1. నా ITR స్థితిని తనిఖీ చేయడం ఎందుకు ముఖ్యం?
ITR స్థితి మీరు దాఖలు చేసిన ITR ప్రస్తుతం ఏ స్థితి/దశలో ఉందో చూపుతుంది. మీరు ITR దాఖలు చేసిన తర్వాత, ఆదాయ పన్ను శాఖ దానిని అంగీకరించిందా మరియు అది ప్రక్రియ చేయబడిందా అని తెలుసుకోవచ్చు. ఏవైనా వ్యత్యాసాలు కనిపించిన సందర్భాల్లో, ITD నుండి వచ్చే సమాచారానికి మీరు స్పందించాల్సిన అవసరం ఉంది. కాబట్టి, మీ ITR స్థితిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం మంచిది.
2. వివిధ రకాల ITR స్థితులు ఏమిటి?
- ఇ - వెరిఫికేషన్/వెరిఫికేషన్ కోసం సమర్పించబడినది మరియు పెండింగ్‌లో ఉంది : ఇది మీరు మీ ITRను దాఖలు చేసినప్పటి స్థితి, కానీ దానిని ఇ - వెరిఫై చేయలేదు, లేదా మీరు సంతకం చేసిన ITR-V ఇంకా CPC వద్దకు చేరలేదు.
- విజయవంతంగా ఇ - వెరిఫై/వెరిఫై చేయబడింది : ఇది మీరు మీ రిటర్న్ సమర్పించిన మరియు ఇ - వెరిఫై/వెరిఫై చేసినప్పటి స్థితి, కానీ రిటర్న్ ఇంకా ప్రాసెస్ చేయబడలేదు.
- ప్రాసెస్ చేయబడింది : ఇది మీ రిటర్న్ విజయవంతంగా ప్రాసెస్ చేయబడినప్పటి స్థితి.
- లోపంగల: చట్టం ప్రకారం అవసరమైన సమాచారం లేకపోవడం లేదా కొన్ని అసమానతలు ఉన్న కారణంగా దాఖలు చేసిన రిటర్న్‌లో ఏదైనా లోపాన్ని విభాగం గమనించిన్నప్పటి స్థితి ఇది. అలాంటి సందర్భంలో, నోటీసు స్వీకరించిన తేదీ నుండి నిర్దిష్ట సమయ పరిమితిలోపు లోపాన్ని సరిదిద్దాల్సిందిగా సెక్షన్ 139 (9) ప్రకారం మీకు నోటీసు వస్తుంది. మీరు లోపంగల రిటర్న్ స్థితికి ప్రతిస్పందించకపోతే, మీ ITR చెల్లనిదిగా పరిగణించబడుతుంది మరియు ప్రాసెసింగ్ కోసం తీసుకోబడదు.
- మదింపు అధికారికి కేసు బదిలీ చేయబడింది: CPC మీ ITRని మీ అధికార పరిధిలో ఉన్న AOకి బదిలీ చేసిన స్థితి ఇది. మీ కేసు మీ AOకి బదిలీ చేయబడితే, అవసరమైన వివరాలను అందించడానికి అధికారి మిమ్మల్ని సంప్రదిస్తారు.
3. నా అధీకృత ప్రతినిధి / ERI అతని / ఆమె లాగిన్ ఉపయోగించి నా ITR స్థితిని యాక్సెస్ చేయగలరా?
అవును, అధీకృత ప్రతినిధి/ERIలు దాఖలు చేసిన ITRల కోసం, ఇది మీకు మరియు మీ అధీకృత ప్రతినిధి /ERIకి చూపించబడుతుంది. మీరు మీ స్వంత ITR (రిజిస్టర్ అయిన పన్ను చెల్లింపుదారుగా) ఫైల్ చేసినట్లయితే, మీ ఇ-ఫైలింగ్ ఖాతాలో స్థితి మీకు మాత్రమే చూపబడుతుంది.
4. ITR స్టేటస్ సేవ అనేది రిజిస్టర్ అయిన పన్ను చెల్లింపుదారుగా నా ITR స్థితిని చూడటానికి మాత్రమేనా?
లేదు. మీ ITR యొక్క స్థితిని చూడటమే కాకుండా, మీరు మీ ఆదాయ పన్ను రిటర్న్స్ వివరాలను చూడవచ్చు:
- మీ ITR-V గుర్తింపురసీదుని, అప్‌లోడ్ చేసిన JSON (ఆఫ్‌లైన్ యుటిలిటీ నుండి) PDF మరియు సమాచార క్రమంలో పూర్తి ITR ఫారమ్‌ను చూసి డౌన్‌లోడ్ చేసుకోండి.
- వెరిఫికేషన్ కోసం పెండింగ్‌లో ఉన్న మీ రిటర్న్(లు)ను చూడండి మరియు మీ రిటర్న్(లు)ను ఇ-వెరిఫై చేయడానికి తదుపరి చర్య తీసుకోండి.
5. నా ITR స్థితిని తనిఖీ చేయడానికి నేను లాగిన్ చేయాల్సిన అవసరం ఉందా?
లేదు, ITR స్థితిని లాగిన్ - ముందు మరియు లాగిన్ - తరువాత తనిఖీ చేయవచ్చు. మీరు మీ ITR స్థితిని లాగిన్ - తరువాత తనిఖీ చేస్తే రిటర్న్ / సమాచారాన్ని డౌన్‌లోడ్ చేయడం వంటి అదనపు సమాచారాన్ని పొందవచ్చు.
6. ITR స్థితి సేవతో, నేను చివరసారి దాఖలు చేసిన రిటర్న్‌లను మాత్రమే చూడగలనా లేదా మునుపటి రిటర్న్‌లను కూడా చూడగలనా?
మీరు మీ గత ఫైలింగ్‌లను అలాగే మీ ప్రస్తుత ఫైలింగ్‌లను చూడవచ్చు.
7. లాగిన్ చేయకుండానే నా ITR స్థితిని చూడటానికి ఈ-ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయబడిన నా మొబైల్ నంబర్ అవసరమా?
లేదు, మీరు లాగిన్ చేయకుండానే మీ ITR స్థితిని చూడటానికి ఏదైనా చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్‌ని ఉపయోగించవచ్చు. అయితే, మీరు లాగిన్ చేయకుండా ఈ సేవను ఉపయోగిస్తుంటే, మీరు చెల్లుబాటు అయ్యే ITR రసీదు నంబర్‌ను నమోదు చేయాలి.
8. నేను నా జీవిత భాగస్వామి యొక్క ITR స్థితిని చూడాలనుకుంటున్నాను. నేను అలా చూడగలనా?
మీరు మీ జీవిత భాగస్వామి యొక్క ITR స్థితిని క్రింది మార్గాల్లో చూడవచ్చు:
- లాగిన్ - ముందు : ఇ - ఫైలింగ్ హోమ్‌పేజీలో, ITR స్థితిని చూడండి పై క్లిక్ చేయండి. మీకు అతని/ఆమె ITR రసీదు నంబర్ మరియు చెల్లుబాటు అయ్యే మొబైల్ నంబర్ అవసరం.
- లాగిన్-తరువాత:
- మీరు మీ జీవిత భాగస్వామి ITR ను అధీకృత ప్రతినిధి / అధీకృత సంతకం చేసిన వ్యక్తిగా దాఖలు చేస్తే, మీరు మరియు మీ భాగస్వామి ఇద్దరూ ITR స్థితిని చూడవచ్చు.
- మీ జీవిత భాగస్వామి అతని / ఆమె స్వంత ITR దాఖలు చేస్తే, అతను / ఆమె అతని / ఆమె సొంత ఇ - ఫైలింగ్ ఖాతాపై స్థితిని చూడగలరు.
9. నా ITR స్థితిని తనిఖీ చేస్తున్నప్పుడు నమోదు చేయడానికి నా రసీదు సంఖ్యను నేను ఎక్కడ చూడగలను?
- మీరు మీ రిటర్న్‌ను ఇ-ఫైలింగ్ చేసిన తర్వాత మీ రిజిస్టర్డ్ ఇమెయిల్‌లో అందుకున్న మీ ITR-V నుండి మీ రసీదు నంబర్‌ను తనిఖీ చేయవచ్చు. మీ ITR-Vని ఇ-ఫైలింగ్ పోర్టల్ లోకి లాగిన్ తరువాత కూడా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు: ఇ-ఫైల్ >ఆదాయపు పన్ను రిటర్న్స్> ఫైల్ చేసిన రిటర్న్స్ చూడండి > రసీదు డౌన్‌లోడ్ ఎంపిక.
- మీరు ఫైల్ చేసిన ఫారమ్‌లను చూడండి సేవను ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో ఫైల్ చేసిన ITR కోసం మీ రసీదు సంఖ్య ( లాగిన్ తరువాత )ని కూడా తనిఖీ చేయవచ్చు.