అధీకృత బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ ఉపయోగించి పన్ను చెల్లింపు > యూజర్ మాన్యువల్

 

1. అవలోకనం

"అధీకృత బ్యాంకుల నెట్ బ్యాంకింగ్"ని ఉపయోగించి పన్ను చెల్లింపు, ఇ-ఫైలింగ్ పోర్టల్ లో నెట్ బ్యాంకింగ్ సదుపాయంతో అధీకృత బ్యాంకులో బ్యాంక్ ఖాతా కలిగి ఉన్న పన్ను చెల్లింపుదారులందరికీ అందుబాటులో ఉంటుంది హోమ్‌ | ఆదాయపు పన్ను శాఖ (లాగిన్ ముందు లేదా లాగిన్ తరువాత విధానంలో). ఈ చెల్లింపు ఎంపికతో, మీరు అధీకృత బ్యాంకుల నెట్ బ్యాంకింగ్ సేవను ఉపయోగించి ఆన్‌లైన్‌లో (లాగిన్ ముందు లేదా లాగిన్ తరువాత విధానంలో) పన్ను చెల్లింపు చేయవచ్చు.

 

2. ఈ సేవ పొందటానికి ముందస్తు అవసరాలు

మీరు లాగిన్ ముందు (ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ చేయడానికి ముందు) లేదా లాగిన్ తరువాత (ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత) విధానంలో “అధీకృత బ్యాంకుల నెట్ బ్యాంకింగ్” ఉపయోగించి పన్ను చెల్లింపు చేయవచ్చు.

 

ఎంపిక

ముందస్తు అవసరాలు

లాగిన్‌కి ముందు

  • చెల్లుబాటు అయ్యే PAN/TAN కోసం పన్ను చెల్లించాల్సి ఉంటుంది
  • నెట్ బ్యాంకింగ్ సౌకర్యంతో అధీకృత బ్యాంకులో బ్యాంక్ ఖాతా; మరియు
  • వన్ టైమ్ పాస్‌వర్డ్‌ని అందుకోవడానికి చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్.

లాగిన్ తరువాత

  • ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన వినియోగదారు హోమ్ | ఆదాయపు పన్ను శాఖ; మరియు
  • నెట్ బ్యాంకింగ్ సౌకర్యంతో అధీకృత బ్యాంకులో బ్యాంక్ ఖాతా.

 

ముఖ్యమైన గమనిక: ప్రస్తుతానికి, నెట్ బ్యాంకింగ్ విధానం ద్వారా ఇ-ఫైలింగ్ పోర్టల్ (ఇ-పే టాక్స్ సర్వీస్)పై పన్ను చెల్లింపు అధీకృత బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉంది, అవి:యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, DCB బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, J&K బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్, RBL బ్యాంక్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్, UCO బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఇతర బ్యాంకుల కోసం, దయచేసి చెల్లింపు గేట్‌వే లేదా RTGS/NEFT ఎంపికను ఉపయోగించండి.

దయచేసి గమనించండి: ఎగువ బ్యాంక్ జాబితా డైనమిక్ స్వభావం కలిగి ఉంటుంది, భవిష్యత్ తేదీలలో బ్యాంకులను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు. ఈ సమాచారం జూలై 25, ,2023 నాటిది.

3. దశలవారీ మార్గదర్శిని

3.1. కొత్త చలాన్ ఫారమ్ (CRN)ని జనరేట్ చేసిన తర్వాత చెల్లించండి - లాగిన్ తరువాత సర్వీస్

దశ 1: మీ వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయండి.

Data responsive

దశ 2: డ్యాష్‌బోర్డ్‌లో, ఇ-ఫైల్ > ఇ-పే ట్యాక్స్ పైన క్లిక్ చేయండి. మీరు ఇ-పే ట్యాక్స్‌కి నావిగేట్ చేయబడతారు. ఇ-పే ట్యాక్స్ పేజీలో, ఆన్‌లైన్ పన్ను చెల్లింపును ప్రారంభించడానికి కొత్త చెల్లింపు ఎంపికను క్లిక్ చేయండి.

Data responsive

 

Data responsive

గమనిక: ఈ విధానం ద్వారా పన్ను చెల్లింపు చేయడం ప్రస్తుతం యాక్సిస్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనరా బ్యాంక్, సిటీ యూనియన్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, DCB బ్యాంక్, ఫెడరల్ బ్యాంక్, HDFC బ్యాంక్, IDBI బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, ICICI బ్యాంక్, ఇండియన్ బ్యాంక్, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, J&K బ్యాంక్, కోటక్ మహీంద్రా బ్యాంక్, కరూర్ వైశ్యా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, పంజాబ్ నేషనల్ బ్యాంక్, పంజాబ్ & సింధ్ బ్యాంక్, RBL బ్యాంక్ లిమిటెడ్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, సౌత్ ఇండియన్ బ్యాంక్, UCO బ్యాంక్ మరియు యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా బ్యాంక్ వంటి అధీకృత బ్యాంకుల ద్వారా అందుబాటులో ఉంది.

ఇతర బ్యాంకుల కోసం, దయచేసి చెల్లింపు గేట్‌వే లేదా RTGS/NEFT ఎంపికను ఉపయోగించండి.

దయచేసి గమనించండి: ఎగువ బ్యాంక్ జాబితా డైనమిక్ స్వభావం కలిగి ఉంటుంది, భవిష్యత్ తేదీలలో బ్యాంకులను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు. ఈ సమాచారం జూలై 25, ,2023 నాటిది.

దశ 3: కొత్త చెల్లింపు పేజీలో, మీకు వర్తించే పన్ను చెల్లింపు టైల్‌పై కొనసాగండి క్లిక్ చేయండి.

Data responsive

 

దశ 4: వర్తించే పన్ను చెల్లింపు టైల్‌ని ఎంచుకున్న తర్వాత, మదింపు సంవత్సరం, మైనర్ హెడ్, ఇతర వివరాలను (వర్తించే విధంగా) ఎంచుకుని,కొనసాగించండిక్లిక్ చేయండి.

Data responsive

దశ 5: పన్ను విభజన వివరాలు జోడించండిపేజీలో, మొత్తం పన్ను చెల్లింపు విభజన మొత్తాన్ని జోడించి, కొనసాగించండిక్లిక్ చేయండి.

Data responsive

దశ 6: చెల్లింపు విధానం ఎంపిక చేయండి పేజీలో, నెట్ బ్యాంకింగ్ మోడ్ ఎంచుకుని, ఎంపికల నుండి బ్యాంక్ పేరును ఎంచుకోండి మరియు కొనసాగించండి క్లిక్ చేయండి.

దశ 7: ప్రివ్యూ మరియు చెల్లింపు చేయండి పేజీలో, వివరాలు మరియు పన్ను విభజన వివరాలను వెరిఫై చేసి, ఇప్పుడే చెల్లించండి క్లిక్ చేయండి.

Data responsive
Data responsive

గమనిక: విజయవంతమైన చెల్లింపు తర్వాత, మీరు ఇ-మెయిల్ ID మరియు ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌కు ధృవీకరణ ఇ-మెయిల్ మరియు SMSని అందుకుంటారు. చెల్లింపు విజయవంతం అయిన తర్వాత, ఇ-పే ట్యాక్స్ పేజీలో చెల్లింపు చరిత్ర ట్యాబ్ కింద చెల్లింపు మరియు చలాన్ రసీదు వివరాలు అందుబాటులో ఉన్నాయి.

గమనిక:

  1. మీ బ్యాంక్ అందిస్తే, "ముందస్తు-అధీకృత ఖాతా డెబిట్" మరియు "మేకర్-చెకర్" వంటి నిర్వాహకతలు కూడా బ్యాంక్ పేజీలో అందుబాటులో ఉంటాయి.
  2. ముందస్తు-అధీకృత ఖాతా డెబిట్ఎంపిక కింద, మీరు భవిష్యత్ తేదీకి చెల్లింపును షెడ్యూల్ చేయగలరు. అయితే, చెల్లింపు యొక్క షెడ్యూల్ తేదీ తప్పనిసరిగా చలాన్ ఫారమ్ (CRN) యొక్క "చెల్లుబాటు అయ్యే వరకు" తేదీలో లేదా అంతకంటే ముందు ఉండాలి.

3.2. ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి లాగిన్ చేయకుండానే చెల్లించండి - ప్రీ-లాగిన్ సర్వీస్

దశ 1: ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి వెళ్లి, ఇ-పే ట్యాక్స్ క్లిక్ చేయండి.

Data responsive

దశ 2: ఇ-పే ట్యాక్స్ పేజీలో, అవసరమైన వివరాలను పూరించండి మరియు కొనసాగించండిక్లిక్ చేయండి.

Data responsive

దశ 3: OTP ధృవీకరణ పేజీలో, దశ 2లో నమోదు చేసిన మొబైల్ నంబర్‌పై అందుకున్న 6-అంకెల OTPని నమోదు చేసి, కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive

దశ 4: OTP సరినిరూపణ తర్వాత, మీ PAN/TAN మరియు మాస్క్డ్ పేరుతో కూడిన విజయవంతమైన సందేశం ప్రదర్శించబడుతుంది. ముందుకు వెళ్ళడానికి కొనసాగించండి పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 5: ఇ-పే ట్యాక్స్ పేజీలో, మీకు వర్తించే పన్ను చెల్లింపు వర్గంపై కొనసాగండి క్లిక్ చేయండి.

Data responsive

దశ 6: వర్తించే పన్ను చెల్లింపు టైల్‌ను ఎంచుకున్న తర్వాత, మదింపు సంవత్సరం, మైనర్ హెడ్, ఇతర వివరాలను (వర్తించే విధంగా) ఎంచుకుని, కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive

దశ 7: పన్ను విభజన వివరాలు జోడించండిపేజీలో, మొత్తం పన్ను చెల్లింపు విభజన మొత్తాన్ని జోడించి, కొనసాగించండి క్లిక్ చేయండి.

Data responsive

 

దశ 8: సెలెక్ట్ పేమెంట్ మోడ్ పేజీలో, నెట్ బ్యాంకింగ్ మోడ్‌ని ఎంచుకుని, ఎంపికల నుండి బ్యాంక్ పేరును ఎంచుకుని, కొనసాగించండిక్లిక్ చేయండి.

Data responsive

దశ 9: ప్రివ్యూ మరియు చెల్లింపు చేయండి పేజీలో, వివరాలను మరియు పన్ను విభజన వివరాలను సరిచూసి, ఇప్పుడే చెల్లించండి క్లిక్ చేయండి

Data responsive

గమనిక: విజయవంతమైన చెల్లింపు తర్వాత, మీరు ఇ-మెయిల్ ID మరియు ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో రిజిస్టర్ చేయబడిన మొబైల్ నంబర్‌కు ధృవీకరణ ఇ-మెయిల్ మరియు SMSని అందుకుంటారు. చెల్లింపు విజయవంతం అయిన తర్వాత, భవిష్యత్ సూచనల కోసం చలాన్ రసీదు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఇ-పే ట్యాక్స్ పేజీ లాగిన్‌ తరువాత, చెల్లింపు చరిత్ర ట్యాబ్ క్రింద కూడా చెల్లింపు వివరాలు మరియు చలాన్ రసీదు అందుబాటులో ఉంటాయి.