1. ఫారం 29B అంటే ఏమిటి?
ఫారం 29B అనేది కంపెనీ యొక్క పుస్తక లాభాలను లెక్కించడానికి సెక్షన్ 115JB క్రింద సమర్పించే ఒక నివేదిక. సెక్షన్ 11JB వర్తించే కంపెనీ కోసం దీనిని ఒక CA ద్వారా అందించాలి. ఆదాయపు పన్ను చట్టం ప్రకారం లెక్కించిన పన్ను నుండి ఉత్పన్నమయ్యే MAT క్రెడిట్‌ను పొందేందుకు, పుస్తక లాభాలను సరిగ్గా లెక్కించడంలో ఇది పన్ను చెల్లింపుదారునికి సహాయపడుతుంది.
2. ఫారం 29Bను దాఖలు చేయడం తప్పనిసరా?
ఏ కంపెనీలోనైతే ఆదాయం నికరలాభంలో 15% కంటే తక్కువగా ఉంటుందో (AY 2020-21 నుండి వర్తిస్తుంది), ఆ కంపెనీ తప్పనిసరిగా చార్టర్డ్ అకౌంటెంట్ నుండి 'ఫారం 29B'లో నివేదికను పొందాలి. ఈ నివేదికను సెక్షన్ 139(1) ప్రకారం రిటర్న్ దాఖలు చేయడానికి నిర్ణీత గడువు తేదీకి ఒక నెల ముందుగా పొందాలి మరియు సమర్పించాలి; లేదా సెక్షన్ 142(1)(i) కింద జారీ చేసిన నోటీసుకు ప్రతిస్పందనగా సమర్పించే ఆదాయపు రిటర్న్‌తో పాటు దీనిని సమర్పించాల్సి ఉంటుంది.
3. ఫారం 29Bను పూరించే ప్రక్రియ ఏమిటి?
ఫారాన్ని పన్ను చెల్లింపుదారు (కంపెనీ) నియమించిన CA పూరించాలి. నియమించబడిన CA ఫారాన్ని పూరించి అప్లోడ్ చేసిన తర్వాత, అది విజయవంతంగా సమర్పించబడేందుకు మదింపుదారు దానిని (వర్క్‌లిస్ట్ నుండి) ఆమోదించి ఇ-ధ్రువీకరణ చేయాలి.
4. నా CA ఫారం 29Bను సిద్ధం చేసి సమర్పించినట్లు నేను ఎలా తెలుసుకోగలను?
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన మీ ఇ-మెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు నిర్ధారణ సందేశం పంపబడుతుంది. అదనంగా, మీరు వర్క్‌లిస్ట్ (మీ చర్య కోసం)లో కూడా స్థితిని చూడవచ్చు. CA ఫారం 29Bను అప్లోడ్ చేసినట్లయితే, అప్లోడ్ చేయబడింది - మదింపుదారు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది అని ప్రదర్శించబడుతుంది.
5. ఫారం 29Bను పూరించేందుకు నేను చేసిన అభ్యర్థనను నా CA తిరస్కరించినట్లు నేను ఎలా తెలుసుకోగలను?
మీరు నియమించిన CA ఫారం 29Bను పూరించేందుకు మీరు చేసిన అభ్యర్థనను తిరస్కరించినట్లయితే, ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన మీ ఇమెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు సమాచారం పంపబడుతుంది.
6. ఫారం 29Bను పూరించేందుకు నేను చేసిన అభ్యర్థనను నా CA ఆమోదించినట్లు నేను ఎలా తెలుసుకోగలను?
మీరు నియమించిన CA మీ అభ్యర్థనను ఆమోదించినట్లయితే, మీ వర్క్‌లిస్ట్ (మీ చర్య కోసం)లో క్రింది స్థితి ప్రదర్శించబడుతుంది:
- CA ద్వారా అప్లోడ్ చేయబడింది - ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది: అంటే, CA మీ అభ్యర్థనను ఇంకా ఆమోదించాల్సి ఉంది; లేదా
- అప్లోడ్ చేయబడింది - మదింపుదారు ఆమోదం కోసం పెండింగ్‌లో ఉంది: అంటే, CA ఇప్పటికే ఫారం 29Bను అప్లోడ్ చేసి సమర్పించారు.