Do not have an account?
Already have an account?

1. ఇ-ఫైలింగ్ ఖాతాకు నా చార్టర్డ్ అకౌంటెంట్ ను ఎలా జోడించాలి?
మీ ఖాతాలోకి లాగిన్ అయిన తర్వాత ఈ సేవను ఉపయోగించి చార్టర్డ్ అకౌంటెంట్(ల)ను మీ ఇ-ఫైలింగ్ ఖాతాకు జోడించవచ్చు. నా చార్టర్డ్ అకౌంటెంట్ సేవ ఈ క్రింది వాటిని చేయడానికి మీకు అనుమతిస్తుంది:

  • మీ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మీచేత ఆథరైజ్ అయిన యాక్టివ్ మరియు ఇన్‌యాక్టివ్ CAల జాబితాను వీక్షించండి
  • చార్టర్డ్ అకౌంటెంట్ ను జోడించండి
  • చార్టర్డ్ అకౌంటెంట్ కు ఫారాలను కేటాయించండి
  • కేటాయించిన ఫారాలను ఉపసంహరించండి
  • సి.ఎ. ను సక్రియం చేయండి
  • CAను నిష్క్రియం చేయండి

2. నా CA సేవను ఎవరు యాక్సెస్ చేయగలరు?
ఈ క్రింది వర్గాలలోని ఒక దానిలో ఉన్న ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన వినియోగదారులందరూ ఈ సేవకు ప్రవేశము పొందగలరు:

  • వ్యక్తిగత
  • HUF
  • కంపెనీ, AOP, BOI, AJP, ట్రస్ట్, ప్రభుత్వం, LA (స్థానిక అధికారం), ఫర్ము
  • పన్ను తగ్గించు మరియు వసూలు చేయు వ్యక్తి


3. CAకి కేటాయించిన ఫారమ్‌లను నేను ఉపసంహరించుకోవచ్చా?
అవును, CAకి కేటాయించిన తర్వాత ఫారమ్‌లను ఉపసంహరించుకోవచ్చు. CAకి కేటాయించిన అన్ని ఫారమ్‌లను వినియోగదారు చూడవచ్చు మరియు అవసరమైతే ఉపసంహరించుకోవచ్చు.

4. నేను చార్టర్డ్ అకౌంటెంట్ కి అధికారం ఎందుకు ఇవ్వాలి?
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో CA మీ తరపున ఏదైనా ఫారమ్‌ను దాఖలు చేయడానికి లేదా సమర్పించడానికి ముందు, అతడు లేదా ఆమె మీచే అధికారం పొంది ఉండాలి. అంతేకాకుండా, సి.ఎ. ధృవీకరణ అవసరమయ్యే కొన్ని చట్టబద్ధమైన ఫారమ్‌లు ఉన్నాయి. మీరు ఈ సేవను ఉపయోగించి సి.ఎ. ని జోడించవచ్చు . ఐ.టి.ఆర్. లు / ఫారమ్‌లను సమర్పించడానికి జోడింపు అభ్యర్థనను CA అంగీకరించాలి.