1. EVC అంటే ఏమిటి?
ఎలక్ట్రానిక్ వెరిఫికేషన్ కోడ్ (EVC) అనేది 10-అంకెల ఆల్ఫాన్యూమరిక్ కోడ్, ఇది ఒక అంశాన్ని మీ రిజిస్టర్డ్ మొబైల్‌లో ఎలక్ట్రానిక్‌గా ధృవీకరించడానికి, ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వడానికి లేదా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయడానికి ఉపయోగించబడుతుంది. మీరు ఎలక్ట్రానిక్‌గా ఒక అంశాన్ని ధృవీకరించటానికి ( చట్టబద్ధమైన ఫారమ్‌లను ఇ - ధృవీకరించడానికి ఆదాయపు పన్ను రిటర్న్‌లను ఇ - ధృవీకరించడానికి, రిఫండ్ తిరిగి జారీ అభ్యర్ధన ఇ - ధృవీకరించడానికి, ఏదైనా నోటీసుకు సమాధానం ఇవ్వడానికి ) EVC ఉపయోగించవచ్చు, ఇ - ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి లేదా పాస్‌వర్డ్‌ను రీసెట్ చేయండి.
2. నేను వేరొకరి కోసం EVCని జనరేట్ చేయవచ్చా లేదా నా తరపున ఎవరైనా EVCని జనరేట్ చేయగలరా?
వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు నిర్దిష్ట కంపెనీకి చెందిన ప్రధాన సంప్రదింపు వ్యక్తి అయితే తనకి మరియు ఇంకొకరి PAN (కంపెనీ తప్ప) లేదా TANకి కూడా EVCని జనరేట్ చేయవచ్చు. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారు నిర్దిష్ట PANకి ప్రతినిధిగా అధికారం పొందినట్లయితే, ఇతర PAN వినియోగదారుకి కూడా EVCని జనరేట్ చేయవచ్చు.
3. ఇ.వి.సి. ద్వారా వారి రిటర్నులను కంపెనీ ధృవీకరించవచ్చా?
లేదు. EVCని సృష్టించడం ద్వారా ఒక సంస్థ వారి రిటర్న్స్ ని ధృవీకరించలేదు. వారు DSC ద్వారా తమ రిటర్నులను వెరిఫై చేయాల్సి ఉంటుంది.
4. నేను EVCని జనరేట్ చేయడానికి ప్రయత్నిస్తున్న ఖాతాతో నా PANని అనుసంధానించడం తప్పనిసరా?
అవును, EVCని జనరేట్ చేయడానికి మీరు ఏ ఖాతా ఉపయోగిస్తున్నారో దానికి మీ PANని అనుసంధానించడం తప్పనిసరి.
మీరు నెట్ బ్యాంకింగ్ లేదా బ్యాంక్ ATM ద్వారా ధృవీకరించిన బ్యాంక్ ఖాతాను ఉపయోగించి EVCని జనరేట్ చేస్తుంటే, మీరు మీ PANను అదే బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి.
ఒకవేళ మీరు డీమాట్ ఖాతా ఉపయోగించి EVCని జనరేట్ చేస్తుంటే, మీరు మీ PANని అదే డీమాట్ ఖాతాతో అనుసంధానించాలి.
5. జనరేట్ అయిన EVC ఎంత సమయం వరకు చెల్లుబాటు అవుతుంది?
జనరేట్ అయిన EVC జనరేట్ చేయబడిన సమయం నుండి 72 గంటల వరకు చెల్లుబాటు అవుతుంది.
6. వేర్వేరు రిటర్న్స్‌ని ఇ-వెరిఫై చేయడానికి నేను ఒకే EVCని 72 గంటలలోపు అనేకసార్లు ఉపయోగించవచ్చా?
లేదు, మీరు వేర్వేరు రిటర్న్‌లను ఇ-వెరిఫై చేయడానికి అదే EVCని ఉపయోగించలేరు. మీరు ఎలక్ట్రానిక్‌గా వెరిఫై చేయాలనుకునే ప్రతి అంశానికి మీరు కొత్త EVCని జనరేట్ చేయాలి.
7. నేను ఇ.వి.సి. ఉపయోగించి రిటర్న్ ధృవీకరించాను, నేను ఇంకా సి.పి.సి. బెంగళూరుకు భౌతిక ఐ.టి.ఆర్. V పంపాలా?
లేదు. మీరు EVCని ఉపయోగించి మీ రిటర్న్‌ను ధృవీకరించిన తర్వాత, మీరు ITR V యొక్క భౌతిక కాపీని CPC బెంగళూరుకు పంపాల్సిన అవసరం లేదు.
8. నేను EVC జనరేట్ చేయడానికి నా బ్యాంక్ ఖాతాను ఉపయోగించాలనుకుంటున్నాను. నేను ఏ బ్యాంక్ ఖాతా అయినా ఉపయోగించవచ్చా లేదా ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో అనుసంధానించబడిన బ్యాంక్ ఖాతాను మాత్రమే ఉపయోగించాలా?
మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో అనుసంధానించబడిన మరియు ధృవీకరించబడిన బ్యాంక్ ఖాతాతో మాత్రమే EVCని జనరేట్ చేయవచ్చు.
9. నేను దాఖలు చేసిన మునుపటి రిటర్న్‌లు పెండింగ్‌లో ఉంటే ధృవీకరించవచ్చా?
అవును, వెరిఫికేషన్‌కి సమయ పరిమితి ముగియకపోతే లేదా ఆలస్యాన్ని సమర్ధ ఆదాయపు పన్ను అధికారి క్షమిస్తే.
10. బ్యాంక్ ATM ఎంపిక ద్వారా నేను EVCని ఎలా జనరేట్ చేయాలి?
బ్యాంక్ ATM ఎంపిక ద్వారా EVCని జనరేట్ చేయడానికి, మీరు మీ PANను సంబంధిత బ్యాంక్ ఖాతాతో లింక్ చేయాలి మరియు అదే PANని ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి. ఇది లింక్ అయిన తర్వాత, మీరు ATMలో మీ డెబిట్ కార్డును స్వైప్ చేయవచ్చు/చొప్పించవచ్చు మరియు "ఆదాయపు పన్ను దాఖలు కోసం PIN" ఎంపికను ఎంచుకోవచ్చు. EVC మీ మొబైల్ నంబర్ మరియు ఇ - ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన ఇమెయిల్ IDకి పంపబడుతుంది.
11. బ్యాంక్ ఖాతా ద్వారా EVC జనరేట్ చేయడానికి ఏ బ్యాంకులు నన్ను అనుమతిస్తాయి?
ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో అనుంసంధానించబడిన మరియు ధృవీకరించబడిన క్రింది బ్యాంకులలో దేని ద్వారా అయినా మీరు EVCని జనరేట్ చేయవచ్చు:
- అలహాబాద్ బ్యాంక్
- ఆంధ్రా బ్యాంక్
- బ్యాంక్ ఆఫ్ బరోడా
- కెనరా బ్యాంక్
- సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- ఫెడరల్ బ్యాంక్
- HDFC బ్యాంక్
- ICICI బ్యాంక్
- IDBI బ్యాంక్
- కరూర్ వైశ్య బ్యాంక్
- కోటక్ మహీంద్రా బ్యాంక్
- ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్
- పంజాబ్ నేషనల్ బ్యాంక్
- సారస్వత్ బ్యాంక్
- సౌత్ ఇండియన్ బ్యాంక్
- స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- సిండికేట్ బ్యాంక్
- UCO బ్యాంక్
- యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
- యూనైటెడ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా
12. నా బ్యాంక్ ఖాతా లేదా డీమ్యాట్ ఖాతాను ఉపయోగించి EVCని రూపొందించే ముందు నేను నా బ్యాంక్ ఖాతాను లేదా నా డీమ్యాట్ ఖాతాను ముందస్తుగా ధృవీకరించాలా?
అవును, EVC జనరేట్ చేసే ముందు మీ బ్యాంక్ ఖాతా లేదా మీ డీమాట్ ఖాతాను ముందుగా ధృవీకరించాల్సిన అవసరం ఉంది.