1. అవలోకనం
ఇ-ఫైలింగ్ పోర్టల్ లో నమోదు చేసుకున్న వినియోగదారులందరికీ మేనేజ్ ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. అనే సేవ అందుబాటులో ఉంటుంది. ఈ సేవతో, పారం 15సిసి/ఫారం V ఫైల్ చేయటానికి అవసరమైన ఒక రిపోర్టింగ్ సంస్థ ఈ దిగువ పేర్కొన్న విధులను చేయవచ్చు:
- ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. జనరేట్ చేయండి (ఆదాయపు పన్ను విభాగ రిపోర్టింగ్ సంస్థ గుర్తింపు సంఖ్య); మరియు
- ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్.ను అలా జనరేట్ చేయడానికి సంబంధించి ఫారాలు 15సిసి మరియు ఫారం Vను ఎవరైనా అధీకృత వ్యక్తులు చూడగలిగేలా మరియు అప్‌లోడ్ చేయగలిగేలా చేస్తుంది.
రిపోర్టింగ్ సంస్థచే అధీకృత వ్యక్తి చేర్చబడిన తరువాత, ఈ సేవ ద్వారా అధీకృత వ్యక్తి ఆ అభ్యర్ధనను అంగీకరించవచ్చు.
ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. అంటే ఆదాయపు పన్ను విభాగంతో రిపోర్టింగ్ సంస్థ నమోదు అయిన తరువాత ఆదాయ పన్ను విభాగం (ఐ.టి.డి.)చే జారీ చేయబడి, కమ్యూనికేట్ చేయబడిన ప్రత్యేక ఐడి అని అర్థం. ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. అనేది 16-అక్షరాల గుర్తింపు సంఖ్య, ఇది XXXXXXXXXX.YZNNN రూపంలో ఉంటుంది, అందులో:
| ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. రూపం | వివరణ |
| XXXXXXXXXX | రిపోర్టింగ్ సంస్థ యొక్క పాన్ లేదా టాన్ |
| Y | ఫారం కోడ్ |
| Z | ఫారం కోడ్ కోసం రిపోర్టింగ్ సంస్థ కోడ్ |
| NNN | క్రమ సంఖ్య కోడ్ |
2. ఈ సేవను వినియోగించుకోవటానికి ముందస్తు ఆవశ్యకతలు
| క్రమ సంఖ్య | యూజర్ | వివరణ |
| 1. | రిపోర్టింగ్ సంస్థ |
|
| 2. | అధీకృత వ్యక్తి |
|
3. దశల వారీగా మార్గదర్శిని
3.1. ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. ఉత్పన్నం చేయండి
దశ 1: యూజర్ ఐడి మరియు పాస్వర్డ్‌ని ఉపయోగిస్తూ మీ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్ మీద, సేవలు > మేనేజ్ ఐటిడి రిపోర్టింగ్ సంస్థ గుర్తింపు సంఖ్య (ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్.) క్లిక్ చేయండి.
దశ 3: ఐ.టి.డి. రిపోర్టింగ్ సంస్థ గుర్తింపు సంఖ్య (ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్.) జనరేట్ చేయండి పేజీ మీద, కొత్త ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. జనరేట్ చేయండి మీద క్లిక్ చేయండి.
దశ 4: ఐ.టి.డి. రిపోర్టింగ్ సంస్థ గుర్తింపు సంఖ్య (ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్.) జనరేట్ చేయండి అనే పేజీ మీద, ఫారం రకం (ఫారం 15సిసి లేదా ఫారం V)ను ఎంచుకోండి.
దశ 5: అప్పుడు, డ్రాప్‌డౌన్ జాబితా నుండి సముచిత రిపోర్టింగ్ సంస్థ కేటగిరీని ఎంచుకుని, ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. జనరేట్ చేయండి పై క్లిక్ చేయండి.
దశ 6: ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. ను విజయవంతంగా జనరేట్ చేసిన మీదట, విజయవంతం అనే సందేశం ప్రదర్శితమవుతుంది. మీ ఫారాన్ని ఫైల్ చేయటంకోసం ఒక అధీకృత వ్యక్తిని చేర్చేందుకు ఇప్పుడు అధీకృత వ్యక్తిని చేర్చు మీద క్లిక్ చేయండి.
గమనిక:
- ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. ను విజయవంతంగా జనరేట్ చేసిన మీదట, ఇ-పైలింగ్ పోర్టల్‌తో నమోదు చేసుకున్న ప్రధాన మొబైల్ సంఖ్య మరియు ఇమెయిల్ ఐడి మీద మీరు ఒక ధృవీకరణ సందేశాన్ని అందుకుంటారు.
- అధీకృత వ్యక్తి తరువాత చేర్చడానికి అధీకృత వ్యక్తిని తరువాత చేర్చండి ని కూడా మీరు ఎంచుకోవచ్చు.
దశ 7: అధీకృత వ్యక్తిని చేర్చండి పేజిలో, అవసరమైన వివరాలను రాసి, అధీకృత వ్యక్తి రకం ఎంపిక చేసి, హోదాను తెలియజేసి, ప్రాప్యత తరహాని ఎంచుకుని, సేవ్ చేయండి పై క్లిక్ చేయండి.
గమనిక:
- అధీకృత వ్యక్తి యొక్క పాన్ లేదా ఆధార్ సమాచారం లేదా రెండింటినీ మీరు అందించవచ్చు.
- అధీకృత వ్యక్తి యొక్క ఆధార్‌ను మాత్రమే మీరు అందించిన యెడల, ఆ ఆధార్‌ను అధీకృత వ్యక్తి యొక్క పాన్‌తో అనుసంధానించాలి.
- అధీకృత వ్యక్తి పేరు అనేది ఒక ఐచ్ఛిక ఖాళీ. ఇమెయిల్ ఐడి, మొబైల్ సంఖ్య, అధీకృత వ్యక్తి తరహా, హోదా మరియు ప్రాప్యత తరహా తప్పనిసరి గా రాయాల్సిన ఖాళీలు
- అధీకృత వ్యక్తి ప్రాప్యత తరహా దిగువ పట్టిక ప్రకారం మారుతూ ఉంటుంది.
| ఫారం Vను మీరు ఎంచుకున్న యెడల | హోదాను నియమిత డైరక్టర్‌గా ఎంచుకున్న యెడల | అధీకృత వ్యక్తి ఫారాన్ని అప్‌లోడ్ చేయవచ్చు మరియు చూడవచ్చు. |
| హోదాను ప్రధాన అధికారిగా ఎంచుకున్న యెడల | అధీకృత వ్యక్తి ఫారాన్ని అప్‌లోడ్ చేయవచ్చు మరియు చూడవచ్చు. | |
| మీరు ఫారం 15సిసిని ఎంచుకుంటే | అధీకృత వ్యక్తి ఫారాన్ని అప్‌లోడ్ చేయవచ్చు మరియు చూడవచ్చు. |
దశ 8: అధీకృత వ్యక్తిని చేర్చుకోవటం విజయవంతం అయిన మీదట, దిగువ పాపప్ సందేశం వస్తుంది, ఇ-ఫైలింగ్ పోర్టల్‌తో నమోదు అయిన అధీకృత వ్యక్తి యొక్క మొబైల్ సంఖ్య మరియు ఇమెయిల్ ఐడికి సమాచారం పంపించబడుతుంది.
దశ 9: అధీకృత వ్యక్తి(క్తుల) స్థితిని చూడటానికి ముగించండి పై క్లిక్ చేయండి.
దశ 10: అధీకృత వ్యక్తి(క్తుల) పేజీలో అధీకృత వ్యక్తిని నిష్క్రియం చేయటానికి, యాక్టివ్ ట్యాబ్ కింద డీయాక్టివేట్ మీద క్లిక్ చేయండి.
దశ 11: ఇనాక్టివ్ ట్యాబ్ కింద అధీకృత వ్యక్తులు ఇప్పటికే చేర్చబడి ఉన్న యెడల యాక్టివేషన్ ఎంపికపై క్లిక్ చేయటం ద్వారా ఆ జాబితాలోని ఇనాక్టివ్‌గా ఉన్న అధీకృత వ్యక్తులను మీరు యాక్టివేట్ చేయవచ్చు.
3.2. అధీకృత వ్యక్తిచే క్రియాశీలం చేయడం
దశ 1: చెల్లుబాటయ్యే యూజర్ ఐడి మరియు పాస్వర్డ్‌ని ఉపయోగిస్తూ ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అవ్వండి.
దశ 2: మీ డ్యాష్‌బోర్డ్ మీద, పెండింగ్ యాక్షన్స్ >పని జాబితా మీద క్లిక్ చేయండి.
దశ 3: పని జాబితా పేజీ మీద, మీరు యాక్టివేట్ చేయదలచిన ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. పై యాక్టివేట్ మీద క్లిక్ చేయండి.
దశ 4: ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. అభ్యర్థన - ఓ.టి.పి. చెల్లుబాటు చేసే పేజీ మీద, అధీకృత వ్యక్తిని చేర్చండి పేజీలో ఒక అధీకృత వ్యక్తిగా మిమ్మల్ని చేర్చుతుండగా వినియోగదారు ఎంటర్ చేసిన మొబైల్ సంఖ్య (మీతో సౌలభ్యంగా ఉన్న) మరియు ఇమెయిల్ ఐడిపై అందుకున్న ప్రత్యేకమైన 6-అంకెల ఓటిపిలను ఎంటర్ చేసి కొనసాగండి పైన క్లిక్ చేయండి.
గమనిక:
- ఓ.టి.పి. కేవలం 15నిమిషాల సేపు చెల్లుబాటు అవుతుంది..
- సరైన ఓ.టి.పి.ని నమోదు చేయడానికి మీకు 3 అవకాశాలు ఉన్నాయి.
- స్క్రీన్ మీద ఓ.టి.పి గడువు ముగిసే కౌంట్‌డౌన్ టైమర్ ఓ.టి.పి. ఎప్పుడు ముగుస్తుందో చెప్తుంది.
- ఓ.టి.పి.ని మరలా పంపించండి ని క్లిక్ చేసిన మీదట, ఒక కొత్త ఓ.టి.పి. జనితం చేయబడి, పంపబడుతుంది.
దశ 5: ఐ.టి.డి.ఆర్.ఇ.ఐ.ఎన్. అభ్యర్థన - కొత్త పాస్వర్డ్ సెట్ చేసే పేజీలో, కొత్త పాస్వర్డ్ సెట్ చేయండిలో పాస్వర్డ్‌ను రాసి మరియు కొత్త పాస్వర్డ్ ఎంపికలను నిర్ధారించి, యాక్టివేట్ మీద క్లిక్ చేయండి.
గమనిక:
- రిఫ్రెష్ లేదా బ్యాక్ మీద క్లిక్ చేయరాదు.
- మీ కొత్త పాస్వర్డ్‌ను రాసేటప్పుడు, పాస్వర్డ్ విధానం పట్ల శ్రద్ధ వహించండి:
- అది కనీసం 8అక్షరాలు మరియు గరిష్ఠంగా 14అక్షరాలతో ఉండాలి.
- అందులో అప్పర్‌కేస్ మరియు లోయర్‌కేస్ అక్షరాలతో సహా ఉండాలి.
- అందులో ఒక సంఖ్య తప్పనిసరిగా ఉండాలి.
- ప్రత్యేక అక్షరాలను కలిగి ఉండాలి (ఉదా. @#$%).
దశ 6:యాక్టివేషన్ విజయవంతం అయిన మీదట, దిగువ సందేశం ప్రదర్శితమవుతుంది.
దశ 7: ఫారం 15సిసి మరియు/లేదా ఫారం V ని మీరు చూడాలని / అప్‌లోడ్ చేయాలని మీరు కోరుకుంటే, ఐటిడిఆర్ఇఐఎన్ పాన్ మరియు పాస్వర్డ్ ఉపయోగిస్తూ ఇ-ఫైలింగ్ పోర్టల్ లోకి లాగ్ ఇన్ అవ్వండి.
4. సంబంధిత అంశాలు
- ఇక్కడ లాగిన్ చేయండి
- డ్యాష్‌బోర్డ్
- పనిజాబితా
- నా ప్రొఫైల్
- పాస్‌వర్డ్‌ను మరచిపోయారా