Do not have an account?
Already have an account?

FO_77_ERI Bulk ITR Upload and View_User Manual_FAQ_V.0.1

1. అవలోకనం

ఈ-ఫైలింగ్ పోర్టల్లో రిజిస్టర్ అయిన టైప్ 1 ఇ-రిటర్న్ ఇంటర్మీడియరీ (ERI) కోసం ఆదాయపు పన్ను రిటర్న్ (బల్క్) అప్‌లోడ్ చేయడం మరియు ఆదాయపు పన్ను రిటర్న్ (బల్క్) విధివిధానాలు వర్తిస్తాయి. ఇది పోస్ట్-లాగిన్ సర్వీస్. ERIలు ITRని అప్‌లోడ్ చేయగలరు మరియు వారి క్లయింట్‌ల తరపున ఫైల్ చేసిన ITRల స్థితిని చూడగలరు.

2. ఈ సర్వీసు పొందడానికి అవసరమైనవి

  • ERI అనేది టైప్ 1 ERI అయి ఉండాలి
  • ERI ద్వారా చెల్లుబాటు అయ్యే మరియు క్రియాశీల PANని క్లయింట్‌గా జోడించాలి మరియు క్లయింట్ ఆమోదించాలి
  • PAN తప్పనిసరిగా ERI యొక్క యాక్టివ్ క్లయింట్ అయి ఉండాలి

 

3. దశల వారీ గైడ్

3.1 ఆదాయపు పన్ను రిటర్న్ (బల్క్) అప్‌లోడ్ చేయండి

దశ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.

Data responsive

దశ 2: సర్వీస్‌లు > ఆదాయపు పన్ను రిటర్న్ అప్‌లోడ్ చేయండి (బల్క్) క్లిక్ చేయండి.

3.1.1 ముందుగా నింపిన క్లయింట్ డేటాను డౌన్ లోడ్ చేయండి

దశ 1: ముందుగా నింపిన క్లయింట్ డేటా డౌన్ లోడ్ చేయండి ట్యాబ్ పైన, డౌన్‌లోడ్ క్లిక్ చేయండి.

Data responsive

దశ 2: క్లయింట్ PANని నమోదు చేసి, ధృవీకరించండి పైన క్లిక్ చేయండి.
 

Data responsive

ముందుగా నింపినది డౌన్‌లోడ్ చేయండి అనేది వన్‌టైమ్ సమ్మతి ఆధారిత సర్వీస్. ముందుగా నింపిన డేటాను డౌన్‌లోడ్ చేయడానికి జోడించిన క్లయింట్ నుండి సమ్మతి తీసుకోకపోతే, దయచేసి క్రింది దశలను అనుసరించండి:

  1. క్లయింట్‌ను నిర్వహించండి >> నా క్లయింట్ పేజీకి నావిగేట్ చేయండి మరియు జోడించిన క్లయింట్ కోసం వెతకండి
  2. సర్వీస్ జోడించండిపై క్లిక్ చేసి, నిర్దిష్ట వ్యవధికి ముందుగా నింపిన సర్వీస్ జోడించండి
  3. ధృవీకరణ కోసం రిజిస్టర్డ్ ఇమెయిల్ మరియు మొబైల్‌కి లావాదేవీ ID జనరేట్ అయ్యి క్లయింట్‌కు పంపించబడుతుంది
  4. క్లయింట్ సమ్మతిని అందించడానికి ప్రీ-లాగిన్ 'సర్వీస్ అభ్యర్థనను ధృవీకరణ' ఫంక్షనాలిటీని యాక్సెస్ చేయవచ్చు
  5. క్లయింట్ తన PAN మరియు లావాదేవీ IDని అందించాలి, సర్వీస్ పేరు మరియు ERI పేరును ధృవీకరించాలి, OTP వివరాలను అందించి ధృవీకరణ పూర్తి చేయాలి.
  6. క్లయింట్ OTP ధృవీకరించిన తర్వాత, ERI ముందుగా నింపిన క్లయింట్ డేటాను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

దశ 3: ప్రామాణీకరణ తర్వాత, డ్రాప్‌డౌన్ మెను నుండి అవసరమైన మదింపు సంవత్సరాన్ని ఎంచుకుని, డౌన్‌లోడ్ క్లిక్ చేయండి.

Data responsive

ఎంచుకున్న PAN మరియు AY కోసం ముందే నింపిన JSON మీ సిస్టమ్‌లో డౌన్‌లోడ్ అయ్యింది.

3.1.2. క్లయింట్ల బల్క్ రిటర్న్‌లను అప్‌లోడ్ చేయండి

దశ 1:క్లయింట్స్ యొక్క బల్క్ రిటర్న్ అప్‌లోడ్ చేయండి ట్యాబ్‌లో, అప్‌లోడ్ క్లిక్ చేయండి.

Data responsive

దశ 2: అవసరమైన ZIP ఫైల్‌ను జోడించడానికి ఫైల్‌ను జోడించచండి పైన క్లిక్ చేయండి.
గమనిక:

  • ZIP ఫైల్ యొక్క గరిష్ట పరిమాణం 40 MB కంటే ఎక్కువ ఉండకూడదు.
  • ZIP ఫైల్‌లో గరిష్ట సంఖ్యలో ITRలు/JSON 40కి మించకూడదు.
  • 139(1), 139(4) మరియు 139(5) వంటి ఫైలింగ్ సెక్షన్ ఉన్న ITRలు మాత్రమే అప్‌లోడ్ చేయాలి
  • ZIP ఫైల్‌లో JSON ఫార్మాట్‌తో ఉన్న ఫైల్‌లు మాత్రమే ఉండాలి.
  • JSON పేరు తప్పనిసరిగా పన్ను చెల్లింపుదారుల PAN (<PAN of Client>.json) అయి ఉండాలి.
  • దయచేసి ఫోల్డర్ కాకుండా JSON ఫైల్‌తో ZIP చేసేలా చూడండి (చూపిన విధంగా JSON ఫైల్‌లను ఎంచుకుని రైట్ క్లిక్ చేయండి → పంపండి → కంప్రెస్డ్ కు (జిప్ చేయబడిన ఫోల్డర్).
Data responsive

దశ 3: ఇ-ధృవీకరణకు కొనసాగండి క్లిక్ చేయండి.

Data responsive

దశ 4: ఇ-ధృవీకరణ ప్రక్రియ గురించి మరింత తెలుసుకోవడానికి ఇ-ధృవీకరణలో వినియోగదారు మాన్యూవల్ చూడండి.

గమనిక: బ్యాంక్ EVC, డీమ్యాట్ EVC, ఆధార్ OTP మరియు DSC ఉపయోగించి ఇ-ధృవీకరణ చేయవచ్చు

ERI ZIP ఫైల్‌ని ఇ-ధృవీకరించిన తర్వాత, ఫైల్ ప్రామాణీకరణ కోసం పంపించబడుతుంది. ఒకసారి విజయవంతంగా ప్రామాణీకరించిన తర్వాత, పన్ను చెల్లింపుదారు రిటర్న్ ఫైలింగ్ ప్రక్రియను పూర్తి చేయడానికి తన రిటర్న్‌ని ఇ-ధృవీకరణ చేయాల్సి ఉంటుంది.

విజయవంతమైన ధృవీకరణ తర్వాత, విజయవంతమైన సందేశం ప్రదర్శించబడుతుంది మరియు మీ ఇమెయిల్ IDకి ఇమెయిల్ నిర్ధారణ పంపించబడుతుంది.

Data responsive

3.2 ఆదాయపు పన్ను రిటర్న్‌లను చూడండి (బల్క్)

దశ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ని ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.

Data responsive

దశ 2: సర్వీసులు > ఆదాయపు పన్ను రిటర్న్‌లను చూడండి (బల్క్) క్లిక్ చేయండి.

గమనిక: ప్రమాణీకరణ బల్క్ ప్రాసెసర్ ప్రతి 10 నిమిషాలకు రన్ అవుతుంది మరియు తదుపరి ప్రామాణీకరణ కోసం క్యూలో ఉన్న ఫైల్‌లను తీసుకుంటుంది. ప్రమాణీకరించిన ఫైల్‌లు విజయవంతంగా ప్రాసెస్ చేయబడతాయి.

ఒకవేళ ప్రమాణీకరణ విఫలమైతే, ఇది ఎర్రర్ వివరాలను కలిగి ఉండే ఎర్రర్ నివేదికను రూపొందిస్తుంది.

అప్లోడ్ చేయబడ్డ టోకెన్ సంఖ్య/బల్క్ రిటర్న్‌ల వివరాలు వాటి స్థితితో ప్రదర్శించబడతాయి.

Data responsive

దశ 4: అప్లోడ్ చేయబడిన ప్రతి ITR/JSON వివరాలను మరియు వాటి సంబంధిత స్థితిని చూడటానికి టోకెన్ నంబర్ టైల్‌లోని వివరాలను చూడండి క్లిక్ చేయండి:

  • ప్రమాణీకరణ విఫలమైంది - ఒకవేళ JSON ప్రమాణీకరణ విఫలమైతే
  • విజయవంతంగా ఇ-ధృవీకరించబడింది - JSON ప్రమాణీకరణ ఆమోదించబడి, పన్ను చెల్లింపుదారు ద్వారా విజయవంతంగా ఇ-ధృవీకరించబడితే
  • పెండింగ్‌లో ఉన్న ఇ-ధృవీకరణ- JSON ప్రమాణీకరణ ఆమోదించబడితే, కాని పన్ను చెల్లింపుదారులచే ఇ-ధృవీకరించబడకపోతే
  • చెల్లని ఇన్‌పుట్- అప్లోడ్ చేసిన ZIP ఫైల్‌లో JSON ఫైల్‌లకు బదులుగా లోపల ఫోల్డర్ ఉన్నప్పుడు
  • చెల్లని ఫైల్ పేరు- అప్లోడ్ చేయబడిన ZIP ఫైల్‌లో అన్ని JSON ఫైల్‌లు లేనప్పుడు
Data responsive

దశ 5: లైఫ్ సైకిల్ స్క్రీన్‌ను చూడటానికి వ్యక్తిగత రసీదు సంఖ్య టైల్‌పై వివరాలను చూడండి క్లిక్ చేయండి.

Data responsive

సంబంధిత అంశాలు

లాగిన్

డాష్‌బోర్డ్

క్లయింట్ ని జోడించండి

నా ERI

వర్క్‌లిస్ట్(పని జాబితా)

ప్రొఫైల్

రిటర్న్ జనరేషన్

ఆఫ్‌లైన్ యుటిలిటీ

 

ERI బల్క్ ITR అప్‌లోడ్ మరియు వీక్షణ > తరచుగా అడిగే ప్రశ్నలు

1. బల్క్ ITR అప్లోడ్ మరియు వీక్షణ సర్వీస్ అన్ని ERIలకు అందుబాటులో ఉందా?

లేదు, ఈ సర్వీస్ టైప్ 1 ERIలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది.

2. బల్క్ ITR అప్లోడ్ మరియు వీక్షణ సర్వీస్ పొందుతున్న ERI చూసే వివరాలు ఏమిటి?

ERI వినియోగదారు అప్లోడ్ చేసిన బల్క్ రిటర్న్‌ల స్థితిని చూడవచ్చు. ఈ స్థితుల్లో ఇవి ఉన్నాయి:

  • ప్రమాణీకరణ విఫలమైంది - JSON ప్రమాణీకరణ విఫలమైతే
  • విజయవంతంగా ఇ-ధృవీకరించబడింది - JSON ప్రమాణీకరణ ఆమోదించబడి, పన్ను చెల్లింపుదారు ద్వారా విజయవంతంగా ఇ-ధృవీకరించబడితే
  • పెండింగ్‌లో ఉన్న ఇ-ధృవీకరణ- JSON ప్రమాణీకరణ ఆమోదించబడితే, కాని పన్ను చెల్లింపుదారులచే ఇ-ధృవీకరించబడకపోతే

ERI కోరుకున్న ITR జీవిత చక్రాన్ని కూడా చూడవచ్చు.

3. ITRని బల్క్‌ అప్లోడ్ చేస్తున్నప్పుడు ERIలు గుర్తుంచుకోవలసిన కొన్ని ముఖ్య విషయాలు ఏమిటి?

ITRను బల్క్‌గా అప్లోడ్ చేయడానికి అనుబంధాన్ని జోడించేటప్పుడు ఈ క్రింది వాటిని గుర్తుంచుకోవాలి:

  • ZIP ఫైల్ యొక్క గరిష్ట పరిమాణం 40 MB కంటే ఎక్కువ ఉండకూడదు.
  • ZIP ఫైల్‌లోని గరిష్ట సంఖ్యలో ITRలు/JSON 40 ఫైల్‌లను మించకూడదు.
  • 139(1), 139(4) మరియు 139(5) వంటి ఫైలింగ్ సెక్షన్ ఉన్న ITRలు మాత్రమే అప్లోడ్ చేయడానికి అనుమతించబడతాయి
  • ZIP ఫైల్ లో JSON ఫార్మాట్‌తో మాత్రమే ఫైల్‌లలు ఉండాలి
  • PAN నివాస పన్ను చెల్లింపుదారుది మాత్రమే అయి ఉండాలి.

పదకోశం

సంక్షిప్త పదం/సంక్షేపణము

వివరణ/పూర్తి ఫారమ్

DOB

పుట్టిన తేదీ

ITD

ఆదాయపు పన్ను శాఖ

NRI

ప్రవాస భారతీయులు

ఎన్.ఎస్.డి.ఎల్.

జాతీయ సెక్యూరిటీస్ డిపాజిటరీ లిమిటెడ్

ఓ.టి.పి

ఒకసారి పాస్ వర్డ్

PAN

పర్మనెంట్ అకౌంట్ నంబర్

SMS

షార్ట్ మెసేజ్ సర్వీస్

UIDAI

భారతదేశ ప్రత్యేక గుర్తింపు అధికారం

UTIISL

UTI ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ టెక్నాలజీ & సర్వీసెస్ లిమిటెడ్

AY

మదింపు సంవత్సరం

ఇ.ఆర్.ఐ

ఇ రిటర్న్ మధ్యవర్తి

DTT

డేటా ట్రాన్స్మిషన్ టెస్ట్

API

అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేస్

 

మూల్యాంకన ప్రశ్నలు

Q1. దిగువ జాబితా నుండి సాధ్యమయ్యే అన్ని ఇ-ధృవీకరణ పద్ధతులు ఏమిటి?

  1. ఆధార్‌తో నమోదైన మొబైల్‌లో OTP
  2. డి.ఎస్.సి.
  3. ఇ.వి.సి
  4. స్టాటిక్ పాస్‌వర్డ్

జవాబు: 1. ఆధార్‌తో నమోదైన మొబైల్‌లో OTP; 2. DSC; 3. ఇ.వి.సి

Q2. ERI అతని/ఆమె క్లయింట్‌ల కోసం ITRలను బల్క్‌గా అప్లోడ్ చేస్తున్నప్పుడు గరిష్టంగా 20 JSON ఫైల్‌లను అప్‌లోడ్ చేయవచ్చు.

  1. ఒప్పు
  2. తప్పు

జవాబు – 2. తప్పు