ఫారమ్ 10-IEA యూజర్ మాన్యువల్
1. అవలోకనం
అసెస్‌మెంట్ ఇయర్ 2024-25 నుండి, కొత్త పన్ను విధానం డిఫాల్ట్ పన్ను విధానంగా అమలులోకి వచ్చింది. అంటే, పన్ను చెల్లింపుదారు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే తన ఉద్దేశాన్ని పేర్కొనకపోతే, ఆదాయపు పన్ను కొత్త పన్ను విధానం ప్రకారమే చెల్లించవలసి ఉంటుంది.
సెక్షన్ 115BAC(6)(ii) ప్రకారం, వృత్తి లేదా వ్యాపార ఆదాయం లేని పన్ను చెల్లింపుదారులు ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేసే సమయంలోనే కొత్త పన్ను విధానం నుండి నేరుగా వైదొలగవచ్చు.
అయితే, వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే ఇండివిడ్యువల్స్, HUF, AOP (కో-ఆపరేటివ్ సొసైటీలు మినహా), BOI మరియు ఏజేపీలు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనే తమ అభిరుచిని తెలియజేయడానికి ఫారం 10-IEAను దాఖలు చేయాలి. అలాగే, కొత్త పన్ను విధానం నుండి పాత పన్ను విధానానికి మారాలన్నా లేదా తిరిగి కొత్త పన్ను విధానంలో చేరాలన్నా, సెక్షన్ 139(1) ప్రకారం నిర్దేశించిన గడువులోపు ఫారం 10-IEAను తప్పనిసరిగా సమర్పించాలి.
2. ఫారం దాఖలు చేయడానికి ముందస్తు అవసరాలు
- చెల్లుబాటు అయ్యే యూజర్ ID మరియు పాస్‌వర్డ్.
- పన్ను చెల్లింపుదారుడి మొత్తం ఆదాయంలో వ్యాపార ఆదాయం కూడా ఉండాలి.
3. ఫారం గురించి
3.1. ఉద్దేశ్యం
వ్యాపార ఆదాయం ఉన్న సందర్భాల్లో, పన్ను చెల్లింపుదారులు పాత పన్ను విధానం లేదా కొత్త పన్ను విధానం మధ్య ఎంపిక చేసుకునే హక్కును వినియోగించుకోవడానికి, 2023 జూన్ 21 తేదీ గల నోటిఫికేషన్ నెం. 43/2023 ద్వారా ఫారం 10-ఐఈఏను ప్రకటించారు. ఈ ఫారాన్ని జీవితకాలంలో రెండు సార్లు దాఖలు చేయవచ్చు. ఒకసారి కొత్త పన్ను విధానం నుండి వైదొలగడానికి మరియు మరోసారి తిరిగి కొత్త పన్ను విధానంలో చేరడానికి ఉపయోగించవచ్చు.
3.2. ఎవరు దీనిని ఉపయోగించవచ్చు?
వ్యాపార ఆదాయం కలిగిన పన్ను చెల్లింపుదారులు కొత్త పన్ను విధానం నుండి వైదొలగడానికి లేదా తిరిగి అందులో చేరడానికి ఫారం 10-IEAను ఉపయోగించవచ్చు.
4. క్లుప్తంగా ఫారం గురించి
ఫారం 10-IEA మూడు భాగాలుగా విభజించబడింది:
- ప్రాథమిక సమాచారం
- అదనపు సమాచారం
- ప్రకటన మరియు ధ్రువీకరణ
ఫారం 10-IEAలోని విభాగాల గురించి సంక్షిప్త పరిచయం ఇక్కడ ఇవ్వబడింది:
4.1. ప్రాథమిక సమాచారం
భాగం 1లో ప్రాథమిక సమాచారం (అసెస్సీ పేరు, పాన్, అసెస్‌మెంట్ ఇయర్ మరియు వ్యక్తి స్థితి) ఉంటుంది. ఈ సమాచారం ఫారంలో ముందుగానే నింపబడి ఉంటుంది. ఫారాన్ని మొదటిసారి దాఖలు చేస్తున్నట్లయితే, కొత్త పన్ను విధానం నుండి వైదొలిగే ఎంపిక స్వయంచాలకంగా ఎంపిక చేయబడుతుంది. ఒకవేళ వ్యవస్థలో ఇప్పటికే వైదొలిగే ఎంపికతో చెల్లుబాటు అయ్యే ఫారం ఉన్నట్లయితే, తిరిగి కొత్త పన్ను విధానంలో చేరే ఎంపిక స్వయంచాలకంగా ఎంపిక చేయబడుతుంది.
4.2. అదనపు సమాచారం
భాగం 2 అదనపు సమాచారం కు సంబంధించినది. ఇందులో అసెస్సీ ఐఎఫ్‌ఎస్‌సీ యూనిట్‌కు సంబంధించిన అదనపు సమాచారాన్ని (ఉన్నట్లయితే) అందించాలి.
దయచేసి గమనించండి: మీరు కొత్త పన్ను విధానం నుండి వైదొలిగే ఎంపికను ఎంచుకుంటే, ఈ అదనపు సమాచారం విభాగం నిష్క్రియంగా కనిపిస్తుంది.
4.3. ప్రకటన మరియు ధ్రువీకరణ
భాగం 3లో కొత్త పన్ను విధానం నుండి వైదొలగడం లేదా తిరిగి కొత్త పన్ను విధానంలో చేరడం కోసం పన్ను చెల్లింపుదారు చేసే ప్రకటన మరియు ధ్రువీకరణ ఉంటుంది.
5. ఎలా యాక్సెస్ చేయాలి మరియు సమర్పించాలి
5.1. పన్ను చెల్లింపుదారు ద్వారా ఫారం 10-IEA దాఖలు
దశ 1: ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు వెళ్లి, లాగిన్‌పై క్లిక్ చేయండి.
దశ 2: లాగిన్ పేజీలో మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
దశ 3: మీ డాష్‌బోర్డ్ లో, ఇ- ఫైల్ మెనూ > ఆదాయపు పన్ను ఫారాలు > ఆదాయపు పన్ను ఫారాలను దాఖలు చేయండికు వెళ్లండి.
దశ 4: ఆదాయపు పన్ను ఫారాలు దాఖలు చేయండి పేజీలో, ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం ఫారాలు ట్యాబ్‌లో ఫారం 10-IEA ను ఎంచుకోండి. ప్రత్యామ్నాయంగా, ఫారాన్ని దాఖలు చేయడానికి సెర్చ్ బాక్స్ లో ఫారం 10-IEA అని నమోదు చేయండి.
దశ 5: ఫారం 10-IEA/b> పేజీలో, సంబంధిత అసెస్‌మెంట్ ఇయర్ ను ఎంచుకుని కొనసాగించు పై క్లిక్ చేయండి.
దశ 6: ఫారం దాఖలు చేయడానికి అవసరమైన పత్రాలను పరిశీలించి, లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి
దశ 7: అసెస్‌మెంట్ ఇయర్‌లో “వ్యాపారం లేదా వృత్తి నుండి లాభాలు మరియు ఆదాయాలు” శీర్షిక కింద మీకు ఆదాయం ఉంటే యెస్ ను ఎంచుకోండి.
దయచేసి గమనించండి:
- వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం పొందే ఇండివిడ్యువల్స్, HUF, AOP (కో-ఆపరేటివ్ సొసైటీలు మినహా), BOI మరియు AJPలు కొత్త పన్ను విధానం నుండి వైదొలగడానికి లేదా తిరిగి కొత్త పన్ను విధానంలో చేరడానికి ఫారం 10-IEAను తప్పనిసరిగా సమర్పించాలి.
- వ్యాపారం లేదా వృత్తి ఆదాయం లేని ఇండివిడ్యువల్స్ మరియు HUFలు తమ ఆదాయపు పన్ను రిటర్నులను దాఖలు చేసే సమయంలోనే కొత్త పన్ను విధానం నుండి వైదొలగవచ్చు లేదా తిరిగి కొత్త పన్ను విధానంలో చేరవచ్చు.
దశ 8: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి వర్తించే గడువు తేదీనిఎంచుకుని కంటిన్యూ పైక్లిక్ చేయండి.
గమనిక: వర్తించే గడువు తేదీని ఎంచుకోవడానికి సహాయం కోసం, హెల్ప్ డాక్యుమెంట్ హైపర్ లింక్ పై క్లిక్ చేసి “సహాయ పత్రం”ను కూడా ఉపయోగించవచ్చు.
దశ 9: పన్ను విధానం ఎంపికను నిర్ధారించండి.
దశ 10: ఫారంలో మూడు విభాగాలు ఉంటాయి - ప్రతి విభాగాన్ని నిర్ధారించండి. ప్రాథమిక సమాచారం విభాగంపై క్లిక్ చేయండి.
దశ 11: ప్రాథమిక సమాచారం విభాగంలో మీ ప్రాథమిక సమాచారం ముందుగానే నింపబడి ఉంటుంది. ఇది మొదటిసారి ఫారం దాఖలు చేస్తున్నట్లయితే, వైదొలగే ఎంపిక స్వయంచాలకంగా ఎంచుకోబడుతుంది. వ్యవస్థలో ఇప్పటికే వైదొలగే ఎంపికతో చెల్లుబాటు అయ్యే ఫారం ఉన్నట్లయితే, తిరిగి చేరే ఎంపిక స్వయంచాలకంగా ఎంచుకోబడుతుంది. సేవ్పై క్లిక్ చేయండి.
వైదొలగడం:
మళ్లీ చేరడం:
దశ 12: ఐఎఫ్‌ఎస్‌సీ యూనిట్‌కు సంబంధించిన (ఉన్నట్లయితే) అవసరమైన వివరాలను అదనపు సమాచారం విభాగంలో నమోదు చేసి సేవ్పై క్లిక్ చేయండి.
మీరు కొత్త పన్ను విధానం నుండి వైదొలగుతున్నట్లయితే, ఈ అదనపు సమాచారం విభాగం నిష్క్రియంగా కనిపిస్తుంది.
దశ 13: ఫారంలో ఉన్న ప్రకటన మరియు ధ్రువీకరణ విభాగంలో అవసరమైన వివరాలను నమోదు చేసి సేవ్పై క్లిక్ చేయండి.
దశ 14: ఫారంలో ఇచ్చిన అన్ని వివరాలను పరిశీలించండి. అవసరమైతే ఎడిట్ బటన్‌పై క్లిక్ చేసి వివరాలను సవరించవచ్చు. లేకపోతే ఈ-వెరిఫైకి కొనసాగించు బటన్‌పై క్లిక్ చేయండి.
దశ 15: ఫారాన్ని ధ్రువీకరించడానికి క్రింది ఎంపికల నుండి ధ్రువీకరణ విధానంను ఎంచుకోండి.
దశ 16:ధ్రువీకరణ అనంతరం ఫారాన్ని సమర్పించడానికి “అవును” పై క్లిక్ చేయండి.
దశ 17:ఇప్పుడు ఫారం విజయవంతంగా సమర్పించబడింది. భవిష్యత్ సూచన కోసం ట్రాన్సాక్షన్ ఐడీని గమనించండి.
ఇప్పుడు, పన్ను చెల్లింపుదారు దాఖలు చేసిన ఫారాన్ని చూడాలనుకుంటే, ఈ-ఫైల్ మెను > దాఖలు చేసిన ఫారాలు చూడండి > ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఫారాలు > ఫారం 10-IEA కు వెళ్లాలి. అక్కడ నుండి ఫారం మరియు రసీదును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఫారం యొక్క పూర్తి వివరాల ప్రక్రియను చూడటానికి వివరాలు చూడండి(వ్యూ డీటైల్స్) పై క్లిక్ చేయండి.

