ఫారమ్ 67 యూజర్ మాన్యువల్
1.సమగ్ర అవలోకనం
ఆదాయపు పన్ను నియమాలు, 1962 లోని నియమం 128 ప్రకారం, భారతదేశం వెలుపల ఉన్న ఏదైనా దేశం లేదా నిర్దిష్ట ప్రాంతంలో చెల్లించిన విదేశీ పన్నుకు నివాస పన్ను చెల్లింపుదారుడు క్రెడిట్‌ను క్లెయిమ్ చేయడానికి అర్హుడు. నిర్దిష్ట కాలపరిమితిలోపు అసెస్సీ ఫారం 67లో అవసరమైన వివరాలను సమర్పించినట్లయితేనే ఈ క్రెడిట్ అనుమతించబడుతుంది.
ఫారం 67ను ఆన్‌లైన్ విధానంలో మాత్రమే సమర్పించవచ్చు. నమోదిత వినియోగదారులకు ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా ఫారం 67ను ఆన్‌లైన్‌లో ఫైల్ చేయడానికి ఈ సేవ వీలు కల్పిస్తుంది.
2. ఈ సేవను పొందడానికి కావలసిన ముందస్తు అర్హతలు
•మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదిత వినియోగదారులై ఉండాలి.
•పన్ను చెల్లింపుదారుని PAN స్థితి "యాక్టివ్"గా ఉండాలి.
•పన్ను చెల్లింపుదారుని PAN మరియు ఆధార్ అనుసంధానించబడి ఉండాలి.(సిఫార్సు చేయబడింది)
3. ఫారం గురించి
3.1 ఉద్దేశం
భారతదేశం వెలుపల ఉన్న దేశంలో మినహాయింపు రూపంలో గానీ లేదా ఇతర విధంగా చెల్లించిన విదేశీ పన్ను మొత్తానికి క్రెడిట్ పొందిన నివాస పన్ను చెల్లింపుదారుడు, అటువంటి పన్నుల క్రెడిట్‌ను క్లెయిమ్ చేయడానికి, సెక్షన్ 139లోని ఉప-విభాగం (1) కింద ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి నిర్దేశించిన గడువు తేదీనాటికి లేదా అంతకు ముందు ఫారం 67లో స్టేట్‌మెంట్‌ను సమర్పించవలసి ఉంటుంది.
ప్రస్తుత సంవత్సరపు నష్టాన్ని వెనక్కి సర్ధుబాటు చేయాడం వల్ల, గత సంవత్సరాలలో క్రెడిట్ క్లెయిమ్ చేసిన ఏదైనా విదేశీ పన్ను రీఫండ్ లభించే పక్షంలో కూడా ఫారం 67ను సమర్పించవలసి ఉంటుంది.
3.2 దీనిని ఎవరు ఉపయోగించవచ్చు?
ఏదైనా విదేశంలో మినహాయింపు లేదా ఇతర విధంగా చెల్లించిన విదేశీ పన్ను మొత్తానికి క్రెడిట్ కలిగిన నివాస పన్ను చెల్లింపుదారుడు.
3.3 ఫారం గురించి క్లుప్తంగా
ఫారం 67లో 4 భాగాలు ఉన్నాయి:
1. పార్ట్ A
2. పార్ట్ B
3. ధ్రువీకరణ
4. అటాచ్‌మెంట్‌లు
4. దశలవారీ మార్గదర్శిని
స్టెప్ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
స్టెప్ 2: యూజర్ ID (PAN) మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
స్టెప్ 3: ఈ-ఫైల్ > ఆదాయపు పన్ను ఫారాలు > కు వెళ్లి ఆదాయపు పన్ను ఫారాలను ఫైల్ చేయండి
స్టెప్ 4: ఫారం 67ని ఆదాయపు పన్ను చట్టం 1961 ట్యాబ్ లో ఉన్న ఫారాల్లో ఎంచుకోండి/శోధించండి.
స్టెప్ 5: AYని ఎంచుకుని, 'కొనసాగించండి' పై క్లిక్ చేయండి.
స్టెప్ 6: లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి
స్టెప్ 7.1.a: 'లెట్స్ గెట్ స్టార్టెడ్' పై క్లిక్ చేసినప్పుడు, ఫారం 67 ప్రదర్శించబడుతుంది. “పార్ట్ A” ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 8.1.b: ఈ విభాగంలో పన్ను చెల్లింపుదారుని ప్రాథమిక వివరాలు మరియు విదేశీ లేదా విదేశీ నిర్దిష్ట భూభాగం నుండి సంపాదించిన ఆదాయ మరియు విదేశీ పన్ను క్రెడిట్ వివరాలు ఉంటాయి.
గమనిక: సంప్రదింపు వివరాలను అప్డేట్ చేయడానికి, “నా ప్రొఫైల్” పై క్లిక్ చేయండి.
గమనిక: మీరు ఆదాయ వివరాలను “యాడ్ డీటైల్స్” బటన్‌ను ఉపయోగించి స్వయంగా నమోదు చేయవచ్చు లేదా మీ వద్ద 50 కంటే ఎక్కువ రికార్డులు ఉంటే, అదే పేజీ నుండి CSV టెంప్లేట్‌ను డౌన్‌లోడ్ చేసి, అందులో వివరాలను నింపి, తరువాత “అటాచ్ CSV ఫైల్” ఎంపికను ఉపయోగించి అప్లోడ్ చేయవచ్చు. మరిన్ని వివరాల కోసం CSV టెంప్లేట్‌ను నింపడానికి సంబంధించిన సూచనలను డౌన్‌లోడ్ చేసి చూడండి మరియు సేవ పై క్లిక్ చేయండి.
స్టెప్ 7.2.a: పార్ట్ A ట్యాబ్ ఇప్పుడు నిర్ధారించబడింది, పార్ట్ B ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 7.2.b: ఈ భాగంలో విదేశీ పన్నుకు సంబంధించి 2 ప్రశ్నలు ఉంటాయి.
వివరాలను నమోదు చేసి, సేవ్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 7.3.a: పార్ట్ B ఇప్పుడు నిర్ధారించబడింది, వెరిఫికేషన్ ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 7.3.b: వివరాలను నమోదు చేసి, 'సేవ్' పై క్లిక్ చేయండి.
స్టెప్ 7.4.a: ధ్రువీకరణ ట్యాబ్ ఇప్పుడు నిర్ధారించబడింది, జోడింపులు ట్యాబ్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 7.4.b:ఇందులో చెల్లించిన విదేశీ పన్ను వివరాలు ఉంటాయి.
గమనిక: ఇక్కడ పన్ను చెల్లింపుదారుడు విదేశీ పన్ను చెల్లింపు/తగ్గింపు రుజువును జతచేయాలి. ఒకటి కంటే ఎక్కువ ఫైళ్లు ఉంటే, వాటిని జిప్ ఫైల్‌గా తయారుచేసి జతచేయాలి. అవసరమైన ఫైళ్లను జతచేసిన తర్వాత, సేవ్ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 8 : అన్ని ట్యాబ్‌లు ఇప్పుడు నిర్ధారించబడ్డాయి. ప్రివ్యూపై క్లిక్ చేయండి.
స్టెప్ 9: ఇది ఫారం యొక్క ప్రివ్యూ. దీనిలో వివరాలు సరిగ్గా ఉంటే, , 'ఈ-వెరిఫై' చేయడానికి ‘కొనసాగించండి’ పై క్లిక్ చేయండి. లేకపోతే వివరాలను సవరించవచ్చు.
స్టెప్ 10: మీరు ఏదైనా ఒక ధ్రువీకరణ విధానం ద్వారా ఫారాన్ని ఈ-వెరిఫై చేయవచ్చు.
ఈ-వెరిఫై తర్వాత, ఫారం 67 సమర్పించబడుతుంది. రసీదు సంఖ్య రూపొందించబడుతుంది. నమోదైన ఇ-మెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు తెలియజేయబడుతుంది.
5. దాఖలు చేసిన ఫారాన్ని ఎలా చూడాలి?
ఈ-ఫైల్‌కు వెళ్లండి > ఆదాయపు పన్ను ఫారాలు > దాఖలు చేసిన ఫారాలను వీక్షించండి > ఆదాయపు పన్ను చట్టం 1961 ప్రకారం ఫారాలు.