రిటర్న్‌ల ఇ-వెరిఫికేషన్ కోసం 30 రోజుల సమయ పరిమితిపై తరచుగా అడిగే ప్రశ్నలు
1. ఇ-వెరిఫికేషన్ లేదా ITR-V సమర్పించడానికి సమయ పరిమితి ఏమిటి?
పరిష్కారం: ఇ-వెరిఫికేషన్ లేదా ITR-V సమర్పించడానికి ఆదాయ రిటర్న్ దాఖలు చేసిన తేదీ నుండి 30 రోజల సమయ పరిమితి ఉంటుంది.
(మరింత తెలుసుకోవాలంటే, ఇది చూడండి: 31.03.2024 తేదీ నాటి నోటిఫికేషన్ నంబర్. 2/2024, 01/04/2024 నుండి అమలులోకి వస్తుంది)
2. డేటాను బదిలీ చేసిన 30 రోజులలోపు ITR-Vని సమర్పించినట్లయితే, ఆదాయపు రిటర్న్‌ను సమర్పించే తేదీ ఏమిటి?
పరిష్కారం: ఆదాయ రిటర్న్ అప్‌లోడ్ చేసి, దానిని అప్‌లోడ్ చేసిన 30రోజుల్లోపు ITR-V సమర్పించినట్లయితే, అటువంటి సందర్భాల్లో ఆదాయ రిటర్న్ అప్‌లోడ్ చేసిన తేదీని ఆదాయ రిటర్న్ స్వీకరించిన తేదీగా పరిగణిస్తారు.
(మరింత తెలుసుకోవాలంటే, ఇది చూడండి: 31.03.2024 తేదీ నాటి నోటిఫికేషన్ నంబర్. 2/2024, 01/04/2024 నుండి అమలులోకి వస్తుంది)
3. 30 రోజుల సమయ పరిమితి దాటి ఇ-వెరిఫికేషన్ లేదా ITR-V సమర్పించినట్లయితే ఏమి జరుగుతుంది?
పరిష్కారం: ఆదాయ రిటర్న్ నిర్ణీత గడువు తేదీలోగా అప్‌లోడ్ చేసి, దానిని అప్‌లోడ్ చేసిన 30 రోజుల తర్వాత ఇ-వెరిఫై లేదా ITR-V సమర్పిస్తే, అలాంటి సందర్భాలలో ఇ-వెరిఫికేషన్/ITR-V సమర్పణ తేదీని ఆదాయ రిటర్న్ అందించిన తేదీగా పరిగణిస్తారు మరియు చట్టప్రకారంగా రిటర్న్ ఆలస్యంగా దాఖలు చేయడం వల్ల కలిగే పర్యవసానాలన్నీ వర్తిస్తాయి. సక్రమంగా ధృవీకరించబడిన ITR-Vని CPCలో స్వీకరించిన తేదీని ఈ 30 రోజుల వ్యవధిని నిర్ణయించడానికి పరిగణిస్తారు. అప్‌లోడ్ చేసిన తర్వాత ఆదాయ రిటర్న్ ధృవీకరించబడనట్లయితే, అటువంటి రిటర్న్ చెల్లనిదిగా పరిగణించబడుతుందని కూడా స్పష్టం చేయబడింది.
(మరింత తెలుసుకోవాలంటే, ఇది చూడండి: 31.03.2024 తేదీ నాటి నోటిఫికేషన్ నంబర్. 2/2024, 01/04/2024 నుండి అమలులోకి వస్తుంది)
4. ITR-Vని పంపాల్సిన చిరునామా ఏది?
పరిష్కారం: నిర్ణీత ఫార్మాట్‌లో మరియు నిర్ణీత పద్ధతిలో సరిగ్గా ధృవీకరించబడిన ITR-Vని సాధారణ లేదా స్పీడ్ పోస్ట్ ద్వారా లేదా మరేదైనా మాధ్యమం ద్వారా క్రింది చిరునామాకు మాత్రమే పంపాలి:
సెంట్రలైజ్డ్ ప్రాసెసింగ్ సెంటర్,
ఆదాయపు పన్ను శాఖ,
బెంగుళూరు - 560500, కర్ణాటక.
(మరింత తెలుసుకోవాలంటే, ఇది చూడండి: 31.03.2024 తేదీ నాటి నోటిఫికేషన్ నంబర్. 2/2024, 01/04/2024 నుండి అమలులోకి వస్తుంది)
5. ITR-V స్పీడ్ పోస్ట్ ద్వారా పంపబడిన సందర్భంలో వెరిఫికేషన్ కోసం ఏ తేదీ పరిగణించబడుతుంది?
పరిష్కారం: సక్రమంగా ధృవీకరించబడిన ITR-Vని CPCలో స్వీకరించిన తేదీని ఈ 30 రోజుల వ్యవధిని నిర్ణయించడం కోసం పరిగణిస్తారు.
(మరింత తెలుసుకోవాలంటే, ఇది చూడండి: 31.03.2024 తేదీ నాటి నోటిఫికేషన్ నంబర్. 2/2024, 01/04/2024 నుండి అమలులోకి వస్తుంది)