ఫారమ్ 174

 

1. అవలోకనం

ఫారం 174 ను పెన్షన్ ఫండ్ దాఖలు చేస్తుంది. ఇది భారతదేశంలో ఒక నిర్దిష్ట వ్యక్తి చేసిన పెట్టుబడుల ద్వారా ఋణం, షేర్ క్యాపిటల్ లేదా యూనిట్ల రూపంలో అయినా పొందిన డివిడెండ్, వడ్డీ, ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని సెక్షన్ 92(2)(k) ప్రకారం పేర్కొన్న ఏదైనా మొత్తం మరియు మూలధన లాభాలపై 100% పన్ను మినహాయింపు పొందడానికి ఉపయోగించబడుతుంది.

2. ఈ సేవను పొందడానికి అవసరమైన ముందస్తు అర్హతలు

•పన్ను చెల్లింపుదారుడు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకుని ఉండాలి.
•పన్ను చెల్లింపుదారుడికి ఈ-ఫైలింగ్ 2.0 పోర్టల్‌లో చెల్లుబాటు అయ్యే యూజర్ నేమ్ (PAN) మరియు పాస్‌వర్డ్ ఉండాలి.
•పన్ను చెల్లింపుదారుడి PAN స్థితి, PAN డేటాబేస్ ప్రకారం “ఆక్టివ్” గా ఉండాలి.
•DSC మోడ్ ద్వారా ఫారాన్ని ధ్రువీకరించడానికి పన్ను చెల్లింపుదారుడికి చెల్లుబాటు అయ్యే డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ DSC ఉండాలి. అది ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు అయి ఉండాలి మరియు గడువు ముగియకుండా ఉండాలి.

3. ఫారం గురించి

3.1 ఉద్దేశ్యం

ఈ ఫారంను దాఖలు చేయడం యొక్క ఉద్దేశ్యం ఏమిటంటే, భారతదేశంలో ఒక నిర్దిష్ట వ్యక్తి చేసిన పెట్టుబడుల ద్వారా ఋణం, షేర్ క్యాపిటల్ లేదా యూనిట్ల రూపంలో పొందిన డివిడెండ్, వడ్డీ, ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని సెక్షన్ 92(2)(k) ప్రకారం పేర్కొన్న ఏదైనా మొత్తం మరియు మూలధన లాభాలపై 100% పన్ను మినహాయింపు పొందడం.

3.2 ఎవరు దీనిని ఉపయోగించవచ్చు?

ఫారం 174 ను పెన్షన్ ఫండ్ దాఖలు చేస్తుంది – ఇది ఆదాయపు పన్ను చట్టం, 2025 లోని షెడ్యూల్ V [టేబుల్: క్రమ సంఖ్య 7, గమనిక 5(a)(iii)(D)] ప్రకారం. ఈ ప్రయోజనం కోసం కేంద్ర ప్రభుత్వం నోటిఫికేషన్ ద్వారా పేర్కొన్న పెన్షన్ ఫండ్, ఆ నోటిఫికేషన్‌లో పేర్కొన్న షరతులను పాటిస్తూ, అలాగే నిర్దేశించిన ఇతర అర్హతలను కూడా నెరవేర్చినట్లయితే దీనిని ఉపయోగించవచ్చు.

3.3 ఫారం సంక్షిప్తరూపం

ఫారం 174 లో నాలుగు ప్యానెల్స్ ఉంటాయి:

  1. పార్ట్ A – పెన్షన్ ఫండ్ వివరాలు
  2. పార్ట్ B - సర్టిఫికేషన్
  3. జతచేయాల్సిన పత్రాలు
  4. వెరిఫికేషన్
Data responsive

4. దశలవారీ మార్గదర్శిని

దశ 1: మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ అవ్వండి.

Data responsive

దశ 2: మీ యూజర్ ID(PAN) మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.

Data responsive

దశ 3: ఈ-ఫైల్ > ఆదాయపు పన్ను ఫారాలు > ఆదాయపు పన్ను ఫారాలను ఫైల్ చేయండి.

Data responsive

దశ 4: మూడు ట్యాబ్‌లలో నుండి ఆదాయపు పన్ను చట్టం 2025 ప్రకారం ఫారాల ట్యాబ్‌ను సెలెక్ట్ చేసి ఫారం 174 ను సెలెక్ట్ చేయండి లేదా సెర్చ్ చేసి ఇఫ్పుడే ఫైల్ చేయండి(ఫైల్ నౌ) బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 5: PAN, సమర్ఫణ విధానం, ఫైలింగ్ రకాన్ని తనిఖీ చేసి, వర్తించే పన్ను సంవత్సరాన్ని (T.Y) ఎంచుకుని, కొనసాగించు బటన్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 6:లెట్స్ గెట్ స్టార్టెడ్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 7:"లెట్స్ గెట్ స్టార్టెడ్" పై క్లిక్ చేసిన తర్వాత యూజర్ ప్యానెల్ స్క్రీన్‌కు వెళ్లబడతారు. కొనసాగించడానికి 1వ ప్యానెల్ అయిన పార్ట్ A - పెన్షన్ ఫండ్ వివరాలు ఎంపిక చేయండి. అవసరమైన వివరాలను నమోదు చేసి వెరిఫై చేసి సేవ్‌పై క్లిక్ చేయండి.

గమనిక: "మై ప్రొఫైల్" విభాగంలో చిరునామాతో సహా అన్ని తప్పనిసరి వివరాలు పూర్తిగా నమోదు చేయబడ్డాయని దయచేసి నిర్ధారించండి. “మై ప్రొఫైల్” హైపర్‌లింక్‌పై క్లిక్ చేసి మీరు మీ సంప్రదింపు మరియు చిరునామా వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.

Data responsive

దశ 8: మొదటి ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత రెండవ ప్యానెల్ అయిన పార్ట్ బి – సర్టిఫికేషన్‌ను ఎంపిక చేయండి.

దయచేసి చెక్‌బాక్స్‌పై క్లిక్ చేసి సేవ్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 9: రెండవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత మూడవ ప్యానెల్ అయిన అటాచ్మెంట్‌ను ఎంపిక చేయండి. ఈ ప్యానెల్‌లో సంబంధిత పత్రాలను అటాచ్మెంట్స్‌గా జత చేసి సేవ్‌పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 10: 3వ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, “ధ్రువీకరణ” ప్యానెల్‌ను ఎంచుకోండి. ధ్రువీకరణ ప్యానెల్‌ను నిర్ధారించి, సేవ్ పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 11: ధ్రువీకరణ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ప్యానెల్ యొక్క స్థితి 'పూర్తయింది' అని ప్రదర్శించబడుతుంది, ఆపై ప్రివ్యూ బటన్ ప్రారంభించబడుతుంది.

Data responsive

దశ 12: ప్రివ్యూ పేజీలో వివరాలను ధ్రువీకరించి “ప్రొసీడ్ టు ఈ-వెరిఫై” పై క్లిక్ చేయండి.

గమనిక: “డౌన్‌లోడ్” బటన్‌పై క్లిక్ చేయడం ద్వారా యూజర్ ప్రివ్యూ PDFను డౌన్‌లోడ్ చేసుకుని ఈ-వెరిఫికేషన్‌కు ముందు వివరాలను ధ్రువీకరించవచ్చు.

Data responsive

దశ 13: “ప్రొసీడ్ టు ఇ-వెరిఫై” బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఇ-వెరిఫికేషన్‌కు కొనసాగాలా అని నిర్ధారించే పాప్‌అప్ కనిపిస్తుంది. దయచేసి ‘అవును’ పై క్లిక్ చేయండి.

Data responsive

దశ 14: ‘అవును’ పై క్లిక్ చేసిన తర్వాత మీరు ఇ-వెరిఫై పేజీకి వెళ్లబడతారు, అక్కడ మీరు ఫారం 174 ను DSC లేదా EVC ద్వారా ధ్రువీకరించవచ్చు.

గమనిక: మరింత సమాచారం కోసం ఇ-వెరిఫై ఎలా చేయాలి వినియోగదారుల మాన్యువల్‌ను చూడండి.

దశ 15: ఈ-వెరిఫికేషన్ విజయవంతమైన తర్వాత ట్రాన్సాక్షన్ ఐడి మరియు ఆక్నాలెడ్జ్‌మెంట్ రసీదు నంబర్‌తో పాటు విజయ సందేశం ప్రదర్శించబడుతుంది. భవిష్యత్ సూచన కోసం ట్రాన్సాక్షన్ ఐడి మరియు ఆక్నాలెడ్జ్‌మెంట్ రసీదు నంబర్‌ను గమనించి ఉంచండి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసిన ఈమెయిల్ ID(లు) మరియు మొబైల్ నంబర్(లు)కు కూడా ధ్రువీకరణ సందేశం పంపబడుతుంది.

డౌన్‌లోడ్ బటన్‌పై క్లిక్ చేసి ఆక్నాలెడ్జ్‌మెంట్ రసీదును డౌన్‌లోడ్ చేసుకోండి

Data responsive

ఫారం 189 విజయవంతంగా సమర్పించిన తర్వాత, యూజర్ పూరించిన ఫారాన్నిచూడవచ్చు. దాని కోసం డాష్‌బోర్డ్‌లో ఈ-ఫైల్ > ఆదాయపు పన్ను ఫారాలు ఫైల్ చేయండి > ఫైల్ చేసిన ఫారాలు చూడండి > ఆదాయపు పన్ను చట్టం 2025 కింద ఉన్న ఫైల్ చేసిన ఫారం ట్యాబ్‌ను క్లిక్ చేయండి.

గమనిక: మరింత తెలుసుకోవడానికి పూరించిన ఫారం వినియోగదారుల మాన్యువల్‌ను చూడండి.

5. సంబంధిత అంశాలు

6. పదకోశం

సంక్షిప్తనామం/క్లుప్తీకరణ వివరణ/పూర్తి రూపం
DSC డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్
EVC ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ సర్టిఫికేట్
ARN అక్నాలెడ్జ్‌మెంట్ రసీదు నంబర్
PY గత సంవత్సరం
FY ఆర్థిక సంవత్సరం
TY పన్ను సంవత్సరం