గురించి సూచన ఇవ్వబడుతుంది. దానికి అనుగుణంగా సంబంధిత భాగాలు పూరించడానికి అందుబాటులో ఉంటాయి.
4.1 పార్ట్ ఎ
మొదటి భాగంలో అన్ని కంపెనీలకు వర్తించే బుక్ ప్రాఫిట్స్‌కు సంబంధించిన సాధారణ వివరాలు ఉంటాయి.
4.2 పార్ట్ బి / పార్ట్ సి
పార్ట్ బి లో సెక్షన్ 115JB యొక్క ఉపవిభాగం (2A) ప్రకారం పెంచాల్సిన లేదా తగ్గించాల్సిన మొత్తాలకు సంబంధించిన వివరాలు ఉంటాయి. పార్ట్ సిలో సెక్షన్ 115JB యొక్కఉపవిభాగం (2C) ప్రకారం పెంచాల్సిన లేదా తగ్గించాల్సిన వివరాలు ఉంటాయి.
4.3 అకౌంటెంట్ నివేదిక
చివరి భాగం CA యొక్క ఆడిట్ నివేదిక.
5. యాక్సెస్ చేయడం మరియు సబ్మిట్ చేయడం ఎలా
ఫారం 29B ను క్రింది విధానాల ద్వారా పూరించి సమర్పించవచ్చు:
- ఆన్‌లైన్ విధానం – ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా
- ఆఫ్‌లైన్ విధానం – ఆఫ్‌లైన్ యుటిలిటీ ద్వారా
గమనిక: మరింత సమాచారం కోసం ఆఫ్‌లైన్ యుటిలిటీ (స్టాట్యూటరీ ఫారాలు) వినియోగదారు మాన్యువల్‌ను చూడండి.
ఆన్‌లైన్ విధానం ద్వారా ఫారం 29B ను ఫైల్ చేసి సమర్పించడానికి క్రింది దశలను అనుసరించండి.
5.1 పన్ను చెల్లింపుదారుడు ఫారం 29B ను అప్పగించడం
దశ 1: మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్ లో ఈ-ఫైల్ > ఇన్‌కమ్ టాక్స్ ఫారాలు> ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫారాలు పై క్లిక్ చేయండి.
దశ 3:ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఉన్న ఫారాలనుండి ఫారం 29B ను ఎంపిక చేయండి / వెతకండి.
మై CA సేవ ద్వారా ఒక CAను నియమించండి (మీరు ఇప్పటివరకు ఏ CAను నియమించకపోతే).
గమనిక: మరింత సమాచారం కోసం My CA వినియోగదారు మాన్యువల్‌ను చూడండి.
దశ 4: అసెస్‌మెంట్ ఇయర్ ను నమోదు చేసి, My CA సేవ ద్వారా సీఏను నియమించండి. అవసరమైన సహాయక పత్రాలను జతచేసి కొనసాగించండి పై క్లిక్ చేయండి.

ఫారం విజయవంతంగా సీఏకు సమర్పించబడింది. ట్రాన్సాక్షన్ ఐడీతో పాటు విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. భవిష్యత్ సూచన కోసం ట్రాన్సాక్షన్ ఐడీని గమనించుకోండి.
5.2 CA ద్వారా ఫారం 29B ఫైలింగ్
దశ 1: మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
దశ 2:మీ డ్యాష్‌బోర్డ్ లోపెండింగ్ యాక్షన్స్ పైవర్క్‌లిస్ట్ పై క్లిక్ చేయండి.
దశ 3:ఫారం 29B ఫైలింగ్ అభ్యర్థననుయాక్సెప్ట్లేదారిజెక్ట్చేయండి.
గమనిక:
- మీరు తిరస్కరించాలనుకుంటే, సంబంధిత కారణాన్ని పేర్కొనవచ్చు.
- తిరస్కరణ జరిగినప్పుడు, తిరస్కరణకు సంబంధించిన కారణాల వివరాలతో ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన ఇమెయిల్ ఐడి మరియు మొబైల్ నంబర్‌కు పన్ను చెల్లింపుదారునికి ఇమెయిల్ మరియు SMS ద్వారా సమాచారం పంపబడుతుంది.
ఆమోదించిన తరువాత విజయ సందేశం ప్రదర్శించబడుతుంది.
దశ 4: మీ వర్క్‌లిస్ట్ లో ఫైల్ ఫారం ను ఎంపిక చేయండి.
దశ 5: వివరాలను ధ్రువీకరించి కంటిన్యూ పై క్లిక్ చేయండి.
దశ 6: ఇన్‌స్ట్రక్షన్స్ పేజీలో లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి .
దశ 7: సంబంధిత ఎంపికలపై క్లిక్ చేసి, ఫారం 29B యొక్క పార్ట్ బి మరియు పార్ట్ సి కు వర్తింపును ఎంపిక చేసి ప్రొసీడ్ పై క్లిక్ చేయండి.
గమనిక:మీరు చేసిన ఎంపిక ప్రకారం వర్తించే భాగాలు మాత్రమే ఫారం నం. 29B పేజీలో కనిపిస్తాయి.
దశ 8:వర్తించే విభాగాలైన పార్ట్ ఎ, పార్ట్ బి / పార్ట్ సి మరియు అకౌంటెంట్ నివేదికలో అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసిప్రివ్యూ పై క్లిక్ చేయండి.
దశ 9: ప్రివ్యూ పేజీలో ప్రొసీడ్ టు ఈ-వెరిఫై పైక్లిక్ చేయండి.
దశ 10:నిర్ధారించడానికిఅవునుపై క్లిక్ చేయండి.
దశ 11: అవును పై క్లిక్ చేసిన తర్వాత, మీరు ఈ-వెరిఫై పేజీకి తీసుకెళ్లబడతారు.
గమనిక: మరింత సమాచారం కోసం ఇ-వెరిఫై ఎలా చేయాలి అనే యూజర్ మాన్యువల్‌ను చూడండి.
ఈ-వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, ఒక సక్సెస్ మెసేజ్ మరియు ట్రాన్సాక్షన్ ID ప్రదర్శించబడతాయి. సమర్పణ విజయవంతంగా పూర్తైన తర్వాత, పన్ను చెల్లింపుదారుడి ఆమోదం / తిరస్కరణ కోసం ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు నిర్ధారణ సందేశం పంపబడుతుంది.
5.3. పన్ను చెల్లింపుదారుడు పూరించిన ఫారం 29B యొక్క ఆమోదం
దశ 1: యూజర్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
దశ 2:మీడ్యాష్‌బోర్డ్లో,పెండింగ్ యాక్షన్స్>వర్క్‌లిస్ట్పై క్లిక్ చేయండి.
దశ 3:CA అప్‌లోడ్ చేసిన ఫారంను ఆమోదించడానికియాక్సెప్ట్ను ఎంచుకోండి / ఫారంను తిరస్కరించడానికిరిజెక్ట్ను ఎంచుకుని, తిరస్కరణకు సంబంధించిన వ్యాఖ్యలను నమోదు చేయండి.
గమనిక:
- మీరు తిరస్కరించాలని నిర్ణయించుకుంటే, సంబంధిత కారణాన్ని పేర్కొనవచ్చు.
- తిరస్కరించిన సందర్భంలో, తిరస్కరణకు సంబంధించిన కారణాల వివరాలతో ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన CA యొక్క ఈమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు ఈమెయిల్ మరియు SMS సందేశాలు పంపబడతాయి.
దశ 5: యాక్సెప్ట్ ను ఎంచుకున్న తర్వాత, మీరు ఇ-వెరిఫై పేజీకి తీసుకెళ్లబడతారు. అక్కడ మీరు అప్‌లోడ్ చేసిన ఫారాన్ని ధ్రువీకరించవచ్చు.
గమనిక: మరింత సమాచారం కోసం ఇ-వెరిఫై ఎలా చేయాలి అనే యూజర్ మాన్యువల్‌ను చూడండి.
ఈ-వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, ఒక సక్సెస్ మెసేజ్ తో పాటు అంగీకార రసీదు సంఖ్య ప్రదర్శించబడుతుంది. మీ ఫారం విజయవంతంగా సమర్పించబడినట్లు నిర్ధారిస్తూ, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన పన్ను చెల్లింపుదారుడు మరియు CA యొక్క ఈమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు ఈమెయిల్ పంపబడుతుంది.