ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోండి: పన్ను తగ్గించే మరియు పన్ను వసూలు చేసే వ్యక్తి కోసం
దశలవారీ మార్గదర్శిని
దశ 1: ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీకి వెళ్ళి, రిజిస్టర్ పైన క్లిక్ చేయండి.
దశ 2: ఇతరులు క్లిక్ చేయండి మరియు వర్గాన్ని పన్ను మినహాయించు మరియు వసూలు చేయు వ్యక్తిగా ఎంచుకోండి.
దశ 3: సంస్థ యొక్క TANని నమోదు చేసి ధృవీకరించండి క్లిక్ చేయండి.
దశ 4a: ఒకవేళ డేటాబేస్ లో TAN అందుబాటులో ఉండి, TRACES తో రిజిస్టర్ అయ్యుండి మరియు రిజిస్ట్రేషన్ అభ్యర్థన అంతకు ముందే లేకుంటే మరియు అనుమతి కోసం పెండింగ్‌లో ఉన్నట్లయితే:
- ప్రాథమిక వివరాలు పేజీని చూడటానికి కొనసాగించండి పైన క్లిక్ చేయండి.
- ప్రాథమిక వివరాలు ముందుగానే నింపబడి ఉన్నాయి. కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 4b: ఒకవేళ డేటాబేస్ లో TAN అందుబాటులో ఉండి, TRACESతో రిజిస్టర్ కాకపోతే మరియు రిజిస్ట్రేషన్ అభ్యర్థన అంతకు ముందే లేకుంటే మరియు అనుమతి కోసం పెండింగ్ లో ఉన్నట్లయితే :
- TRACES పేజీని చూడటానికి కొనసాగించండి క్లిక్ చేయండి.
- ప్రాథమిక వివరాలు పేజీని వీక్షించడం కోసం TRACES ఇ-ఫైలింగ్ తో రిజిస్టర్ మీద క్లిక్ చేయండి.
- అవసరమైన విధంగా ప్రాథమిక వివరాలను నమోదు చేసి కొనసాగించండి క్లిక్ చేయండి.
గమనిక: మీరు మొదట TRACESలో ముందుగా నమోదు చేసుకోవాలి. అక్కడి నుండి, మిమల్ని ఇ-ఫైలింగ్ రిజిస్ట్రేషన్ పేజీకి తీసుకెళ్లటానికి, ఇ-ఫైలింగ్ తో రిజిస్టర్ చేయండి పై క్లిక్ చేయండి.
దశ 4సి: ఒకవేళ డేటాబేస్ లో TAN అందుబాటులో ఉండి, రిజిస్ట్రేషన్ అభ్యర్థన అంతకు ముందే ఉన్నట్లయితే మరియు అనుమతి కోసం పెండింగ్ లో ఉన్నట్లయితే:
- లోపం ఉందన్న సందేశం ప్రదర్శించబడింది, మీరు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఉపసంహరించుకోవచ్చు.
దశ 5: చెల్లింపులు చేసే లేదా పన్ను వసూలు చేసే వ్యక్తి వివరాలను నమోదు చేసి కొనసాగించండి క్లిక్ చేయండి.
దశ 6: ప్రాధమిక మొబైల్ నెంబర్, ఇమెయిల్ ID మరియు తపాలా చిరునామాతో కూడిన సంప్రదింపు వివరాలను అందించండి. కొనసాగించండి పై క్లిక్ చేయండి.
దశ 7: దశ 6లో నమోదు చేసిన ప్రాధమిక మొబైల్ నెంబర్ మరియు ఇమెయిల్ IDకు రెండు వేర్వేరు OTPలు పంపించబడ్డాయి. వేర్వేరు 6 అంకెల OTPలు నమోదు చేసి, కొనసాగించండి పై క్లిక్ చేయండి.
గమనిక:
- OTP 15 నిమిషాలు మాత్రమే చెల్లుతుంది
- మీకు సరైన OTPలను నమోదు చేయడానికి 3అవకాశాలు ఉన్నాయి
- స్క్రీన్ పై OTP గడువు ముగిసే కౌంట్ డౌన్ టైమర్, OTP ఎప్పుడు ముగుస్తుందో తెలియజేస్తుంది
- OTPని మళ్ళీ పంపండి పైన క్లిక్ చేసినప్పుడు, కొత్త OTP జనరేట్ అయ్యి పంపించబడుతుంది
దశ 8: వివరాలు వెరిఫై చేయండి పేజీలో, అందించిన వివరాలను సమీక్షించండి, అవసరమైతే వివరాలను సవరించండి, ఆపై నిర్ధారించండిక్లిక్ చేయండి.
దశ 9: పాస్‌వర్డ్ సెట్ చేయండి పేజీలో, పాస్‌వర్డ్‌ను సెట్ చెయ్యండి మరియు పాస్‌వర్డ్‌ని నిర్ధారణ చెయ్యండి అనబడే టెక్స్ట్‌బాక్స్‌లు రెండింటిలోనూ మీకు కావలసిన పాస్‌వర్డ్‌ను నమోదు చేసి, మీ వ్యక్తిగత సందేశం సెట్ చేయండి మరియు రిజిస్టర్ క్లిక్ చేయండి.
గమనిక:
రిఫ్రెష్లేదా వెనక్కి క్లిక్ చేయవద్దు.
మీ కొత్త పాస్వర్డ్‌ను నమోదు చేస్తున్నప్పుడు, పాస్వర్డ్ విధానం పట్ల శ్రద్ధ వహించండి:
- ఇది కనీసం 8 అక్షరాలు మరియు గరిష్టంగా 14 అక్షరాలు ఉండాలి
- దీనిలో అప్పర్ కేస్ మరియు లోయర్ కేస్ లెటర్లు రెండూ ఉండాలి.
- ఇది ఒక సంఖ్యను కలిగి ఉండాలి
- దీనికి ప్రత్యేక గుర్తు ఉండాలి (ఉదా. @#$%)
లావాదేవీ IDతో పాటు విజయవంతమైనది అనే సందేశం కనిపిస్తుంది. భవిష్యత్ సూచన కోసం లావాదేవీ IDని వ్రాసి పెట్టుకోండి. సమర్థ అధికారి నుండి ఆమోదం పొందిన తరువాత రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తవుతుంది.