ఫారమ్ 186

 

1. అవలోకనం

ఫారం 186 అనేది, ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం ఒక ప్రావిడెంట్ ఫండ్‌ను “గుర్తింపు పొందిన ప్రావిడెంట్ ఫండ్”గా గుర్తింపు పొందడానికి యజమానులు లేదా ట్రస్టీలు దాఖలు చేయవలసిన ఒక దరఖాస్తు. ఈ గుర్తింపు, యజమానులు మరియు ఉద్యోగులు ఇద్దరికీ పన్ను మినహాయింపు గల విరాళాలు మరియు పన్ను రహిత వడ్డీ చేరడం వంటి పన్ను ప్రయోజనాలను అందిస్తుంది.

ఈ ఫారాన్ని ఆదాయపు పన్ను నియమాలు, 2026లోని నియమం 196 ప్రకారం నిర్దేశించారు. ఇందులో యజమాని, ప్రావిడెంట్ ఫండ్, దాని ట్రస్టీలు, అలాగే ఫండ్‌కు సంబంధించిన ఆర్థిక మరియు పెట్టుబడి వివరాలను సమగ్రంగా అందించాల్సి ఉంటుంది.

2. ఈ సేవను పొందడానికి అవసరమైన ముందస్తు అర్హతలు

ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో చెల్లుబాటు అయ్యే యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్‌తో నమోదైన వినియోగదారు అయి ఉండాలి. ఈ ఫారం కేవలం ట్రస్ట్ లాగిన్ ద్వారా మాత్రమే దాఖలు చేయడానికి అందుబాటులో ఉండి, ప్రతినిధి పన్ను చెల్లింపుదారు కూడా ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో ఈ ఫారాన్ని దాఖలు చేయవచ్చు.

ఫారం 186ను దాఖలు చేయడానికి ముందు, కింది ముందస్తు అవసరాలు నెరవేరినట్లు నిర్ధారించుకోండి:

A. అర్హతకు సంబంధించిన ముందస్తు అవసరాలు

• దరఖాస్తుదారుప్రావిడెంట్ ఫండ్‌ను నిర్వహిస్తున్నయజమాని లేదా ట్రస్టీ అయి ఉండాలి.
• ప్రావిడెంట్ ఫండ్నిజమైనదై ఉండాలి,ఉద్యోగుల సంక్షేమం కోసం ఏర్పాటు చేయబడి ఉండాలి, అలాగే లిఖితపూర్వక పథకంట్రస్ట్ డీడ్ ఆధారంగా నిర్వహించబడుతూ ఉండాలి.

B. పత్రాలకు సంబంధించిన ముందస్తు అవసరాలు

కింది పత్రాలను ముందుగానే సిద్ధంగా ఉంచుకోవాలి:

• ట్రస్ట్ డీడ్ (అసలు పత్రం + కాపీ) లేదా ధ్రువీకరించబడిన కాపీ.
• ప్రావిడెంట్ ఫండ్ నియమావళి.
• వర్తించే చట్టం ప్రకారం నమోదు ధ్రువపత్రం (వర్తించినట్లయితే).
• ఫండ్ యొక్క తాజా బ్యాలెన్స్ షీట్ కాపీ (ఫండ్ ఇప్పటికే ఉనికిలో ఉంటే).
• ఫండ్ పెట్టుబడి వివరాలు.

C. అదనపు అవసరాలు (వర్తించినట్లయితే)

• ఉద్యోగుల భవిష్యనిధిమరియు ఇతర నిబంధనల చట్టం, 1952 (EPF & MP Act, 1952) పరిధిలో ఫండ్‌కు ఉన్న కవరేజ్‌కు సంబంధించిన వివరాలు 
.• 31-03-2006కు ముందు ప్రావిడెంట్ ఫండ్‌కు గుర్తింపు లభించి ఉంటే, దానికి సంబంధించిన ఆధార పత్రాలు (వర్తించినట్లయితే).

3. ఫారం గురించి

ఫారం 186 అనేది యజమానులు లేదా ట్రస్టీలు ఆదాయపు పన్ను చట్టం, 2026లోని పదకొండవ షెడ్యూల్ పార్ట్–A ప్రకారం ప్రావిడెంట్ ఫండ్‌కు గుర్తింపు పొందేందుకు ఉపయోగించే దరఖాస్తు ఫారం. ఈ ఫారంలో యజమానికి సంబంధించిన పూర్తి వివరాలు, సంస్థ యొక్క EPF నిబంధనల అమలు స్థితి, ప్రావిడెంట్ ఫండ్ వివరాలు, ట్రస్టీల సమాచారం, యజమాని మరియు ఉద్యోగులు చెల్లించిన విరాళాల వివరాలు, అలాగే సంబంధిత ఆర్థిక మరియు నియంత్రణ పరమైన సమాచారాన్ని సమగ్రంగా అందించాలి. సమాచారాన్ని క్రమబద్ధంగా వెల్లడించేలా ఈ ఫారం నాలుగు భాగాలుగా రూపొందించబడింది.

• Part A – యజమాని వివరాలు:యజమాని పేరు, చిరునామా, PAN, వ్యాపారం/వృత్తి వివరాలు, ప్రధాన వ్యాపార స్థలం, అలాగే భారతదేశంలో పనిచేస్తున్న ఉద్యోగులతో సహా మొత్తం ఉద్యోగుల సంఖ్యను ఈ భాగంలో నమోదు చేయాలి.
• Part B – సంస్థ వివరాలు:సంస్థEPF & MP చట్టం, 1952పరిధిలోకి వస్తుందా లేదా, వర్తించే సెక్షన్ 1(3) లేదా 1(4) ఏది,సెక్షన్ 17 కింద మినహాయింపు పొందిందా లేదా, సంబంధిత ఉత్తర్వుల వివరాలు లేదా EPFO దరఖాస్తు స్థితి వంటి సమాచారాన్ని ఈ భాగంలో నమోదు చేయాలి.
• పార్ట్ C – ఫండ్ వివరాలు:ఫండ్ పేరు, PAN, ఫండ్ స్థాపించబడిన తేదీ, ఫండ్‌కు చందాదారులైన ఉద్యోగుల సంఖ్య (భారతదేశంలో మరియు భారతదేశం వెలుపల), ఖాతాలు నిర్వహించే లేదా నిర్వహించబోయే స్థలం, ట్రస్టీల వివరాలు, ట్రస్ట్ రద్దు చేయలేని స్వభావం, యజమాని మరియు ఉద్యోగుల, విరాళాల శాతాలు, ఆదాయపు పన్ను చట్టం, 1961 కింద గతంలో గుర్తింపు పొందిన వివరాలు (ఉన్నట్లయితే), ఫండ్ మొత్తం నిధి, అలాగేనియమం 292 ప్రకారం పెట్టుబడుల నమూనా వంటి వివరాలు ఇందులో ఉంటాయి.• Part D – అదనపు ఆమోదాలు:సంస్థకు ఆమోదం పొందిన సూపర్ యాన్యుయేషన్ ఫండ్ లేదా గ్రాట్యుటీ ఫండ్ ఉందా లేదా, ఉంటే వాటికి సంబంధించిన ఉత్తర్వు సంఖ్యలు, తేదీలు మరియు ఆమోదం మంజూరు చేసిన అధికారుల వివరాలను ఈ భాగంలో నమోదు చేయాలి.

ఫారం చివరలో ధ్రువీకరణ విభాగంఉంటుంది. ఇందులో అధీకృత ట్రస్టీ ఫారంలో అందించిన సమాచారం మొత్తం నిజమైనదని, అలాగే జతచేసిన పత్రాలు అసలైనవని ధ్రువీకరించాలి. అదనంగా, కింది తప్పనిసరి అనుబంధ పత్రాలు వర్తించే సందర్భాల్లో జతచేయాలి: ట్రస్ట్ డీడ్, ఫండ్ నియమాలు, EPF మినహాయింపు రుజువు పత్రం, EPFO దరఖాస్తు స్వీకరణ పత్రం, గతంలో పొందిన ఆమోద లేఖల ఫండ్ బ్యాలెన్స్ షీట్ ఈ పత్రాలన్నీ (అవసరమైన చోట) ఫారం 186తో పాటు సమర్పించాలి.

4.ఎలా యాక్సెస్ చేయాలి మరియు సమర్పించాలి

ఫారం 186ను కింది విధానాల ద్వారా పూరించి సమర్పించవచ్చు:

• ఆన్‌లైన్ విధానం – ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా.

5. దశలవారీ మార్గదర్శిని

దశ 1: మీ యూజర్ ఐడీ మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.

Data responsive

దశ 2: మీ యూజర్ ఐడీ (PAN) మరియు పాస్‌వర్డ్ నమోదు చేయండి.

Data responsiveData responsive

3వ దశ: ఈ-ఫైల్లోకి వెళ్లి,"ఆదాయపు పన్ను ఫారాలు" ఎంపికను ఎంచుకుని, ఆ తర్వాత "ఆదాయపు పన్ను ఫారాలను దాఖలు చేయండి" అనే ఎంపికపై క్లిక్ చేయండి.

Data responsive

4వ దశ: "ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం ఫారాలు" అనే ట్యాబ్‌ను ఎంచుకోండి.

Data responsive

దశ 5: ఫారం 186ను ఎంచుకోండి/శోధించండి

Data responsive

6వ దశ: వర్తించే పన్ను సంవత్సరం (T.Y.) ను ఎంచుకుని, "కొనసాగించండి" బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 7: "ప్రారంభిద్దాం" బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

8వ దశ: "ప్రారంభిద్దాం" బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, వినియోగదారు ఫారం నెం. 186 యొక్క ప్యానెల్ స్క్రీన్‌కు మళ్లించబడతారు.

Data responsive

9వ దశ: ప్రతి ప్యానెల్‌లో ఉన్న తప్పనిసరి వివరాలన్నింటినీ వినియోగదారు నమోదు చేయాలి. అవసరమైన ధ్రువీకరణ నియమాలకు అనుగుణంగా అన్ని వివరాలు నమోదు చేసిన తర్వాత, ఆ ప్యానెల్‌ను సేవ్ చేయవచ్చు. ప్యానెల్ విజయవంతంగా ధ్రువీకరించబడి సేవ్ అయిన తర్వాత, అది "పూర్తయింది" అని గుర్తించబడుతుంది. అలాగే, ప్యానెల్ స్క్రీన్‌లో ఆ ప్యానెల్ పక్కన ఆకుపచ్చ రంగు టిక్ గుర్తు ప్రదర్శించబడుతుంది.

దశ 9.1: ఫారం 186 యొక్క ప్యానెల్ స్క్రీన్‌లో పార్ట్–A మరియు పార్ట్–B ప్యానెల్‌లను ఎంచుకోండి.

Data responsive

దశ 9.1.1: పార్ట్–A మరియు పార్ట్–B కు సంబంధించిన అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి, అనంతరం "సేవ్" బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsiveData responsiveData responsive

దశ 9.1.2: "సేవ్" బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, మొదటి ప్యానెల్ "పార్ట్–A & పార్ట్–B" ప్యానెల్ స్క్రీన్‌లో "పూర్తయింది" అని గుర్తించబడుతుంది. అలాగే, దాని పక్కన ఆకుపచ్చ టిక్ గుర్తు ప్రదర్శించబడుతుంది.

Data responsive

దశ 9.2: ఫారం 186 యొక్క ప్యానెల్ స్క్రీన్‌లో భాగం–C ప్యానెల్‌ను ఎంచుకోండి.

Data responsive

దశ 9.2.1: పార్ట్ -C కు సంబంధించిన అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి, అనంతరం "సేవ్" బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsiveData responsiveData responsive

దశ 9.2.2: "సేవ్" బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, రెండవ ప్యానెల్ "పార్ట్–C" ప్యానెల్ స్క్రీన్‌లో "పూర్తయింది" అని గుర్తించబడుతుంది. అలాగే, దాని పక్కన ఆకుపచ్చ టిక్ గుర్తు ప్రదర్శించబడుతుంది.

Data responsive

దశ 9.3: ఫారం 186 యొక్క ప్యానెల్ స్క్రీన్‌లో పార్ట్ -D ప్యానెల్‌ను ఎంచుకోండి.

Data responsive

దశ 9.3.1: పార్ట్ -D కు సంబంధించిన అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి, అనంతరం "సేవ్" బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 9.3.2: 3వ ప్యానెల్‌లోని సేవ్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, ప్యానెల్ స్క్రీన్‌పై "భాగం–D" పూర్తయినట్లుగా గుర్తించబడుతుంది.

Data responsive

దశ 9.4: ఫారం 186 యొక్క ప్యానెల్ స్క్రీన్‌లో అటాచ్‌మెంట్ ప్యానెల్ను ఎంచుకోండి.

Data responsive

దశ 9.4.1: జత చేయాల్సిన అన్ని అవసరమైన పత్రాలను అప్‌లోడ్ చేసి, అనంతరం "సేవ్" బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 9.4.2: 4వ ప్యానెల్‌లోని సేవ్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, ప్యానెల్ స్క్రీన్‌పై "అనుబంధం" పూర్తయినట్లుగా గుర్తించబడుతుంది.

Data responsive

దశ 9.5: ఫారం 186 యొక్క ప్యానెల్ స్క్రీన్‌లో ధ్రువీకరణ ప్యానెల్ను ఎంచుకోండి.

Data responsive

దశ 9.5.1: ధ్రువీకరణ ప్యానెల్‌లో అవసరమైన అన్ని వివరాలను నమోదు చేసి, అనంతరం "సేవ్" బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 9.5.2: "సేవ్" బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఐదవ ప్యానెల్ "ధ్రువీకరణ" ప్యానెల్ స్క్రీన్‌లో "పూర్తయింది" గా గుర్తించబడుతుంది. అలాగే "ప్రివ్యూ" బటన్ సక్రియమవుతుంది.

Data responsive

10వ దశ: ప్రివ్యూ పేజీలో అన్ని వివరాలను పరిశీలించి, అనంతరం "ఈ-వెరిఫైకి కొనసాగించండి" పై క్లిక్ చేయండి.

Data responsiveData responsiveData responsive

11వ దశ: సమర్పణను నిర్ధారించడానికి "అవును" పై క్లిక్ చేయండి. "అవును" పై క్లిక్ చేసిన తర్వాత, మీరు ఈ-వెరిఫై పేజీకి మళ్లించబడతారు.

Data responsive

12వ దశ: అందుబాటులో ఉన్న ఏదైనా ధ్రువీకరణ విధానాన్ని ఉపయోగించి మీరు ఫారాన్ని ఈ-వెరిఫై చేయవచ్చు.

Data responsive

13వ దశ: రూపొందించిన EVC ను నమోదు చేసి, ఫారాన్ని ఈ-వెరిఫై చేయడానికి బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై ఎలా చేయాలి వినియోగదారుల మాన్యువల్‌ను చూడండి.

ఈ-ధ్రువీకరణ విజయవంతంగా పూర్తయిన తర్వాత, ట్రాన్సాక్షన్ ఐడీ మరియు అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్ తో పాటు విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. భవిష్యత్తు సూచన కోసం ట్రాన్సాక్షన్ ఐడీ మరియు అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ను తప్పకుండా నమోదు చేసుకుని ఉంచుకోండి. అలాగే, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన మీ ఈ-మెయిల్ ఐడీ మరియు మొబైల్ నంబర్‌కు కూడా నిర్ధారణ సందేశం పంపబడుతుంది.

14వ దశ: ఫారాన్ని సమర్పించడానికి "అవును" పై క్లిక్ చేయండి.

Data responsive

15వ దశ: ఫారం విజయవంతంగా సమర్పించబడుతుంది. ఫారం సమర్పించిన తర్వాత, వినియోగదారు "డౌన్‌లోడ్" బటన్‌ను ఉపయోగించి అక్నాలెడ్జ్‌మెంట్ రసీదును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అలాగే, మీరు డాష్‌బోర్డ్ కు తిరిగి వెళ్లి, విభాగంలో దాఖలుచేయబడిన ఫారాన్ని డౌన్‌లోడ్ చేసుకొని సమీక్ష చేయవచ్చు.

Data responsive