Do not have an account?
Already have an account?

1. నేను ఫారం 10A కోసం మినహాయింపు అభ్యర్థనను ఆఫ్‌లైన్ విధానంలో దాఖలు చేయవచ్చా?

లేదు, ఫారం 10Aకి సంబంధించిన మినహాయింపు అభ్యర్థనను ఆఫ్‌లైన్ విధానంలో దాఖలు చేయడం సాధ్యం కాదు; ఆన్‌లైన్ విధానం ద్వారా మాత్రమే దీనిని దాఖలు చేసే వెసులుబాటు ఉంది.

2. మినహాయింపు అభ్యర్థనను దాఖలు చేసేటప్పుడు, జతచేయాల్సిన ఏదైనా తప్పనిసరి పత్రం ఉందా?

క్రమ సంఖ్య 2(f) వద్ద ఉన్న "ఈ ఫారం ఇప్పటికే దాఖలు చేయబడిందా?" అనే ప్రశ్నకు పన్ను చెల్లింపుదారు 'అవును' అని ఎంచుకున్నట్లయితే, దాఖలు చేసిన ఫారం యొక్క పిడియఫ్ ను అప్‌లోడ్ చేయడం తప్పనిసరి.

3. పన్ను చెల్లింపుదారు దాఖలు చేసిన మినహాయింపు అభ్యర్థన పత్రాన్ని ఎలా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు?

మినహాయింపు అభ్యర్థనను సమర్పించిన పన్ను చెల్లింపుదారు ఈ క్రింది మార్గంలో ఫారంను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: డాష్‌బోర్డ్ -- సేవలు -- మినహాయింపు అభ్యర్థన -- చట్టబద్ధమైన ఫారాల కోసం దరఖాస్తు --> లేవనెత్తిన మినహాయింపు అభ్యర్థనకు ఎదురుగా ఉన్న వివరాలను వీక్షించండి బటన్ --> డౌన్‌లోడ్ ఫారం బటన్‌పై క్లిక్ చేయండి.

4. పన్ను చెల్లింపుదారు మినహాయింపు దరఖాస్తుకు సంబంధించిన ఆమోదం లేదా తిరస్కరణ ఉత్తర్వును ఎలా వీక్షించగలరు?

పన్ను చెల్లింపుదారు ఈ క్రింది మార్గం ద్వారా ఆమోదం/తిరస్కరణ ఉత్తర్వును పొందవచ్చు:
డాష్‌బోర్డ్ --; సేవలు --; మినహాయింపు అభ్యర్థన --; చట్టబద్ధమైన నమూనాల కోసం దరఖాస్తు --; ఆమోదించబడిన/తిరస్కరించబడిన మినహాయింపు అభ్యర్థనకు ఎదురుగా ఉన్న గమనికలో పేర్కొన్న 'ఇక్కడ క్లిక్ చేయండి' బటన్ --; మీ సమాచారం కోసం --; డౌన్ లోడ్ క్లోజర్ ఆర్డర్ బటన్

5. పన్ను చెల్లింపుదారు బహుళ మినహాయింపు దరఖాస్తులను దాఖలు చేయవచ్చా?

అవును, ఒక పన్ను చెల్లింపుదారు వివిధ అసెస్‌మెంట్ సంవత్సరం (AY) మరియు సెక్షన్ కోడ్ల కలయికల కోసం బహుళ మినహాయింపు దరఖాస్తులను దాఖలు చేయవచ్చు

6. మినహాయింపు అభ్యర్థన ఆమోదించబడిన తర్వాత ఫారం 10Aని ఎలా దాఖలు చేయాలి?

మినహాయింపు దరఖాస్తు పై ఆమోదం పొందిన తర్వాత, ఫారం 10Aని దాఖలు చేయడానికి పన్ను చెల్లింపుదారులు ఈ క్రింది దశలను అనుసరించాలి:

డాష్‌బోర్డ్ --; ఆదాయపు పన్ను ఫారాలు --; ఆదాయపు పన్ను ఫారాలను దాఖలుచేయండి --;
ఆదాయపు పన్ను చట్టం, 1961 ప్రకారం ఫారాలు --; ఫారం 10A --; ‘ఇప్పుడే దాఖలు చేయండి’కు వెళ్లండి

మీరు ఫారం 10A యొక్క లాండింగ్ స్క్రీన్‌కు మళ్లించబడతారు:

A) ఫైలింగ్ టైప్ 'మినహాయింపు'గా మరియు మినహాయింపు టైప్ "ఇప్పటికే ఆమోదించబడిన మినహాయింపు"గా ఎంచుకోండి.
B) “DIN నెంబర్లను పొందండి” బటన్‌పై క్లిక్ చేయండి.
C) ఆమోదించబడిన మినహాయింపు దరఖాస్తుకు సంబంధించిన DINలు, 'DIN నెంబర్లు' డ్రాప్-డౌన్ జాబితాలో ప్రదర్శించబడతాయి.
D) DIN నెంబర్ ను ఎంచుకున్న తర్వాత, ఆమోదించబడిన DIN నంబర్‌కు సంబంధించి మినహాయింపు సంవత్సరం ముందే పూరించబడి కనిపిస్తుంది. ఇప్పుడు మీరు ఫారం 10Aని దాఖలు చేయడానికి ముందుకు సాగవచ్చు.

గమనిక: ఆమోదించబడిన మినహాయింపు అభ్యర్థనకు అనుసంధానించబడిన ఒక DINను ఉపయోగించి ఫారం 10Aని ఒకసారి దాఖలు చేసిన తర్వాత, ఫారం 10Aని ఉపసంహరించుకున్న సందర్భంలో తప్ప, అదే DINను ఉపయోగించి దానిని మళ్లీ దాఖలు చేయడం సాధ్యం కాదు.

దయచేసి క్రింద ఇవ్వబడిన స్క్రీన్‌షాట్‌ను చూడండి:

Data responsive

పదకోశం

 

సంక్షిప్త పదం/ సంక్షిప్త రూపంవివరణ / పూర్తి రూపం
AOమదింపు అధికారి
AYమదింపు సంవత్సరం
CAచార్టర్డ్ అకౌంటెంట్
CPCసెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్
EVCఎలక్ట్రానిక్ ధ్రువీకరణ కోడ్