మీ PANని ధృవీకరించండి గురించి యూజర్ మాన్యువల్
1. అవలోకనం
‘వెరిఫై PAN స్టేటస్' అనేది ఎక్స్‌టర్నల్ ఏజెన్సీలు మినహా మిగిలిన వినియోగదారులందరి కోసం ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో అందుబాటులో ఉండే ఒక ప్రీ-లాగిన్ (పోర్టల్‌లోకి లాగిన్ అవ్వాల్సిన అవసరం లేని) సేవ.
ఎక్స్‌టర్నల్ ఏజెన్సీలు ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అయిన తర్వాత, ఈ PAN స్థితిని ధ్రువీకరించే సేవను యాక్సెస్ చేయవచ్చు.
ఈ సేవను ఉపయోగించి, మీరు ఇవి చేయగలరు:
- PANపై ఉన్న పేరు, పుట్టిన తేదీ వంటి వివరాలు సరైనవేనా, కాదా అని సరిచూసుకోండి.
- PAN యాక్టివ్‌గా ఉందో లేదో ధ్రువీకరించుకోండి.
2. ఈ సేవను పొందటానికి కావలసిన ముందస్తు అవసరాలు
- చెల్లుబాటయ్యే PAN
- చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ (మీకు అందుబాటులో ఉన్నది)
- ఎక్స్‌టర్నల్ ఏజెన్సీల కొరకు: ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదైన వినియోగదారుడై ఉండాలి మరియు సరైన యూజర్ ఐడీ, పాస్‌వర్డ్ అలాగే సంస్థ ప్రారంభించబడిన తేదీ కలిగి ఉండాలి.
3. స్టెప్ బై స్టెప్ గైడ్
3.1 PAN స్థితిని సరిచూడండి
దశ 1: ఈ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లండి.
దశ 2: క్విక్ లింక్స్ విభాగంలో, 'PAN స్థితిని ధ్రువీకరించండి' పై క్లిక్ చేయండి.
దశ 3: ‘PAN స్థితిని ధ్రువీకరించండి’ పేజీలో మీ PAN, పూర్తి పేరు, పుట్టిన తేదీ మరియు మొబైల్ నంబర్‌ను (మీ అందుబాటులో ఉన్నది) నమోదు చేసి, కంటిన్యూ పై క్లిక్ చేయండి.
దశ 4: ధ్రువీకరణ పేజీలో,దశ 3లో నమోదు చేసిన మొబైల్ నంబర్‌కు వచ్చిన 6-అంకెల OTPని నమోదు చేసి, 'ధ్రువీకరించు' పై క్లిక్ చేయండి.
గమనిక:
• OTP కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
• సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉంటాయి.
• కొత్త OTPని పొందడానికి మిగిలి ఉన్న సమయాన్ని OTP టైమర్ సూచిస్తుంది. రీసెండ్ OTP' పై క్లిక్ చేసినప్పుడు, ఒక కొత్త OTP రూపొందించబడి పంపబడుతుంది.
ధ్రువీకరణ విజయవంతమైన తర్వాత, మీ PAN స్థితి ప్రదర్శించబడుతుంది.
గమనిక:
ఇది కేవలం సమాచార ప్రయోజనం కోసం మాత్రమే, ఇది ఇ-ఫైలింగ్‌లోని ఇతర ఏ కార్యాచరణపైనా ప్రభావం చూపదు. ఏవైనా సందేహాలు ఉంటే, వినియోగదారులు కేవలం JAOని మాత్రమే సంప్రదించాలి
3.2 ఎక్స్‌టర్నల్ ఏజెన్సీల కోసం PAN ధ్రువీకరణ
దశ 1:మీ వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
దశ 2: ‘సర్వీసెస్’ > ‘వ్యూ పాన్ డీటెయిల్స్’ పై క్లిక్ చేయండి.
దశ 3: ‘వెరిఫై యువర్ పాన్’ పేజీలో, ధ్రువీకరించవలసిన PAN నంబర్, పూర్తి పేరు మరియు సంస్థ స్థాపన తేదీ (DOI) / జన్మ తేదీ (DOB) నమోదు చేసి, ‘కంటిన్యూ’ పై క్లిక్ చేయండి.
ధ్రువీకరణ విజయవంతమైన తర్వాత, PAN స్థితి ప్రదర్శించబడుతుంది.
4. సంబంధిత విషయాలు