చట్టబద్ధమైన ఫారమ్స్ గురించి తరచుగా అడిగే ప్రశ్నలు
ఫారమ్ 3CB-3CD
ప్రశ్న; ఫారమ్ 3CB-3CD సమర్పించేటప్పుడు, "యూనిక్ డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నంబర్" పేజీ ప్రదర్శించబడుతుంది. పన్ను ఆడిట్ నివేదికను అప్‌లోడ్ చేయడానికి ముందే మేము UDIN తీసుకున్నప్పటికీ, నేను UDIN వివరాలను జత చేయలేకపోతున్నాను. బదులుగా నేను "నాకు UDIN లేదు/ నేను తరువాత అప్‌డేట్ చేస్తాను" అని ఎంపిక చేయాలా?
సమాధానం; ఫారమ్ 15CB కోసం మాత్రమే UDIN బల్క్ అప్‌లోడ్ సదుపాయం అనుమతించబడుతుంది. త్వరలోనే ఈ ఫీచర్ ప్రారంభించబడుతుంది. మీరు ఇప్పటికీ ముందుకు కొనసాగిస్తూ ఈ క్రింద ఉన్నది ఎంపిక చేసి ఫారమ్ దాఖలు చేయవచ్చు "నాకు UDIN లేదు / నేను తరువాత అప్‌డేట్ చేస్తాను". అన్ని ఫారమ్స్ కోసం UDIN ఫీచర్ అందుబాటులోకి వచ్చిన తరువాత, మీరు దానిని పోర్టల్‌లో అప్‌డేట్ చేయవచ్చు.
ఫారమ్ 10 B
ప్రశ్న. నేను ఫారమ్ 10B దాఖలు చేసి, దానిని సబ్మిట్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను. అయితే, సబ్మిట్ చేయగానే, పేజీపై "ARN కోసం అనుమతించబడని ఫార్మాట్" అనే కింది ఎర్రర్ చూపబడుతుంది. నేనేమీ చేయాలి?
సమాధానం: ఫారమ్ 10B దాఖలు చేయడానికి ముందు "నా ప్రొఫైల్" విభాగంలో మీ ప్రొఫైల్ అప్‌డేట్ చేయండి, తప్పనిసరి ఫీల్డ్స్ అన్నీ పూరించబడినవా నిర్ధారించుకోండి. ప్రొఫైల్ వివరాలను అప్‌డేట్ చేసిన తర్వాత మళ్లీ లాగిన్ చేసి మరోసారి ప్రయత్నించవచ్చు.
ఫారమ్ 67
ప్రశ్న; నేను ఫారమ్ 67ను ఎందుకు సమర్పించాల్సి ఉంటుంది?
సమాధానం: మీరు భారతదేశం వెలుపల ఒక దేశంలో లేదా పేర్కొన్న భూభాగంలో చెల్లించిన విదేశీ పన్ను క్రెడిట్ క్లెయిమ్ చేసుకోవాలనుకుంటే ఫారమ్ 67ను సమర్పించాల్సి ఉంటుంది. మునుపటి సంవత్సరాలలో క్రెడిట్ క్లెయిమ్ చేయబడిన విదేశీ పన్ను రీఫండ్ ఫలితంగా ప్రస్తుత సంవత్సరం నష్టాన్ని వెనుకకు తీసుకోవాలనుకుంటే మీరు ఫారం 67 సమర్పించాల్సి ఉంటుంది.
ప్రశ్న; ఫారమ్ 67 సమర్పించగల విధానాలు ఏమిటి?
సమాధానం; ఫారమ్ 67ను ఆన్‌లైన్‌లో ఇ-ఫైలింగ్ పోర్టల్ ద్వారా మాత్రమే సమర్పించవచ్చు. ఇ - ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అయిన తరువాత, ఫారమ్ 67 ను ఎంచుకోండి, ఫారమ్‌ను సిద్ధం చేసి, సమర్పించండి
ప్రశ్న. ఫారమ్ 67 ఎలా ఇ-వెరిఫై చేయబడుతుంది?
సమాధానం: మీరు EVC లేదా DSC ఉపయోగించి ఫారమ్ ఇ-వెరిఫై చేయవచ్చు.మరింత సమాచారం కోసం ఇ-వెరిఫై ఎలా చేయలనే దాని గురించిన యూజర్ మాన్యువల్ మీరు చూడవచ్చు.
ప్రశ్న; నా తరపున ఫారమ్ 67 దాఖలు చేయడానికి నేను అధీకృత ప్రతినిధిని జోడించవచ్చా?
సమాధానం; అవును, మీ తరపున ఫారమ్ 67 దాఖలు చేయడానికి మీరు అధీకృత ప్రతినిధిని జోడించవచ్చు.
ప్రశ్న; ఫారమ్ 67 దాఖలు చేయడానికి కాల పరిమితి ఏమిటి?
సమాధానం; సెక్షన్ 139(1) ప్రకారం రిటర్న్ దాఖలు కోసం గల గడువు తేదీకి ముందే ఫారమ్ 67 దాఖలు చేయాలి
ప్రశ్న; చట్టబద్ధమైన ఫారమ్‌లను దాఖలు చేసేటప్పుడు నేను అనుబంధంలను అప్‌లోడ్ చేయడానికి ప్రయత్నిస్తున్నప్పుడు, పేజీలో కొన్ని ఎర్రర్స్ కనిపిస్తున్నాయి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అనుబంధం అప్‌లోడ్ చేసేటప్పుడు నేను ఏమి గుర్తుంచుకోవాలి?
సమాధానం; - ఫైల్‌లో ఉపయోగించిన పేరు పెట్టే విధానం కారణంగా ఎర్రర్ సంభవించి ఉండవచ్చు. దయచేసి ఫైల్ పేరులో ఏవైనా ప్రత్యేక అక్షరాలను ఉపయోగించవద్దు అలాగే ఫైల్ పేరును చిన్నదిగా ఉంచండి. అంతేకాకుండా, అనుబంధం పరిమాణం 5 MB కంటే తక్కువగా ఉండాలి అలాగే దాని ఫార్మాట్ PDF లేదా Zip ఫార్మాట్‌లో మాత్రమే ఉండాలి.
ఫారమ్ 29B & 29C
ప్రశ్న; నేను ఫారమ్ 29B అప్‌లోడ్ చేయలేకపోతున్నాను. నేను ఫారమ్ 29B ఎలా దాఖలు చేయగలను, సమర్పించగలను?
సమాధానం; ఫారమ్ 29B ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉంది. పన్ను చెల్లింపుదారు ఫారమ్ 29Bని వారి CAకు అప్పగించాలి.
పన్ను చెల్లింపుదారు ఫారమ్ అప్పగించిన తరువాత, CA పనిజాబితాలో ఈ ఫారమ్ అతనికి/ఆమెకు అందుబాటులో ఉంటుంది.
ప్రశ్న; ఫారమ్ సమర్పించేటప్పుడు, పేజీ "చెల్లుబాటు కాని మెటాడేటా" అనే ఎర్రర్ చూపుతున్నది. నేనేమీ చేయాలి?
సమాధానం: అటువంటి లోపం కనిపిస్తుంటే, ఎంచుకున్న పన్ను చెల్లింపుదారు లేదా ఫైలింగ్ రకం (అసలు / సవరించిన) మధ్య అసమతుల్యత ఉంది లేదా AY మీ లాగిన్ క్రెడెన్షియల్స్‌తో సమకాలీకరించబడలేదు. పైన పేర్కొనబడిన పారామితుల మధ్య అసమతుల్యత ఏదీలేదని మీరు నిర్ధారించుకోవాలి.
ప్రశ్న; నేను 2021-22 మదింపు సంవత్సరం కోసం ఫారమ్ 29B దాఖలు చేయలేకపోతున్నాను. పేజీలో "సమర్పణ విఫలమైంది:చెల్లుబాటు కాని ఇన్‌పుట్" అనే క్రింది ఎర్రర్ కనిపిస్తుంది. నేనేమీ చేయాలి?
సమాధానం: “అకౌంటెంట్ నివేదిక” పార్ట్ 3 ఫీల్డ్ ఖాళీగా వదిలినప్పుడు ఈ సమస్య తలెత్తుతుంది. ఒకవేళ ఫీల్డ్ వర్తించని సందర్భంలో, మీరు "అకౌంటెంట్ కోసం నివేదిక" పేరా 3 క్రింద అందించిన టెక్స్ట్ బాక్స్‌లో “NA” ను నమోదు చేసి, మళ్లీ ఫారమ్ సమర్పించడానికి ప్రయత్నించవచ్చు.
ప్రశ్న; నేను 2021-22 మదింపు సంవత్సరం కోసం ఫారమ్ 29B దాఖలు చేయలేకపోతున్నాను. పేజీలో "ARN కోసం చెల్లుబాటు కాని ఫార్మాట్" అనే క్రింది ఎర్రర్ కనిపిస్తుంది. నేనేమీ చేయాలి?
సమాధానం; యూజర్ "ప్రొఫైల్" సరిగ్గా నవీకరించబడని సందర్భంలో ఇది కనిపిస్తుంది. దయచేసి ఫారమ్ మరియు మీ ప్రొఫైల్‌లో నింపిన సమాచారంలో అసమతుల్యత లేదని నిర్ధారించుకోండి. ప్రొఫైల్ నవీకరించిన తర్వాత, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మళ్లీ లాగిన్ చేసి, మరోసారి ప్రయత్నించండి.
ప్రశ్న; ఫారమ్ 29B పార్ట్ C (సెక్షన్ 115JB సబ్-సెక్షన్ (2C) ప్రకారం పెంచాల్సిన లేదా తగ్గించాల్సిన మొత్తం వివరాలు) దాఖలు చేసేటప్పుడు పెంచాల్సిన లేదా తగ్గించాల్సిన బుక్ ప్రాఫిట్ మొత్తాలను నమోదు చేయడానికి నేను ప్రయత్నిస్తున్నాను. అయితే, ఫారమ్ రుణాత్మక విలువను ఆమోదించడం లేదు. నేనేమీ చేయాలి?
సమాధానం; మీరు ఫారమ్ 29B యొక్క పాత ముసాయిదాపై పనిచేస్తుండవచ్చు. దయచేసి ఆ ముసాయిదాను తొలగించి, తాజా ఫారమ్ దాఖలు చేయండి.
ఫారమ్ 56F
ప్రశ్న; sez దాఖలు కోసం సెక్షన్ 10AA ప్రకారం ఫారమ్ 56F దాఖలు చేసేటప్పుడు, పేజీ కొన్ని దోషాలు చూపిస్తుంది. డిసెంబర్ 29న జారీ చేయబడిన నోటిఫికేషన్ ఆధారంగా, 56F తొలగించబడి దాని స్థానంలో 56FF చేర్చబడినది (రీఇన్వెస్ట్‌మెంట్ వివరాల కోసం మాత్రమే). అయితే, సెక్షన్ 10Aతో చదివే సెక్షన్ 10AAలో ఎలాంటి మార్పు లేదు. DI 56F దాఖలు చేయాలా?
సమాధానం: రెండు ఫారమ్స్ పోర్టల్‌లో యూజర్ల అందుబాటులో ఉన్నాయి. మీరు ఆదాయపు పన్ను శాఖ జారీ చేసిన నోటిఫికేషన్ / మార్గదర్శకాల ఆధారంగా అలాగే చట్టం / నియమావళిలో వర్తించే నిబంధన ప్రకారం ఫారమ్ దాఖలు చేయవచ్చు.
ఫారమ్ 10E
ప్రశ్న; నేను ఫారమ్ 10E ఎప్పుడు దాఖలు చేయాలి?
సమాధానం: మీ ఆదాయపు పన్ను రిటర్నులు దాఖలు చేయడానికి ముందు ఫారమ్ 10E దాఖలు చేయాలి.
ప్రశ్న; ఫారమ్ 10E దాఖలు చేయడం తప్పనిసరా?
సమాధానం; అవును, మీరు మీ బకాయి/ముందస్తు ఆదాయంపై పన్ను మినహాయింపు క్లెయిమ్ చేయాలనుకుంటే మీరు ఫారమ్ 10E దాఖలు చేయడం తప్పనిసరి.
ప్రశ్న; నేను నా ITRలో సెక్షన్ 89 ప్రకారం మినహాయింపు క్లెయిమ్ చేసి ఫారం 10E దాఖలు చేయడంలో విఫలమైతే ఏమి జరుగుతుంది?
సమాధానం; మీరు మీ ITRలో సెక్షన్ 89 ప్రకారం మినహాయింపు క్లెయిమ్ చేసి 10E దాఖలు చేయడంలో విఫలమైతే, మీ ITR ప్రాసెస్ చేయబడుతుంది, అయితే సెక్షన్ 89 ప్రకారం క్లెయిమ్ చేయబడిన మినహాయింపు అనుమతించబడదు.
ప్రశ్న; నా ITR లో నేను క్లెయిమ్ చేసిన మినహాయింపును ITD అనుమతించలేదని నాకు ఎలా తెలుస్తుంది?
సమాధానం: మీరు సెక్షన్ 89 ప్రకారం క్లెయిమ్ చేసిన మినహాయింపు ఆమోదించబడని సందర్భంలో, మీ ITR ప్రాసెసింగ్ పూర్తయిన తర్వాత సెక్షన్ 143(1) ప్రకారం ఆదాయపు పన్ను శాఖ మీకు ఈ సమాచారాన్ని తెలియజేస్తుంది.
ప్రశ్న: FY 2019-20కోసం ఫారమ్ 10E దాఖలు చేసేటప్పుడు నేను ఆదాయ వివరాలను జోడించలేకపోయాను. నేనేమీ చేయాలి?
సమాధానం: మీరు 2021-22 మదింపు సంవత్సరం కోసం ఫారమ్ 10E దాఖలు చేస్తున్నారా అని నిర్ధారించుకోండి. 2021-22 మదింపు సంవత్సరం కోసం ఫారమ్ 10E దాఖలు చేయడానికి, ఇ-ఫైల్>ఆదాయపు పన్ను ఫారమ్స్>ఆదాయపు పన్ను ఫారమ్స్ దాఖలు చేయండి ను క్లిక్ చేయండి. "వ్యాపార/వృత్తిపరమైన ఆదాయం లేని వ్యక్తులు" ట్యాబ్ కనుగొనడానికి క్రిందకు స్క్రోల్ చేయండి అలాగే ఇప్పుడు దాఖలు చేయండి పై క్లిక్ చేయండి. మదింపు సంవత్సరాన్ని 2021-22గా ఎంపిక చేసి కొనసాగించు పై క్లిక్ చేయండి.
ప్రశ్న; నేను AY 2021-22కోసం ITR దాఖలు చేస్తున్నాను. ఫారం 10E దాఖలు చేసేటప్పుడు నేను AYగా దేనిని ఎంచుకోవాలి?
సమాధానం, 2021-22మదింపు సంవత్సరానికి మీరు ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేస్తుంటే, మీరు ఫారం 10E సమర్పించేటప్పుడు 2021-22 మదింపు సంవత్సరాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది.
ప్రశ్న: ఫారమ్ 10E దాఖలు చేసేటప్పుడు, మదింపు సంవత్సరంలో వర్తించే పన్నులను నేను చూడలేకపోతున్నాను. నేను ఎలా కొనసాగాలి?
మీరు అన్ని ఆదాయ వివరాలను (పట్టిక A లోని గత సంవత్సరం ఆదాయ వివరాలతో సహా) పూరించారని నిర్ధారించుకోండి. స్లాబ్ రేటు ఆధారంగా పన్నులు స్వయంచాలకంగా ప్రదర్శించబడతాయి. పోర్టల్‌లో అందుబాటులో ఉన్న వివరాల ప్రకారం ఆదాయం మీ గణనతో సరిపోలుతుందో లేదో వెరిఫై చేసి, సంబంధిత పట్టికలో పన్ను మొత్తాన్ని నమోదు చేయండి.
ఫారమ్ 10IE
ప్రశ్న; నేను ఫారం 10IE ఎప్పుడు దాఖలు చేయాలి?
సమాధానం: ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలు చేయడానికి ముందు ఫారమ్ 10IE దాఖలు చేయాలి.
ప్రశ్న; ఫారమ్ 10IE దాఖలు చేయడం తప్పనిసరా?
సమాధానం; అవును, మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవాలనుకుంటే అలాగే "వ్యాపారం, వృత్తి ద్వారా లాభాలు, రాబడులు" హెడ్ కింద ఆదాయాన్ని కలిగి ఉంటే మీరు ఫారమ్ 10IE దాఖలు చేయడం తప్పనిసరి.
ప్రశ్న; ఫారమ్ 10IE నాకు వర్తించినప్పటికీ ITR దాఖలుకు ముందు నేను దానిని దాఖలు చేయడంలో విఫలమైతే ఏమి జరుగుతుంది?
సమాధానం; మీరు ITR దాఖలుకు ముందు ఫారమ్ 10IE దాఖలు చేయని సందర్భంలో, మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోలేరు.
ప్రశ్న; ఫారమ్ 10IE సమర్పించేటప్పుడు, "చెల్లుబాటు కాని ఇన్‌పుట్" లేదా "సమర్పణ విఫలమైంది!"అని కనిపిస్తుంది. నేనేమీ చేయాలి?
సమాధానం; ఫారమ్ 10-IE పూరించే ముందు దయచేసి "నా ప్రొఫైల్" కింద "సంప్రదించు వివరాలు" (లేదా మీరు HUF అయితే "కీలక వ్యక్తి వివరాలు") నవీకరించండి అలాగే తప్పనిసరి అయిన ఫీల్డ్‌లు అన్నీ పూరించబడినవా నిర్ధారించుకోండి.
మీ ప్రొఫైల్ నుండి మీ సంప్రదించు వివరాలను నవీకరించిన తర్వాత, మీరు తిరిగి లాగిన్ అయి మళ్లీ ప్రయత్నించవచ్చు.
ప్రశ్న; ఫారమ్ 10IE దాఖలు చేసేటప్పుడు, AO వివరాలు లేదా పుట్టిన తేదీ / విలీనం ముందుగా పూరించబడుతుంది. నేనేమీ చేయాలి?
సమాధానం:దయచేసి "డిలీట్ డ్రాఫ్ట్" పై క్లిక్ చేయడం ద్వారా ఫారమ్ యొక్క పాత ముసాయిదాను తొలగించి మళ్లీ ఫారమ్ 10-IE సమర్పించడానికి ప్రయత్నించండి.
ప్రశ్న; ఫారమ్ 10IE సమర్పించేటప్పుడు, HUF కర్త హోదా వెరిఫికేషన్ ట్యాబ్ కింద ముందుగా పూరించబడటం లేదు. నేనేమీ చేయాలి?
సమాధానం; మీరు "నా ప్రొఫైల్" సెక్షన్ కింద "కీలక వ్యక్తి వివరాలు"ను నవీకరించాలని అభ్యర్థిస్తున్నాము. ఇ-ఫైలింగ్ పోర్టల్‌కి మళ్లీ లాగిన్ చేసి, మళ్లీ ప్రయత్నించండి.
ప్రశ్న. నాకు ఎలాంటి వ్యాపార ఆదాయం లేదు. ఫారమ్ 10IE దాఖలు చేసేటప్పుడు, "ప్రాథమిక సమాచారం" ట్యాబ్ కింద నేను "లేదు" ఎంచుకోలేకపోతున్నాను. నేనేమీ చేయాలి?
సమాధానం: మీకు వ్యాపార ఆదాయం లేకుండా మీరు ITR 1/ ITR 2ను దాఖలు చేయవలసి ఉంటే, ఆదాయపు పన్ను చట్టం, 1961లోని సెక్షన్ 115BAC ప్రకారం మీరు కొత్త పన్ను విధానాన్ని ఎంచుకోవడానికి ఫారం 10-IE దాఖలు చేయవలసిన అవసరం లేదు. మీకు వ్యాపార ఆదాయం ఉన్న సందర్భంలో సెక్షన్ 115BAC ప్రకారం మీరు ప్రయోజనాన్ని పొందే ఎంపికను మీరు సంబంధిత ITR ఫారమ్ (ITR 1/ ITR 2) దాఖలు చేసేటప్పుడు క్లెయిమ్ చేసుకోవచ్చు.
ఫారమ్ 10BA
ప్రశ్న; ఫారమ్ 10BA సమర్పించేటప్పుడు, పేజీ ఈ ఎర్రర్ చూపుతున్నది: "ఎర్రర్: దయచేసి చెల్లుబాటు అయ్యే విలువలను నమోదు చేయండి". నేనేమీ చేయాలి?
సమాధానం: ఫారమ్ సమర్పించే సమయంలో మీరు అటువంటి సమస్యను ఎదుర్కొంటే, ప్రొఫైల్ నవీకరణ కోసం పేర్కొనబడిన దశలు పూర్తి చేశారా నిర్ధారించుకోండి. అంతేకాకుండా, "డిలీట్ డ్రాఫ్ట్"పై క్లిక్ చేయడం ద్వారా ఫారమ్ పాత ముసాయిదాను తొలగించండి. ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో తిరిగి లాగిన్ చేసి మళ్లీ ప్రయత్నించండి.
ఫారమ్ 35
ప్రశ్న; ఫారమ్ 35ను సమర్పించేటప్పుడు, ఫిర్యాదు ఫీజు చలాన్ వివరాలను నమోదు చేసే సమయంలో పేజీలో "చెల్లించే ఫిర్యాదు ఫీజు రూపాయలు 250, 500లేదా 1000ఎలాగైనా ఉండాలి" లోపం చూపిస్తుంది. నేనేమీ చేయాలి?
సమాధానం: 4 వ ప్యానెల్ అంటే, "ఫిర్యాదు వివరాలు" ఓపెన్ చేయండి
- దయచేసి “నిశ్చయించబడిన ఆదాయం మొత్తం” వంటి తప్పనిసరి ఫీల్డ్‌లు నవీకరించబడ్డాయని నిర్ధారించుకోండి.
- TDS ఫిర్యాదు విషయంలో, దీనిని "వర్తించదు"గా ఎంచుకోవచ్చు.
ఈ ఫీల్డ్‌లు నవీకరించబడిన తర్వాత, 7వ ప్యానెల్ అనగా "ఫిర్యాదు దాఖలు వివరాలు" కు వెళ్లి చలానా వివరాలను తొలగించి తిరిగి నమోదు చేయడానికి ప్రయత్నించండి.
ఫారమ్ 10- IC
ప్రశ్న; ఫారమ్ 10IC దాఖలు చేసేటప్పుడు, నేను "సెక్షన్ 115BA యొక్క సబ్-సెక్షన్ (4) ప్రకారం ఫారమ్ 10-IB లో ఆప్షన్ ఉపయోగించబడినదా?" కోసం అవును అని ఎంచుకున్నాను. అప్పుడు కూడా, ముందుగా నింపిన "పోయిన సంవత్సరం", "ఫారం 10-IB దాఖలు తేదీ" ఫీల్డ్‌లు మిస్ అవుతున్నాయి. నేనేమీ చేయాలి?
సమాధానం: ఇప్పటికే “ఆదాయపు పన్ను ఫారమ్స్ దాఖలు చేయండి”లో సేవ్ చేయబడిన ఫారమ్ 10-IC "డ్రాఫ్ట్"ను మీరు తొలగించి ఫారమ్ తాజాగా దాఖలు చేయడం ప్రారంభించాలి.
ప్రశ్న; ఫారమ్ 10IC దాఖలు చేసేటప్పుడు, "సెక్షన్ 115BA యొక్క సబ్-సెక్షన్ (4) ప్రకారం ఎంపిక ఫారమ్ 10-IB లో ఉపయోగించబడినదా? కోసం", నేను "అవును" ఎంచుకున్నాను, "ఇందుమూలంగా నేను సెక్షన్115 BA యొక్క సబ్-సెక్షన్ (4) ప్రకారం అమలు చేయబడిన ఎంపికను దీని ద్వారా విత్‌డ్రా చేసుకుంటాను...."కోసం చెక్ బాక్స్ సేవ్ చేయబడడం లేదు. నేనేమీ చేయాలి?
సమాధానం: ఇప్పటికే “ఆదాయపు పన్ను ఫారమ్స్ దాఖలు చేయండి”లో సేవ్ చేయబడిన ఫారమ్ 10-IC "డ్రాఫ్ట్"ను మీరు తొలగించి ఫారమ్ తాజాగా దాఖలు చేయడం ప్రారంభించాలి.
ఫారమ్ 10-IB & 10-ID
ప్రశ్న; ఫారమ్ 10-IB దాఖలు చేసేటప్పుడు, "నా ప్రొఫైల్" నుండి కంపెనీ ప్రాథమిక వివరాలు దానికదే నింపబడడంలేదు. నేనేమీ చేయాలి?
సమాధానం: ఇప్పటికే “ఆదాయపు పన్ను ఫారమ్స్ దాఖలు చేయండి”లో సేవ్ చేయబడిన ఫారమ్ 10-IB "డ్రాఫ్ట్"ను మీరు తొలగించి ఫారమ్ తాజాగా దాఖలు చేయడం ప్రారంభించాలి.
ప్రశ్న; ఫారమ్ 10-ID దాఖలు చేసేటప్పుడు, “మదింపు అధికారి” వివరాలు “నా ప్రొఫైల్” నుండి దానికదే నింపబడడం లేదు. నేనేమీ చేయాలి?
సమాధానం: ఇప్పటికే “ఆదాయపు పన్ను ఫారమ్స్ దాఖలు చేయండి”లో సేవ్ చేయబడిన ఫారమ్ 10-ID "డ్రాఫ్ట్"ను మీరు తొలగించి ఫారమ్ తాజాగా దాఖలు చేయడం ప్రారంభించాలి.
ఫారమ్ 10DA
ప్రశ్న; 'సమర్పణ విఫలమైంది' అనే కింది ఎర్రర్ కనిపించుట కారణంగా నేను ఫారం 10DA సమర్పించలేకపోతున్నాను. నేను ఎలా కొనసాగాలి?
సమాధానం: మీరు ఇప్పటికే “ఆదాయపు పన్ను ఫారమ్స్ దాఖలు చేయండి”లో సేవ్ చేయబడిన పాత ఫారమ్ ఉపసంహరించుకుని/తొలగించి తాజాగా ఫారమ్ దాఖలు చేయడం ప్రారంభించాలి. చిరునామా ఫీల్డ్‌లు సహా అన్ని ఫీల్డ్‌లు వెరిఫికేషన్ ప్యానెల్‌లో పూర్తిగా నవీకరించబడినాయని నిర్ధారించుకోండి అలాగే ఫారమ్ సమర్పించుటను ప్రయత్నించండి.
ఫారమ్ 10 IF
ప్రశ్న; నా PAN కర్ణాటక క్రెడిట్ కో-ఆపరేటివ్ సొసైటీల చట్టం, 1959కింద రిజిస్టర్ చేయబడిన క్రెడిట్ కో-ఆపరేటివ్ బ్యాంకుగా రిజిస్టర్ చేయబడింది. సెక్షన్ 115BAD ప్రకారం, నేను తక్కువ పన్ను రేటును ఎంచుకోవాలనుకుంటున్నాను. సెక్షన్ 115BAD ప్రకారం అన్ని షరతులు సంతృప్తి చెందినప్పటికీ, నేను ఇప్పటికీ ఫారమ్ 10- IF దాఖలు చేయలేకపోతున్నాను. నేను ఏమి చేయాలి?
సమాధానం:సెక్షన్ 115BAD ప్రకారం సహకార సంఘాలకు మాత్రమే సెక్షన్ ప్రయోజనం పొందేందుకు అనుమతి ఉంది. మీరు ఒక AOPగా కాకుండా ఒక చట్టబద్ధమైన కృత్రిమ వ్యక్తిగా రిజిస్టర్ చేసుకుని ఉండవచ్చు. అందువల్ల, ఫారమ్ 10IF దాఖలు కోసం అందుబాటులో లేదు. అటువంటి సందర్భంలో, మీరు NSDL ద్వారా వివరాలను నవీకరించుకోవాలని అభ్యర్శిస్తున్నాము.
సాధారణ ప్రశ్నలు
ప్రశ్న:బ్యాంకు ఖాతా వాలిడేషన్ ఎందుకు అవసరం? నా బ్యాంకు ఖాతా ఎందుకు ప్రీ-వాలిడేట్ చేయబడడం లేదు?
సమాధానం:
- ప్రీ-వాలిడేటెడ్ బ్యాంక్ ఖాతాను మాత్రమే ఆదాయపు పన్ను రీఫండ్ అందుకునేందుకు నామినేట్ చేయవచ్చు.ఇంకా, ఇ-వెరిఫికేషన్ ప్రయోజనం కోసం EVC (ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్)ని ప్రారంభించడానికి వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు ప్రీ-వాలిడేటెడ్ బ్యాంక్ ఖాతాను ఉపయోగించవచ్చు. ఆదాయపు పన్ను రిటర్న్‌లు మరియు ఇతర ఫారమ్‌లు, ఇ-ప్రొసీడింగ్‌లు, రీఫండ్ రీఇష్యూ, పాస్‌వర్డ్‌ని రీసెట్ చేయడం మరియు ఇ-ఫైలింగ్ ఖాతాకు సురక్షితమైన లాగిన్ కోసం ఇ-వెరిఫికేషన్ ఉపయోగించవచ్చు.
- విజయవంతమైన ముందస్తు ధృవీకరణ కోసం, మీరు తప్పనిసరిగా ఇ-ఫైలింగ్‌తో రిజిస్టర్ చేయబడిన చెల్లుబాటు అయ్యే PAN మరియు PANతో లింక్ చేయబడిన క్రియాశీల బ్యాంక్ ఖాతాను కలిగి ఉండాలి.
- వాలిడేషన్ విఫలమైతే, విఫలమైన బ్యాంకు ఖాతాల క్రింద వివరాలు ప్రదర్శించబడతాయి. విఫలమైన బ్యాంక్ ఖాతాల విభాగంలో బ్యాంక్ కోసం మీరు రీ-వాలిడేట్ క్లిక్ చేయవచ్చు.
- అయితే, వాలిడేషన్ కోసం కొనసాగుటకు ముందు, దయచేసి మీ బ్యాంకర్ల తరపు నుండి కూడా మీ KYC పూర్తి చేయబడినదని నిర్ధారించుకోండి, లేనిచో, అది మళ్ళీ ఎర్రర్ చూపవచ్చు.
ప్రశ్న:ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసే పేరు ఫార్మాట్ ఏమిటి?
సమాధానం: మీరు ఒక వ్యక్తిగత యూజర్ అయితే, మీరు PANలో కనిపించే ఫార్మాట్ ప్రకారం మీ పేరును నమోదు చేయాలి:
- మొదటి పేరు
- మధ్య పేరు
- ఇంటి పేరు
ప్రశ్న:నేను DSC ఉపయోగించి నా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయలేకపోతున్నాను. నేనేమీ చేయాలి?
సమాధానం: ఇంతకుముందే ప్రొఫైల్‌లో పన్ను చెల్లింపుదారు ద్వారా DSC రిజిస్టర్ చేయబడిన పరిస్థితిలో మాత్రమే ఈ ఆప్షన్ ఎనేబుల్ అవుతుంది. మీరు DSC ఉపయోగించి పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయాలనుకుంటే, మీరు పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడానికి ఉపయోగించే ముందు DSCని రిజిస్టర్ చేయాలి. మీరు దీనికోసం అందుబాటులో ఉన్న ఇతర ఎంపికలను కూడా ఉపయోగించవచ్చు.
ప్రశ్న: రిజిస్టర్డ్ మొబైల్ నంబరులో ఆధార్ OTP లేదా ఇ-ఫైలింగ్ OTP ఉపయోగించి నా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయలేకపోతున్నాను. నేనేమీ చేయాలి?
సమాధానం: మీరు ఎంపికలను ఉపయోగించి నా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయలేకపోతే, క్రింది పత్రాలను efilingwebmanager@incometax.gov.in పై షేర్ చేయండి.
- మీరు ఒక వ్యక్తిగత యూజర్ అయిన సందర్భంలో:
- స్కాన్ చేయబడిన మీ PAN కాపీ
- స్కాన్ చేయబడిన గుర్తింపు రుజువు PDF కాపీ (పాస్‌పోర్ట్ / ఓటరు గుర్తింపు కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ / ఆధార్ కార్డు / ఫోటోతో గల బ్యాంక్ పాస్‌బుక్ వంటివి)
- స్కాన్ చేయబడిన చిరునామా రుజువు PDF కాపీ (పాస్‌పోర్ట్ / ఓటరు గుర్తింపు కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ / ఆధార్ కార్డు / ఫోటోతో గల బ్యాంక్ పాస్‌బుక్ వంటివి)
- కారణాలను ఇవ్వడం ద్వారా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయమని అభ్యర్థిస్తూ లేఖ (మీరు మీ ఇమెయిల్ని IDని, OTP జనరేట్ చేయడానికి భారతదేశానికి చెందిన సంప్రదించు నంబరు అందించాలి)
- మీరు కార్పొరేట్ యూజర్ అయిన సందర్భంలో:
- కంపెనీ PAN కార్డ్ స్కాన్ కాపీ లేదా AO/PAN సర్వీస్ ప్రొవైడర్/స్థానిక కంప్యూటర్ సెంటర్ జారీ చేసిన PAN కేటాయింపు లేఖ.
- కంపెనీ విలీన తేదీ రుజువు యొక్క స్కాన్ కాపీ.
- ప్రధాన కాంటాక్ట్ (ఆదాయపు పన్ను చట్టం -1961లోని సెక్షన్ 140 ప్రకారం ఆదాయ రాబడిపై సంతకం చేయు బాధ్యత గల వ్యక్తి) PAN స్కాన్డ్ కాపీ
- ప్రధాన కాంటాక్ట్ కోసం ప్రభుత్వ సంస్థలు జారీ చేసిన మరో గుర్తింపు ధృవీకరణ కాపీ (పాస్‌పోర్ట్ / ఓటరు గుర్తింపు కార్డు / డ్రైవింగ్ లైసెన్స్ / ఆధార్ కార్డు మొదలైనవి)
- కంపెనీ కార్యాలయ చిరునామా ధృవీకరణం అంటే కంపెనీ పేరు మీద జారీ చేయబడిన విద్యుత్ బిల్లు / టెలిఫోన్ బిల్లు / బ్యాంక్ పాస్‌బుక్/ అద్దె ఒప్పందం వంటి పత్రాలలో ఏదైనా ఒకటి.
- మేనేజింగ్ డైరెక్టర్ / డైరెక్టర్లు కాకుండా మరొకరు అభ్యర్థన చేసిన సందర్భంలో, ప్రధాన కాంటాక్ట్ నియామక ధృవీకరణం.
- కంపెనీ పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడం కోసం ప్రిన్సిపల్ కాంటాక్ట్ సంతకం చేసిన కంపెనీ లెటర్ హెడ్ ద్వారా అభ్యర్థన లేఖ. పేర్కొనబడిన అన్ని పత్రాలపై ప్రధాన కాంటాక్ట్ స్వీయ-ధృవీకరణ చేస్తూ సంతకం చేయాలి. పత్రాలు వాలిడేట్ చేయబడిన తర్వాత, రీసెట్ చేయబడిన పాస్‌వర్డ్‌ను అభ్యర్థన అందుకున్న మెయిల్ id ద్వారా షేర్ చేస్తారు.
ప్రశ్న: DSC ద్వారా ఆదాయపు పన్ను పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునే సమయంలో పరిగణించవలసిన కొన్ని ముఖ్యమైన అంశాలు ఏమిటి?
సమాధానం: మీరు సహాయ కేంద్రానికి మీ సమస్యలను నివేదించే ముందు క్రింది ముందస్తు అవసరాలను తనిఖీ చేసుకోవాలి:
- తాజా ఎంబ్రిడ్జ్ అప్లికేషన్ ఇన్‌స్టాల్ చేసుకోవాలి
- నవీకరించబడిన ఇ-ముద్ర టోకెన్ డ్రైవర్స్ నవీకరించబడుతాయి
- మీరు టోకెన్ మేనేజర్‌లోకి లాగిన్ అయ్యారు
- స్థానిక హోస్ట్ ఇ-ముద్ర సిస్టమ్ అడ్మిన్ ద్వారా వైట్‌లిస్ట్ చేయబడుతుంది.
- ప్రొఫైల్, సంప్రదించు వివరాలు (తప్పనిసరి ఫీల్డులు) నవీకరించబడ్డాయి (మీరు దాన్ని నవీకరించిన తర్వాత లాగ్ ఔట్ చేసి తిరిగి లాగిన్ చేయండి),
- ఒక డాంగిల్ (ఇ-టోకెన్)లో ఒక DSC ఉండేలా చూసుకోండి
ప్రశ్న: నేను DSCని తిరిగి రిజిస్టర్ చేయడానికి ప్రయత్నిస్తున్నాను కాని PAN సరిపోలడం లేదు అనే ఎర్రర్ పొందుతున్నాను? నేనేమీ చేయాలి?
సమాధానం: DSC ఇప్పటికే పోర్టల్‌లో రిజిస్టర్ చేయబడినందున, మీరు మళ్లీ రిజిస్టర్ చేయవలసిన అవసరం లేదు. మీరు 'వ్యూ సర్టిఫికేట్' కింద రిజిస్టర్డ్ DSC చూడగలిగిన తర్వాత, ఫారమ్ / ITR ఇ-వెరిఫైకి కొనసాగవచ్చు.
ప్రశ్న: నేను మునుపటి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో DSC రిజిస్టర్ చేసాను. మళ్లీ నేను కొత్త పోర్టల్‌లో కూడా దీనిని రిజిస్టర్ చేసుకోవాలా?
సమాధానం: అవును.
ప్రశ్న: నేను ఒక వ్యక్తిగతేతర యూజర్. DSC రిజిస్టర్డ్ అయినట్లు చూపించని సందర్భంలో అలాగే వాలిడిటీ ఫీల్డ్ "ముఖ్యమైన వ్యక్తి వివరాలు" కింద ఖాళీగా కనిపిస్తుంటే నేను ఏమి చేయాలి?
సమాధానం: మీరు కింది దశలు ప్రయత్నించవచ్చు:
- ప్రధాన కాంటాక్ట్ లో, ప్రొఫైల్ (అనగా వ్యక్తిగత యూజర్) వివరాలు పొందిన DSCతో సరిపోలాలి - ఇమెయిల్ ID, టోకెన్ పేరు, DSC వాలిడిటీ.
- మీరు మళ్ళీ అదే ముఖ్యమైన వ్యక్తిని జోడించడానికి ప్రయత్నించవచ్చు
- ఒకే ముఖ్యమైన వ్యక్తిని మళ్లీ జోడించలేరు అనే ప్రాంప్ట్ పొందినప్పుడు - "లెఫ్ట్" అనే ఎంపికను ఎంచుకోవడం ద్వారా దయచేసి ఆ 'ముఖ్యమైన వ్యక్తి'ని తొలగించి అదే ముఖ్యమైన వ్యక్తిని మళ్లీ జోడించండి.
- వ్యక్తిగతం కాని ప్రొఫైల్‌లో ఒకరి కంటే ఎక్కువ మంది కీలక వ్యక్తులు జోడించబడితే, మీరు ఫారమ్/ITRని ఇ-వెరిఫై చేసే ముందు ప్రధాన సంప్రదింపుగా సరైన “కీలక వ్యక్తి”ని ఎంచుకోవాలి.
ప్రశ్న: ప్రాథమిక సర్దుబాటు కోసం సెక్షన్ 143(1) (a) ప్రకారం కమ్యూనికేషన్ జారీ చేయబడినప్పుడు నేను సవరణను దాఖలు చేయవచ్చా?
సమాధానం: మీరు ఈ క్రింది వాటిని నిర్ధారించుకోవాలి:
- పి.ఎఫ్.ఎ. కోసం సెక్షన్ 143(1) (a) ప్రకారం కమ్యూనికేషన్ జారీ చేసినప్పుడు అంగీకరిస్తున్నారు / విభేదిస్తున్నారు కోసం ప్రతిస్పందనను దాఖలు చేయాలి;
- రిటర్న్ ప్రాసెస్ చేయబడి, సెక్షన్ 143(1) ప్రకారం సమాచారం జనరేట్ చేయబడిన తర్వాత, మీరు సవరణ దాఖలును ఎంచుకోవచ్చు
ప్రశ్న: నేను దాఖలు చేసిన తర్వాత సవరణను ఉపసంహరించుకోవచ్చా?
సమాధానం: లేదు. ఆన్‌లైన్‌లో దాఖలు చేయబడిన సవరణ దరఖాస్తును ఉపసంహరించుకోవడం సాధ్యం కాదు.
ప్రశ్న: సవరణ దాఖలు చేయబడిన సందర్భంలో, నేను మళ్ళీ సవరణను దాఖలు చేయవచ్చా?
సమాధానం: మునుపటి సవరణ అభ్యర్థన ప్రాసెస్ చేయబడి సెక్షన్ 154 ప్రకారం ఉత్తర్వులు జారీ చేయబడిన తరువాత మీరు మళ్లీ సవరణను దాఖలు చేయవచ్చు.