1. అవలోకనం
ITD సేవా ద్వార జారి చేయబడ్డ ప్రమాణీకరణ నోటీసు/ఆర్డర్ ఇ-ఫైలింగ్ పోర్టల్ యొక్క నమోదైన మరియు నమోదు కాని వినియోగాదరులకు ప్రీ-లాగిన్ సేవగా అందుబాటులో ఉంటుంది, ఇది నోటీసు, ఆర్డర్, సమన్లు, లేఖ లేదా ఆదయపు పన్ను అధికారులు జారీ చేసిన ఏదైనా ఉత్తర ప్రత్యుత్తరాల యొక్క ప్రామాణికతను ధృవీకరించడానికి వీలు కల్పిస్తుంది.
2. ఈ సేవను పొందటానికి ముందస్తు అవసరాలు
- ఈ-ఫైలింగ్ పోర్టల్‌కు యాక్సెస్
3. దశలవారీ మార్గదర్శిని
దశ 1: ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్ పేజీకి వెళ్లండి.
దశ 2: ITD ద్వారా జారీ చేయబడ్డ అథెంటికేట్(ప్రమాణీకరణ) నోటీస్/ఆర్డర్ మీద క్లిక్ చేయండి.
దశ 3: నోటీస్/ఆర్డర్ ధృవీకరించడం కొరకు దిగువ పేర్కొన్న ఆప్షన్‌ల్లో దేనినైనా ఎంచుకోండి-
| PAN, డాక్యుమెంట్(పత్రం) రకం, అసెస్మెంట్ సంవత్సరం, జారీ తేదీ మరియు మొబైల్ నెంబరు | సెక్షన్ 3.1 చూడండి |
| డాక్యుమెంట్ గుర్తింపు నెంబరు మరియు మొబైల్ నెంబరు | సెక్షన్ 3.2 చూడండి |
3.1ఒకవేళ మీరు PAN, డాక్యుమెంట్ రకం, జారీ తేదీ మరియు మొబైల్ నెంబరు ఆప్షన్‌గా ఎంచుకున్నట్లయితే
దశ 1: PAN, డాక్యుమెంట్ రకం, అసెస్మెంట్ సంవత్సరం, జారీ తేదీ మరియు మొబైల్ నెంబరును ఎంచుకోండి.
దశ 2: PAN నమోదు చేయండి, డాక్యుమెంట్ రకం మరియు అసెస్మెంట్ సంవత్సరాన్ని ఎంచుకోండి, మొబైల్ నెంబరు మరియు జారీ తేదీని నమోదు చేయండి మరియు కొనసాగించు మీద క్లిక్ చేయండి.
దశ 3: దశ 2లో మీరు నమోదు చేసిన మొబైల్ నెంబరుపై అందుకున్న 6 అంకెల OTPని నమోదు చేయండి మరియు కొనసాగించుపై క్లిక్ చేయండి.
గమనిక:
- OTP కేవలం 15 నిమిషాలు మాత్రమే చెల్లుతుంది.
- సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 అవకాశాలు ఉంటాయి.
- స్క్రీన్(తెర)పై OTP గడువు ముగిసే కౌంట్ డౌన్ టైమర్,OTP ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
- OTP మళ్ళీ పంపండి క్లిక్ చేసిన తరువాత, కొత్త OTP జనరేట్ అయ్యి పంపించబడుతుంది.
OTP దృవీకరించబడిన తరువాత, నోటీస్ జారీ చేయబడ్డ తేదీతోపాటుగా జారీ చేయబడ్డ నోటీస్ యొక్క డాక్యుమెంట్ నెంబరు కనబడుతుంది.
గమనిక: ఒకవేళ ITD ద్వారా ఎలాంటి నోటీస్ జారీ చేయనట్లయితే, ఇవ్వబడ్డ ప్రమాణాలకు ఎలాంటి రికార్డ్ కనిపించలేదు అనే సందేశాన్ని ఇస్తుంది.
3.2: ఒకవేళ మీరు డాక్యుమెంట్ ఐడెంటిఫికేషన్ నెంబరు(గుర్తింపు సంఖ్య) మరియు మొబైల్ నెంబరు ఆప్షన్ ఎంచుకున్నట్లయితే
దశ 1: డాక్యుమెంట్ గుర్తింపు నెంబరు మరియు మొబైల్ నెంబరు ఎంచుకోండి.
దశ 2: డాక్యుమెంట్ గుర్తింపు నెంబరు మరియు మొబైల్ నెంబరు నమోదు చేసి కొనసాగించు మీద క్లిక్ చేయండి.
దశ 3: దశ 2లో మీరు నమోదు చేసిన మొబైల్ నెంబరుపై పొందిన 6 అంకెల OTPని నమోదు చేసి కొనసాగించుపై క్లిక్ చేయండి.
గమనిక:
- OTP కేవలం 15 నిమిషాలు మాత్రమే చెల్లుతుంది.
- సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 అవకాశాలు ఉంటాయి.
- స్క్రీన్(తెర)పై OTP గడువు ముగిసే కౌంట్ డౌన్ టైమర్,OTP ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
- రీసెండ్ OTPని క్లిక్ చేసిన తరువాత, కొత్త OTP పంపబడుతుంది.
OTP దృవీకరించబడిన తరువాత, ఒక విజయ సందేశం చూపబడుతుంది.
గమనిక: ఒకవేళ ITD ద్వారా ఎలాంటి నోటీస్ జారీ చేయనట్లయితే, ఇవ్వబడ్డ డాక్యుమెంట్ నెంబరు కొరకు ఎలాంటి రికార్డ్ కనుగొనబడలేదు అనే సందేశాన్ని ప్రదర్శిస్తుంది.