Do not have an account?
Already have an account?

1. ఫారం 10B అంటే ఏమిటి?
పన్ను చెల్లింపుదారుడు ఇప్పటికే సేవా లేదా మతపరమైన ట్రస్ట్ / సంస్థగా నమోదు చేయబడితే లేదా దరఖాస్తు చేసుకుంటే ఫారం 10A దాఖలు చేయడం ద్వారా పన్ను చెల్లింపుదారు ఆడిట్ నివేదికను దాఖలు చేయడానికి ఫారం 10B అనుమతిస్తుంది. ఫారం 10B నా చార్టర్డ్ అకౌంటెంట్ సేవ క్రింద పన్ను చెల్లింపుదారు జోడించిన CA ద్వారా యాక్సెస్ చేయబడుతుంది మరియు సంబంధిత ఫారానికి కేటాయించబడుతుంది.

2. ఫారం 10Bని ఎవరు ఉపయోగించవచ్చు?
ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో వినియోగదారులుగా నమోదు చేయబడిన చార్టర్డ్ అకౌంటెంట్ లు 10B ఫారమ్‌ను యాక్సెస్ చేయవచ్చు. ఇంకా, దాన్ని యాక్సెస్ చేయడానికి, సవరించడానికి, సమీక్షించడానికి మరియు సమర్పించడానికి చార్టర్డ్ అకౌంటెంట్లకు పన్ను చెల్లింపుదారు ఫారంను కేటాయించాలి.

3. ఫారం 10Bని ఎప్పుడు దాఖలు చేయాలి?
సెక్షన్ 11 మరియు 12ల మీద ప్రభావం చూపకుండా ట్రస్ట్ లేదా సంస్థ యొక్క మొత్తం ఆదాయం లెక్కించబడినప్పుడు మరియు ఏదైనా ఆర్థిక సంవత్సరంలో అది ఆదాయపు పన్ను వసూలు చేయదగ్గ గరిష్ట మొత్తాన్ని మించినపుడు సంవత్సరానికి ఖాతాలను చార్టర్డ్ అకౌంటెంట్ ఆడిట్ చేయాలి.ఇందుకోసం సదరు వ్యక్తి ఆదాయపు పన్ను రిటర్న్ తో పాటు, రశీదును సమర్పించాలి. అటువంటి ఆడిట్ నివేదిక చార్టర్డ్ అకౌంటెంట్ సంతకం చేసి, ధృవీకరించిన ఫారం 10Bలో ఉండాలి.

4. ఫారం 10B ఆన్‌లైన్‌లో దాఖలు చేయడం తప్పనిసరా?
అవును, AY 2020 - 21 నుండి అమలులోకి వచ్చినట్లు, ఫారమ్ 10B ఆన్‌లైన్ విధానంలో మాత్రమే దాఖలు చేయాలి.

5. ఫారం 10B దాఖలు చేయటానికి ప్రక్రియ ఏమిటి?
పన్ను చెల్లింపుదారుచే చార్టర్డ్ అకౌంటెంట్ కు ఫారమ్ 10B కేటాయించబడుతుంది. చార్టర్డ్ అకౌంటెంట్ నమోదిత, క్రియాశీల మరియు చెల్లుబాటు అయ్యే డి.ఎస్.సి. ఉపయోగించి ఫారంను అప్‌లోడ్ చేయవచ్చు మరియు ఇ-ధృవీకరణ చేయవచ్చు. పన్ను చెల్లింపుదారుని అభ్యర్థనను అంగీకరించాలి.సమర్పణ ప్రక్రియను పూర్తి చేయడానికి దానిని డి.ఎస్.సి. లేదా ఈ.వీ.సి.ని ఉపయోగించి ధృవీకరించాలి.