ఫారమ్ 10-IEA
ఫారం 10-IEA తరచుగా అడిగే ప్రశ్నలు
1. ఏ అసెస్మెంట్ సంవత్సరం నుండి ఫారం 10-IEA వర్తిస్తుంది?
సమాధానం: 21 జూన్ 2023 నాటి నోటిఫికేషన్ నెం. 43/2023 ద్వారా ప్రకటించబడిన ఫారం 10-IEA, అసెస్మెంట్ సంవత్సరం 2024–25 నుండి, అంటే అసెస్మెంట్ సంవత్సరం 2024–25 మరియు తదుపరి సంవత్సరాలకు వర్తిస్తుంది.
2. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఫారం 10-IEA ను ఎవరు దాఖలు చేయవచ్చు?
వ్యాపారం లేదా వృత్తి ద్వారా ఆదాయం కలిగిన వ్యక్తి, హిందూ అవిభక్త కుటుంబం (HUF), వ్యక్తుల సంఘం (సహకార సంఘం మినహా), వ్యక్తుల సమూహం (BOI) మరియు సెక్షన్ 2(31)(vii) కింద పేర్కొన్న కృత్రిమ న్యాయ వ్యక్తి (AJP) ఈ ఫారంను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో దాఖలు చేయవచ్చు.
3. నేను ఫారం 10-IEA ను ఎందుకు సమర్పించాలి?
"వ్యాపారం లేదా వృత్తి నుండి లాభాలు మరియు ఆదాయం" అనే శీర్షిక కింద మీకు ఆదాయం ఉండి, కొత్త పన్ను విధానం నుండి వైదొలగాలనుకున్నా లేదా తిరిగి అందులో చేరాలనుకున్నా, మీరు ఫారం 10-IEA ను సమర్పించాలి.
4. ఫారం 10-IEA ను ఏయే విధానాల ద్వారా సమర్పించవచ్చు?
ఫారం 10-IEA ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మాత్రమే ఆన్లైన్ ద్వారా సమర్పించవచ్చు.
5. ఫారం 10-IEA ను ఇ-వెరిఫై ఎలా చేయవచ్చు?
పన్ను చెల్లింపుదారుడు ఆధార్ OTP, EVC లేదా DSC ఉపయోగించి ఫారమ్‌ను ఇ-వెరిఫై చేసుకోవచ్చు. మరింత తెలుసుకోవడానికి మీరు 'ఇ-వెరిఫై ఎలా చేయాలి' యూజర్ మాన్యువల్‌ను చూడవచ్చు. (యూజర్ మాన్యువల్ లింక్ ఇక్కడ ఇవ్వబడుతుంది).
6. నా తరఫున ఫారం 10-IEA ను దాఖలు చేయడానికి నేను అధీకృత ప్రతినిధిని నియమించవచ్చా?
అవును, మీ తరపున ఫారం 10-IEA దాఖలు చేయడానికి మీరు ఒక అధీకృత ప్రతినిధిని నియమించుకోవచ్చు. మరింత తెలుసుకోవడానికి మీరు 'ప్రతినిధిగా అధికారం ఇవ్వండి / నమోదు చేసుకోండి వినియోగదారు మాన్యువల్'ని చూడవచ్చు. (యూజర్ మాన్యువల్ లింక్ ఇక్కడ ఇవ్వబడాలి)
7. ఫారం 10-IEA ను దాఖలు చేయడానికి గడువు ఎంత?
సమాధానం: ఫారం 10-IEA ను ఆదాయపు పన్ను చట్టం, 1961 లోని సెక్షన్ 139(1) ప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి నిర్దేశించిన గడువు తేదీలోపు దాఖలు చేయాలి. పన్ను చెల్లింపుదారు గడువు తేదీ తర్వాత ఫారంను దాఖలు చేస్తే, ఆ ఫారం చెల్లనిదిగా పరిగణించబడుతుంది.
8. ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసిన తర్వాత ఫారం 10-IEA ను సమర్పించవచ్చా?
ఫారం 10-IEA ప్రయోజనాన్ని పొందాలంటే, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే ముందు ఫారం 10-IEA ను సమర్పించడం మంచిది. ఎందుకంటే, ఆదాయపు పన్ను రిటర్న్‌లో ఫారం 10-IEA దాఖలు చేసిన అంగీకార సంఖ్య మరియు దాఖలు చేసిన తేదీ వివరాలను తప్పనిసరిగా నమోదు చేయాలి.
9. ఫారం 10-IEA సమర్పించేటప్పుడు, వెరిఫికేషన్ ట్యాబ్ కింద హోదా ముందుగా నింపబడటం లేదు. నేను ఏమి చేయాలి?
"మై ప్రొఫైల్" విభాగంలో "కీలక వ్యక్తి వివరాలు" నవీకరించండి. అనంతరం ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మళ్లీ లాగిన్ అయి, తిరిగి ప్రయత్నించండి.
10. నాకు వ్యాపార ఆదాయం లేదు. ఫారం 10-IEA దాఖలు చేస్తున్నప్పుడు, "అసెస్మెంట్ సంవత్సరంలో 'వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే లాభాలు మరియు ఆదాయం' శీర్షిక కింద మీకు ఆదాయం ఉందా?" అనే ప్రశ్నకు "లేదు" అని ఎంచుకుంటే, తదుపరి ప్రక్రియకు వెళ్లలేకపోతున్నాను. నేను ఏమి చేయాలి?
ఒకవేళ మీకు ఎటువంటి వ్యాపారం లేదా ఆదాయం లేకపోయి, ITR-1 లేదా ITR-2 దాఖలు చేయాల్సి వస్తే, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 115BAC(1A) కింద ఉన్న కొత్త పన్ను విధానం నుండి వైదొలగడానికి లేదా తిరిగి అందులో చేరడానికి 'ఫారం 10-IEA'ను దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అటువంటి సందర్భంలో, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(1) ప్రకారం నిర్ణయించిన గడువు తేదీలోపు లేదా అంతకంటే ముందే సంబంధిత ITR ఫారం (ITR-1 లేదా ITR-2)ను దాఖలు చేసేటప్పుడే ఈ ఎంపికను వినియోగించుకోవచ్చు
11. "ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి వర్తించే గడువు తేదీ" కోసం నేను ఏమి ఎంచుకోవాలి?
ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 139(1) ప్రకారం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి మీకు వర్తించే గడువు తేదీని ఎంచుకోవాలి. ఇందుకోసం తెరపై అందుబాటులో ఉన్న హెల్ప్ డాక్యుమెంట్‌ను పరిశీలించి, ఫారం 10-IEA దాఖలుకు వర్తించే సరైన ఎంపికను ఎంచుకోండి.
12. కొత్త పన్ను విధానం నుండి వైదొలగడానికి ప్రతి సంవత్సరం ఫారం 10-IEA దాఖలు చేయాలా?
మీరు వ్యాపారం లేదా వృత్తి ఆదాయం కలిగిన వ్యక్తి అయి, గత అసెస్మెంట్ సంవత్సరంలో కొత్త పన్ను విధానం నుండి వైదొలిగి, ప్రస్తుత సంవత్సరంలో కూడా పాత పన్ను విధానాన్నే కొనసాగించాలనుకుంటే, ప్రతి సంవత్సరం ఫారం 10-IEA దాఖలు చేయాల్సిన అవసరం లేదు. అయితే, వ్యాపారం లేదా వృత్తి ఆదాయం లేని వ్యక్తులు ప్రతి సంవత్సరం ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలోనే నేరుగా పన్ను విధానాన్ని మార్చుకోవచ్చు.
13. నాకు ఫారం 10-IEA వర్తిస్తుంది. ఇప్పుడు నా ఆదాయపు పన్ను రిటర్న్‌లో పాత పన్ను విధానాన్ని ఉపసంహరించుకుని కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటున్నాను. దాని కోసం అనుసరించాల్సిన విధానం ఏమిటి?
మీరు గత అసెస్మెంట్ సంవత్సరంలో పాత పన్ను విధానాన్ని ఎంచుకుని, ఇప్పుడు కొత్త పన్ను విధానంలోకి మళ్లీ చేరాలనుకుంటే, ప్రస్తుత అసెస్మెంట్ సంవత్సరం కోసం ఫారం 10-IEAలో ఉపసంహరణ ఎంపికను ఉపయోగించి దాఖలు చేయాలి.
14. గత అసెస్మెంట్ సంవత్సరంలో ఫారం 10-IEA ద్వారా మళ్లీ చేరే ఎంపికను ఉపయోగించి నేను పాత పన్ను విధానం నుండి వైదొలిగాను. ఇప్పుడు మళ్లీ ఫారం 10-IEA ద్వారా పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చా?
మీరు ఒకసారి పాత పన్ను విధానంలోకి మళ్లీ చేరిన తర్వాత, ఆ విధానం నుండి వైదొలిగితే, ఇకపై పాత పన్ను విధానాన్ని మళ్లీ ఎంచుకునే అర్హత ఉండదు. అయితే, వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే ఆదాయం లేకపోయిన సందర్భంలో మాత్రమే, మళ్లీ ఆ ఎంపికను వినియోగించుకోవచ్చు.
15. నేను ఫారం 10-IEA ద్వారా కొత్త పన్ను విధానం నుండి వైదొలగాలనుకున్నాను. అయితే, ఆదాయపు పన్ను రిటర్న్ గడువు తేదీ తర్వాత ఫారం 10-IEA దాఖలు చేశాను. అయినప్పటికీ నాకు పాత పన్ను విధానం ప్రయోజనం లభిస్తుందా?
మీరు కొత్త పన్ను విధానం నుండి వైదొలగాలనుకుని, నిర్దేశించిన గడువు తేదీలోపు ఫారం 10-IEA దాఖలు చేయకపోతే, ఆదాయపు పన్ను రిటర్న్‌లో పాత పన్ను విధానం ప్రయోజనాన్ని పొందడానికి అర్హులు కారు.
16. నేను ఫారం 10-IEA దాఖలు చేశాను. అయితే, ఆ ఫారం స్థితి " అనుమతించబడని ఫారం"గా చూపిస్తోంది. నేను ఏమి చేయాలి?
మీరు ఆదాయపు పన్ను రిటర్న్ గడువు తేదీ తర్వాత ఫారం 10-IEA దాఖలు చేసినట్లయితే, ఆ ఫారం స్థితి "అనుమతించబడని ఫారం"గా చూపబడుతుంది. అలాంటి సందర్భంలో, తదుపరి అసెస్మెంట్ సంవత్సరంలో కొత్తగా ఫారం 10-IEA దాఖలు చేయాలి.
17. నేను దాఖలు చేసిన ఫారం 10-IEA స్థితి "చెల్లుబాటు అయ్యే ఫారం" నుండి "చెల్లని ఫారం" గా మారింది. నేను ఏమి చేయాలి?
ఫారం 10-IEA దాఖలు చేసే సమయంలో, ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు మీకు వర్తించే సరైన గడువు తేదీని ఎంచుకోకపోతే, అలాగే ఆదాయపు పన్ను రిటర్న్ గడువు తేదీ తర్వాత ఫారం 10-IEA దాఖలు చేయడం వల్ల ఆ ఫారం ఆదాయపు పన్ను రిటర్న్ ప్రాసెసింగ్ కోసం ఆమోదించబడదు. అలాంటి సందర్భంలో, ఫారం స్థితి "అనుమతించబడని ఫారం"గా మారుతుంది. అప్పుడు, తదుపరి అసెస్మెంట్ సంవత్సరంలో ఫారం 10-IEAను కొత్తగా దాఖలు చేయవచ్చు.
18. ఫారం 10-IEA సమర్పించిన తర్వాత దానిని సవరించవచ్చా లేదా మార్పులు చేయవచ్చా?
లేదు. ఫారం 10-IEAను సవరించడానికి అనుమతి లేదు. అలాగే, ఒకసారి ఫారం 10-IEA దాఖలు చేసిన తర్వాత, అదే సంవత్సరంలో దానిని ఉపసంహరించుకోవడం కూడా సాధ్యం కాదు.
19. ఫారం 10-IEA దాఖలు చేసిన తర్వాత దాని స్థితిని ఎలా తెలుసుకోవాలి?
ఆదాయపు పన్నుఇ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అయి ఫారం 10-IEA దాఖలు స్థితిని తెలుసుకోవచ్చు. ఇందుకోసం ఇ-ఫైల్ ట్యాబ్‌లో ఆదాయపు పన్ను ఫారాలు → దాఖలు చేసిన ఫారాలను వీక్షించండి → ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం ఫారాలు → ఫారం 10-IEA కోసం వెతికి, దాని స్థితి "అనుమతించిన ఫారం " లేదా "అనుమతించబడని ఫారం"గా ఉందో లేదో పరిశీలించండి.
20. భవిష్యత్తులో నా ఆదాయ వనరును వ్యాపారం లేదా వృత్తి ఆదాయంగా మార్చుకుంటే ఏమవుతుంది? నేను మళ్లీ ఫారం 10-IEA దాఖలు చేయాలా?
అవును. తరువాత మీ ఆదాయ వనరు వ్యాపారం లేదా వృత్తి ఆదాయంగా మారి, మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) ప్రకారం వర్తించే గడువు తేదీలోపు ఫారం 10-IEAను తప్పనిసరిగా దాఖలు చేయాలి.
21. నేను ప్రతి సంవత్సరం పాత పన్ను విధానం మరియు కొత్త పన్ను విధానం మధ్య మారవచ్చా?
సమాధానం: వ్యాపారం లేదా వృత్తి ఆదాయం కాకుండా ఇతర ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు, ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139(1) ప్రకారం నిర్దేశించిన గడువు తేదీలోపు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేసే సమయంలో ప్రతి సంవత్సరం పాత పన్ను విధానం లేదా కొత్త పన్ను విధానంను ఎంచుకోవచ్చు. అయితే, వ్యాపారం లేదా వృత్తి ఆదాయం ఉన్న పన్ను చెల్లింపుదారులు సెక్షన్ 139(1) ప్రకారం గడువు తేదీలోపు ఫారం 10-IEA దాఖలు చేసి పాత పన్ను విధానాన్ని ఎంచుకోవచ్చు. అనంతరం, మళ్లీ చేరే ఎంపికతో ఫారం 10-IEAను మరోసారి దాఖలు చేసి కొత్త పన్ను విధానంలోకి ఒక్కసారి మాత్రమే మారవచ్చు.