ఇ-ఫైలింగ్ వాల్ట్ అధిక భద్రత గురించి యూజర్ మాన్యువల్
1. అవలోకనం
ఇ-ఫైలింగ్ వాల్ట్ ఉన్నత భద్రత సేవ, నమోదిత వినియోగదారులకు వారి ఇ-ఫైలింగ్ ఖాతాకు అధిక భద్రతను కల్పించడానికి అందుబాటులో ఉంది. ఇ-ఫైలింగ్ వాల్ట్, ఇ-ఫైలింగ్ ఖాతాలోకి లాగిన్ అయ్యేటప్పుడు రెండవ స్థాయి ప్రమాణీకరణను మరియు కింది ఎంపికలలో ఒకదాని ద్వారా పాస్వర్డ్ రీసెట్ కోసం రెండవ కారక ప్రమాణీకరణను జోడిస్తుంది:
- నెట్ బ్యాంకింగ్
- డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC)
- ఆధార్‌తో నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు పంపే OTP
- బ్యాంక్ ఖాతా EVC
- డీమాట్ ఖాతా EVC
2.ఈ సేవను పొందడానికి అవసరమైన ముందస్తు అర్హతలు
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో చెల్లుబాటు అయ్యే యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో నమోదు అయిన యూజర్ కావాలి
యూజర్ వద్ద క్రింది వాటిలో ఏదో ఒకటి ఉండాలి:
ఇ-ఫైలింగ్ లో రిజిస్టర్ చేయబడిన చెల్లుబాటు అయ్యే DSC (డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్)
ఇ-ఫైలింగ్ లో ముందుగా వాలిడేట్ చేసి EVC-ఎనేబుల్ చేసిన బ్యాంక్ ఖాతా
ఇ-ఫైలింగ్ లో ముందుగా వాలిడేట్ చేసి EVC-ఎనేబుల్ చేసిన డీమ్యాట్ ఖాతా
చెల్లుబాటు అయ్యే నెట్ బ్యాంకింగ్ సౌకర్యం
3. దశలవారీ మార్గదర్శిని
స్టెప్ 1:: మీ యూజర్ ID మరియు పాస్వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.

స్టెప్ 2: మీ డాష్బోర్డ్కుడి పైభాగంలో, మై ప్రొఫైల్ పై క్లిక్ చేయండి. మై ప్రొఫైల్ పేజీలో, ఇ-ఫైలింగ్ వాల్ట్ వాల్ట్ హైయర్ సెక్యూరిటీ పై క్లిక్ చేయండి.
ఇ-ఫైలింగ్ వాల్ట్ వాల్ట్ హైయర్ సెక్యూరిటీ పేజీలో, మీరు క్రింది వాటిలో ఏదో ఒకదాన్ని ఎంచుకోవచ్చు:
| ఆధార్‌తో నమోదు చేసుకున్న మొబైల్ నంబర్‌పై OTPని ఎనేబుల్ చేయండి. | విభాగం 3.1ను చూడండి |
| బ్యాంక్ ఖాతా EVC / డీమ్యాట్ ఖాతా EVC / DSC / నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎనేబుల్ చేయండి | విభాగం 3.2ను చూడండి |
| అధిక భద్రతా ఎంపికలను రద్దు చేయండి | విభాగం 3.3ను చూడండి |
3.1 ఆధార్‌తో నమోదు చేసిన మొబైల్ నంబర్‌పై OTPని ఎనేబుల్ చేయడం
స్టెప్ 1: లాగిన్ కోసం అధిక భద్రతను సెట్ చేయండి అలాగే పాస్వర్డ్ రీసెట్ కోసం అధిక భద్రతను సెట్ చేయండి విభాగాలలో, మీరు అమలు చేయాలనుకుంటున్న ఉన్నత భద్రతా ఎంపికను ఎంచుకోండి. ఒకవేళ ఆధార్‌తో నమోదైన మొబైల్ నంబర్‌కు వచ్చే OTP ద్వారా ద్వితీయ-శ్రేణి ప్రామాణీకరణను మీరు ఎంచుకోవాలనుకుంటే, ఆ ప్రత్యేక ఎంపికను ఎంచుకోండి.
స్టెప్ 2ː. మీరు ఆధార్ OTP ద్వారా ధృవీకరణ చేయాల్సి ఉంటుందని తెలిపే పాప్-అప్ సందేశం కనిపిస్తుంది. OK. పై క్లిక్ చేయండి.
స్టెప్ 3: మీ వద్ద ఇప్పటికే OTP ఉంటే ఆధార్‌తో నమోదు చేసిన మొబైల్ నంబర్‌పై ఇప్పటికే OTP ఉంది అనే ఎంపికను ఎంచుకోండి. లేకపోతే OTPని రూపొందించండి. అది మీ ఆధార్‌తో నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.

స్టెప్ 4: నా ఆధార్ వివరాలను ధృవీకరించడానికి నేను అంగీకరిస్తున్నాను పై క్లిక్ చేసి, తరువాత ఆధార్ OTPని రూపొందించు పై క్లిక్ చేయండి.

స్టెప్ 5:. OTPని ధృవీకరించడం .పేజీలో, ఆధార్‌తో నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన 6 అంకెల OTPని నమోదు చేసి, ధృవీకరించు. పై క్లిక్ చేయండి.
గమనిక:
- గమనిక: OTP కేవలం 15 నిమిషాల వరకు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
- సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు మాత్రమే ఉంటాయి.
- OTP మళ్ళీ పంపు పై క్లిక్ చేసినప్పుడు, కొత్త OTP రూపొందించబడుతుంది మరియు అది ఆధార్‌తో నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు పంపబడుతుంది.
విజయవంతమైన ధృవీకరణ తర్వాత, క్రింది విజయ సందేశం ప్రదర్శించబడుతుంది.
3.2 బ్యాంక్ ఖాతా EVC / డీమ్యాట్ ఖాతా EVC / DSC / నెట్ బ్యాంకింగ్ ద్వారా ఎనేబుల్ చేయడం
స్టెప్ 1: లాగిన్ కోసం అధిక భద్రతను సెట్ చేయడం మరియు పాస్వర్డ్ రీసెట్ కోసం అధిక భద్రతను సెట్ చేయడం విభాగాలలో, మీరు అమలు చేయాలనుకుంటున్న అధిక భద్రతా ఎంపికను ఎంచుకోండి.
దశ 2: మీరు ఎంచుకున్న ఎంపిక ఆధారంగా, విజయవంతమైన ధృవీకరణ తర్వాత ఒక సమాచార సందేశం ప్రదర్శించబడుతుంది. OK పై క్లిక్ చేయండి.

ఎంపిక చేసిన తర్వాత, మీరు నిర్ధారించు పేజీకి దారిమార్చబడతారు. ఎంపిక చేసిన భద్రతా ఎంపికలపై అధిక భద్రతను అమలు చేయడానికి నిర్ధారించు పై క్లిక్ చేయండి.
3.3 అధిక భద్రతా ఎంపికలను అన్‌సెలెక్ట్ చేయడం
స్టెప్ 1:ఇ-ఫైలింగ్ అధిక భద్రతా సౌకర్యంపేజీలో, మీరులాగిన్మరియుపాస్వర్డ్ రీసెట్కోసం ఎంచుకున్న రెండవ స్థాయి ధృవీకరణ ఎంపికలు కనిపిస్తాయి. మీకు అధిక భద్రత అవసరం లేని ఎంపికలను అన్‌సెలెక్ట్ చేసి,కొనసాగించుపై క్లిక్ చేయండి.
గమనిక:మీరు లాగిన్ మరియు/లేదా పాస్వర్డ్ రీసెట్ కోసం ఉన్న అధిక భద్రతా ఎంపికను అన్‌సెలెక్ట్ చేయవచ్చు.
స్టెప్ 2:నిర్ధారణ పేజీలో, ఎంచుకున్న ఎంపికలపై అధిక భద్రతను నిలిపివేయడానికి నిర్ధారించు పై క్లిక్ చేయండి.

ధృవీకరణ విజయవంతమైన తర్వాత, లావాదేవీ IDతో పాటు ఒక విజయ సందేశం ప్రదర్శించబడుతుంది.
4. సంబంధిత అంశాలు
- లాగిన్
- పాస్వర్డ్ రీసెట్ చేయండి
- పాస్‌వర్డ్‌ని మార్చండి
- EVCని రూపొందించండి
- DSC నమోదు
- ఆధార్‌ను అనుసంధానం చేయండి