Do not have an account?
Already have an account?
తాజా వార్తలు
08-ఏప్రి-2026

ఆదాయపు పన్ను చట్టం 1961లోని సెక్షన్ 90(1) కింద, భారతదేశం–బ్రెజిల్ ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందానికి (DTAA) సంబంధించిన సవరణ ప్రోటోకాల్‌ను అమలులోకి తెచ్చే ప్రకటన. డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

08-ఏప్రి-2026

CBDT, AY 2026-27 కోసం ITR-5 ఫారంను ప్రకటించింది. డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

08-ఏప్రి-2026

CBDT, AY 2026-27 కోసం ITR-౩ ఫారంను ప్రకటించింది. డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

08-ఏప్రి-2026

CBDT, AY 2026-27 కోసం ITR-2 ఫారంను ప్రకటించింది. డౌన్‌లోడ్ చేయడానికి  ఇక్కడ క్లిక్ చేయండి 

08-ఏప్రి-2026

CBDT, AY 2026-27 కోసం ITR-1 మరియు 4 ఫారాలను ప్రకటించింది. డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

08-ఏప్రి-2026

న్యూఢిల్లీలోని ఆదాయపు పన్ను సంచాలక కార్యాలయం (సిస్టమ్స్), ఫారం నం. 121కి సంబంధించి 'యూనిక్ ఐడెంటిఫికేషన్ నెంబర్, (UIN) జారీ మరియు కేటాయింపు ప్రక్రియ, నమూనా మరియు ప్రమాణాలను, అలాగే చెల్లింపుదారు ద్వారా ఆ ఫారం యొక్క 'పార్ట్ బి 'ని త్రైమాసిక ప్రాతిపదికన సమర్పించే విధానాన్ని ప్రకటించింది. డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

01-ఏప్రి-2026

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 119 కింద, 31 డిసెంబర్ 2025తో ముగిసే త్రైమాసికానికి సంబంధించి ఆ చట్టంలోని సెక్షన్ 203 ప్రకారం మూలం వద్ద పన్ను మినహాయింపు (TDS) ధృవీకరణ పత్రాలను జారీ చేయడానికి గడువును పొడిగిస్తూ CBDT ఒక ఉత్తర్వును జారీ చేసింది. డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి 

 

01-ఏప్రి-2026

20 మార్చి 2026 ' వ తేదీ నోటిఫికేషన్ సంఖ్య 22/2026' ప్రకారం, ఆదాయపు పన్ను చట్టం, 2025 క్రింది ఫారాలు దశలవారీగా ఇ -ఫైలింగ్ పోర్టల్‌లో విడుదల చేయబడుతున్నాయి

01-ఏప్రి-2026

చెల్లింపులను సులభతరం చేయడానికి, ఆదాయపు పన్ను చట్టం, 2025 క్రింద,  2026 ఏప్రిల్ 1 నుండి ఆదాయపు పన్ను ఇ -ఫైలింగ్ పోర్టల్‌లో కొత్త చలాన్లు అందుబాటులోకి వచ్చాయి. ఈ చలాన్లను ఈ క్రింది విధంగా ఎంచుకోవడం ద్వారా పొందవచ్చు:
e File → e Pay Tax → Select “Income Tax Act, 2025” → New Payment → Select the applicable tile
మీరు 2026–27 పన్ను సంవత్సరానికి లేదా ఆ తర్వాతి సంవత్సరాలకు సంబంధించిన పన్ను చెల్లింపు చేస్తున్నట్లయితే, 'ఆదాయపు పన్ను చట్టం, 2025' వర్తిస్తుంది.
2026–27 పన్ను సంవత్సరానికి ముందు కాలాలకు, అంటే 2026–27 మదింపు సంవత్సరానికి (AY) లేదా అంతకు ముందు కాలాలకు సంబంధించిన చెల్లింపుల కోసం 'ఆదాయపు పన్ను చట్టం, 1961' వర్తిస్తుంది.
కొత్త చలాన ఫారంలకు  సంబంధించిన వివరణాత్మక మార్గదర్శకత్వం కోసం దయచేసి వినియోగదారు దీపికలను పరిశీలించండి.
ఇ -ఫైలింగ్ పోర్టల్‌లో “ఆదాయపు పన్ను చట్టం  2025” మరియు “ఆదాయపు పన్ను చట్టం 1961” ఈ రెండు చట్టాల కింద పన్ను చెల్లింపు ఎంపికలు అందుబాటులో ఉన్నాయని దయచేసి గమనించండి.

 

01-ఏప్రి-2026

ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 12A యొక్క ఉప-సెక్షన్ (1)లోని క్లాజ్ (ac) యొక్క ఉప-క్లాజ్ (i) కింద ఫారం నెం. 10A దాఖలు చేయడంలో జాప్యాన్ని క్షమించే అధికారం గురించి CBDT ఒక స్పష్టీకరణను జారీ చేసింది. డౌన్‌లోడ్ చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి