ఫారమ్ 152 యూజర్ మాన్యువల్

 

1. అవలోకనం:

ఆదాయపు పన్ను చట్టం, 2025లోని సెక్షన్ 407(2) / 407(5) ప్రకారం ముందస్తు పన్ను చెల్లించాలని, సెక్షన్ 289 కింద డిమాండ్ ఆర్డర్ అందుకున్న వ్యక్తి ఫారం 152ను దాఖలు చేయాలి. ముందస్తు పన్నును తక్కువగా చెల్లించినందుకు అసెస్సింగ్ ఆఫీసర్ జారీ చేసిన ఫారం 151కు ప్రతిస్పందనగా ఈ సమాచార ఫారం దాఖలు చేయబడుతుంది.

2. ఫారం దాఖలు చేయడానికి అవసరమైన ముందస్తు అర్హతలు

  • వినియోగదారు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఉండాలి.
  • ఫారం దాఖలు చేయడానికి, అసెస్సీ యొక్క PAN మరియు ఆధార్ పరస్పరం అనుసంధానించబడి ఉండాలి.
  • అసెస్సీకి సెక్షన్ 289 కింద ఆర్డర్ జారీ చేయబడి ఉండాలి. అలాగే, ఆ ఆర్డర్ యొక్క DIN అవసరం.
  • DSC ద్వారా ధ్రువీకరణ చేసే సందర్భంలో, అసెస్సీ చెల్లుబాటు అయ్యే మరియు సక్రియంగా ఉన్న DSCను కలిగి ఉండాలి.
  • ఆధార్ OTP ద్వారా సమర్పణ చేసే సందర్భంలో, మొబైల్ నంబర్ ఆధార్‌తో అనుసంధానించబడి ఉండాలి.

3. ఫారం గురించి

ఎ) ఫారం యొక్క ఉద్దేశ్యం:
ఆదాయపు పన్ను చట్టం, 2025లోని సెక్షన్ 407(2) లేదా 407(5) ప్రకారం జారీ చేయబడిన డిమాండ్‌కు సంబంధించి, సెక్షన్ 289 కింద డిమాండ్ నోటీసు అందుకున్నప్పుడు, అసెస్సీ ముందస్తు పన్నుకు సంబంధించిన సమాచారాన్ని అసెస్సింగ్ ఆఫీసర్ (AO)కు తెలియజేయడానికి ఫారం 152 ఒక చట్టబద్ధమైన సమాచార ఫారం. సరళంగా చెప్పాలంటే, శాఖ విధించిన ముందస్తు పన్ను డిమాండ్‌పై అసెస్సీ యొక్క స్థానం లేదా అభ్యంతరాలను AOకు తెలియజేయడానికి ఈ ఫారం ఉపయోగించబడుతుంది.

బి) దీన్ని ఎవరు దాఖలు చేయవచ్చు?
ముందస్తు పన్నుకు సంబంధించి డిమాండ్ నోటీసు అందుకున్న వ్యక్తి, డిమాండ్ నోటీసులో పేర్కొన్న పన్ను మొత్తం సరైనది కాదని తెలియజేయాలనుకుంటే, ఫారం 152ను దాఖలు చేయవచ్చు.

4. ఫారం – ముఖ్యాంశాలు

ఫారం 152లో మొత్తం 3 ప్యానెల్‌లు ఉన్నాయి. అవి:

  • అసెస్సింగ్ ఆఫీసర్, నోటీసు మరియు సమాచారం
  • ఆదాయ అంచనా
  • జోడింపులు

5. స్టెప్-బై-స్టెప్ గైడ్ (దశలవారీ మార్గదర్శిని):

మీరు ఫారం 152ను ఆన్‌లైన్ విధానంలో ఈ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా మాత్రమే నింపి సమర్పించవచ్చు.

దశ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.

Data responsive

దశ 2: యూజర్ ID(PAN) మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

Data responsive

దశ 3: ఈ-ఫైల్ > ఆదాయపు పన్ను ఫారాలు > ఆదాయపు పన్ను ఫారాలను దాఖలు చేయండి కు వెళ్లండి.

Data responsive

దశ 4: ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం ఫారాలు ట్యాబ్‌ను ఎంచుకుని, ఫారం 152ను వెతికి లేదా ఎంపిక చేసి, ఫైల్ నౌ బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 5: వర్తించే పన్ను సంవత్సరం (T.Y.)ను ఎంచుకుని, కంటిన్యూ(కొనసాగించు)బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 6: లెట్స్ గెట్ స్టార్టెడ్(ఇప్పుడే ప్రారంభిద్దాం)పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 7: లెట్స్ గెట్ స్టార్టెడ్ క్లిక్ చేసిన తర్వాత, వినియోగదారు ప్యానెల్ స్క్రీన్‌కు తీసుకెళ్లబడతారు. మొదటి ప్యానెల్ అయిన అసెస్సింగ్ ఆఫీసర్, నోటీసు మరియు సమాచారంను ఎంచుకోండి.

Data responsive

దశ 8: అవసరమైన వివరాలను నమోదు చేసి, సేవ్ పై క్లిక్ చేయండి.

గమనిక: ఈ ప్యానెల్‌లో అసెస్సింగ్ ఆఫీసర్ వివరాలు, ఆర్డర్ నంబర్ (DIN), ఆర్డర్ తేదీతో పాటు, ఫారం 151కు ప్రతిస్పందనగా ఫారం దాఖలు చేయడానికి గల కారణానికి సంబంధించిన వివరాలు ఉంటాయి.

 

Data responsiveData responsive

దశ 9:మొదటి ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, రెండవ ప్యానెల్ అయినఆదాయ అంచనాను ఎంచుకోండి.
 

Data responsive

దశ 10: ఆదాయ అంచనా ప్యానెల్‌లో అవసరమైన వివరాలను నమోదు చేసి, ధ్రువీకరించి, సేవ్ పై క్లిక్ చేయండి.

గమనిక:
a) ఈ ప్యానెల్‌లో అంచనా వేసిన ఆదాయ వనరులకు సంబంధించిన వివరాలు ఉంటాయి.
b) పాయింట్ నెం. 3లోని సీరియల్ నెం. 4లో, వ్యాపారం లేదా వృత్తి ద్వారా వచ్చే లాభాలు మరియు ఆదాయానికి సంబంధించిన వివరాలు ఉంటాయి. ఇందులో సంస్థలోని వాటా కూడా ఉంటుంది.
c) పాయింట్ నెం. 6లో, ఆదాయానికి సంబంధించిన TDS వివరాలు ఉంటాయి.
d) పాయింట్ నెం. 11లో, చెల్లించాల్సిన మిగిలిన పన్ను మొత్తం చూపబడుతుంది.
 

Data responsive

గమనిక: పాయింట్ నెం: 3, sn.04 (a) మరియు sn.4(b) లలో “వివరాలను జోడించండి(యాడ్ డీటెయిల్స్)” పై క్లిక్ చేసినప్పుడు, వినియోగదారుడు వ్యాపారం లేదా వృత్తి నుండి వచ్చే ఆదాయం మరియు సంస్థ నుండి వచ్చే ఆదాయ వాటా కోసం అవసరమైన సమాచారాన్ని నమోదు చేయాలి.
a) ఏదైనా నష్టం సంభవించిన సందర్భంలో వినియోగదారుడు sn.4(a)లో ప్రతికూల విలువలను నమోదు చేయవచ్చు.
b) అయితే 4(b)లో ఎటువంటి ప్రతికూల విలువ అనుమతించబడదు.

Data responsive

పాయింట్ నం. 3లోని క్రమ సంఖ్య 5 'ఇతర వనరుల నుండి వచ్చే ఆదాయం'కు సంబంధించినది; వడ్డీ, డివిడెండ్లు మరియు లాటరీ వంటి ఇతర మార్గాల ద్వారా వినియోగదారునికి ఏదైనా ఆదాయం సమకూరితే, దానిని ఈ క్రమ సంఖ్యలో తప్పనిసరిగా వెల్లడించాల్సి ఉంటుంది.

అలాగే, క్యారీ ఫార్వర్డ్ చేసిన నష్టాలు లేదా మినహాయింపులు ఏవైనా ఉంటే, వాటి వివరాలను సీరియల్ నెం. 5 పక్కన ఉన్న సంబంధిత ఫీల్డ్‌లలో నమోదు చేయాలి.

Data responsive

పాయింట్ నెం:4 (ఎ) (i) &(ii), లో ముందస్తు పన్ను చెల్లించవలసి ఉన్నప్పటికీ, ఎటువంటి పన్ను చెల్లించనవసరం లేని ఆదాయ వివరాలు ఉంటాయి. ఉదాహరణకు, నమోదుకాని సంస్థ నుండి వచ్చే ఆదాయంలో, ఆ సంస్థ పన్ను చెల్లించే వాటా మరియు AOP లేదా BOI నుండి వచ్చే ఆదాయంలో, ఆ సంఘం లేదా సంస్థ పన్ను చెల్లించే వాటా వంటివి.

పాయింట్ 4(ఎ) (iv)లో, వినియోగదారుడు వివరాలను జోడించుపై క్లిక్ చేసి, బహుళ వరుస అంశాలను నమోదు చేయగల ఇతర అంశాలు ఉన్నాయి.
 

Data responsive


పాయింట్ నెం. 6లో, ముందస్తు పన్ను గణన కోసం పరిగణించిన ఆదాయంపై ఇప్పటికే చెల్లించిన మొత్తం TDS వివరాలను నమోదు చేయాలి.

Data responsiveData responsive

దశ 11: రెండవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, మూడవ ప్యానెల్ అయిన జోడింపులు(అటాచ్మెంట్స్)కు వెళ్లండి. 

Data responsive

దశ12: సంబంధిత పత్రాలను జత చేసి, సేవ్పై క్లిక్ చేయండి.

గమనిక:అసెస్సింగ్ ఆఫీసర్ చేసిన ముందస్తు పన్ను గణనలో పొరపాటు ఉందని నిరూపించే సంబంధిత పత్రాలను అసెస్సీ జత చేయాలి. అలాగే, ఈ ప్యానెల్‌లో ముందస్తు పన్నును అంచనా వేసిన వ్యక్తి పేరు, అంటే ఫారాన్ని ధ్రువీకరించే లేదా సమర్పించే వెరిఫైయర్ పేరు కూడా నమోదు చేయబడుతుంది.

Data responsive

                                

Data responsive

దశ 13:మూడవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత,ప్రివ్యూపై క్లిక్ చేయండి.
 

Data responsive

దశ 14: ప్రివ్యూ పేజీలో వివరాలను సమీక్షించి, డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసి ప్రివ్యూ PDFను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అనంతరం ప్రొసీడ్ టు ఈ-వెరిఫైపై క్లిక్ చేయండి.

గమనిక: ప్రివ్యూ పేజీలో వినియోగదారు UI స్క్రీన్‌లో నమోదు చేసిన వివరాలు సరైనవో కాదో ధ్రువీకరించవచ్చు. ఏవైనా వివరాలు తప్పుగా ఉన్నా లేదా నమోదు కాకపోయినా, వాటిని సరిచేయడానికి ఎడిట్ బటన్‌పై క్లిక్ చేయవచ్చు.

Data responsive

  

Data responsive

దశ 15: ప్రివ్యూ స్క్రీన్‌లో ప్రొసీడ్ టు ఈ-వెరిఫైపై క్లిక్ చేసినప్పుడు, అవును మరియు కాదు అనే ఎంపికలతో ఒక నిర్ధారణ పాప్-అప్ కనిపిస్తుంది. ఫారాన్ని కొనసాగించి సమర్పించడానికి వినియోగదారు అవునును ఎంచుకోవాలి.

 

Data responsive

దశ 16: అవునును ఎంచుకున్న తర్వాత, వినియోగదారు ఈ-వెరిఫికేషన్ పేజీకి తీసుకెళ్లబడతారు. అక్కడ ఫారాన్ని ఆధార్ OTP, DSC లేదా ఇతర EVC విధానాల ద్వారా సమర్పించవచ్చు.

గమనిక: మరింత సమాచారం కోసం ఇ-వెరిఫై ఎలా చేయాలి యూజర్ మాన్యువల్‌ను చూడండి.

Data responsive

దశ 17: ఈ-వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తైన తర్వాత, ట్రాన్సాక్షన్ ID మరియు రసీదు ధ్రువీకరణ సంఖ్యతో పాటు విజయవంతమైన సందేశం ప్రదర్శించబడుతుంది. భవిష్యత్ అవసరాల కోసం ట్రాన్సాక్షన్ ఐడి మరియు రసీదు నిర్ధారణ సంఖ్యను భద్రంగా ఉంచుకోండి. అలాగే, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన ఇమెయిల్ ఐడి(లు) మరియు మొబైల్ నంబర్(లు)కు కూడా నిర్ధారణ సందేశం పంపబడుతుంది.

ధ్రువీకరణ రసీదును డౌన్‌లోడ్ చేయడానికి డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

ఫారం 152 విజయవంతంగా సమర్పించిన తర్వాత, వినియోగదారు దాఖలు చేసిన ఫారాన్ని ఈ విధంగా చూడవచ్చు - మీ డ్యాష్‌బోర్డ్‌లో ఈ-ఫైల్ > ఆదాయపు పన్ను ఫారాలు > దాఖలు చేసిన ఫారాలను వీక్షించండి > ఆదాయపు పన్ను చట్టం 2025 కింద ఉన్న దాఖలు చేసిన ఫారాలను వీక్షించండి ట్యాబ్‌కు వెళ్లండి.

గమనిక: మరింత సమాచారం కోసం దాఖలు చేసిన ఫారం వీక్షించండి వినియోగదారు మాన్యువల్‌ను చూడండి.

6. సంబంధిత అంశాలు


7. పదకోశం

సంక్షిప్తనామం/క్లుప్తీకరణ వివరణ / పూర్తి రూపం
DSC డిజిటల్ సంతకం సర్టిఫికేట్
EVC ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ సర్టిఫికేట్
ARN ధ్రువీకరణ రసీదు సంఖ్య
TY పన్ను సంవత్సరం