ఫారమ్ 80 యూజర్ మాన్యువల్
1. అవలోకనం
టన్నేజ్ పన్ను పథకాన్ని ఎంచుకోవడానికి అర్హత కలిగిన కంపెనీ, సెక్షన్ 231(1) ప్రకారం టన్నేజ్ పన్ను పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి లేదా సెక్షన్ 231(10) ప్రకారం ఆ ఎంపికను పునరుద్ధరించుకోవడానికి ఫారం నెం. 80లో దరఖాస్తు సమర్పించవచ్చు.
2. ఈ సేవను పొందడానికి అవసరమైన ముందస్తు అర్హతలు
• మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదిత వినియోగదారుగా ఉండాలి
• పన్ను చెల్లింపుదారుని PAN స్థితి "యాక్టివ్"గా ఉండాలి
• DSC ద్వారా ఫారాన్ని ధ్రువీకరించడానికి చెల్లుబాటు అయ్యే DSC కలిగి ఉండాలి. అలాగే అది ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదై ఉండి గడువు ముగియకుండా ఉండాలి.
3. ఫారం గురించి.
3.1 ఉద్దేశ్యం
ఫారం 80 దాఖలు చేయడం యొక్క ఉద్దేశ్యం, అర్హత కలిగిన కంపెనీ టన్నేజ్ పన్ను పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి లేదా ఆ ఎంపికను పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు సమర్పించడం.
3.2 దీనిని ఎవరు ఉపయోగించవచ్చు?
"టన్నేజ్ ట్యాక్స్ స్కీమ్"ను ఎంపిక చేసుకున్న అర్హత కలిగిన కంపెనీలకు మాత్రమే ఫారం-80 వర్తిస్తుంది.
3.3 ఫారం గురించి క్లుప్తంగా
ఫారం 80లో ఆరు ప్యానెల్స్ ఉన్నాయి:
- దరఖాస్తు రకం
- భాగం A – దరఖాస్తుదారుని వివరాలు
- నౌకలు / అంతర్గత జలమార్గ నౌకల వివరాలు
- భాగం B – టన్నేజ్ పన్ను పథకం ఎంపికను పునరుద్ధరించే సందర్భంలో మాత్రమే సమర్పించాల్సిన వివరాల ప్రకటన.
- అనుబంధాలు
- ప్రకటన
4. దశలవారీ మార్గదర్శిని
దశ 1: మీ యూజర్ ID మరియు పాస్వర్డ్ ఉపయోగించి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
దశ 2: యూజర్ ID (PAN) మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
దశ 3: ఈ-ఫైల్ > ఆదాయపు పన్ను ఫారాలు > కు వెళ్లి ఆదాయపు పన్ను ఫారాలను ఫైల్ చేయండి.
దశ 4: మూడు ట్యాబ్‌లలో ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం ఫారాలు అనే ట్యాబ్‌ను ఎంచుకుని, ఫారం 80ను ఎంపిక చేయండి లేదా వెతకండి, అనంతరం ఫైల్ నౌ బటన్‌పై క్లిక్ చేయండి.
దశ 5:PAN, సమర్పణ విధానం, ఫైలింగ్ రకం వివరాలను పరిశీలించి, వర్తించే పన్ను సంవత్సరం (T.Y) ను ఎంచుకోండి. అనంతరంకొనసాగించండిబటన్పై క్లిక్ చేయండి.
దశ 6: లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి.
దశ 7: లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేసిన తర్వాత, వినియోగదారు ప్యానెల్ స్క్రీన్కు వెళ్తారు. కొనసాగడానికి మొదటి ప్యానెల్ అయిన “దరఖాస్తు రకం” ను ఎంచుకోండి.
గమనిక: ఈ ఫారంలో సమర్పిస్తున్న అప్లికేషన్ రకాన్ని డ్రాప్‌డౌన్ జాబితా నుండి ఎంచుకోండి. సంబంధిత వివరాలను నమోదు చేసి, ధ్రువీకరించి సేవ్ పై క్లిక్ చేయండి.
- టన్నేజ్ పన్ను పథకాన్ని మొదటిసారిగా ఎంచుకుంటున్నట్లయితే, దయచేసి “ఎంపికను వినియోగించుకోవడం”ను ఎంచుకోండి.
- గతంలో ఎంచుకున్న టన్నేజ్ పన్ను పథకాన్ని పునరుద్ధరించడానికి దరఖాస్తు దాఖలు చేసినట్లయితే, దయచేసి "పునరుద్ధరణ అవకాశం" ను ఎంచుకోండి.
దశ 8: మొదటి ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, కొనసాగడానికి రెండవ ప్యానెల్, పార్ట్ A – దరఖాస్తుదారు వివరాలను ఎంచుకోండి. సంబంధిత వివరాలను నింపి, సరిచూసి, సేవ్ పై క్లిక్ చేయండి.
గమనిక:
- దయచేసి "మై ప్రొఫైల్" విభాగంలో చిరునామాతో సహా అన్ని తప్పనిసరి వివరాలు పూర్తిగా నమోదు చేయబడ్డాయని నిర్ధారించుకోండి. మీరు "మై ప్రొఫైల్" హైపర్‌లింక్‌పై క్లిక్ చేసి మీ సంప్రదింపు మరియు చిరునామా వివరాలను నవీకరించవచ్చు.
- క్రమ సంఖ్య 3 వద్ద ఉన్న శాఖ కార్యాలయాల చిరునామాలు విభాగంలో, 'వివరాలు జత పరచండి' ఎంచుకుని, అవసరమైన వివరాలను నమోదు చేసి, ముందుకు వెళ్లడానికి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.
క్రమ సంఖ్య 7 మరియు 8 - కంపెనీ డైరెక్టర్(ల) పేరు(లు) మరియు చిరునామా(లు) కింద, 'వివరాలను జోడించండి' ఎంచుకుని, అవసరమైన వివరాలను నమోదు చేసి, ముందుకు వెళ్లడానికి 'జోడించండి' పై క్లిక్ చేయండి.
దశ 9:రెండవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, మూడవ ప్యానెల్: నౌక / అంతర్గత జలమార్గ నౌక వివరాలను ఎంచుకోండి.
ఫీల్డ్ 11 “కంపెనీ యాజమాన్యంలోని లేదా అద్దెకు తీసుకున్న ఓడలు లేదా అంతర్గత జల నౌకల వివరాలు” కింద అవసరమైన ఫీల్డ్‌లను పూరించి, కొనసాగడానికి 'జోడించు'పై క్లిక్ చేయండి.
గమనిక –దయచేసి ఓడ / అంతర్గత జలమార్గ నౌక పేరు, నికర టన్నేజ్, జెండా, ఓడ / అంతర్గత జలమార్గ నౌకల రకం, చార్టర్ ప్రారంభ తేదీ, డైరెక్టర్ జనరల్ (షిప్పింగ్)/ అంతర్గత నౌకల రిజిస్ట్రార్ ఆమోదపు సూచన సంఖ్య మరియు ప్రతి ఉప-శీర్షిక కింద అర్హత ఉందా లేదా అనే వివరాలను అందించండి.

దశ 10: మూడవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, నాల్గవ ప్యానెల్: భాగం B - టన్నేజ్ పన్ను పథకం ఎంపికను పునరుద్ధరించే సందర్భంలో మాత్రమే సమర్పించాల్సిన వివరాల ప్రకటన ను ఎంచుకోండి. సంబంధిత వివరాలను నమోదు చేసి, ధ్రువీకరించి సేవ్ పై క్లిక్ చేయండి.
ఈ ప్యానెల్లో, గతంలో చేసిన ఎంపికల వివరాలను దయచేసి అందించండి.
నోట్ - అప్లికేషన్ ప్యానెల్‌లోని అప్లికేషన్ రకం ఫీల్డ్‌లో "రిన్యూవింగ్ ఆప్షన్" ఎంపిక చేసినట్లయితే మాత్రమే ఈ భాగం పూరించడానికి అందుబాటులో ఉంటుంది.
దశ 11: నాల్గవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ఐదవ ప్యానెల్: అటాచ్‌మెంట్స్‌ను ఎంచుకోండి. ఈ ప్యానెల్లో సంబంధిత పత్రాలను జతపరచి, సేవ్ పై క్లిక్ చేయండి.
దశ 12: ఐదవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, "డిక్లరేషన్" ప్యానెల్‌ను ఎంచుకోండి. డిక్లరేషన్ ప్యానెల్‌ను నిర్ధారించి, సేవ్ పై క్లిక్ చేయండి.
దశ 13: డిక్లరేషన్ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ప్యానెల్ యొక్క స్థితి 'పూర్తయింది' అని ప్రదర్శించబడుతుంది. ఆ తర్వాత "ప్రీవ్యూ" బటన్ ఎనేబుల్ అవుతుంది.
దశ 14: ప్రీవ్యూ పేజీలో వివరాలను సరిచూసుకుని ప్రొసీడ్ టు ఈ-వెరిఫై పై క్లిక్ చేయండి.
గమనిక: "డౌన్లోడ్" బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా, వినియోగదారుడు ప్రివ్యూ PDFను డౌన్లోడ్ చేసుకొని, ఈ-ధ్రువీకరణతో ముందుకు వెళ్ళే ముందు వివరాలను సరిచూసుకోవచ్చు.
దశ 15: ప్రొసీడ్ టు ఈ-వెరిఫై బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఈ-వెరిఫైకి కొనసాగాలా అని నిర్ధారించే పాప్-అప్ కనిపిస్తుంది. అవును పై క్లిక్ చేయండి.
దశ 16: అవును పై క్లిక్ చేసిన తర్వాత, మీరు ఇ-వెరిఫై పేజీకి వెళ్తారు. అక్కడ మీరు DSCని ఉపయోగించి మాత్రమే ఫారం 80ని ధ్రువీకరించవచ్చు.
గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై చేయడం ఎలా వినియోగదారు మాన్యువల్‌ను చూడండి
దశ 17: ఇ-వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తైన తర్వాత, లావాదేవీ ID మరియు రసీదు సంఖ్యతో పాటు విజయ సందేశం కనబడుతుంది. దయచేసి భవిష్యత్ సూచన కోసం లావాదేవీ ID మరియు రసీదు సంఖ్యను నోట్ చేసుకోండి. అలాగే, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన ఇమెయిల్ ID(లు) మరియు మొబైల్ నంబర్(లు)కు కూడా ధ్రువీకరణ సందేశం పంపబడుతుంది.
రసీదును డౌన్లోడ్ చేయడానికి డౌన్లోడ్ బటన్‌పై క్లిక్ చేయండి.
ఫారం 80ని విజయవంతంగా సమర్పించిన తర్వాత, వినియోగదారుడు తాను నింపిన ఫారాన్ని ఈ క్రింది విధంగా చూడవచ్చు - మీ డాష్‌బోర్డ్‌లో ఆదాయపు పన్ను చట్టం 2025 క్రింద ఉన్న ఇ-ఫైల్ > ఆదాయపు పన్ను ఫారాలను ఫైల్ చేయండి > నింపిన ఫారాలను వీక్షించండి ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
నోట్: మరింత సమాచారం కోసం నింపిన ఫారపు వినియోగదారు కరదీపికను చూడండి.
5. సంబంధిత విషయాలు
6. పదకోశం
| సంక్షిప్తరూపం/సంక్షిప్తపదం | వివరణ/పూర్తిరూపం |
| DSC | డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ |
| EVC | ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ పత్రం |
| ARN | గుర్తింపు రసీదు సంఖ్య |
| PY | గత సంవత్సరం |
| FY | ఆర్థిక సంవత్సరం |
| TY | పన్ను సంవత్సరం |