1. అవలోకనం

అధీకృత బ్యాంకుల డెబిట్ కార్డు ద్వారా పన్ను చెల్లింపు ఎంపిక పన్ను చెల్లింపుదారులందరికీ ఇ-ఫైలింగ్ పోర్టల్ https://www.incometax.gov.in/iec/foportal/లో అందుబాటులో ఉంటుంది. ఈ సేవతో, మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఆన్‌లైన్ పన్ను చెల్లింపు చేయడానికి అందుబాటులో ఉన్న అధీకృత బ్యాంక్ డెబిట్ కార్డ్‌ని ఉపయోగించడం ద్వారా ఆన్‌లైన్‌లో (ప్రీ-లాగిన్ లేదా పోస్ట్-లాగిన్ మోడ్‌లో) పన్ను చెల్లింపు చేయవచ్చు.

 

2. ఈ సేవ పొందటానికి ముందస్తు అవసరాలు

మీరు ప్రీ-లాగిన్ (ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ చేయడానికి ముందు) లేదా పోస్ట్-లాగిన్ (ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ చేసిన తర్వాత) మోడ్‌లో “అధీకృత బ్యాంకుల డెబిట్ కార్డ్” ఉపయోగించి పన్ను చెల్లింపు చేయవచ్చు.

 

ఎంపిక

ముందస్తు అవసరాలు

లాగిన్‌కి ముందు

  • చెల్లుబాటు అయ్యే PAN/TAN కోసం పన్ను చెల్లింపు చేయవలసి ఉంది;
  • అధీకృత బ్యాంక్ డెబిట్ కార్డ్; మరియు
  • వన్ టైమ్ పాస్‌వర్డ్‌ని అందుకోవడానికి చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్.

లాగిన్ తరువాత

  • ఇ-ఫైలింగ్ పోర్టల్ www.incometax.gov.in;లో రిజిస్టర్ అయిన వినియోగదారు మరియు
  • అధీకృత బ్యాంక్ డెబిట్ కార్డ్.

 

ముఖ్య గమనిక: ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో డెబిట్ కార్డ్ ద్వారా పన్ను చెల్లింపును అనుమతిస్తున్న అధీకృత బ్యాంక్ [DJ1] [DMG2] ద్వారా జారీ చేయబడిన డెబిట్ కార్డ్ కలిగి ఉన్న పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లింపు కోసం ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు. ఈ మోడ్ ద్వారా పన్ను చెల్లింపు చేయడానికి ఎలాంటి లావాదేవీ ఛార్జ్/ఫీజు వర్తించదు. ప్రస్తుతానికి, కెనరా బ్యాంక్, ICICI బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌లు డెబిట్ కార్డ్ మోడ్ ద్వారా ఇ-ఫైలింగ్ పోర్టల్ (ఇ-పే టాక్స్ సర్వీస్)పై పన్ను చెల్లింపు కోసం ఆఫర్ చేయబడుతున్నాయి. ఇతర బ్యాంకుల కోసం, దయచేసి చెల్లింపు గేట్‌వే మోడ్‌ను ఎంచుకోండి.

 

 

3. దశలవారీ మార్గదర్శిని

3.1. కొత్త చలాన్ ఫారమ్ (CRN)ని జనరేట్ చేసిన తర్వాత చెల్లించండి - లాగిన్ తరువాత సర్వీస్

దశ 1: మీ వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.

Data responsive

దశ 2: డ్యాష్‌బోర్డ్‌లో, ఇ-ఫైల్ > ఇ-పే ట్యాక్స్ పైన క్లిక్ చేయండి. మీరు ఇ-పే ట్యాక్స్‌కి నావిగేట్ చేయబడతారు. ఇ-పే ట్యాక్స్ పేజీలో, ఆన్‌లైన్ పన్ను చెల్లింపును ప్రారంభించడానికి కొత్త చెల్లింపు ఎంపికను క్లిక్ చేయండి.

దశ 3: కొత్త చెల్లింపు పేజీలో, మీకు వర్తించే పన్ను చెల్లింపు గడిపై కొనసాగండి క్లిక్ చేయండి.

దశ 4: వర్తించే పన్ను చెల్లింపు టైల్‌ని ఎంచుకున్న తర్వాత, మదింపు సంవత్సరం, మైనర్ హెడ్, ఇతర వివరాలను (వర్తించే విధంగా) ఎంచుకుని, కొనసాగించండి క్లిక్ చేయండి.

దశ 5: పన్ను విభజన వివరాలు జోడించండిపేజీలో, మొత్తం పన్ను చెల్లింపు విభజన మొత్తాన్ని జోడించి, కొనసాగించండిక్లిక్ చేయండి.

దశ 6: సెలెక్ట్ పేమెంట్ మోడ్ పేజీలో, డెబిట్ కార్డ్ మోడ్‌ని ఎంచుకుని, ఎంపికల నుండి బ్యాంక్ పేరును ఎంచుకుని, కొనసాగించండి క్లిక్ చేయండి.

దయచేసి గమనించండి: ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో డెబిట్ కార్డ్ ద్వారా పన్ను చెల్లింపును అనుమతిస్తున్న అధీకృత బ్యాంక్ద్వారా జారీ చేయబడిన డెబిట్ కార్డ్ కలిగి ఉన్న పన్ను చెల్లింపుదారులు పన్ను చెల్లింపు కోసం ఈ విధానాన్ని ఉపయోగించవచ్చు.ఈ మోడ్ ద్వారా పన్ను చెల్లింపు చేయడానికి ఎలాంటి లావాదేవీ ఛార్జ్/ఫీజు వర్తించదు.ప్రస్తుతానికి, కెనరా బ్యాంక్, ICICI బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మరియు పంజాబ్ నేషనల్ బ్యాంక్ డెబిట్ కార్డ్‌లు డెబిట్ కార్డ్ మోడ్ ద్వారా ఇ-ఫైలింగ్ పోర్టల్ (ఇ-పే ట్యాక్స్ సర్వీస్)పై పన్ను చెల్లింపు కోసం ఆఫర్ చేయబడుతున్నాయి.ఇతర బ్యాంకుల కోసం, దయచేసి చెల్లింపు గేట్‌వే విధానం ఎంచుకోండి.

 

దశ 7: ప్రివ్యూ మరియు చెల్లింపు చేయండి పేజీలో, వివరాలు మరియు పన్ను విభజన వివరాలను వెరిఫై చేసి, ఇప్పుడే చెల్లించండి క్లిక్ చేయండి.

Data responsive