ఫారమ్ 41 యూజర్ మాన్యువల్
1. 1.సంక్షిప్త వివరణ
పన్ను ఒప్పందం కింద, భారతదేశంలోనూ మరియు మరొక దేశంలోనూ పన్ను విధించబడే ఆదాయాన్ని కలిగి ఉన్న పన్ను చెల్లింపుదారులకు ద్వంద్వ పన్ను ఉపశమనం లభిస్తుంది. ఇటువంటి క్లెయిమ్‌లను ఆదాయపు పన్ను శాఖ ధృవీకరించడానికి వీలుగా, ప్రవాసీ పన్ను చెల్లింపుదారులు కొంత అదనపు సమాచారాన్ని సమర్పించాల్సి ఉంటుంది.
ఈ వివరాలను అందించడానికి నిర్దేశించిన ఫారం, ఫారం 41. ఆదాయ పన్ను చట్టం లోని సెక్షన్ 159 ప్రకారం ఒక ప్రవాసీ పన్ను చెల్లింపుదారుడు ద్వంద్వ పన్నుల నివారణ ఒప్పందం (DTAA) కింద పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయాలనుకున్నప్పుడు దీనిని దాఖలు చేయాలి. ఫారం 41 దాఖలు చేయడం ద్వారా, రూల్ 75 కింద అవసరమైన సహాయక సమాచారం సక్రమంగా సమర్పించబడిందని నిర్ధారించబడుతుంది, తద్వారా ఉపశమనం కోసం చేసిన క్లెయిమ్‌ను సరైన విధంగా పరిగణించవచ్చు.
ఫారం 41 ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. దీనిని ఆన్లైన్ ద్వారా మాత్రమే సమర్పించవచ్చు.
2.ఈ సేవను పొందడానికి అవసరమైన ముందస్తు షరతులు
- మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో చెల్లుబాటు అయ్యే యూజర్ ఐడి మరియు పాస్వర్డ్ కలిగి ఉన్న నమోదిత వినియోగదారుడు అయి ఉండాలి.
- PAN లేని మరియు PAN కలిగి ఉండాల్సిన అవసరం లేని ప్రవాసీలు ("ప్రవాసీ పన్ను చెల్లింపుదారులు”) ఈ ఫారాన్ని పన్ను చెల్లింపుదారుల కోసం ప్రత్యేకంగా ఉన్న ఇంకొక లాగిన్ ద్వారా దాఖలు చేయాలి.
- దరఖాస్తుదారుని నివాస దేశం లేదా ప్రాంతంలో ఉన్న పన్ను గుర్తింపు సంఖ్య
- సెక్షన్ 159(8)లో సూచించిన ధ్రువీకరణ పత్ర నకలు
- మీరు DSC విధానం ద్వారా ఫారాన్ని ధ్రువీకరించాలనుకుంటే, మీ వద్ద చెల్లుబాటు అయ్యే DSC ఉండాలి. అది ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడి ఉండాలి అలాగే గడువు ముగిసి ఉండకూడదు (PAN లాగిన్ సందర్భంలో).
3. ఫారం గురించి
3.1 ఉద్దేశ్యం
ఆదాయపు పన్ను చట్టం, 2025 ప్రకారం పన్ను ఒప్పందం కింద ఒకే ఆదాయంపై భారతదేశంలో మరియు ఇతర దేశంలో కూడా పన్ను విధించబడినప్పుడు, ప్రవాసీ పన్ను చెల్లింపుదారుడు పన్ను మినహాయింపును క్లెయిమ్ చేయడానికి అనుమతి ఉంటుంది. అలాంటి క్లెయిమ్‌కు మద్దతుగా, చెల్లింపుదారుడు నిర్దిష్ట సమాచారాన్ని. ఇతర పత్రాలను పన్ను అధికారులకు సమర్పించాల్సి ఉంటుంది.
ఈ వివరాలను అందించడానికి ఫారం 41 అనేది నిర్దేశిత ఫారం. సెక్షన్ 159 మరియు రూల్ 75 కింద అవసరమైన వివరాలను సమర్పించడానికి ఇది ఒక ప్రవాసికి వీలు కల్పిస్తుంది. దానివల్ల ద్వంద్వ పన్ను నివారణ ఒప్పందం (DTAA) కింద లభించే ఉపశమనాన్ని వారు పొందగలుగుతారు.
3.2 దీనిని ఎవరు ఉపయోగించవచ్చు?
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన ప్రవాసీ వినియోగదారులందరు, ఆదాయపు పన్ను చట్టం, 2025 సెక్షన్ 159(8) కింద నిర్దేశించిన సమాచారాన్ని అందించేందుకు ఫారం 41లో అవసరమైన వివరాలను సమర్పించవచ్చు.
3.3 ఫారం గురించి క్లుప్తంగా
ఫారం 41 మూడు ప్యానెల్లు ఉన్నాయి:
1. పార్ట్ A: దరఖాస్తుదారుని వివరాలు
2. పార్ట్ B: నివాస సమాచారం
3. ప్రకటన మరియు ధ్రువీకరణ
4. దశలవారీ మార్గదర్శిని
స్టెప్ 1: మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌తో ఇ -ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
స్టెప్ 2: యూజర్ ID ని [PAN ఉన్న ప్రవాసీలు అయితే -PAN మరియు PAN లేని ప్రవాస భారతీయుల విభాగం కింద నమోదు చేసుకున్న వినియోగదారుల విషయంలో-NR ID గా] నమోదు చేసి పాస్వర్డ్ ను నమోదు చేయండి.
స్టెప్ 3: ఇ-ఫైల్ కు వెళ్ళండి > ఆదాయపు పన్ను ఫారాలు > ఆదాయపు పన్ను ఫారాలను దాఖలు చేయండి.
స్టెప్ 4: ఆదాయ పన్ను చట్టం 2025 ప్రకారం ఫారాలను ఎంచుకకుని అందులో ఫారం 41 కోసం వెతకండి. ఆపై ఫైల్ నౌ బటన్‌ను క్లిక్ చేయండి.
స్టెప్ 5: వర్తించే పన్ను సంవత్సరాన్ని (T.Y)ఎంచుకుని, కంటిన్యూ బటన్‌పై క్లిక్ చేయండి
స్టెప్ 6: లెట్స్ గెట్ స్టార్ట్ బటన్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 7: లెట్స్ గెట్ స్టార్టెడ్ బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, వినియోగదారుడు ప్యానెల్ స్క్రీన్‌కి మళ్లించబడతారు; అక్కడ మొదటి ప్యానెల్ అయిన "పార్ట్ A: దరఖాస్తుదారుడి వివరాలు" ను ఎంచుకోండి.
స్టెప్ 8: వివరాలను ధృవీకరించి , సేవ్ పై క్లిక్ చేయండి.
గమనిక: "మై ప్రొఫైల్" విభాగంలోని చిరునామా సహా అన్ని తప్పనిసరి వివరాలు పూర్తిగా నమోదు చేయబడినట్లు నిర్ధారించుకోండి. "మై ప్రొఫైల్" హైపర్‌లింక్‌పై క్లిక్ చేసి, మీ సంప్రదింపు మరియు చిరునామా వివరాలను అప్డేట్ చేయవచ్చు.
స్టెప్ 9: మొదటి ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ఆ ప్యానెల్ స్థితి పూర్తయింది అని కనిపిస్తుంది. అప్పుడు రెండవ ప్యానెల్ అయిన "పార్ట్ B: నివాస వివరాలు" ను ఎంచుకోండి.
స్టెప్ 10: రెండవ ప్యానెల్లో అవసరమైన వివరాలను నింపి , సేవ్ పై క్లిక్ చేయండి.
స్టెప్11: రెండవ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ప్యానెల్ స్థితి పూర్తయింది అని ప్రదర్శించబడుతుంది. అప్పుడు "ప్రకటన మరియు ధ్రువీకరణ" అనే మూడవ ప్యానెల్ ను ఎంచుకోండి.
స్టెప్ 12: మూడవ ప్యానెల్ లో అవసరమైన వివరాలను నింపి , సేవ్ బటన్ పై క్లిక్ చేయండి.
దశ 13: 3వ ప్యానెల్‌ను సేవ్ చేసిన తర్వాత, ప్యానెల్ స్థితి పూర్తయింది అని వస్తుంది. ఆపై ప్రివ్యూపై క్లిక్ చేయండి.
స్టెప్ 14: ప్రివ్యూ పేజీలో వివరాలను సరిచూసుకుని , ప్రొసీడ్ టు ఇ-వెరిఫై పై క్లిక్ చేయండి.
స్టెప్ 15: ప్రొసీడ్ టు ఇ-వెరిఫై బటన్‌పై క్లిక్ చేసిన తర్వాత, మీరు ఇ-వెరిఫై ప్రక్రియతో ముందుకు సాగాలనుకుంటున్నారని తెలిపే ఒక నిర్ధారణ పాప్అప్ కనిపిస్తుంది. అక్కడ ఎస్ పై క్లిక్ చేయండి.
స్టెప్ 16: ఎస్ పై క్లిక్ చేసిన తర్వాత, మీరు ఇ-వెరిఫై పేజీకి మళ్లించబడతారు. అక్కడ మీ లాగిన్ రకం ఆధారంగా మీరు ఫారం 41 ను ధ్రువీకరించవచ్చు:
1.PAN లాగిన్ :EVC లేదా DSC ద్వారా ధ్రువీకరించండి (వర్తించినట్లయితే).
2. NR ID లాగిన్: మీ ఇమెయిల్ మరియు మొబైల్ నంబర్‌కు పంపిన OTPలను ఉపయోగించి ధ్రువీకరించండి.
గమనిక: మరింత సమాచారం తెలుసుకోవడానికి ఇ-వెరిఫై చేయడం ఎలా యూజర్ మాన్యువల్‌ని చూడండి.
ఇ-వెరిఫికేషన్ విజయవంతంగా పూర్తయిన తర్వాత, ఒక లావాదేవీ గుర్తింపు సంఖ్య మరియు రసీదు సంఖ్యతో కూడిన విజయవంతమైన సందేశం కనిపిస్తుంది. భవిష్యత్తు అవసరాల కోసం దయచేసి ఈ లావాదేవీ గుర్తింపు సంఖ్య, రసీదు సంఖ్యలను నోట్ చేసి పెట్టుకోండి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన మీ ఇమెయిల్ మరియు మొబైల్ నంబర్లకు కూడా ధ్రువీకరణ సందేశం పంపబడుతుంది.
5.సంబంధిత అంశాలు
- లాగిన్
- డాష్‌బోర్డ్ మరియు వర్క్‌లిస్ట్ (పన్ను చెల్లింపుదారుడు)
- EVCని రూపొందించండి
- ప్రతినిధిగా అంగీకరించండి/నమోదుచేసుకోండి
6.పదకోశం
| సంక్షిప్తపదం/ సంక్షిప్తరూపం | వివరణ / పూర్తి రూపం |
| DSC | డిజిటల్ సంతక ధ్రువీకరణ పత్రం |
| EVC | ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ సర్టిఫికేట్ |
| ARN | గుర్తింపు రసీదు సంఖ్య |
| FY | ఆర్ధిక సంవత్సరం |