నా బ్యాంక్ ఖాతా గురించి యూజర్ మాన్యువల్

 

1. అవలోకనం

ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయిన తర్వాత, చెల్లుబాటు అయ్యే PAN మరియు చెల్లుబాటు అయ్యే బ్యాంకు ఖాతా ఉన్న నమోదిత పన్ను చెల్లింపుదారులందరికీ నా బ్యాంకు ఖాతా(మై బ్యాంక్ అకౌంట్) సేవ అందుబాటులో ఉంటుంది. ఈ సేవ మీకు ఈ క్రింది వాటిని చేయడానికి వీలు కల్పిస్తుంది:

  • బ్యాంక్ ఖాతాను జోడించి, దానిని ముందుగానే ధ్రువీకరించండి.
  • మూసివేయబడిన లేదా డీయాక్టివేట్ చేయబడిన బ్యాంక్ అకౌంట్‌ను తొలగించవచ్చు.
  • ఆదాయపు పన్ను వాపసును పొందడానికి మరియు నెట్ బ్యాంకింగ్ లాగిన్ కోసం ధ్రువీకరించబడిన బ్యాంక్ ఖాతాను సూచించండి.
  • ఆ బ్యాంక్ అకౌంట్‌లో ఆదాయపు పన్ను రీఫండ్ అందుకోకుండా ఉండేందుకు, నామినేట్ చేసిన బ్యాంక్ అకౌంట్‌ను నామినేషన్ నుండి తొలగించవచ్చు.
  • ధ్రువీకరించబడిన బ్యాంక్ ఖాతా కోసం EVCని ఎనేబుల్ లేదా డిసేబుల్ చేయండి (కేవలం వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు మరియు ఈ-ఫైలింగ్ అనుసంధానిత బ్యాంకుల కోసం మాత్రమే).
  • ముందస్తు ధ్రువీకరణ విఫలమైన బ్యాంకు ఖాతాలను తిరిగి ధ్రువీకరించండి

2. ఈ సేవను పొందడానికి అవసరమైన ముందస్తు అర్హతలు

  • ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో చెల్లుబాటు అయ్యే యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో నమోదు అయిన వినియోగదారు.
  • ముందుగా ధ్రువీకరించబడే బ్యాంకు ఖాతాతో PAN తప్పనిసరిగా లింక్ చేయబడాలి

 

సేవ ముందస్తు అర్హతలు
బ్యాంక్ అకౌంట్‌ను జోడించి ధ్రువీకరణ చేయడం

1. అకౌంట్ తప్పనిసరిగా PANతో అనుసంధానించబడి ఉండాలి.
2. వినియోగదారు వద్ద చెల్లుబాటు అయ్యే IFSC మరియు అకౌంట్ నంబర్ ఉండాలి.
3. క్రింది వెరిఫికేషన్ విధానాల్లో ఏదైనా ఒకదానికి ప్రాప్యత ఉండాలి*:

  • OTP కోసం ఆధార్‌తో నమోదు చేసిన మొబైల్ నంబర్.
  • బ్యాంక్ అకౌంట్ / డీమ్యాట్ అకౌంట్ ద్వారా EVC.
  • నెట్ బ్యాంకింగ్ ద్వారా.
  • చెల్లుబాటు అయ్యే DSC.

గమనిక*: వినియోగదారు లాగిన్ రకం ఆధారంగా ధ్రువీకరణ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

బ్యాంక్ అకౌంట్‌ను తొలగించడం

1. ఏదైనా ఒక ధ్రువీకరణ పద్ధతిని పొందే అవకాశం*:

  • ఆధార్‌తో నమోదు చేసిన మొబైల్ నంబర్ ద్వారా OTP.
  • బ్యాంక్ అకౌంట్ / డీమ్యాట్ అకౌంట్ ద్వారా EVC.
  • నెట్ బ్యాంకింగ్ ద్వారా.
  • చెల్లుబాటు అయ్యే DSC.

గమనిక*: వినియోగదారు లాగిన్ రకాన్ని బట్టి ధ్రువీకరణ ఎంపికలు అందుబాటులో ఉంటాయి.

రీఫండ్ కోసం బ్యాంక్ అకౌంట్‌ను నామినేట్ చేయడం లేదా నామినేషన్ నుండి బ్యాంక్ అకౌంట్‌ను తొలగించడం

1. ధ్రువీకరించబడిన బ్యాంకు ఖాతా
2. ఖాతా రకం తప్పనిసరిగా పొదుపు/కరెంట్/క్యాష్ క్రెడిట్/ఓవర్‌డ్రాఫ్ట్/ప్రవాస సాధారణ ఖాతా అయి ఉండాలి

  EVCను ఎనేబుల్ చేయడం

1. ఈ-ఫైలింగ్‌తో అనుసంధానించబడిన బ్యాంకులలో ఏదైనా ఒక బ్యాంకులో అకౌంట్ ఉండాలి.
2. ప్రైమరీ మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ ID, బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్ లేదా ఈమెయిల్ IDతో ఒకే విధంగా ఉండాలి.

 

3. స్టెప్-బై-స్టెప్ గైడ్(దశల వారీ మార్గదర్శిని)

దశ 1:మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ను ఉపయోగించి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.
 

Data responsive

దశ 2:డ్యాష్‌బోర్డ్నుండిమై ప్రొఫైల్ పేజీకి వెళ్లండి.
 

Data responsive

దశ 3: మై బ్యాంక్ అకౌంట్ పై క్లిక్ చేయండి.

Data responsive

మై బ్యాంక్ అకౌంట్పేజీలో,జోడించినవి,విఫలమైనవిమరియుతొలగించిన బ్యాంకు ఖాతాలుఅనే ట్యాబ్‌లు ప్రదర్శించబడతాయి.
 

Data responsive

మై బ్యాంక్ అకౌంట్ సేవలో అందుబాటులో ఉన్న వివిధ సౌకర్యాలను ఎలా ఉపయోగించాలో తెలుసుకోవడానికి, క్రింది విభాగాలను చూడండి:

బ్యాంక్ ఖాతాను జోడించి, ముందస్తుగా ధ్రువీకరించడం సెక్షన్ 3.1కు వెళ్లండి
బ్యాంక్ అకౌంట్‌ను తొలగించు సెక్షన్ 3.2కు వెళ్లండి
రీఫండ్ కోసం బ్యాంక్ అకౌంట్‌ను నామినేట్ చేయడం లేదా నామినేషన్ నుండి బ్యాంక్ అకౌంట్‌ను తొలగించడం సెక్షన్ 3.3కు వెళ్లండి
EVCని ప్రారంభించడం మరియు నిలిపివేయడం సెక్షన్ 3.4కు వెళ్లండి
బ్యాంక్ ఖాతాను తిరిగి ధ్రువీకరించండి సెక్షన్ 3.5కు వెళ్లండి
నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అవ్వడానికి ఒక బ్యాంక్ ఖాతాను ఎంచుకోండి సెక్షన్ 3.6కు వెళ్లండి

 

3.1 బ్యాంక్ ఖాతాను జోడించడం మరియు ముందుగానే ధ్రువీకరించడం
 

PAN / ఆధార్‌ను ఉపయోగించి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవడం ద్వారా  

స్టెప్ 1: నా బ్యాంక్ ఖాతా పేజీలో, బ్యాంక్ ఖాతాను జోడించండి పై క్లిక్ చేయండి.

Data responsive

స్టెప్ 2: బ్యాంక్ ఖాతాను జోడించండి పేజీలో, బ్యాంక్ ఖాతా సంఖ్యను నమోదు చేయండి, ఖాతా రకం మరియు హోల్డర్ రకంను ఎంచుకోండి, మరియు IFSCని నమోదు చేయండి. IFSC ఆధారంగా బ్యాంక్ పేరు మరియు బ్రాంచ్ ఆటోమేటిక్‌గా నింపబడతాయి. మీ బ్యాంక్ ఇ-ఫైలింగ్‌తో అనుసంధానించబడి ఉంటే, మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID మీ ఇ-ఫైలింగ్ ప్రొఫైల్ ద్వారా ముందుగానే నింపబడి ఉంటాయి మరియు వాటిని సవరించడానికి వీలుండదు.

Data responsive

స్టెప్ 3:ఈ-ధృవీకరణకు కొనసాగండిపై క్లిక్ చేయండి.
 

Data responsive

ఈ-ధృవీకరణ ఎంపికను ఎంచుకుని, కొనసాగించండి పై క్లిక్ చేయండి.

Data responsive

OTPని నమోదు చేసి ధృవీకరించండి.

Data responsive

ధృవీకరణ అభ్యర్థన విజయవంతంగా సమర్పించబడిన తర్వాత, ఒక విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. అలాగే, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID కి కూడా ఒక సందేశం పంపబడుతుంది.

Data responsive

 

Data responsive

3.2 బ్యాంకు ఖాతాను తొలగించండి.

దశ 1: కావలసిన బ్యాంక్ ఖాతా కోసం  యాక్షన్  కాలమ్ కింద బ్యాంక్ ఖాతాను తీసివేయండి పై క్లిక్ చేయండి.

 

Data responsive

స్టెప్ 2: బ్యాంక్ ఖాతాను తొలగించడానికి డ్రాప్‌డౌన్ నుండి ఒక కారణాన్ని ఎంచుకోండి. మీరు ఇతర ఎంచుకుంటే, టెక్స్ట్ బాక్స్‌లో కారణాన్ని నమోదు చేసి, కొనసాగించు పై క్లిక్ చేయండి.

Data responsive

స్టెప్ 3:ఈ-ధృవీకరణ ఎంపికను ఎంచుకుని, కొనసాగించండి పై క్లిక్ చేయండి.

Data responsive

స్టెప్ 4:OTPని నమోదు చేసి ధృవీకరించండి.

Data responsive

బ్యాంక్ ఖాతా విజయవంతంగా తొలగించబడిన తర్వాత, ఒక విజయ సందేశం కనబడుతుంది.

Data responsive

‘ధృవీకరణ పురోగతిలో ఉంది’ అనే స్థితిలో ఉన్న బ్యాంక్ ఖాతాను మీరు తొలగించవచ్చు. తొలగించిన తర్వాత, సరైన వివరాలతో అదే బ్యాంక్ ఖాతా మళ్లీ జోడించవచ్చు.

3.3 రీఫండ్ కోసం బ్యాంక్ ఖాతాను నామినేట్ చేయడం లేదా నామినేషన్ నుండి బ్యాంక్ ఖాతాను తొలగించడం

A. రీఫండ్ కోసం బ్యాంక్ ఖాతానును నామినేట్ చేయడం  

స్టెప్ 1:రీఫండ్ కోసం బ్యాంక్ ఖాతాను నామినేట్ చేయడానికి, మీరు నామినేట్ చేయాలనుకున్న బ్యాంక్ ఖాతాకు సంబంధించినరీఫండ్ కోసం నామినేట్ చేయండిటాగుల్ / స్విచ్‌పై (స్విచ్ ఎడమ వైపున ఉంటుంది) క్లిక్ చేయండి.
 

Data responsive


దశ 2:ఎంచుకున్న బ్యాంక్ అకౌంట్‌ను నామినేట్ చేయాలని నిర్ధారించడానికికంటిన్యూ(కొనసాగించు)పై క్లిక్ చేయండి.
 

Data responsive

విజయవంతంగా పూర్తయిన తర్వాత, స్విచ్ కుడి వైపుకు మారుతుంది.

Data responsive

B.రీఫండ్ కోసం నామినేషన్ నుండి బ్యాంక్ ఖాతాను తొలగించండి  

స్టెప్ 1:రీఫండ్ కోసం నామినేట్ చేసిన బ్యాంక్ ఖాతాను తొలగించడానికి, మీరు నామినేషన్ నుండి తొలగించాలనుకుంటున్న బ్యాంక్ ఖాతాకు సంబంధించినరీఫండ్ కోసం నామినేట్ చేయండిటోగుల్ / స్విచ్‌(ఇది కుడి వైపున ఉంటుంది)పై క్లిక్ చేయండి.
 

Data responsive

స్టెప్ 2:ఎంపిక చేసిన బ్యాంక్ ఖాతా నామినేషన్‌ను తొలగించాలని నిర్ధారించడానికికొనసాగించండిపై క్లిక్ చేయండి.
 

Data responsive

విజయవంతంగా పూర్తయిన తర్వాత, స్విచ్ ఎడమ వైపుకు మారుతుంది.

Data responsive

3.4 EVCను ఎనేబుల్ చేయండి మరియు నిలిపివేయడం  

A. EVCను ఎనేబుల్ చేయండి  

స్టెప్ 1:మీరు EVCను ఎనేబుల్ చేయాలనుకున్న బ్యాంక్ ఖాతాకు సంబంధించినయాక్షన్స్కాలమ్‌లో ఉన్నఎనేబుల్ EVCపై క్లిక్ చేయండి.
 

Data responsive


స్టెప్ 2:ఒక నిర్ధారణ సందేశం కనిపిస్తుంది.కొనసాగించండిపై క్లిక్ చేయండి.
 

Data responsive

గమనిక:

  • ఈ క్రింది షరతులు నెరవేరినట్లయితేనే, ధృవీకరించబడిన బ్యాంక్ ఖాతా కోసం EVCని ఎనేబుల్ చేయవచ్చు:
  • మీ మొబైల్ నంబర్ లేదా ఇమెయిల్ ID బ్యాంక్ ద్వారా ధ్రువీకరించబడి ఉండాలి.
  • ఈ-ఫైలింగ్‌లో నమోదు చేసిన మీ మొబైల్ నంబర్, బ్యాంక్ ద్వారా ధ్రువీకరించబడిన మొబైల్ నంబర్‌తో ఒకేలా ఉండాలి. అవి సరిపోలేలా చేయడానికి, మీ ఈ-ఫైలింగ్ ప్రొఫైల్‌లోని మొబైల్ నంబర్‌ను బ్యాంక్‌తో అనుసంధానించిన మొబైల్ నంబర్‌కు అనుగుణంగా నవీకరించండి లేదా మీ బ్యాంక్‌లో నమోదు చేసిన మొబైల్ నంబర్‌ను ఈ-ఫైలింగ్ ప్రొఫైల్‌లో ఉన్న మొబైల్ నంబర్‌కు అనుగుణంగా నవీకరించండి.
  • ఏ ఇతర బ్యాంక్ ఖాతాకూ EVCని ఎనేబుల్ చేయకూడదు.
  • మీ బ్యాంక్ ఈ-ఫైలింగ్‌తో అనుసంధానించబడి ఉండాలి. ఈ-ఫైలింగ్‌తో అనుసంధానించబడిన బ్యాంకుల జాబితాను ఇక్కడ చూడవచ్చు: .లాగిన్ > నా ప్రొఫైల్ > నా బ్యాంకు ఖాతా > గమనికల విభాగం > “బ్యాంకుల జాబితా" పై క్లిక్ చేయండి
  • మీరు మీ బ్యాంక్ ఖాతాను మాత్రమే ముందుగా ధృవీకరించాలని, EVCని ప్రారంభించవద్దు అనుకుంటే, మీ ఇ - ఫైలింగ్ మొబైల్ లేదా ఇమెయిల్, మీ బ్యాంక్ ధృవీకరించిన సంప్రదింపు వివరాలతో సరిపోల్చాల్సిన అవసరం లేదు.

పై షరతులు నెరవేరితే, ఎంపిక చేసిన బ్యాంకు ఖాతాకు EVC విజయవంతంగా ప్రారంభించబడుతుంది మరియు దాని స్థితి వాలిడేటెడ్ అండ్ EVC ఎనేబుల్డ్ గా నవీకరించబడుతుంది:

Data responsive

స్టెప్ 3: ఒక బ్యాంకు ఖాతాకు ఇప్పటికే EVC ప్రారంభించబడి ఉండి, మీరు మరొక బ్యాంకు ఖాతాకు EVCను ప్రారంభించడానికి ప్రయత్నిస్తే, దానికి సంబంధించిన ఒక సందేశం కనిపిస్తుంది. ఆ సందేశంలో కొనసాగండి పై క్లిక్ చేయండి. స్టెప్ 2లో పేర్కొన్న షరతులు నెరవేరినట్లయితే, ఆ బ్యాంక్ అకౌంట్‌కు EVC ప్రారంభించబడుతుంది. అటువంటి సందర్భంలో, ఇంతకుముందు EVC ప్రారంభించబడినబ్యాంకు ఖాతాకు EVC నిలిపివేయబడుతుంది.

Data responsive

గమనిక: మీరు రద్దు పై క్లిక్ చేసినా లేదా సందేశాన్ని మూసివేసినా, ప్రస్తుతం ఉన్న బ్యాంకు ఖాతాకు EVC ప్రారంభించబడిన స్థితిలోనే ఉంటుంది.

B. EVCను నిలిపివేయండి  

స్టెప్ 1:EVC ప్రారంభించబడిన బ్యాంకు ఖాతాకు సంబంధించినయాక్షన్స్కాలమ్‌లో ఉన్నEVCని నిలిపివేయండిపై క్లిక్ చేయండి.
 

Data responsive


స్టెప్ 2:ఒక నిర్ధారణ సందేశం కనిపిస్తుంది.కొనసాగించండిపై క్లిక్ చేయండి.
 

Data responsive


విజయవంతంగా పూర్తయిన తర్వాత, ఎంపిక చేసిన బ్యాంక్ ఖాతాకు EVC నిలిపివేయబడుతుంది మరియు దాని స్థితిధృవీకరించబడిందిగా మాత్రమే నవీకరించబడుతుంది.

Data responsive

3.5 బ్యాంక్ ఖాతాను మళ్లీ ధ్రువీకరించడం

స్టెప్ 1: ఒక బ్యాంక్ ఖాతాకు సంబంధించిన ధృవీకరణ ఇంతకుముందు విఫలమై ఉంటే, దాని వివరాలు ఫెయిల్డ్ బ్యాంక్ ఖాతాలు ట్యాబ్‌లో కనిపిస్తాయి. మీరు మళ్లీ ధృవీకరించాలనుకున్న బ్యాంక్ ఖాతాకు సంబంధించిన యాక్షన్ కాలమ్‌లో ఉన్న రీ-వాలిడేట్ పై క్లిక్ చేయండి.

మీ బ్యాంక్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్/ఇమెయిల్‌లో లేదా ఈ-ఫైలింగ్ ప్రొఫైల్‌లో ఏవైనా నవీకరణలు జరిగినా, లేదా మీ అకౌంట్ రకం/అకౌంట్ స్థితి మారినా, జోడించిన బ్యాంక్ అకౌంట్‌ను కూడా మీరు మళ్లీ ధ్రువీకరించవచ్చు.

Data responsive

స్టెప్ 2: యాడ్ బ్యాంక్ అకౌంట్ పేజీలో, బ్యాంక్ మరియు సంప్రదింపు వివరాలు ముందుగానే నింపబడి ఉంటాయి. బ్యాంక్ వివరాలను సవరించవచ్చు, అయితే సంప్రదింపు వివరాలను సవరించలేరు. అవసరమైతే సవరించగల వివరాలను నవీకరించండి. అనంతరం ప్రొసీడ్ టు ఈ-వెరిఫై పై క్లిక్ చేయండి.

Data responsive

స్టెప్ 3:ఈ-వెరిఫికేషన్ కోసం పద్ధతిని ఎంచుకోండి.

Data responsive

ఆధార్‌తో నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన OTPను నమోదు చేయండి.

Data responsive

 

Data responsive

విజయవంతంగా పూర్తయిన తర్వాత, బ్యాంకు ఖాతా జోడించిన బ్యాంక్ ఖాతాలు/strong> ట్యాబ్ కింద జోడించబడుతుంది మరియు దాని స్థితి ధృవీకరణ ప్రక్రియ కొనసాగుతోంది గా నవీకరించబడుతుంది.

Data responsive

ఆ తర్వాత, మీ సంప్రదింపు వివరాలు బ్యాంక్ వివరాలతో ధృవీకరించబడతాయి. బ్యాంక్ ద్వారా ఖాతా వివరాలు ధృవీకరించబడితే, మీ బ్యాంక్ ఖాతా చెల్లుబాటు అవుతుంది. మీరు జోడించిన బ్యాంక్ ఖాతాలు ట్యాబ్‌లోని స్టేటస్ కాలమ్‌లో ధృవీకరణ స్థితిని తనిఖీ చేయవచ్చు.

Data responsive

ఒకవేళ ధృవీకరణ ఇప్పటికీ విఫలమై ఉంటే వైఫల్యానికి గల కారణాన్ని బట్టి (ఈ-ఫైలింగ్‌తో అనుసంధానించబడిన బ్యాంకుల కోసం) క్రింది చర్యలు తీసుకోండి:

వైఫల్యానికి గల కారణం తీసుకోవలసిన చర్య
PAN–బ్యాంక్ ఖాతా–IFSC అనుసంధానం విఫలమైంది మీ PAN ను బ్యాంక్ అకౌంట్‌తో అనుసంధానం చేయడానికి మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి. అనంతరం అభ్యర్థనను సమర్పించడానికి రీ-వాలిడేట్పై క్లిక్ చేయండి. మరింత సమాచారం కోసం మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
పేరు సరిగాలేదు PAN ప్రకారం పేరును అప్‌డేట్ చేయడానికి బ్రాంచ్‌ను సంప్రదించండి. ఆ తర్వాత, వివరాలను మళ్లీ సరిచూసుకుని, అప్‌డేట్ చేసి, పునఃపరిశీలన కోసం అభ్యర్థనను సమర్పించండి.
బ్యాంక్ ఖాతా నంబర్ సరిగా లేదు పునఃధృవీకరించండి పై క్లిక్ చేసి, సరైన బ్యాంక్ ఖాతా సంఖ్యను నమోదు చేసి, మళ్లీ ధ్రువీకరణ కోసం అభ్యర్థనను సమర్పించండి.
ఖాతా సంఖ్య లేదు సరైన బ్యాంక్ ఖాతా సంఖ్యను నమోదు చేసి, మళ్లీ ధ్రువీకరణ కోసం అభ్యర్థనను సమర్పించండి.
బ్యాంక్ ఖాతా మూసివేయబడింది / క్రియారహితంగా ఉంది వేరొక బ్యాంక్ ఖాతా సంఖ్యతో ప్రయత్నించండి. మరింత సమాచారం కోసం మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

నాన్-ఇంటిగ్రేటెడ్ బ్యాంకులలో ఒకదానిలో ఖాతా ఉంటే, ఈ క్రింది చర్యలు తీసుకోవాలి:

వైఫల్యానికి గల కారణం తీసుకోవలసిన చర్య
బ్యాంక్ ఖాతాతో PAN లింక్ చేయలేదు. PAN ను బ్యాంక్ ఖాతాతో అనుసంధానించి, అభ్యర్థనను సమర్పించడానికి రీ-వాలిడేట్పై క్లిక్ చేయండి. మరింత సమాచారం కోసం మీ శాఖను సంప్రదించండి.
PAN సరిపోలడం లేదు సరైన PAN‌ను బ్యాంకు ఖాతాతో అనుసంధానం చేసి, అభ్యర్థనను సమర్పించడానికి రీ-వాలిడేట్పై క్లిక్ చేయండి. మరింత సమాచారం కోసం మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.
చెల్లుబాటులో లేని ఖాతా రకం రీ-వాలిడేట్ పై క్లిక్ చేసి, సరైన బ్యాంక్ ఖాతా రకాన్ని ఎంపిక చేసి, ధ్రువీకరణ కోసం అభ్యర్థనను సమర్పించండి.
ఖాతా మూసివేయబడింది/నిష్క్రియ ఖాతా/వివాదాస్పద ఖాతా/ఖాతా స్తంభింపజేయబడింది లేదా నిరోధించబడింది వేరొక సరైన బ్యాంక్ ఖాతా నంబర్‌తో ప్రయత్నించండి. మరింత సమాచారం కోసం మీ శాఖను సంప్రదించండి.
ఖాతాదారుని పేరు చెల్లదు రీ-వాలిడేట్ పై క్లిక్ చేసి వివరాలను నవీకరించండి. PANలో ఉన్న పేరుకు అనుగుణంగా మీ పేరును నవీకరించేందుకు మీ బ్యాంక్ శాఖను సంప్రదించండి.

బ్యాంక్ ధృవీకరణ స్థితి ‘ధృవీకరణ సాధ్యం కాదు’ గా చూపబడితే, ఆ బ్యాంక్ ఈ-ఫైలింగ్‌తో అనుసంధానించబడిన బ్యాంక్ కాకపోవడం లేదా NPCIతో అనుసంధానించబడకపోవడం వల్ల, బ్యాంక్ ఖాతా వివరాలను శాఖ ధృవీకరించలేకపోయిందని అర్థం. అటువంటి సందర్భాల్లో, మీరు RBI జాబితా ప్రకారం ఈ-ఫైలింగ్‌తో అనుసంధానించబడిన బ్యాంక్‌కు చెందిన లేదా NPCIతో అనుసంధానించబడిన మరొక బ్యాంక్ ఖాతాను జోడించవచ్చు.

3.6 నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ కావడానికి ధ్రువీకరించబడిన బ్యాంక్ ఖాతాను నామినేట్ చేయడం

స్టెప్ 1:నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ కోసం నామినేట్ బటన్‌ను ప్రారంభించండి:

Data responsive

స్టెప్ 2: కొనసాగించండి పై క్లిక్ చేయండి.

Data responsive

స్టెప్ 3: ఇప్పుడు, నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ కావడానికి బ్యాంక్ అకౌంట్ నామినేట్ చేయబడింది.

Data responsive

4. సంబంధిత అంశాలు