లాగిన్
(సైన్ ఇన్ అవ్వండి. అనుసంధానమై ఉండండి)
(సైన్ ఇన్ అవ్వండి. అనుసంధానమై ఉండండి)
లాగిన్ పై తరచుగా అడిగే ప్రశ్నలు
1. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడానికి నా రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ అవసరమా?
ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడానికి అనేక మార్గాలు ఉన్నాయి. రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ కలిగి ఉండటం తప్పనిసరి కాదు. అయితే, మీరు మీ పాస్‌వర్డ్‌ను మర్చిపోయిన పక్షంలో రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ ఉపయోగకరంగా ఉంటుంది.
2. నా PAN నంబర్‌ను ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్డ్ చేయాలా?
అవును, PAN ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడి ఉండాలి. అలా చేయకపోతే, మీకు ఈ క్రింది సందేశం కనిపిస్తుంది - PAN ఉనికిలో లేదు, దయచేసి ఈ PAN ను నమోదు చేయండి లేదా వేరొక PAN తో ప్రయత్నించండి. ఒకవేళ PAN కు అనుసంధానించబడిన ఈ-ఫైలింగ్ ఖాతా నిష్క్రియం చేయబడినట్లయితే, హెల్ప్‌డెస్క్‌ను సంప్రదించి దయచేసి దాన్ని మళ్లీ సక్రియం చేసుకోండి.
3. నేను పాస్వర్డ్ తప్పుగా నమోదు చేస్తే నా ఖాతా లాక్ చేయబడుతుందా?
అవును, లాగిన్ కావడానికి 5 విఫల ప్రయత్నాలు చేసిన తర్వాత ఖాతా లాక్ అవుతుంది. “మీ ఖాతాను అన్‌లాక్ చేయండి” సౌకర్యాన్ని ఉపయోగించి ఖాతాను అన్‌లాక్ చేయవచ్చు లేదా 30 నిమిషాల తర్వాత దానంతట అదే అన్‌లాక్ అవుతుంది.
4. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వడానికి నేను నా PANను ఆధార్‌తో అనుసంధానం చేయాలా?
మీ PAN ఆధార్‌తో అనుసంధానం కాకపోయినా, మీరు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ కావచ్చు. కానీ మీకు పరిమిత సదుపాయం మాత్రమే ఉంటుంది. అందువల్ల, PAN ను ఆధార్‌తో అనుసంధానం చేసుకోవడం మంచిది.
5. ఈ-ఫైలింగ్ ఖాతాలోకి లాగిన్ అవ్వడానికి అన్ని బ్యాంకులు నెట్ బ్యాంకింగ్ సౌకర్యాన్ని కల్పిస్తాయా?
చాలావరకు అన్నీ జాతీయ బ్యాంకులు తమ వినియోగదారులకు ఈ సేవను అందిస్తాయి. అయితే, భద్రతా దృష్ట్యా, దీనికి సంబంధించి బ్యాంకు వెబ్‌సైట్‌ను తనిఖీ చేయడం లేదా బ్యాంకును సంప్రదించడం మంచిది. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నెట్ బ్యాంకింగ్ ఆప్షన్‌పై క్లిక్ చేసిన తర్వాత గుర్తింపు పొందిన బ్యాంకుల జాబితా అందుబాటులో ఉంటుంది.
6. OTP కోసం నాకు మొబైల్ కనెక్టివిటీ లేదు. నేను నా ఈ-ఫైలింగ్ ఖాతాలోకి ఎలా లాగిన్ కావచ్చు?
ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ కావడానికి OTP అవసరం లేదు. అయితే, మీరు “ఈ-ఫైలింగ్ వాల్ట్ హయ్యర్ సెక్యూరిటీ” సేవలో ఏదైనా అధిక భద్రతా ఎంపికను ప్రారంభించి ఉంటే, 2nd ఫ్యాక్టర్ ధృవీకరణ కోసం క్రింది పద్ధతుల్లో ఏదైనా ఎంపిక చేసి ఉంటే, ఆ పద్ధతుల ద్వారా లాగిన్ కావచ్చు:
- బ్యాంక్ ఖాతా EVC (మీకు ఇప్పటికే EVC ఉంటే), లేదా
- డీమ్యాట్ ఖాతా EVC (మీకు ఇప్పటికే EVC ఉంటే), లేదా
- DSC లేదా
- ప్రస్తుత ఆధార్ OTP.
7. ఈ-ఫైలింగ్ వాల్ట్ అంటే ఏమిటి? అది నాకు ఎలా ఉపయోగపడుతుంది?
ఈ-ఫైలింగ్ వాల్ట్ ఆప్షన్ లాగిన్ మరియు పాస్వర్డ్ రీసెట్ కోసం బహుళ-కారక ధృవీకరణను అందిస్తుంది. లాగిన్ సమయంలో అదనపు ధృవీకరణ దశ కోసం బ్యాంక్ అకౌంట్ EVC, డీమ్యాట్ అకౌంట్ EVC మరియు DSC వంటి అనేక ఎంపికలలో ఏదైనా ఒకదాన్ని ఎంచుకోవచ్చు.
8. కొత్త పోర్టల్‌లో లాగిన్ సేవకు సంబంధించిన మెరుగుదలలు ఏమిటి?
కొత్త ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో, అవాంతరాలు లేని లాగిన్ అనుభవాన్ని నిర్ధారించడానికి క్యాప్చాను తొలగించారు. ఫిషింగ్ వెబ్సైట్ల నుండి రక్షణ కోసం సురక్షిత యాక్సెస్ సందేశాన్ని జోడించారు. అదనంగా, మీరు ఈ-వాల్ట్ సెక్యూరిటీని ఉబహుళ-కారక ధృవీకరణను సెట్ చేసుకోవచ్చు.
9. నేను ఒక వ్యక్తిగత పన్ను చెల్లింపుదారున్ని. లాగిన్ చేయడానికి నా యూజర్ ఐడి ఏమిటి?
వ్యక్తుల యూజర్ IDగా PAN ఉపయోగించబడుతుంది.
10. CA, ERI, బాహ్య ఏజెన్సీ, ITDREIN వినియోగదారు మరియు TIN 2.0 వినియోగదారు కోసం యూజర్ ID ఏమిటి?
పైన పేర్కొన్న వినియోగదారులు ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకున్నప్పుడు వారికి యూజర్ ID సృష్టించబడుతుంది. సంబంధిత యూజర్ IDలు ఇవి:
- CA - ARCA తర్వాత CA యొక్క 6-అంకెల సభ్యత్వ సంఖ్య.
- ERI - ERIP తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో రూపొందించబడిన 6-అంకెల సంఖ్య.
- బాహ్య ఏజెన్సీ - EXTA తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో రూపొందించబడిన 6-అంకెల సంఖ్య.
- ITDREIN వినియోగదారు - నమోదు సమయంలో రూపొందించబడిన యూజర్ ID.
- TIN2.0 వినియోగదారు - TINP తర్వాత రిజిస్ట్రేషన్ సమయంలో రూపొందించబడిన 6-అంకెల సంఖ్య.
11. నా ఈ-ఫైలింగ్ ఖాతాను ఎవరైనా అనధికార వ్యక్తి యాక్సెస్ చేశారని నేను భావిస్తే నేను ఏమి చేయాలి?
మీ ఈ-ఫైలింగ్ ఖాతా అనధికారంగా యాక్సెస్ చేయబడిందని లేదా హ్యాక్ చేయబడిందని మీరు అనుకుంటే, మీరు సైబర్ నేరానికి గురై ఉండవచ్చు. మొదటి చర్యగా,సంబంధిత పోలీసు లేదా సైబర్ సెల్ అధికారులకు ఈ సంఘటనను వెంటనే తెలియజేయండి. మీరు ఆన్లైన్లో క్రిమినల్ ఫిర్యాదు/FIR నమోదు చేయడానికి భారత ప్రభుత్వపు సైబర్ నేర ఫిర్యాదు వేదికైన https://cybercrime.gov.in/ వెబ్‌సైట్‌ను సందర్శించవచ్చు. దీని ద్వారా బాధితులు / ఫిర్యాదుదారులు ఆన్లైన్లో సైబర్ నేర ఫిర్యాదులను నమోదు చేయవచ్చు. అనుమానిత సైబర్ నేరానికి సంబంధించిన ఏ సమాచారమైనా, తమ చట్టబద్ధ విచారణాధికారాల ప్రకారం సంబంధిత చట్ట అమలు సంస్థలు కోరినప్పుడు ఆదాయపు పన్ను శాఖ వారితో పంచుకుంటుంది.
సాధారణ జాగ్రత్త చర్యగా, దయచేసి మీ లాగిన్ వివరాలు లేదా ఇతర సున్నితమైన సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దు.
12. ఈ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ కావడానికి నాకు నా యూజర్ ID మరియు పాస్వర్డ్ అవసరమా?
అవును, ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ కావడానికి యూజర్ ID మరియు పాస్వర్డ్ అవసరం. అయితే, నెట్ బ్యాంకింగ్ వంటి కొన్ని సందర్భాల్లో యూజర్ ID మరియు పాస్వర్డ్ అవసరం ఉండదు.
13. నా ఈ-ఫైలింగ్‌లో నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు నాకు యాక్సెస్ లేకపోతే, నేను కొత్త పోర్టల్‌లో ఎలా లాగిన్ కావచ్చు?
మీరు యూజర్ ID మరియు పాస్వర్డ్ ఉపయోగించి కొత్త పోర్టల్‌లో లాగిన్ కావచ్చు. అలాగే, మీరు ఆధార్ OTP ద్వారా లాగిన్ అయ్యే ఎంపికను ప్రారంభించి ఉంటే, మీ PAN ఆధార్‌తో అనుసంధానించబడి ఉండాలి మరియు ఆధార్‌తో అనుసంధానించబడిన మొబైల్ నంబర్‌కు మీకు యాక్సెస్ ఉండాలి, తద్వారా ఆధార్ OTP ను పొందించి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో లాగిన్ కావచ్చు.
14. నెట్ బ్యాంకింగ్ లాగిన్ కోసం ఒకటి కంటే ఎక్కువ బ్యాంకు ఖాతాలను ఉపయోగించవచ్చా?
లేదు, నెట్ బ్యాంకింగ్ లాగిన్ కోసం కేవలం ఒక ధృవీకరించబడిన బ్యాంక్ ఖాతాను మాత్రమే ఎనేబుల్ చేయవచ్చు. ధృవీకరించబడిన ఖాతా ఏదీ ఎంపిక చేయబడకపోతే, సిస్టమ్ “యాక్సెస్ నిరాకరించబడింది” సందేశాన్ని ప్రదర్శిస్తుంది.
15. యాక్సెస్ నిరాకరణ సమస్యను పరిష్కరించడానికి నా ప్రొఫైల్‌లో 'నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్' ఎంపికను ఎలా ప్రారంభించాలి?
‘యాక్సెస్ నిరాకరించబడింది’ సమస్యకు సంబంధించి, దయచేసి మీ ప్రొఫైల్ విభాగంలో మీ బ్యాంక్ ఖాతా కోసం నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ ఎంపికను ప్రారంభించండి. ఒకసారి ప్రారంభించిన తర్వాత, మీరు నెట్ బ్యాంకింగ్ విధానం ద్వారా లాగిన్ కావచ్చు.
నెట్ బ్యాంకింగ్ లాగిన్‌ను ఎనేబుల్ చేయడానికి ప్రక్రియ క్రింది విధంగా ఉంటుంది:
- మీ ఖాతాలో లాగిన్ అవ్వండి.
- ప్రొఫైల్‌కు వెళ్లండి.
- నా బ్యాంక్ ఖాతాను జోడించు ను ఎంచుకోండి
- నెట్ బ్యాంకింగ్ ద్వారా లాగిన్ అయ్యే ఎంపికను ఎనేబుల్ చేయండి
16. నెట్ బ్యాంకింగ్ కోసం ఈ-వాల్ట్ అధిక భద్రతా లాగిన్ ఎంపికను ప్రారంభించడానికి కావలసిన ముందస్తు షరతులు ఏమిటి?
నెట్ బ్యాంకింగ్ కోసం ఈ-వాల్ట్ అధిక భద్రతా లాగిన్ ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలంటే, ముందుగా మీరు నెట్ బ్యాంకింగ్ నామినేషన్ ద్వారా లాగిన్ అవ్వండి ఆప్షన్‌ను ఎనేబుల్ చేయాలి. ఈ ఆప్షన్ “నా బ్యాంకు ఖాతా” స్క్రీన్‌లో అందుబాటులో ఉంటుంది.
17. ఈ-వాల్ట్ నెట్ బ్యాంకింగ్ కోసం అధిక భద్రతా లాగిన్ ఎంపిక ఇప్పటికే ప్రారంభించబడి ఉన్న సందర్భంలో, నేను 'నెట్ బ్యాంకింగ్ నామినేషన్ ద్వారా లాగిన్' ఎంపికను నిలిపివేస్తే ఏమి జరుగుతుంది?
మీరు “నెట్ బ్యాంకింగ్ నామినేషన్ ద్వారా లాగిన్ అవ్వండి” ఆప్షన్‌ను డిసేబుల్ చేస్తే, మీ నెట్ బ్యాంకింగ్ లాగిన్‌కు అనుసంధానమైన సెక్యూరిటీ లాగిన్ ఫీచర్ యాక్సెస్ కోల్పోతారు. ఒకసారి దీన్ని డిసేబుల్ చేసిన తర్వాత, ఈ విధానం ద్వారా మీరు ఇకపై పోర్టల్‌లో లాగిన్ కావడం సాధ్యం కాదు. అయితే, మీరు ఇతర ఈ-వాల్ట్ లాగిన్ ఆప్షన్లు ఎనేబుల్ చేసి ఉంటే, అవి మాత్రం యథావిధిగా కొనసాగుతాయి.