మీ JAO గురించి తెలుసుకోండి యూజర్ మాన్యువల్

 

1. అవలోకనం

చెల్లుబాటయ్యే పాన్ కలిగిన పన్ను చెల్లింపుదారులకు (ఈ-ఫైలింగ్ లో నమోదు చేసుకున్నవారు లేదా చేసుకోనివారు) 'Know Your JAO' సేవ అందుబాటులో ఉంది. ఒక నిర్దిష్ట పాన్ కు సంబంధించిన అధికారిక పరిధి మదింపు అధికారి (JAO) వివరాలను వీక్షించడానికి ఈ సేవ మిమ్మల్ని అనుమతిస్తుంది. ఈ సేవను పొందడానికి మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేదు.

2. ఈ సేవ పొందడానికి ముందస్తు అర్హతలు
 

  • చెల్లుబాటయ్యే పాన్‌
  • చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్

3. దశలవారీ మార్గదర్శిని


దశ 1:ఈ-ఫైలింగ్ పోర్టల్ హోంపేజ్ కి వెళ్ళి'మీ JAO ని తెలుసుకోండి'పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 2:'మీ అధికార పరిధిలోని అసెస్సింగ్ అధికారిని తెలుసుకోండి'పేజీలో, మీ పాన్‌ మరియు చెల్లుబాటయ్యే మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, 'కొనసాగించు' పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 3:స్టెప్ 2లో మీరు నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు 6 అంకెల OTP వస్తుంది. ఆ OTPని నమోదు చేసి, 'ధృవీకరించు' పై క్లిక్ చేయండి.

Data responsive

గమనిక:

  • OTP కేవలం 15 నిమిషాలు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
  • సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 అవకాశాలు ఉన్నాయి.
  • స్క్రీన్ పై OTP గడువు ముగిసే కౌంట్‌డౌన్ టైమర్, OTP గడువు ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
  • 'OTP మళ్ళీ పంపు' పై క్లిక్ చేసినప్పుడు, ఒక కొత్త OTP రూపొందించబడి పంపబడుతుంది.

OTP ధ్రువీకరణ విజయవంతమైన తర్వాత, మీ పాన్‌ స్థితితో పాటు, అధికార పరిధి గల అసెస్సింగ్ అధికారి వివరాలు (ఏరియా కోడ్, AO రకం, రేంజ్ కోడ్, AO సంఖ్య, అధికార పరిధి, చిరునామా మరియు JAO యొక్క ఇమెయిల్ ID వంటివి) మీకు కనిపిస్తాయి.

Data responsive

4. సంబంధిత అంశాలు