Do not have an account?
Already have an account?

1. అవలోకనం

పెద్ద సంఖ్యలో పాన్ /టాన్ తనిఖీ చేసే సేవ బయటి సంస్థలకు సౌలభ్యంగా ఉంది. బయటి సంస్థలలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విభాగాలు లేదా ప్రభుత్వ రంగ సంస్థలు, గుర్తింపు పొందిన స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థలు, ఆర్‌బిఐ-ఆమోదించిన బ్యాంకులు లేదా ఆర్థిక సంస్థలు ఉన్నాయి. ఒకసారి ఇ-ఫైలింగ్ పోర్టల్ లో బయటి సంస్థగా నమోదు చేసుకుని, ఆమోదం పొందిన తరువాత నిర్దిష్ట సేవలను (పెద్ద సంఖ్యలో పాన్ /టాన్ తనిఖీ చేసే సేవ లాంటివి) వారు వినియోగించుకోవచ్చు. బయటి సంస్థలు (లాగిన్ తరువాత) ఈ సేవను వినియోగించుకుంటూ ఈ దిగువ పేర్కొన్న విధులను చేసే వీలు కలిగిస్తుంది:

  • ఇ-ఫైలింగ్ పోర్టల్ మీద పాన్ /టాన్ తనిఖీ చేయటానికి పెద్ద సంఖ్యలో పాన్/ టాన్ విచారణా టెంప్లేట్స్ అప్‌లోడ్ చేయయటం.
  • ఇ-పైలింగ్ పోర్టల్ మీద గత టోకెన్ వివరాలను వీక్షించడం.

2. ఈ సేవను వినియోగించుకోవటానికి ముందస్తు ఆవశ్యకతలు

ఈ సేవ సౌలభ్యంగా ఉండేది కేవలం బయటి సంస్థల కోసం మాత్రమే, ఎవరైతే:

  • ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడి ఉన్నవారు.
  • ఇ-ఫైలింగ్ పోర్టల్ నుండి పెద్ద సంఖ్యలో పాన్ /టాన్ విచారణ కోసం తాజా టెంప్లేట్‌ను డౌన్‌లోడ్ చేసుకుని ఉన్నవారు

3. ప్రాసెస్/దశల వారీగా సూచనలు అందించే మార్గదర్శిని.

3.1 బల్క్ పాన్ /టాన్ ప్రశ్నలు అప్‌లోడ్ చేయటం

దశ 1: యూజర్ ఐడి మరియు పాస్వర్డ్‌ని ఉపయోగిస్తూ మీ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.

Data responsive


దశ 2: బల్క్ పాన్/టాన్ తనిఖీ చేయటం కోసం >బల్క్ పాన్ /టాన్ తనిఖీ చేయండి పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 3: మీరు ఎంచుకున్న (పాన్ /టాన్) ప్రశ్నతో సంబంధం గల టెంప్లేట్‌ను డౌన్‌లోడ్ చేసుకోండి పై క్లిక్ చేయండి.
గమనిక: పెద్ద సంఖ్యలో పాన్ మరియు టాన్ ల విచారణను తనిఖీ చేయటానికి ప్రత్యేక జె.ఎస్.ఓ.ఎన్. టెంప్లేట్స్ అందించబడతాయి.

Data responsive


దశ 4: ఒకసారి టెంప్లేట్‌ను మీరు నింపిన తరువాత మరియు అప్‌లోడ్ చేయటానికి జె.ఎస్.ఓ.ఎన్. ఫైల్‌ను జనరేట్ చేసిన తరువాత, మీరు అప్‌లోడ్ చేయాలని కోరుకున్న విచారణ తరహాని ఎంచుకోండి. పెద్ద సంఖ్యలో పాన్ విచారణ మరియు టాన్ విచారణకు, అటాచ్‌మెంట్ మీద క్లిక్ చేసి, మీ కంప్యూటర్ నుండి సంబంధిత ఫైల్‌ను ఎంచుకోండి.

Data responsive


దశ 5: ఒకసారి మీ ఫైల్ జతచేశాక, అప్‌లోడ్ మీద క్లిక్ చేయండి.
గమనిక: ఒక జె.ఎస్.ఓ.ఎన్. ఫైల్‌లో, కేవలం 100పాన్/టాన్ రికార్డులను మాత్రమే అప్‌లోడ్ చేయవచ్చు.

Data responsive


అప్‌లోడ్ విజయవంతం అయిన మీదట, టోకెన్ నెంబర్ జనరేట్ చేయబడుతుంది, మరియు లావాదేవీ ఐడి మరియు టోకెన్ నెంబరుతోపాటు విజయవంతం అయిందన్న ఒక సందేశం కనిపిస్తుంది. ఇ-ఫైలింగ్‌తో నమోదు చేసుకున్న మీ ఇమెయిల్ ఐడికి టోకెన్ నెంబరుతో ఒక ఇమెయిల్‌ సమాచారాన్ని కూడా మీరు అందుకుంటారు.

Data responsive


3.2ముందరి టోకెన్ వివరాలు చూడండి

దశ 1: యూజర్ ఐడి మరియు పాస్వర్డ్‌ని ఉపయోగిస్తూ మీ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.

Data responsive


దశ 2: జనరేట్ అయిన టోకెన్ల వివరాలు మరియు స్థితిని చూడటానికి, పెద్ద మొత్తంలో పాన్/టాన్ > పెద్ద మొత్తంలో పాన్/టాన్ > వెరిపై చేయటంపై క్లిక్ చేయండి.

Data responsive


దశ 3: ముందరి టోకెన్ వివరాలపై క్లిక్ చేయండి.

Data responsive


మీ స్థితి (ప్రాసెస్ చేయబడిన/పెండింగ్‌లో ఉన్న)తో పాటు టోకెన్ల జీవిత వలయాన్ని (సమర్పించబడిన విచారణ/ ప్రాసెస్ చేయబడిన విచారణ) కూడా మీరు చూడగలుగుతారు.

Data responsive


గమనిక: జాబితా చేయబడిన టోకెన్ వివరాల పైన కుడివైపు పై మూల ఒక గరాటు చిహ్నం గల బటన్ పై క్లిక్ చేయటం ద్వారా మీ విచారణలను మీరు ఫిల్టర్ చేయవచ్చు.

Data responsive

 

Data responsive


దశ 4: ఒక ప్రత్యేక విచారణ ద్వారా తనిఖీ చేయబడిన వివరాలను మీరు డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, టోకెన్ మీద ఉన్న డౌన్‌లోడ్ .csv ఫైల్ మీద క్లిక్ చేయండి. మీ కంప్యూటర్ మీద డౌన్‌లోడ్ చేయబడిన ఒక డాట్ సి.ఎస్.వి. ఫార్మాట్ ఫైల్‌ను మీరు పొందుతారు.

Data responsive


ప్రతీ టోకెన్ కోసం మీరు అప్‌లోడ్ చేసిన పెద్ద సంఖ్యలోని పాన్/టాన్ విచారణ నుండి వివరాలు సి.బి.ఎన్. డేటాబేస్‌లోని వివరాలతో తనిఖీ చేయబడి, డాట్ సి.వి.సి. ఫైల్‌లో రికార్డ్ చేయబడతాయి. మీరు డౌన్‌లోడ్ చేసుకున్న డాట్ సి.ఎస్.వి. ఫైల్‌లో, ఏ వివరాలు సరిపోలుతున్నాయి మరియు డేటాబేస్‌లో పాన్/టాన్ ఉన్నదా అనేది మీరు చూడగలుగుతారు.


4. సంబంధిత అంశాలు

  • లాగిన్
  • మీరే రిజిస్టర్ చేసుకోండి
  • పాస్‌వర్డ్‌ని మార్చండి
  • పాస్‌వర్డ్‌ను మరచిపోయారా
  • నా ప్రొఫైల్