ఫారమ్ 51 యూజర్ మాన్యువల్
1.సంక్షిప్త వివరణ
అంతర్జాతీయ లావాదేవీలు జరిగినప్పుడు, బదిలీ ధరల నిర్ణయం అనిశ్చితిని సృష్టించగలదు. ఎందుకంటే భవిష్యత్ వివాదాలను నివారించడానికి బదిలీ ధర తప్పనిసరిగా నియంత్రణలో ఉండాలి. ముందస్తు స్పష్టతను కల్పించడానికి, వ్యాజ్యాలను తగ్గించడానికి, ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులు ఇటువంటి లావాదేవీల కోసం ముందస్తు ధరల ఒప్పందం (APA) కుదుర్చుకోవడానికి అనుమతిస్తుంది.
ఫారం 51 అనేది APAని అభ్యర్థించడానికి ఉపయోగించే దరఖాస్తు. దీనిని ఏకపక్ష, ద్విపక్ష, లేదా బహుపక్ష ఒప్పందం కోసం, నిర్దేశిత రుసుముతో పాటు దాఖలు చేయవచ్చు. ఇదే ఫారం ద్వారా, దరఖాస్తుదారుడు రోల్‌బ్యాక్‌ను అభ్యర్థించవచ్చు. తద్వారా నిబంధనలు అనుమతించిన చోటల్లా, అంగీకరించిన విధానాన్ని వెనుకటి సంవత్సరాలకు వర్తింపజేయవచ్చు.
కొనసాగుతున్న లావాదేవీల విషయంలో లేదా మిగిలిన లావాదేవీలకు సంబంధించి లావాదేవీని చేపట్టే ముందు మొదటి సంబంధిత పన్ను సంవత్సరం ప్రారంభానికి ముందే ఫారం 51 దాఖలు చేయాలి. అవసరమైన APA రకాన్ని బట్టి, దాన్ని సంబంధిత అధికార సంస్థకు సమర్పించాలి.
ఫారం 51 ఆదాయపు పన్ను ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది మరియు దీనిని ఆన్లైన్లో మాత్రమే సమర్పించవచ్చు.
2. 2. ఈ సేవ పొందడానికి అవసరమైనవి
⢠మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో చెల్లుబాటైన యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ ఉన్న రిజిస్టర్డ్ యూజర్ అయి ఉండాలి
⢠పన్ను చెల్లింపుదారుని PAN స్థితి "Active" గా ఉండాలి.
⢠PAN మరియు ఆధార్ అనుసంధానించబడి ఉండాలి (తప్పనిసరి)
⢠మీరు DSC విధానం ద్వారా ఫారాన్ని ధృవీకరించుకోవాలని ఎంచుకుంటే, దానిని ధృవీకరించడానికి మీ వద్ద చెల్లుబాటు అయ్యే DSC ఉండాలి. అది ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదై ఉండి గడువు ముగిసి ఉండకూడదు.
3. ఫారం గురించి
3.1 ఉద్దేశం
ఫారం 51 అనేది సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ టాక్సెస్ (CBDT)తో ముందస్తు ధరల ఒప్పందం (APA) కోరుకునే పన్ను చెల్లింపుదారుల కోసం ఒక దరఖాస్తు ఫారంగా పనిచేస్తుంది. ఇది వ్యాపారాలు తమ అంతర్జాతీయ లావాదేవీల కోసం బదిలీ ధరల పద్ధతులను ముందుగానే ఏర్పాటు చేసుకోవడానికి వీలు కల్పిస్తుంది, తద్వారా వివాదాలను తగ్గించి, పన్ను నిశ్చయతను పెంచుతుంది.
2026 కొత్త ఆదాయపు పన్ను నిబంధనల ప్రకారం, ఫారాలు 3CED, 3CEDA ఫారాలు కొత్త ఫారం 51 లోకి ఏకీకృతం చేయబడ్డాయి. ఇది అదనంగా అంగీకరించిన APA బదిలీ ధరల పద్ధతులను వెనుకటి సంవత్సరాలకు విస్తరించడాన్ని మరింత సులువు చేసి స్థిరత్వాన్ని పెంచుతూ, ప్రస్తుత లేదా సంభావిత పన్ను వివాదాలను తగ్గిస్తుంది.
3.2 దీనిని ఎవరు వాడవచ్చు?
ఆదాయపు పన్ను చట్టం మరియు నియమాల సంబంధిత కేటాయింపుల ప్రకారం ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన వినియోగదారులందరూ ముందస్తు ధరల ఒప్పందం కోసం దరఖాస్తు కోసం అవసరమైన వివరాలను అందించడానికి, అనుమతించిన సందర్భాలలో వెనక్కి తీసుకునే అభ్యర్థనతో కూడా ఫారం 51 ని సమర్పించవచ్చు.
3.3 ఫారం గురించి క్లుప్తంగా
ఫారం 51 నాలుగు భాగాలను కలిగి ఉంది:
1. భాగం A: దరఖాస్తుదారు వివరాలు
2. భాగం B: ఇతర వివరాలు
3. జతచేయాల్సిన పత్రాలు
4. ధృవీకరణ
4.దశలవారీ మార్గదర్శిని
స్టెప్ 1: మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో ఇ -ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
స్టెప్ 2: యూజర్ ఐడి (PAN), పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
స్టెప్ 3: ఇ-ఫైల్ వెళ్ళి >ఆదాయపు పన్ను ఫారాలు > ఆదాయపు పన్ను ఫారాలను దాఖలు చేయండి.
స్టెప్ 4 2025 ఆదాయపు పన్ను చట్టం ప్రకారం ఫారాలను ఎంచుకోండి. ఫారం 51 కోసం వెతికి ఫైల్ నౌ బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: PAN, సమర్పణ విధానం, ఫైలింగ్ రకాన్ని తనిఖీ చేసి కొనసాగించు బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 6: ప్రారంభిద్దాం (లెట్స్ గెట్ స్టార్టెడ్ )పైన క్లిక్ చేయండి.
స్టెప్ 7: మీరు ప్రారంభిద్దాం పై క్లిక్ చేసిన తర్వాత ప్యానెల్ స్క్రీన్‌కి వెళ్తారు. అక్కడ మీరు 1వ ప్యానెల్‌ను ఎంచుకోండి: "పార్ట్ A: దరఖాస్తుదారుడి వివరాలు".
స్టెప్ 8: వివరాలను నిర్ధారించి, సేవ్ పై క్లిక్ చేయండి.
గమనిక: దయచేసి "My Profile" విభాగంలో చిరునామాతో సహా, అవసరమైన వివరాలన్నీ పూర్తి చేయబడ్డాయని నిర్ధారించుకోండి. "My Profile" అనే హైపర్‌లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా రు మీ కాంటాక్ట్ , చిరునామా వివరాలను అప్డేట్ చేయవచ్చు
స్టెప్ 9: మొదటి ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ప్యానెల్ స్థితి పూర్తయింది అని చూపించబడుతుంది ఆ తర్వాత రెండవ ప్యానెల్ అయిన భాగం B: ఇతర వివరాలు ను ఎంచుకోండి.
step 10: రెండవ ప్యానెల్లో అవసరమైన వివరాలను నింపి , సేవ్ పై క్లిక్ చేయండి.
సూచనలు:
ఫీల్డ్ నెం.9 (APA రకం) లో ద్వైపాక్షిక లేదా బహుపాక్షిక APAలను ఎంపిక చేసుకున్న సందర్భంలో మాత్రమే ఫీల్డ్ నెం. 10 వర్తిస్తుంది.
మీరు ఏకపక్ష APA కోసం దరఖాస్తు చేస్తున్నట్లయితే, దయచేసి "ప్రస్తుత దరఖాస్తు ముందుగా సమర్పించబడింది" అనే ఫీల్డ్ కింద "Pr. CCIT (IT)"ని ఎంచుకోండి. బహుపాక్షిక లేదా ద్వైపాక్షిక APA, కరేబియన్ దీవులతో సహా ఉత్తర అమెరికా మరియు ఐరోపా దేశాలతో ఉన్నట్లయితే, దయచేసి "కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (జాయింట్ సెక్రటరీ FT&TR-I)"ని ఎంచుకోండి. లేని పక్షంలో, "ప్రస్తుత దరఖాస్తు వీరికి సమర్పించబడింది" అనే ఫీల్డ్ కింద, "సంబంధిత భారతదేశ అధికారి (జాయింట్ సెక్రటరీ FT&TR-II)" ను ఎంచుకోండి.

సూచనలు:
దయచేసి, పీల్డ్ సంఖ్య 12 లో ఉన్న 'గమనిక'లో పేర్కొన్న సూచనలను చదవగలరు "కవర్ చేయడానికి ప్రతిపాదించిన/ఆమోదించిన అంతర్జాతీయ లావాదేవీల వివరాలు".
మీరు AE రకాన్ని, పీల్డ్ రకాన్ని ఎంచుకున్నప్పుడు మాత్రమే లావాదేవీ గుర్తింపు ID రూపొందించబడుతుంది. ఏదైనా నిర్దిష్ట లావాదేవీకి మీరు 'రోల్‌బ్యాక్' ఎంచుకోనట్లయితే, అందుకు గల కారణాన్ని తెలిపే పత్రాన్ని మీరు జతచేయాల్సి ఉంటుంది.
సూచనలు:
ఫీల్డ్ నెం. 12 క్రింద ఉన్న "రోల్‌బ్యాక్ ఎంచుకోబడిందా?" అనే ఫీల్డ్‌కు 'అవును' అని ఎంపిక చేసిన సందర్భంలో మాత్రమే ఫీల్డ్ నెం. 13 ఎనేబుల్ చేయబడుతుంది.
ఫీల్డ్ నెం. 13 క్రింద ఉన్న నోట్లో పేర్కొన్న సూచనలను దయచేసి చదవండి: "రోల్‌బ్యాక్ ఎంచుకున్నట్లయితే ప్రతి లావాదేవీకి సంబంధించిన గత నాలుగు పన్ను సంవత్సరాల వివరాలు"
11వ ఫీల్డ్‌లో ఎంచుకున్న కాల వ్యవధి ఆధారంగా పన్ను సంవత్సరాలు ప్రదర్శించబడతాయి: "ప్రతిపాదిత/ఆమోదించబడిన APA యొక్క కాల వ్యవధి మరియు APA అభ్యర్థించబడిన/చేయబడిన తేదీ:". ఉదాహరణకు, ఎంచుకున్న కాల వ్యవధి 01 ఏప్రిల్ 2026 నుండి 31 మార్చి 2031 వరకు అయితే, రోల్‌బ్యాక్ పన్ను సంవత్సరాలు TY 2022-23 నుండి TY 2025-26 వరకు ప్రదర్శించబడతాయి.
ఫీల్డ్ నెం. 12లో రోల్‌బ్యాక్ ఎంచుకోబడిన ట్రాన్సాక్షన్ ఐడిలు, ట్రాన్సాక్షన్ ఐడి ఫీల్డ్ కింద ప్రదర్శించబడతాయి.
మీరు ఫీల్డ్ నెం. 13లో 40 కంటే ఎక్కువ రికార్డులను నమోదు చేయాలనుకుంటే, అప్పుడు మీరు ఎక్సెల్ టెంప్లేట్‌ను డౌన్లోడ్ చేసి, వివరాలను నింపి, ఎక్సెల్ ఫైల్‌ను .CSV ఫార్మాట్లోకి మార్చి, దానిని అప్లోడ్ చేయాలి.
సూచనలు
పైన పేర్కొన్న Excel నమూనాను పూరించడానికి, దిగువ సూచించిన సూచనలను పాటించండి:
|
ఫీల్డ్ పేరు |
సూచన |
తప్పనిసరి ఫీల్డ్ (అవును/కాదు) |
అక్షర సంఖ్య |
|
క్రమసంఖ్య |
1 నుండి ప్రారంభమయ్యే క్రమ సంఖ్యలను నమోదు చేయండి. |
అవును |
|
|
పన్ను సంవత్సరం |
రోల్‌బ్యాక్ ఎంచుకోబడుతున్న సంబంధిత పన్ను సంవత్సరాన్ని YYYY-YY ఫార్మాట్లో నమోదు చేయండి. |
అవును |
కింద పేర్కొన్న ఫార్మాట్లో 7 అక్షరాలు |
|
లావాదేవీ ID |
ఫీల్డ్ నెం. 12లో రూపొందించబడిన మరియు రోల్‌బ్యాక్ ఎంచుకోబడిన లావాదేవీ IDని నమోదు చేయండి. |
అవును |
|
|
ఆదాయపు పన్ను రిటర్ను సమర్పించిన తేదీ |
సంబంధిత పన్ను సంవత్సరానికి ఆదాయ రిటర్న్ సమర్పించిన తేదీని నమోదు చేయండి. |
కాదు |
క్రింద పేర్కొన్న ఫార్మాట్ లో తేదీని నమోదు చేయండి |
|
ఫారం నం. 48లో ఆడిట్ నివేదికను సమర్పించిన తేదీ |
సంబంధిత పన్ను సంవత్సరానికి, ఫారం నం. 48లో ఆడిట్ నివేదిక సమర్పించబడిన తేదీని నమోదు చేయండి. |
లేదు |
క్రింద పేర్కొన్న ఫార్మాట్ లో తేదీని నమోదు చేయండి |
|
పెండింగ్‌లో ఉన్న అప్పీళ్ల వివరాలు |
పెండింగ్‌లో ఉన్న అప్పీళ్ల వివరాలను నమోదు చేయండి. |
లేదు |
గరిష్టంగా 2000 అక్షరాలు |
|
అప్పిలేట్ ట్రిబ్యునల్... ఆమోదించిందా |
డ్రాప్‌డౌన్ నుండి అవును లేదా కాదు ఎంచుకోండి |
అవును |
|
సూచనలు:
ఫీల్డ్ నెం. 14 (b): ఫీల్డ్ నెంబరు 12 లో రోల్ బ్యాక్ ను ఎంచుకున్నారా? అనేదానికి 'అవును' అని ఎంచుకున్నప్పుడు మాత్రమే రోల్ బ్యాక్ ఫీజు ప్రారంభించబడుతుంది.
2026 ఆదాయపు పన్ను నియమాలు 106, 111 నిబంధనల ప్రకారం, మీరు దరఖాస్తు రుసుము, చెల్లించిన రోల్ బ్యాక్ రుసుము వివరాలను అందించాలి. అలాగే మీరు అటాచ్మెంట్ ప్యానెల్ కింద ఏ-27 లో చెల్లించిన రుసుము కాపీని జతచేయాలి.
స్టెప్ 11: 2వ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ప్యానెల్ స్థితి 'Completed' (పూర్తయింది) గా ప్రదర్శించబడుతుంది, ఆపై 3వ ప్యానెల్: "Attachments" (అటాచ్మెంట్లు) ను ఎంచుకోండి
స్టెప్ 2: 3వ ప్యానెల్లో అవసరమైన పత్రాలు/వివరాలను జతచేసి సేవ్ పై క్లిక్ చేయండి.




స్టెప్ 13: 3వ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ప్యానెల్ స్థితి 'పూర్తయింది' అని ప్రదర్శించబడుతుంది. అప్పుడు 4వ ప్యానెల్ "ధృవీకరణ" ను ఎంచుకోండి.
స్టెప్ 14:4వ ప్యానెల్లో అవసరమైన వివరాలను నింపి, సేవ్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 15: 4వ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ప్యానెల్ స్థితి 'పూర్తయింది' అని ప్రదర్శించబడుతుంది. అప్పుడు ప్రివ్యూపై క్లిక్ చేయండి.
స్టెప్ 16: ప్రివ్యూ పేజీలో, వివరాలను ధృవీకరించి, 'ప్రొసీడ్ టు ఇ-వెరిఫై' పై క్లిక్ చేయండి.

స్టెప్ 17: 'ప్రొసీడ్ టు ఇ-వెరిఫై' బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీరు ఇ-వెరిఫైకి వెళ్లాలనుకుంటున్నారని తెలియజేస్తూ ఒక పాపప్ నిర్ధారణ కనిపిస్తుంది. అవును పై క్లిక్ చేయండి.
స్టెప్ 18: అవును పై క్లిక్ చేసినప్పుడు, మీరు ఇ-వెరిఫై పేజీకి మళ్ళించబడతారు. అక్కడ మీరు EVC/DSC ఉపయోగించి ఫారం 51ని ధృవీకరించవచ్చు.(అనుగుణంగా)
గమనికః ఇ-వెరిఫై ఎలా చేయాలి అనేది మరింత తెలుసుకోవడానికి వినియోగదారు మాన్యువల్ ని చూడండి.
ఇ-వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత, లావాదేవీ గుర్తింపు ID మరియు గుర్తింపు రసీదు నంబర్‌తో పాటు ఒక విజయ సందేశం కనబడుతుంది. దయచేసి భవిష్యత్ అవసరాల కోసం లావాదేవీ ID మరియు రసీదు నంబర్‌ను రాసి పెట్టుకోండి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్న ఇమెయిల్ ఐడి(లు) మరియు మొబైల్ నంబర్(ల)కు కూడా మీకు నిర్ధారణ సందేశం వస్తుంది.
5. సంబంధిత అంశాలు
- లాగిన్
- డాష్‌బోర్డ్
- ఇ-వెరిఫై ఎలా చేయాలి
- EVCని రూపొందించండి
- ప్రతినిధిగా అంగీకరించండి/నమోదుచేసుకోండి
6. పదకోశం
|
సంక్షిప్తపదం/ సంక్షిప్తరూపం |
వివరణ/పూర్తి రూపం |
|
DSC |
డిజిటల్ సంతకం ధృవీకరణ పత్రం |
|
EVC |
ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ |
|
ARN |
గుర్తింపు రసీదు సంఖ్య |
|
TY |
టాక్స్ సంవత్సరం |