1. స్థిరమైన పాస్‌వర్డ్ అంటే ఏమిటి?
స్థిరమైన పాస్‌వర్డ్ అనేది రెండవ పాస్‌వర్డ్, ఇది ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వడానికి మీరు ఉపయోగించే దానికి అదనంగా ఉపయోగించదగినది. మీ ఇ-ఫైలింగ్ పాస్‌వర్డ్ మరియు స్థిర పాస్‌వర్డ్ మధ్య వ్యత్యాసం క్రింది విధంగా ఉంటుంది:
- మీ స్టాటిక్ పాస్‌వర్డ్‌ను మీరు సృష్టించాల్సిన అవసరం లేదు, ఇది సిస్టమ్ ద్వారా జనరేట్ అవుతుంది (మీరు స్టాటిక్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించాలని ఎంచుకుంటే).
- స్థిర పాస్‌వర్డ్‌ను ఉపయోగించడం ఐచ్ఛికం, ఇ-ఫైలింగ్ పాస్‌వర్డ్ తప్పనిసరి.
- స్థిర పాస్‌వర్డ్ రెండవ ప్రామాణీకరణ కారకం, మీ ఇ-ఫైలింగ్ పాస్‌వర్డ్ మొదటిది.
2. స్థిర పాస్‌వర్డ్ ఉత్పత్తి చేయటం వలన ప్రయోజనమేమిటి?
మీరు ఆధార్ OTP, EVC, నెట్ బ్యాంకింగ్, DSC లేదా QR కోడ్ వంటి రెండు-కారకాల ప్రామాణీకరణ కోసం వివిధ పద్ధతులను ఉపయోగించవచ్చు. ఈ పద్ధతులు సాధారణంగా మంచి నెట్‌వర్క్ కలిగి ఉండటంపై ఆధారపడి ఉంటాయి. మీకు తక్కువ మొబైల్ నెట్‌వర్క్ ఉన్నప్పుడు మరియు మీ మొబైల్ నంబర్‌లో OTPని స్వీకరించనపుడు స్థిర పాస్‌వర్డ్‌లు ఉపయోగపడతాయి.
3. నా స్వంత స్టాటిక్ పాస్‌వర్డ్‌ను ఏర్పరచుకోవాల్సిన అవసరం ఉందా?
లేదు. స్టాటిక్ పాస్‌వర్డ్‌లు సిస్టమ్ ద్వారా జనరేట్ చేయబడతాయి మరియు ఇ - ఫైలింగ్‌తో రిజిస్టర్ చేయబడిన మీ ఇమెయిల్ IDపై మీకు ఇమెయిల్ చేయబడతాయి.
4. స్థిర పాస్‌వర్డ్‌ను రూపొందించడానికి నియమాలు ఏమిటి?
- మొత్తం 10 స్టాటిక్ పాస్‌వర్డ్‌లు ఒకేసారి జనరేట్ అవుతాయి మరియు ఇ-ఫైలింగ్‌తో రిజిస్టర్ చేయబడిన మీ ఇ-మెయిల్ IDకి పంపబడతాయి.
- జనరేట్ చేయబడిన 10 పాస్‌వర్డ్‌ల నుండి, ఒక లాగిన్ కోసం ఒక పాస్‌వర్డ్ మాత్రమే ఉపయోగించబడుతుంది మరియు తిరిగి ఉపయోగించబడదు. మీరు జనరేట్ చేసిన జాబితా నుండి మరొకదాన్ని ఎంచుకోవాలి.
- మీకు పంపిన స్థిర పాస్‌వర్డ్‌లు ఉత్పత్తి అయిన తేదీ నుండి 30 రోజులు క్రియాశీలంగా ఉంటాయి.
- మీరు మీ స్టాటిక్ పాస్‌వర్డ్‌ని జనరేట్ చేసిన తర్వాత, మొత్తం 10 పాస్‌వర్డ్‌లను వినియోగించే వరకు లేదా 30 రోజులు ముగిసే వరకు, ఏది ముందుగా జరిగినా, స్టాటిక్ పాస్‌వర్డ్‌ను జనరేట్ చేయండి బటన్ నిలిపివేయబడుతుంది. 10 పాస్‌వర్డ్‌లు లేదా 30 రోజుల గడువు ముగిసిన తరువాత, మీరు మళ్లీ స్టాటిక్ పాస్‌వర్డ్‌లను జనరేట్ చేయాలి.
5. నేను స్టాటిక్ పాస్‌వర్డ్‌లను చాలాసార్లు జనరేట్ చేయవచ్చా, లేదా ఇది ఒకసారి మాత్రమే చెయ్యాల్సిన కార్యాచరణా?
అవును, మీరు స్టాటిక్ పాస్‌వర్డ్‌లను అనేక సార్లు జనరేట్ చేయవచ్చు, కానీ అన్ని 10స్టాటిక్ పాస్‌వర్డ్‌ల గడువు ముగిసిన తర్వాత (అంటే జనరేషన్ నుండి30 రోజుల తర్వాత) లేదా వినియోగించిన తరువాత మాత్రమే.
6. నాకు ఇప్పటికే ఇ-ఫైలింగ్ పాస్‌వర్డ్ ఉంది. నాకు స్థిర పాస్‌వర్డ్ ఎందుకు అవసరం?
మెరుగైన భద్రత కోసం, ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వడం రెండు కారకాల ప్రామాణీకరణను కలిగి ఉంటుంది. రెండు కారకాల ప్రామాణీకరణ అనేది అదనపు భద్రతా కవచంతో కూడిన పద్ధతి (వినియోగదారు పేరు మరియు పాస్‌వర్డ్‌తో పాటు). మీ ఇ-ఫైలింగ్ యూజర్ ఐ.డి మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేసిన తర్వాత రెండు కారకాల ప్రామాణీకరణ పద్ధతుల్లో స్థిర పాస్‌వర్డ్ ఒకటి.
7. ఇ-ఫైలింగ్ కోసం స్థిర పాస్‌వర్డ్ ఏమి కలిగి ఉన్నది?
ఇ-ఫైలింగ్ స్టాటిక్ పాస్‌వర్డ్ యాదృచ్ఛికంగా జనరేట్ చేయబడిన 6-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్.
8. నా ఉపయోగించని స్థిర పాస్‌వర్డ్‌ల స్థితిని నేను ఎలా తెలుసుకోగలను?
మీ ఇ-ఫైలింగ్ డాష్‌బోర్డ్ యొక్క ఎడమ మెను నుండి, "స్టాటిక్ పాస్‌వర్డ్" క్లిక్ చేయండి. మీరు గత 30 రోజులలో ఏదైనా స్టాటిక్ పాస్‌వర్డ్‌లను జనరేట్ చేశారా మరియు మీరు మొత్తం 10 స్టాటిక్ పాస్‌వర్డ్‌లను వినియోగించినట్లయితే సిస్టమ్ తనిఖీ చేస్తుంది. మీరు ఉపయోగించని స్థిర పాస్‌వర్డ్‌లు ఏవైనా ఉంటే, మిగిలిన 30 రోజులలో మీరు ఎన్ని పాస్‌వర్డ్‌లను మిగిల్చారో తెలుపుతుంది. "స్థిర పాస్‌వర్డ్‌ను తిరిగి పంపండి" క్లిక్ చేయండి మరియు మీ ఇ-ఫైలింగ్ నమోదిత ఇ-మెయిల్ ఐడిలో ఉపయోగించని స్థిర పాస్‌వర్డ్‌ల జాబితాతో మీకు ఇ-మెయిల్ వస్తుంది.
9. స్థిర పాస్‌వర్డ్‌ను నేను ఎక్కడ నమోదు చేయాలి?
స్టాటిక్ పాస్‌వర్డ్‌ను ఉపయోగించడానికి, మీరు వాటిని ఇంతకు ముందే జనరేట్ చేసి ఉండాలి. క్రింది సందర్భాల్లో మీరు మళ్ళీ స్టాటిక్ పాస్‌వర్డ్‌లను జనరేట్ చేయాలి:
- గతంలో జనరేట్ చేసిన మీ 10 పాస్‌వర్డ్‌లు అన్నీ ఉపయోగించినట్లయితే, లేదా
- మీరు చివరిగా స్టాటిక్ పాస్‌వర్డ్‌లను జనరేట్ చేసిన రోజు నుండి 30 రోజులు దాటితే ( మీరు మొత్తం 10 ని ఉపయోగించకపోయినా )
స్టాటిక్ పాస్‌వర్డ్‌లను ఉపయోగించే ప్రక్రియ ఈ క్రింది విధంగా ఉంది:
- ఇ - ఫైలింగ్ హోమ్ పేజీకి వెళ్ళండి, మీ ఇ - ఫైలింగ్ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి.
- ఇది మీరే అని ధృవీకరించండి పేజీ పై , మరొక పద్ధతి ప్రయత్నించండి పై క్లిక్ చేయండి.
- తదుపరి పేజీలో, స్టాటిక్ పాస్‌వర్డ్ పై క్లిక్ చేయండి, ఆపై కొనసాగించండి పై క్లిక్ చేయండి.
- స్టాటిక్ పాస్‌వర్డ్ పేజీలో, టెక్స్ట్‌బాక్స్ లో మీ చెల్లుబాటు అయ్యే స్టాటిక్ పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి మరియు లాగిన్ అవ్వండి.
10. ఇంతకుముందు ఏ నిర్దిష్ట స్థిర పాస్‌వర్డ్ ఉపయోగించబడిందో నాకు ఎలా తెలుస్తుంది?
మీరు ఉపయోగించిన పాస్‌వర్డ్‌లను మాన్యువల్ గా ట్రాక్ చేయవచ్చు, లేదా మీ డ్యాష్‌బోర్డ్ > స్టాటిక్ పాస్‌వర్డ్ ట్యాబ్ కి వెళ్ళండి > స్టాటిక్ పాస్‌వర్డ్ మళ్ళీ పంపండి పై క్లిక్ చేయండి. మీ ఇ-ఫైలింగ్ నమోదిత ఇ-మెయిల్ ఐడిలో ఉపయోగించని స్థిర పాస్‌వర్డ్‌ల జాబితాతో మీకు ఇ-మెయిల్ వస్తుంది.
11. స్థిర పాస్‌వర్డ్‌లను ఉపయోగించడం తప్పనిసరి కాదా?
లేదు. మీరు మీ లాగిన్‌ను సురక్షితంగా ఉంచటానికి ఇతర పద్ధతులను ఎంచుకోవచ్చు, ఆధార్ OTP, EVC, నెట్ బ్యాంకింగ్, DSC,, లేదా QR కోడ్ వంటివి మొబైల్ నెట్‌వర్క్ కనెక్టివిటీ తక్కువ లేదా లేని ప్రాంతంలో మీరు ఉంటే స్టాటిక్ పాస్‌వర్డ్ సహాయపడుతుంది, ఇక్కడ మీ మొబైల్‌లో OTP/EVC స్వీకరించడం కష్టతరం కావచ్చు.