ఫారమ్ 50 యూజర్ మాన్యువల్
1. సమగ్ర అవలోకనం
అంతర్జాతీయ లావాదేవీలు ఉన్నప్పుడు బదిలీ ధరల నిర్ణయం అనిశ్చితిని సృష్టించవచ్చు, ఎందుకంటే భవిష్యత్తులో వివాదాలను నివారించడానికి ఆ ధర తప్పనిసరిగా ఆర్మ్స్ లెంగ్త్ ప్రకారం ఉండాలి. ముందస్తుగానే స్పష్టతను అందించడానికి మరియు వ్యాజ్యాలను తగ్గించడానికి, ఆదాయపు పన్ను శాఖ పన్ను చెల్లింపుదారులు ఇటువంటి లావాదేవీల కొరకు ప్రైసింగ్ అగ్రిమెంట్ కుదుర్చుకోవడానికి అనుమతిస్తుంది.
ఫారం నెం. 50 అనేది అర్హత కలిగిన వ్యక్తి, ఆదాయపు పన్ను ప్రధాన చీఫ్ కమిషనర్‌కు సమర్పించే ఒక ముందస్తు ఫైలింగ్ సంప్రదింపుల దరఖాస్తు. ఈ దరఖాస్తు అందిన తర్వాత, కేటాయించిన బృందం దరఖాస్తుదారుడితో ముందస్తు ఫైలింగ్ సంప్రదింపులను నిర్వహిస్తుంది. ద్విపాక్షిక లేదా బహుపాక్షిక ఒప్పందాలు ఉన్న సందర్భాలలో, భారతదేశ సమర్థ అధికారి లేదా వారి ప్రతినిధి కూడా ఇందులో పాల్గొంటారు.
అర్హత కలిగిన వ్యక్తి
ఒక వ్యక్తి, ఈ క్రింది సందర్భాలలో APA నిబంధనల ప్రకారం ఒప్పందం కుదుర్చుకోవడానికి అర్హులవుతారు, ఒకవేళ అతను-
:వివరాలు: అంతర్జాతీయ లావాదేవీని నిర్వహించి ఉంటే; లేదా; or
(ii)అంతర్జాతీయ లావాదేవీని నిర్వహించాలని ఆలోచిస్తుంటే.
2. ఈ సేవను పొందేందుకు కావలసిన ముందస్తు అవసరాలు
• మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో చెల్లుబాటు అయ్యే వినియోగదారు ఐడి మరియు పాస్‌వర్డ్ కలిగి ఉన్న నమోదిత వినియోగదారు అయి ఉండాలి.
• పన్ను చెల్లింపుదారుని యొక్క PAN స్థితి యాక్టివ్ గా ఉండాలి;.
• PAN మరియు ఆధార్ లింక్ చేయబడి ఉండాలి(సిఫార్సు చేయబడింది) • ఒకవేళ మీరు DSC మోడ్ ద్వారా ఫారంను ధృవీకరించాలని ఎంచుకుంటే, మీ వద్ద చెల్లుబాటు అయ్యే DSC ఉండాలి. అలాగే అది ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదై ఉండాలి మరియు దాని గడువు ముగిసి ఉండకూడదు.
3. ఫారం గురించి
3.1 ఉద్దేశం
అడ్వాన్స్ ప్రైసింగ్ అగ్రిమెంట్ కి సంబంధించి ప్రీ-ఫైలింగ్ సమావేశాన్ని అభ్యర్థించడానికి ఫారం 50 సమర్పించబడుతుంది. బహుళజాతి సంస్థలు తమ నియంత్రిత లావాదేవీలకు తగిన బదిలీ ధరల పారామితులను అంచనా వేయడానికి ఇది ఒక ముఖ్యమైన పత్రంగా ఉపయోగపడుతుంది. ప్రతిపాదిత ఒప్పందం యొక్క విస్తృత రూపకల్పనపై ప్రాథమిక చర్చలను ఈ ఫారం సులభతరం చేస్తుంది మరియు APAని ఖరారు చేయడానికి ముందే కీలకమైన బదిలీ ధరల సమస్యలను గుర్తించడంలో సహాయపడుతుంది. ఈ దరఖాస్తును మూడు ప్రతులలో సమర్పించవలసి ఉంటుంది మరియు దరఖాస్తుదారునికి తెలిసినంతవరకు అందించిన అన్ని వివరాలు ఖచ్చితమైనవి మరియు నిజమైనవి అయి ఉండాలి.
3.2 దీనిని ఎవరు ఉపయోగించవచ్చు?
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోని నమోదిత వినియోగదారులందరూ, ఆదాయపు పన్ను చట్టం మరియు నిబంధనలలోని సంబంధిత నిబంధనల ప్రకారం అనుమతించబడిన విధంగా, దాఖలుకు ముందు సంప్రదింపుల కోసం ఫారం 50 దరఖాస్తులో అవసరమైన వివరాలను సమర్పించవచ్చు.
3.3 ఫారం గురించి క్లుప్తంగా
ఫారం 50 నాలుగు విభాగాలుగా విభజించబడింది:
1. పార్ట్ A - వ్యక్తి యొక్క వివరాలు
2. పార్ట్ B - ఇతర వివరాలు
3. అనుబంధాలు
4. ధ్రువీకరణ
4. దశలవారీ మార్గదర్శిని
దశ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్ తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
దశ 2: యూజర్ ఐడి (PAN) మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
దశ 3 : మీ డ్యాష్‌బోర్డ్‌లో ఈ-ఫైల్ > ఇన్‌కమ్ ట్యాక్స్ ఫారాలు > ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫారాల పై క్లిక్ చేయండి.
స్టెప్ 4: ఇన్‌కమ్ ట్యాక్స్ అక్ట్ 2025 ట్యాబ్ ప్రకారం ఫారాలు ఎంచుకుని, ఫారం 50 కోసం వెతికి, "ఫైల్ నౌ" బటన్‌పై క్లిక్ చేయండి.
స్టెప్ 5: PAN, సమర్పణ విధానం మరియు ఫైలింగ్ రకాన్ని పరిశీలించి,"కంటిన్యూ" బటన్‌పై క్లిక్ చేయండి.
b>స్టెప్ 6: లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి.
b>స్టెప్ 7: లెట్స్ గెట్ స్టార్టెడ్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, వినియోగదారు ప్యానెల్ స్క్రీన్‌కు చేరుకుంటారు. అక్కడ మొదటి ప్యానెల్ అయిన "పార్ట్ A: వ్యక్తి యొక్క వివరాలు" ని ఎంచుకోండి.
Step 8: అవసరమైన వివరాలను నమోదు చేసి, ఆ వివరాలను నిర్ధారించుకున్న Confirm తర్వాత Save పై క్లిక్ చేయండి.
గమనిక: మై ప్రొఫైల్ విభాగంలో చిరునామాతో సహా అన్ని తప్పనిసరి వివరాలు పూర్తి చేయబడ్డాయని దయచేసి నిర్ధారించుకోండి. మీరు మై ప్రొఫైల్ హైపర్‌లింక్‌పై క్లిక్ చేయడం ద్వారా మీ సంప్రదింపు మరియు చిరునామా వివరాలను అప్‌డేట్ చేయవచ్చు.
స్టెప్ 9: మొదటి ప్యానెల్ సేవ్ చేసిన తర్వాత, దాని స్టేటస్ కంప్లీటెడ్ అని చూపిస్తుంది. ఆ తర్వాత రెండవ ప్యానెల్ అయిన పార్ట్ B: ఇతర వివరాలు ని ఎంచుకోండి.
స్టెప్ 10:
2వ ప్యానెల్ "పార్ట్ B: ఇతర వివరాలు" లో వివరాలను నమోదు చేసి, సేవ్‌పై క్లిక్ చేయండి. ఫీల్డ్ నం. 11 కోసం, యూజర్‌కు రెండు ఎంపికలు ఉంటాయి — వివరాలను జోడించండి లేదా CSV అప్‌లోడ్ చేయండి. ఫీల్డ్ నం. 11ను పూర్తి చేయడానికి యూజర్ ఈ రెండు ఎంపికల్లో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
గమనికలు:
- ఫీల్డ్ నంబర్ 9 (APA) లో బైలేటరల్ లేదా మల్టీలేటరల్ APAని ఎంచుకున్న సందర్భంలో మాత్రమే ఫీల్డ్ నంబర్ 10 వర్తిస్తుంది.
- ఒకవేళ మీరు యూనిలేటరల్ APA కోసం దరఖాస్తు చేసుకుంటుంటే, "ప్రెజెంట్ అప్లికేషన్ ఇజ్ ఫర్నిష్డ్ బిఫోర్" ఫీల్డ్ కింద "Pr. CCIT (IT)" ని ఎంచుకోండి. ఒకవేళ మల్టీలేటరల్ లేదా బైలేటరల్ APA అనేది కరేబియన్ దీవులతో సహా ఉత్తర అమెరికా మరియు యూరప్ దేశాలతో అయి ఉంటే, దయచేసి "కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (జాయింట్ సెక్రటరీ FT&TR-I)" ని ఎంచుకోండి. మరే ఇతర దేశంతోనైనా అయితే, "ప్రెజెంట్ అప్లికేషన్ ఇజ్ ఫర్నిష్డ్ బిఫోర్" ఫీల్డ్ కింద "కాంపిటెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా (జాయింట్ సెక్రటరీ FT&TR-II)" ని ఎంచుకోండి.
- ఫీల్డ్ నం. 11 కింద పేర్కొన్న “కవర్ చేయబడవలసిన అంతర్జాతీయ లావాదేవీల వివరాలు” సంబంధిత గమనికలోని సూచనలను దయచేసి చదవండి.
ఒకవేళ వరస సంఖ్య 11 కింద జోడించాల్సిన AE యొక్క వివరాల రికార్డులు 50 కంటే ఎక్కువ ఉంటే, డౌన్‌లోడ్ ఎక్సెల్ టెంప్లేట్ బటన్‌ను ఉపయోగించండి. ఈ ఎక్సెల్ ఫైల్‌ను డౌన్‌లోడ్ చేసిన తర్వాత, అందులో ఇచ్చిన కాలమ్స్ ప్రకారం వివరాలను పూరించాల్సి ఉంటుంది. ఆ ఎక్సెల్ టెంప్లేట్ కాలమ్స్ గురించిన వివరణ క్రింది విధంగా ఉంది:
ఎక్సెల్ టెంప్లేట్‌ను పూరించడానికి క్రింది సూచనలను పాటించండి:
|
ఫీల్డ్ పేరు |
సూచన |
తప్పనిసరి ఫీల్డ్ (అవును/కాదు) |
అక్షర పరిమాణం |
|
వరుస సంఖ్య |
క్రమ సంఖ్య 1 నుండి వరుసగా నమోదుచేయండి. |
అవును |
|
|
AE రకం |
డ్రాప్‌డౌన్ నుండి క్రింది విలువలలో ఒకదాన్ని ఎంచుకోండి |
అవును |
|
|
రకం |
డ్రాప్ డౌన్ విలువలలో నుండి ఎంచుకోండిe |
అవును |
|
|
లావాదేవీ వివరణ |
లావాదేవీ వివరణను నమోదు చేయండి |
అవును |
గరిష్టంగా 4000 అక్షరాలు |
|
పేరు |
AE పేరును నమోదు చేయండి |
అవును |
గరిష్టంగా 277 అక్షరాలు |
|
AE ఉన్న ప్రదేశం (దేశం/ప్రాంతం) |
డ్రాప్‌డౌన్ నుండి సంబంధిత దేశం లేదా ప్రాంతాన్ని ఎంచుకోండి. |
అవును |
|
|
AE యొక్క పన్ను గుర్తింపు సంఖ్య లేదా దానికి సమానమైనది |
TIN సంఖ్య లేదా దానికి సమానమైన గుర్తింపు సంఖ్యను నమోదు చేయండి |
అవును |
గరిష్టంగా 75అక్షరాలు |
|
PAN (ఇఫ్ అవైలబుల్) |
మొదటి 5 అక్షరాలు, 4 అంకెలు, 1 అక్షరం |
కాదు |
|
|
ప్రతిపాదిత బదిలీ ధర పద్ధతి |
డ్రాప్‌డౌన్ నుండి ఎంచుకోండి: |
|
|
|
దయచేసి పేర్కొనండి |
పైన పేర్కొన్న ఫీల్డ్‌లో (f) ఆప్షన్‌ను ఎంచుకున్నట్లయితే, బోర్డు నిర్దేశించిన ఆ నిర్దిష్ట బదిలీ ధర పద్ధతి ఏమిటో ఇక్కడ వివరంగా రాయాల్సి ఉంటుంది |
అవును |
గరిష్టంగా 400 అక్షరాలు |
|
గత 3 పన్ను సంవత్సరాల అంచనా విలువ |
FY 2025-26 |
కాదు |
డెసిమల్ లేకుండా 14 అంకెలు నమోదు చేయండి |
|
|
FY 2024-25 |
కాదు |
డెసిమల్ లేకుండా 14 అంకెలు నమోదు చేయండి. |
|
|
FY 2023-24 |
కాదు |
డెసిమల్ లేకుండా 14 అంకెలు నమోదు చేయండి |
b>Step 11: రెండో ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత రెండో ప్యానెల్‌ను సేవ్ చేయగానే అది పూర్తయింది అని చూపిస్తుంది. ఆ తర్వాత, మూడో ప్యానెల్ అయిన అటాచ్‌మెంట్లను ఎంచుకోండి. ఈ ప్యానెల్‌లో మొత్తం 8 అటాచ్‌మెంట్లు ఉంటాయి. వీటిలో 3 అటాచ్‌మెంట్లు మరియు 1 అదనపు వివరాల ఫీల్డ్ వివరాలు భర్తీ చేయాల్సి ఉంటుంది.
Step 12: మూడవ ప్యానెల్ అయిన “అటాచ్‌మెంట్లు” ను పూర్తి చేసిన తర్వాత “సేవ్” పై క్లిక్ చేయండి

Step 13: మూడవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత అది పూర్తయినట్లు చూపిస్తుంది. అనంతరం నాల్గవ ప్యానెల్ అయిన “వెరిఫికేషన్” ను ఎంచుకోండి.
Step 14: నాలుగో ప్యానెల్‌లో అవసరమైన వివరాలను భర్తీ చేసిన తరువాత సేవ్ బటన్‌పై క్లిక్ చేయండి
Step 15: నాలుగో ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ప్యానెల్ యొక్క స్టేటస్ పూర్తయ్యింది అని చూపబడుతుంది, అప్పుడు ప్రివ్యూ పై క్లిక్ చేయండి.
Step 16: ప్రివ్యూ పేజీలో, వివరాలను సరిచూసుకుని ప్రొసీడ్ టు ఈ-వైరిఫై పై క్లిక్ చేయండి. వినియోగదారు ప్రివ్యూ పిడిఎఫ్ ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

Step 17: ప్రొసీడ్ టు ఇ-వైరిఫై బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీరు ఈ-వైరిఫై చేయడానికి ఇష్టపడుతున్నారా అని అడుగుతూ ఒక పాప్-అప్ కన్ఫర్మేషన్ కనిపిస్తుంది. అక్కడ 'Yes' పై క్లిక్ చేయండి.
Step 18: “అవును” పై క్లిక్ చేసిన తర్వాత, మీరు ఈ-వెరిఫై పేజీకి వెళ్లబడతారు. అక్కడ EVC/DSC (వర్తించినట్లయితే) ద్వారా ఫారం 50 ను వెరిఫై చేయవచ్చు.
గమనిక: మరింత తెలుసుకోవడానికి ఇ-వెరిఫై చేయడం ఎలా అనే వినియోగదారు మాన్యువల్‌ను చూడండి.
విజయవంతంగా ఈ-వెరిఫై పూర్తయిన తర్వాత, ఒక ట్రాన్సాక్షన్ ఐడి మరియు అక్నాలెడ్జ్‌మెంట్ రసీదు నంబర్ లతో కూడిన సక్సెస్ మెసేజ్ చూపబడుతుంది. భవిష్యత్తు సూచన కోసం దయచేసి ట్రాన్సాక్షన్ ఐడి మరియు అక్నాలెడ్జ్‌మెంట్ రసీదు నంబర్‌ను నోట్ చేసి పెట్టుకోండి. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన మీ ఇమెయిల్ ఐడి(లు) మరియు మొబైల్ నంబర్(ల)కు కూడా ధృవీకరణ సందేశం పంపబడుతుంది.
ఫారం 50ని విజయవంతంగా సమర్పించిన తర్వాత, వినియోగదారు పూరించిన ఫారంను ఇక్కడ చూడవచ్చు - మీ డ్యాష్‌బోర్డ్‌లో ఈ-ఫైల్ > ఫైల్ ఇన్‌కమ్ ట్యాక్స్ ఫారమ్స్ > వ్యూ ఫైల్డ్ ఫారమ్స్ పై క్లిక్ చేసి, ఇన్ కమ్ టాక్స్ యాక్ట్ 2025 కింద ఉన్న వ్యూ ఫైల్డ్ ఫారం ట్యాబ్‌ను ఎంచుకోండి.
గమనిక: మరింత తెలుసుకోవడానికి 'వ్యూ ఫైల్డ్ ఫారం' యూజర్ మాన్యువల్‌ని చూడండి.
5. సంబంధిత అంశాలు
- లాగిన్
- డాష్‌బోర్డ్
- ఇ-వెరిఫై ఎలా చేయాలి
- EVCని రూపొందించండి
- ప్రతినిధిగా అధికారం ఇవ్వడం / నమోదు చేసుకోవడం
పదకోశం
| DSC | డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ |
| EVC | ఈ-వెరిఫికేషన్ సర్టిఫికేట్ |
| ARN | అక్నాలెడ్జ్‌మెంట్ రసీదు నంబర్ |
| TY | పన్ను సంవత్సరం |