ఫారమ్ 80 యూజర్ మాన్యువల్

 

1. అవలోకనం

టన్నేజ్ పన్ను పథకాన్ని ఎంచుకోవడానికి అర్హత కలిగిన కంపెనీ, సెక్షన్ 231(1) ప్రకారం టన్నేజ్ పన్ను పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి లేదా సెక్షన్ 231(10) ప్రకారం ఆ ఎంపికను పునరుద్ధరించుకోవడానికి ఫారం నెం. 80లో దరఖాస్తు సమర్పించవచ్చు.

2. ఈ సేవను పొందడానికి అవసరమైన ముందస్తు అర్హతలు

• మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదిత వినియోగదారుగా ఉండాలి
• పన్ను చెల్లింపుదారుని PAN స్థితి "యాక్టివ్"గా ఉండాలి
• DSC ద్వారా ఫారాన్ని ధ్రువీకరించడానికి చెల్లుబాటు అయ్యే DSC కలిగి ఉండాలి. అలాగే అది ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదై ఉండి గడువు ముగియకుండా ఉండాలి.

3. ఫారం గురించి.

3.1 ఉద్దేశ్యం

ఫారం 80 దాఖలు చేయడం యొక్క ఉద్దేశ్యం, అర్హత కలిగిన కంపెనీ టన్నేజ్ పన్ను పథకాన్ని ఎంపిక చేసుకోవడానికి లేదా ఆ ఎంపికను పునరుద్ధరించుకోవడానికి దరఖాస్తు సమర్పించడం.

3.2 దీనిని ఎవరు ఉపయోగించవచ్చు?

"టన్నేజ్ ట్యాక్స్ స్కీమ్"ను ఎంపిక చేసుకున్న అర్హత కలిగిన కంపెనీలకు మాత్రమే ఫారం-80 వర్తిస్తుంది.

3.3 ఫారం గురించి క్లుప్తంగా

ఫారం 80లో ఆరు ప్యానెల్స్ ఉన్నాయి:

  1. దరఖాస్తు రకం
  2. భాగం A – దరఖాస్తుదారుని వివరాలు
  3. నౌకలు / అంతర్గత జలమార్గ నౌకల వివరాలు
  4. భాగం B – టన్నేజ్ పన్ను పథకం ఎంపికను పునరుద్ధరించే సందర్భంలో మాత్రమే సమర్పించాల్సిన వివరాల ప్రకటన.
  5. అనుబంధాలు
  6. ప్రకటన
Data responsive

4. దశలవారీ మార్గదర్శిని

దశ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.

Data responsive

దశ 2: యూజర్ ID (PAN) మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

Data responsive

దశ 3: ఈ-ఫైల్ > ఆదాయపు పన్ను ఫారాలు > కు వెళ్లి ఆదాయపు పన్ను ఫారాలను ఫైల్ చేయండి.

Data responsive

దశ 4: మూడు ట్యాబ్‌లలో ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం ఫారాలు అనే ట్యాబ్‌ను ఎంచుకుని, ఫారం 80ను ఎంపిక చేయండి లేదా వెతకండి, అనంతరం ఫైల్ నౌ బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 5:PAN, సమర్పణ విధానం, ఫైలింగ్ రకం వివరాలను పరిశీలించి, వర్తించే పన్ను సంవత్సరం (T.Y) ను ఎంచుకోండి. అనంతరంకొనసాగించండిబటన్‌పై క్లిక్ చేయండి.
 

Data responsive

దశ 6: లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 7: లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేసిన తర్వాత, వినియోగదారు ప్యానెల్ స్క్రీన్‌కు వెళ్తారు. కొనసాగడానికి మొదటి ప్యానెల్ అయిన “దరఖాస్తు రకం” ను ఎంచుకోండి.

గమనిక: ఈ ఫారంలో సమర్పిస్తున్న అప్లికేషన్ రకాన్ని డ్రాప్‌డౌన్ జాబితా నుండి ఎంచుకోండి. సంబంధిత వివరాలను నమోదు చేసి, ధ్రువీకరించి సేవ్ పై క్లిక్ చేయండి.

  1. టన్నేజ్ పన్ను పథకాన్ని మొదటిసారిగా ఎంచుకుంటున్నట్లయితే, దయచేసి “ఎంపికను వినియోగించుకోవడం”ను ఎంచుకోండి.
  2. గతంలో ఎంచుకున్న టన్నేజ్ పన్ను పథకాన్ని పునరుద్ధరించడానికి దరఖాస్తు దాఖలు చేసినట్లయితే, దయచేసి "పునరుద్ధరణ అవకాశం" ను ఎంచుకోండి.
Data responsive

దశ 8: మొదటి ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, కొనసాగడానికి రెండవ ప్యానెల్, పార్ట్ A – దరఖాస్తుదారు వివరాలను ఎంచుకోండి. సంబంధిత వివరాలను నింపి, సరిచూసి, సేవ్ పై క్లిక్ చేయండి.

గమనిక:

  1. దయచేసి "మై ప్రొఫైల్" విభాగంలో చిరునామాతో సహా అన్ని తప్పనిసరి వివరాలు పూర్తిగా నమోదు చేయబడ్డాయని నిర్ధారించుకోండి. మీరు "మై ప్రొఫైల్" హైపర్‌లింక్‌పై క్లిక్ చేసి మీ సంప్రదింపు మరియు చిరునామా వివరాలను నవీకరించవచ్చు.
  2. క్రమ సంఖ్య 3 వద్ద ఉన్న శాఖ కార్యాలయాల చిరునామాలు విభాగంలో, 'వివరాలు జత పరచండి' ఎంచుకుని, అవసరమైన వివరాలను నమోదు చేసి, ముందుకు వెళ్లడానికి 'కొనసాగండి' పై క్లిక్ చేయండి.
Data responsive

క్రమ సంఖ్య 7 మరియు 8 - కంపెనీ డైరెక్టర్(ల) పేరు(లు) మరియు చిరునామా(లు) కింద, 'వివరాలను జోడించండి' ఎంచుకుని, అవసరమైన వివరాలను నమోదు చేసి, ముందుకు వెళ్లడానికి 'జోడించండి' పై క్లిక్ చేయండి.

Data responsive


దశ 9:రెండవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, మూడవ ప్యానెల్: నౌక / అంతర్గత జలమార్గ నౌక వివరాలను ఎంచుకోండి.

ఫీల్డ్ 11 “కంపెనీ యాజమాన్యంలోని లేదా అద్దెకు తీసుకున్న ఓడలు లేదా అంతర్గత జల నౌకల వివరాలు” కింద అవసరమైన ఫీల్డ్‌లను పూరించి, కొనసాగడానికి 'జోడించు'పై క్లిక్ చేయండి.

గమనిక –దయచేసి ఓడ / అంతర్గత జలమార్గ నౌక పేరు, నికర టన్నేజ్, జెండా, ఓడ / అంతర్గత జలమార్గ నౌకల రకం, చార్టర్ ప్రారంభ తేదీ, డైరెక్టర్ జనరల్ (షిప్పింగ్)/ అంతర్గత నౌకల రిజిస్ట్రార్ ఆమోదపు సూచన సంఖ్య మరియు ప్రతి ఉప-శీర్షిక కింద అర్హత ఉందా లేదా అనే వివరాలను అందించండి.
 

Data responsiveData responsive

దశ 10: మూడవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, నాల్గవ ప్యానెల్: భాగం B - టన్నేజ్ పన్ను పథకం ఎంపికను పునరుద్ధరించే సందర్భంలో మాత్రమే సమర్పించాల్సిన వివరాల ప్రకటన ను ఎంచుకోండి. సంబంధిత వివరాలను నమోదు చేసి, ధ్రువీకరించి సేవ్ పై క్లిక్ చేయండి.

ఈ ప్యానెల్‌లో, గతంలో చేసిన ఎంపికల వివరాలను దయచేసి అందించండి.

నోట్ - అప్లికేషన్ ప్యానెల్‌లోని అప్లికేషన్ రకం ఫీల్డ్‌లో "రిన్యూవింగ్ ఆప్షన్" ఎంపిక చేసినట్లయితే మాత్రమే ఈ భాగం పూరించడానికి అందుబాటులో ఉంటుంది.

Data responsive

దశ 11: నాల్గవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ఐదవ ప్యానెల్: అటాచ్‌మెంట్స్‌ను ఎంచుకోండి. ఈ ప్యానెల్‌లో సంబంధిత పత్రాలను జతపరచి, సేవ్ పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 12: ఐదవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, "డిక్లరేషన్" ప్యానెల్‌ను ఎంచుకోండి. డిక్లరేషన్ ప్యానెల్‌ను నిర్ధారించి, సేవ్ పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 13: డిక్లరేషన్ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ప్యానెల్ యొక్క స్థితి 'పూర్తయింది' అని ప్రదర్శించబడుతుంది. ఆ తర్వాత "ప్రీవ్యూ" బటన్ ఎనేబుల్ అవుతుంది.

Data responsive

దశ 14: ప్రీవ్యూ పేజీలో వివరాలను సరిచూసుకుని ప్రొసీడ్ టు ఈ-వెరిఫై పై క్లిక్ చేయండి.

గమనిక: "డౌన్‌లోడ్" బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా, వినియోగదారుడు ప్రివ్యూ PDFను డౌన్‌లోడ్ చేసుకొని, ఈ-ధ్రువీకరణతో ముందుకు వెళ్ళే ముందు వివరాలను సరిచూసుకోవచ్చు.

Data responsive

దశ 15: ప్రొసీడ్ టు ఈ-వెరిఫై బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, ఈ-వెరిఫైకి కొనసాగాలా అని నిర్ధారించే పాప్-అప్ కనిపిస్తుంది. అవును పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 16: అవును పై క్లిక్ చేసిన తర్వాత, మీరు ఇ-వెరిఫై పేజీకి వెళ్తారు. అక్కడ మీరు DSCని ఉపయోగించి మాత్రమే ఫారం 80ని ధ్రువీకరించవచ్చు.

గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై చేయడం ఎలా వినియోగదారు మాన్యువల్‌ను చూడండి 

దశ 17: ఇ-వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తైన తర్వాత, లావాదేవీ ID మరియు రసీదు సంఖ్యతో పాటు విజయ సందేశం కనబడుతుంది. దయచేసి భవిష్యత్ సూచన కోసం లావాదేవీ ID మరియు రసీదు సంఖ్యను నోట్ చేసుకోండి. అలాగే, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన ఇమెయిల్ ID(లు) మరియు మొబైల్ నంబర్(లు)కు కూడా ధ్రువీకరణ సందేశం పంపబడుతుంది.

రసీదును డౌన్‌లోడ్ చేయడానికి డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

ఫారం 80ని విజయవంతంగా సమర్పించిన తర్వాత, వినియోగదారుడు తాను నింపిన ఫారాన్ని ఈ క్రింది విధంగా చూడవచ్చు - మీ డాష్‌బోర్డ్‌లో ఆదాయపు పన్ను చట్టం 2025 క్రింద ఉన్న ఇ-ఫైల్ > ఆదాయపు పన్ను ఫారాలను ఫైల్ చేయండి > నింపిన ఫారాలను వీక్షించండి ట్యాబ్‌పై క్లిక్ చేయండి.

నోట్: మరింత సమాచారం కోసం నింపిన ఫారపు వినియోగదారు కరదీపికను చూడండి.

5. సంబంధిత విషయాలు

6. పదకోశం

సంక్షిప్తరూపం/సంక్షిప్తపదం వివరణ/పూర్తిరూపం
DSC డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్
EVC ఎలక్ట్రానిక్ ధ్రువీకరణ పత్రం
ARN గుర్తింపు రసీదు సంఖ్య
PY గత సంవత్సరం
FY ఆర్థిక సంవత్సరం
TY పన్ను సంవత్సరం