1. అవలోకనం
బకాయి డిమాండ్ కి ప్రతిస్పందన సేవ ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన పన్ను చెల్లింపుదారులందరికి ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో బకాయి డిమాండ్ కి ప్రతిస్పందన చూడటానికి మరియు / లేదా సమర్పించడానికి మరియు వర్తించే చోట బకాయి డిమాండ్ చెల్లించడానికి అనుమతిస్తుంది. ఈ సేవతో, మీరు వీరి ద్వారా లేవనెత్తబడిన బకాయి పన్ను డిమాండ్స్ కోసం మీ ప్రతిస్పందన సమర్పించవచ్చు:
- సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్; లేదా
- మదింపు అధికారి
2. ఈ సేవ పొందడానికి ముందస్తు అవసరాలు
- చెల్లుబాటు అయ్యే యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ అయిన వినియోగదారు
3. దశల వారీ మార్గదర్శిని
3.1. బకాయి డిమాండ్ కోసం ప్రతిస్పందించండి (పన్ను చెల్లింపుదారుల కోసం)
దశ 1: మీ వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ - ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్‌లో, మీ బకాయి డిమాండ్‌ల జాబితా చూడటానికి పెండింగ్ చర్యలు> బకాయి డిమాండ్‌కి ప్రతిస్పందన క్లిక్ చేయండి.
గమనిక: మీరు డిమాండ్ చెల్లించాలనుకుంటే, మీరు డిమాండ్ చెల్లించడానికి ఇప్పుడే చెల్లించండి పై క్లిక్ చేయవచ్చు. మీరు పన్ను చెల్లింపు చేయగల ఇ-పే ట్యాక్స్ పేజీకి వెళ్తారు.
బకాయి డిమాండ్ ప్రతిస్పందన పేజీలో మీరు "ఇటీవల సెక్షన్ 245 నోటీస్" లేదా "గతంలో జారీ చేయబడిన సెక్షన్ 245 నోటీస్" బటన్‌లపై క్లిక్ చేయడం ద్వారా ఇటీవల మరియు మునుపటి సెక్షన్ 245 నోటీసులను కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు
మీరు ఇంతకు ముందు జారీ అయిన నోటీసులను డౌన్‌లోడ్ చేయాలనుకుంటే, 245 నోటీసు జారీ చేయబడిన ఆర్థిక సంవత్సరాన్ని ఎంచుకుని, డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయాలి.
దశ 3: బకాయి మొత్తానికి ప్రతిస్పందన పేజీపై, బకాయి డిమాండ్ కోసం ప్రతిస్పందనను సమర్పించడానికి ప్రతిస్పందన సమర్పించండి ని క్లిక్ చేయండి
సందర్భానుసారంగా, మీరు సంబంధిత విభాగానికి వెళ్లవచ్చు:
| డిమాండ్ సరైనదిగా ఉంటే మరియు మీరు ఇప్పటికే చెల్లించకపోతే | 3.1 (A) సెక్షన్ చూడండి |
| డిమాండ్ సరైనదిగా ఉండి మీరు ఇప్పటికే చెల్లించినట్లయితే | 3.1 (B) సెక్షన్ చూడండి |
| మీరు డిమాండ్‌తో అంగీకరించకపోతే (పూర్తిగా లేదా పాక్షికంగా) | 3.1 (C) సెక్షన్ చూడండి |
గమనిక: మీరు సమర్పించిన అన్ని ప్రతిస్పందనలను చూడటానికి, బకాయి మొత్తానికి ప్రతిస్పందన పేజీలో, నిర్దిష్ట డిమాండ్‌కి ఎదురుగా చూడండి పైన క్లిక్ చేయండి.
3.1 (A) డిమాండ్ సరైనదిగా ఉండి మీరు ఇప్పటికే చెల్లించనట్లయితే ప్రతిస్పందనను సమర్పించండి
దశ 1: బకాయి మొత్తానికి ప్రతిస్పందన పేజీలో, డిమాండ్ సరైనది ఎంపికను మరియు నిరాకరణ ఎంచుకోండి ఒకసారి మీరు డిమాండ్ సరైనదని ప్రతిస్పందనను సమర్పించిన యెడల, మీరు తర్వాత డిమాండ్‌తో విభేదించలేరు.
దశ 2: అదే పేజీపై, ఇంకా చెల్లింపు చేయలేదు ఆప్షన్ ఎంపిక చేసి, ఇప్పుడే చెల్లించండి క్లిక్ చేయండి.
గమనిక: మీరు పన్ను చెల్లింపు చేయగల ఇ-పే ట్యాక్స్ పేజీకి వెళ్తారు.
చెల్లింపు విజయవంతం అయిన తరువాత, లావాదేవీ గుర్తింపు IDతో పాటు చెల్లింపు విజయవంతమైనట్లు సందేశం కనిపిస్తుంది. దయచేసి భవిష్యత్ సూచన కోసం లావాదేవీ గుర్తింపు ID వ్రాసి పెట్టుకోండి.
3.1 (B) డిమాండ్ సరైనది మరియు మీరు ఇప్పటికే చెల్లించినట్లయితే ప్రతిస్పందనను సమర్పించండి
దశ 1: బకాయి మొత్తానికి ప్రతిస్పందన పేజీలో, డిమాండ్ సరైనది ఎంపికను మరియు నిరాకరణను ఎంచుకోండి మరియు డిమాండ్ సరైనదని మీరు ప్రతిస్పందనను సమర్పించిన తర్వాత, మీరు తర్వాత డిమాండ్‌తో విభేదించలేరు.
దశ 2: అవును, ఇప్పటికే చెల్లించబడింది మరియు చలాన్‌లో CIN ఉంది ఎంచుకోండి. చలానా వివరాలు జోడించండి పై క్లిక్ చేయండి.
దశ 3: చలానా వివరాలను జోడించడానికి, చెల్లింపు రకం (మైనర్ హెడ్) ఎంచుకోండి, చలానా మొత్తం, BSR కోడ్, క్రమ సంఖ్య నమోదు చేసి, చెల్లింపు తేదీని ఎంపిక చేయండి.చలాన్ (PDF) కాపీని అప్‌లోడ్ చేయడానికి అటాచ్‌మెంట్ క్లిక్ చేసి, సేవ్ చేయండి క్లిక్ చేయండి.
గమనిక:
- ఒక అటాచ్‌మెంట్ సైజ్ గరిష్టంగా 5 MB ఉండాలి.
దశ 4: చలానా వివరాలను నమోదు చేసిన తర్వాత, ప్రతిస్పందనను మరియు నమోదు చేసిన చలానా వివరాలను సమర్పించడానికి సమర్పించండి క్లిక్ చేయండి.
విజయవంతమైన ధ్రువీకరణ తరువాత, లావాదేవీ గుర్తింపు IDతో పాటు ధృవీకరణ విజయవంతమైనట్లు సందేశం కనిపిస్తుంది. దయచేసి భవిష్యత్ సూచన కోసం లావాదేవీ IDని వ్రాసి పెట్టుకోండి.
3.1 (C) మీరు డిమాండ్‌తో (పూర్తిగా లేదా పాక్షికంగా) అంగీకరించకపోతే ప్రతిస్పందనను సమర్పించండి
దశ 1: బకాయి మొత్తానికి ప్రతిస్పందన పేజీలో, డిమాండ్‌తో అంగీకరించడం లేదు (పూర్తిగా లేదా పాక్షికంగా) ఎంపికను ఎంచుకోండి. కారణాలు జోడించండిపైన క్లిక్ చేయండి.
దశ 2: మీరు విభేదించడానికి కారణం(లు) ఎంచుకోవడానికి, ఎంపికల నుండి వాటిని సెలెక్ట్ చేసి అప్లై క్లిక్ చేయండి. (మీరు ఒకటి లేదా అంతకంటే ఎక్కువ ఎంపికలు ఎంచుకోవచ్చు.)

దశ 3: మీ అసమ్మతికి తగిన కారణాలను ఎంచుకున్న తర్వాత, బకాయి మొత్తానికి ప్రతిస్పందన పేజీలో దశ 2లో మీరు జాబితా చేసిన ప్రతి కారణాన్ని ఎంచుకుని, ప్రతి కారణానికి తగిన వివరాలను నమోదు చేయండి.
గమనిక: మీరు వివరాలను సమర్పించిన కారణానికి ఎదురుగా పూర్తయిన స్థితి కనిపిస్తుంది.
దశ 4: దశ 2లో జాబితా చేసిన అన్ని కారణాల కోసం వివరాలను సమర్పించిన తర్వాత, చెల్లింపు సారాంశంలో అందుబాటులో ఉన్న మిగిలిన బకాయి మొత్తాన్ని చెల్లించడానికి ఇప్పుడే చెల్లించండి క్లిక్ చేయండి (మీరు పాక్షికంగా విభేదిస్తే).
గమనిక: మీరు పన్ను చెల్లింపు చేయగల ఇ-పే ట్యాక్స్ పేజీకి వెళ్తారు.
దశ 5: చెల్లింపు చేసిన తర్వాత, మీరు బకాయి మొత్తానికి ప్రతిస్పందన పేజీకి వెళ్తారు, మీ ప్రతిస్పందనను సమర్పించడానికి సమర్పించండి క్లిక్ చేయండి.
దశ 6: మీ సమర్పణను నిర్ధారించడానికి ధృవీకరించండి క్లిక్ చేయండి.
విజయవంతంగా సమర్పించిన తరువాత, లావాదేవీ IDతో పాటు విజయవంతంగా సమర్పించబడినట్లు సందేశం కనిపిస్తుంది. దయచేసి భవిష్యత్ సూచన కోసం లావాదేవీ ID వ్రాసి పెట్టుకోండి.