1. అవలోకనం
ఈ సర్వీసు ఇ-ఫైలింగ్ పోర్టల్ యొక్క రిజిష్టర్డ్ యూజర్స్ అందరికీ అందుబాటులో ఉంది. ఈ సర్వీస్ ఇ- ఫైలింగ్ పోర్టల్ యొక్క రిజిష్టర్డ్ యూజర్స్ ను, స్వదేశంలో లేకపోవడం వల్ల లేదా నివాసితులుగా లేనందున లేదా మరే ఇతర కారణాల వల్ల వారి ITRs / ఫార్మ్స్/ సర్వీస్ రిక్వెస్ట్స్ వెరిఫై చేయడం వీలుకానివారు, లేదా ఇతర కారణాల వల్ల వెరిఫై చేయలేనివారిని మరొక వ్యక్తికి ITRs / ఫార్మ్‌లు / సర్వీస్ రిక్వెస్ట్ వెరిఫై చేయడానికి అధికారాన్ని ఇస్తుంది. ఈ సర్వీస్ యూజర్స్ ను ప్రతినిధి మదింపుదారులుగా రిజిష్టర్ చేసుకోవడానికి మరియు మరొక వ్యక్తి తరపున పనిచేయడానికి తమను తాము రిజిష్టర్ చేసుకోవడానికి అనుమతిస్తుంది.
2. ఈ సర్వీస్ పొందడానికి ముందుగా అవసరమైనవి.
- మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్ యొక్క రిజిస్టర్డ్ యూజర్ అయి ఉండాలి
- ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వడానికి మీ వద్ద వాలీడ్ ఆధారాలు ఉండాలి
- యూజర్ మరియు ప్రతినిధి యొక్క PAN యాక్టివ్ గా ఉండాలి
3. దశల వారీ గైడ్
3.1మీ తరపున పనిచేయడానికి మరొక వ్యక్తికి అధికారం ఇవ్వండి
దశ 1: మీ వినియోగదారుని ఐడి మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 2: అధికారం కలిగిన భాగస్వాముల పై క్లిక్ చేయండి > స్వీయ తరపున వ్యవహరించడానికి మరొక వ్యక్తికి అధికారం ఇవ్వండి.
దశ 3: సర్వీస్ గురించి సూచనలతో పేజీ కనిపిస్తుంది. సూచనలను చదివిన తరువాత, లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి.
దశ 4: మీరు ఇప్పుడు గతంలోని రిక్వెస్ట్స్ చూడగలరు. కొత్త రిక్వెస్ట్ కోసం, యాడ్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ పై క్లిక్ చేయండి.
దశ 5: యాడ్ ఆథరైజ్డ్ సిగ్నేటరీ లేబుల్‌తో కొత్త స్క్రీన్ డిస్ప్లే అవుతుంది. ఆథరైజ్డ్ సిగ్నేటరీ యొక్క DOB మరియు పేరు, PAN, మరియు కారణం (PAN ప్రకారం వివరాలు) వంటి వివరాలను నింపండి మరియు కంటిన్యూ పై క్లిక్ చేయండి.

దశ 6: వెరిఫై యువర్ రిక్వెస్ట్ పేజీలో, ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో రిజిష్టర్ అయిన మీ మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ IDలో వచ్చిన 6-అంకెల OTP ని వేయండి మరియు సబ్మిట్ క్లిక్ చేయండి.
గమనిక:
- సరైన OTP ని నమోదు చేయడానికి మీకు 3 అవకాశాలు ఉన్నాయి. (మీరు మూడవసారి సరైన OTPని ఎంటర్ చేయడంలో విఫలమైతే, మీరు మళ్లీ దశ 1 నుండి ప్రారంభం కావాలి.)
- OTP 15 నిమిషాల పాటు మాత్రమే వాలీడ్ గా ఉంటుంది.
- OTP గడువు ఎప్పుడు ముగుస్తుందనే దానిని స్క్రీన్‌పై OTP ఎక్స్‌పైరీ కౌంట్‌డౌన్ టైమర్ మీకు చెబుతుంది.
- OTP ని జనరేట్ చేయడానికి మిగిలి ఉన్న సమయాన్ని రీసెండ్ OTP టైమర్ చూపిస్తుంది.
దశ 7: విజయవంతంగా వాలిడేషన్ అయిన తరువాత, సబ్మిటెడ్ సక్సెస్‌ఫుల్లీ అనే పాప్-అప్ డిస్ప్లే అవుతుంది.
గమనిక:
సబ్మిట్ చేసిన తరువాత, రిక్వెస్ట్ -
- రిక్వెస్ట్ రైజ్ చేసినట్టు తెలియజేస్తూ, ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఇ - మెయిల్ ID మరియు మొబైల్ నంబర్‌కు ఎలర్ట్ మెసేజ్ వెళుతుంది.
- ఆథరైజ్డ్ సిగ్నేటరీ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ కావచ్చు; గో టు 'వర్క్ లిస్ట్' టాబ్--> 'ఫర్ యువర్ యాక్షన్' టు వ్యూ/యాక్సెప్ట్/రిజెక్ట్ ది రిక్వెస్ట్.
- రిక్వెస్ట్ రైజ్ చేసి తేదీ నుండి 7 రోజుల్లోపు ఆథరైజ్డ్ సిగ్నేటరీ రిక్వెస్ట్ యాక్సెప్ట్ లేదా రిజెక్ట్ చేయాలి. మదింపుదారుడి నుండి అందుకున్న నోటరైజ్డ్ పవర్ ఆఫ్ అటార్నీ(POA) యొక్క PDF కాపీని అటాచ్ చేయడం ద్వారా రిక్వెస్ట్ అంగీకరించవచ్చు లేదా కామెంట్స్ అందించడం ద్వారా దానిని తిరస్కరించవచ్చు.
దశ 8: గతంలో సబ్మిట్ చేసిన రిక్వెస్ట్ లను చూడడానికి వ్యూ రిక్వెస్ట్ బటన్‌పై క్లిక్ చేయండి.
గమనిక:
- కేసు స్టేటస్ పెండింగ్‌లో ఉంటే క్యా్సిల్ రిక్వెస్ట్ బటన్ కనిపిస్తుంది.
- కేసు స్టేటస్ యాక్సెప్ట్ మరియు యాక్టివేట్ గా ఉంటే విత్‌డ్రా రిక్వెస్ట్ బటన్ కనిపిస్తుంది.
రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయడానికి, క్యాన్సిల్ రిక్వెస్ట్ బటన్‌పై క్లిక్ చేయండి. రిక్వెస్ట్ స్టేటస్ ఆథరైజేషన్ విత్‌డ్రాన్‌కు మారుతుంది. మీరు క్యాన్సిల్ క్లిక్ చేసిన తర్వాత, ప్రతినిధి అభ్యర్థనను అంగీకరించలేరు లేదా తిరస్కరించలేరు.
లేదా
రిక్వెస్ట్ విత్‌డ్రా చేయడానికి, విత్‌డ్రా రిక్వెస్ట్ బటన్‌పై క్లిక్ చేయండి. రిక్వెస్ట్ స్టేటస్ ఆథరైజేషన్ విత్‌డ్రాన్‌కు మారుతుంది.
3.2 ప్రతినిధిగా రిజిష్టర్ చేసుకోండి
దశ 1: మీ యూజర్ ID మరియు పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 2: ఆథరైజ్డ్ పార్ట్‌నర్స్ క్లిక్ చేయండి > ప్రతినిధి అసెసీగా రిజిష్టర్డ్ చేసుకోండి.
దశ 3: గత రిక్వెస్ట్స్ అన్నీ చూడడానికి లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి.
దశ 4: రిజిస్టర్ యాజ్ రిప్రజెంటేటివ్ పేజీలో క్రియేట్ న్యూ రిక్వెస్ట్ మీద క్లిక్ చేయండి.
దశ 5: డ్రాప్‌డౌన్ మెనూ నుండి అసెసీ రకాన్ని ఎంచుకోండి మరియు అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి. తప్పనిసరి అటాచ్మెంట్స్ అప్‌లోడ్ చేయండి మరియు కంటిన్యూ క్లిక్ చేయండి.
గమనిక: అటాచ్మెంట్ మాగ్జిమం సైజ్ 5 MB ఉండాలి.

దశ 6: మీ అభ్యర్థన ధ్రువీకరణ పేజీలో, ఇమెయిల్ నంబర్ మరియు ఇ - ఫైలింగ్ పోర్టల్‌తో నమోదు చేయబడిన మెయిల్ ఐడిపై స్వీకరించిన 6 అంకెల OTP ని అందించండి మరియు సబ్మిట్ క్లిక్ చేయండి.
గమనిక:
- సరైన OTP ని నమోదు చేయడానికి మీకు 3 అవకాశాలు ఉన్నాయి. (మీరు మూడవసారి సరైన OTPని ఎంటర్ చేయడంలో విఫలమైతే, మీరు మళ్లీ దశ 1 నుండి ప్రారంభం కావాలి.)
- OTP 15 నిమిషాల పాటు మాత్రమే వాలీడ్ గా ఉంటుంది.
- OTP గడువు ఎప్పుడు ముగుస్తుందనే దానిని స్క్రీన్‌పై OTP ఎక్స్‌పైరీ కౌంట్‌డౌన్ టైమర్ మీకు చెబుతుంది.
- రీసెండ్ OTP టైమర్ లో OTP రీజనరేట్ చేయడానికి మిగిలి ఉన్న సమయం చూపిస్తుంది.
దశ 7: అప్‌లోడ్ చేసిన అటాచ్మెంట్స్ తో సబ్మిట్ చేసిన అన్ని రిక్వెస్ట్స్ చూడటానికి వ్యూ రిక్వెస్ట్ బటన్‌ను క్లిక్ చేయండి.
గమనిక:
- కేసు స్టేటస్ పెండింగ్‌లో ఉంటే క్యా్సిల్ రిక్వెస్ట్ బటన్ కనిపిస్తుంది.
- కేసు స్టేటస్ అంగీకరించి, యాక్టివేట్ చేయబడితే విత్‌డ్రా రిక్వెస్ట్ బటన్ కనిపిస్తుంది.
రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయడానికి, క్యాన్సిల్ రిక్వెస్ట్ బటన్‌పై క్లిక్ చేయండి. రిక్వెస్ట్ స్టేటస్ అప్పుడు రిప్రజెంటేషన్ వెనకకు టీసుకున్నట్లుగా మారుతుంది.
లేదా
రిక్వెస్ట్ విత్‌డ్రా చేయడానికి, విత్‌డ్రా రిక్వెస్ట్ బటన్‌పై క్లిక్ చేయండి. రిక్వెస్ట్ స్టేటస్ అప్పుడు రిప్రజెంటేషన్ విత్‌డ్రాన్ కు మారుతుంది.
3.3 మరొక వ్యక్తి తరపున రిజిష్టర్ చేసుకోండి
దశ 1: మీ వినియోగదారుని ఐడి మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 2: ఆథరైజ్డ్ పార్ట్‌నర్స్> మరొక వ్యక్తి తరఫున పనిచేయడానికి రిజిష్టర్ పై క్లిక్ చేయండి.
దశ 3: మరొక వ్యక్తి తరపున రిజిస్టర్ కావడానికి మీకు సూచనలను చూపిస్తున్నట్లు పాపప్ కనిపిస్తుంది. లెట్స్ గెట్ స్టార్టెడ్ పై క్లిక్ చేయండి.
దశ 4: తదుపరి పేజీలో, కొత్త అభ్యర్థనను సృష్టించడంపై క్లిక్ చేయండి.
దశ 5: డ్రాప్‌డౌన్ నుండి అసెసీ క్యాటగిరీ ఎంచుకోండి మరియు అవసరమైన వివరాలను ఎంటర్ చేయండి. తప్పనిసరి అటాచ్మెంట్స్ అప్‌లోడ్ చేయండి (మాగ్జిమం అటాచ్మెంట్ సైజ్ 5 MB ఉండాలి) మరియు కంటిన్యూ క్లిక్ చేయండి.
దశ 6: వెరిఫై యువర్ రిక్వెస్ట్ పేజీలో, మీ మొబైల్ నంబర్ మరియు ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో రిజిష్టర్ చేసిన ఇమెయిల్ IDలో వచ్చిన 6 అంకెల OTP ని అందించండి మరియు సబ్మిట్ క్లిక్ చేయండి.
గమనిక:
- సరైన OTP ని నమోదు చేయడానికి మీకు 3 అవకాశాలు ఉన్నాయి. (మీరు మూడవసారి సరైన OTPని ఎంటర్ చేయడంలో విఫలమైతే, మీరు మళ్లీ దశ 1 నుండి ప్రారంభం కావాలి.)
- OTP 15 నిమిషాల పాటు మాత్రమే వాలీడ్ గా ఉంటుంది.
- OTP గడువు ఎప్పుడు ముగుస్తుందనే దానిని స్క్రీన్‌పై OTP ఎక్స్‌పైరీ కౌంట్‌డౌన్ టైమర్ మీకు చెబుతుంది.
- రీసెండ్ OTP టైమర్ లో OTP రీజనరేట్ చేయడానికి మిగిలి ఉన్న సమయం చూపిస్తుంది.
దశ 7: అప్‌లోడ్ చేసిన అటాచ్మెంట్స్ తో పాటు సబ్మిట్ చేసిన అన్ని రిక్వెస్ట్స్ చూడటానికి వ్యూ రిక్వెస్ట్ను క్లిక్ చేయండి.
గమనిక:
- కేసు స్టేటస్ పెండింగ్‌లో ఉంటే క్యా్సిల్ రిక్వెస్ట్ బటన్ కనిపిస్తుంది.
- కేసు స్టేటస్ యాక్సెప్ట్ మరియు యాక్టివేట్ గా ఉంటే విత్‌డ్రా రిక్వెస్ట్ బటన్ కనిపిస్తుంది.
రిక్వెస్ట్ క్యాన్సిల్ చేయడానికి, క్యాన్సిల్ రిక్వెస్ట్ బటన్‌పై క్లిక్ చేయండి. రిక్వెస్ట్ స్టేటస్ అప్పుడు రిప్రజెంటేషన్ వెనకకు టీసుకున్నట్లుగా మారుతుంది.
లేదా
రిక్వెస్ట్ విత్‌డ్రా చేయడానికి, విత్‌డ్రా రిక్వెస్ట్ బటన్‌పై క్లిక్ చేయండి. రిక్వెస్ట్ స్టేటస్ అప్పుడు రిప్రజెంటేషన్ వెనకకు టీసుకున్నట్లుగా మారుతుంది.
4. సంబంధిత విషయాలు
లాగిన్
మీకు మీరే నమోదు చేసుకోండి.
ఇ-వెరిఫై రిటర్న్స్
ఫైల్ చేసిన ఫార్మ్స్ చూడండి
డ్యాష్‌బోర్డ్
వర్క్‌లిస్ట్