Do not have an account?
Already have an account?

1. అవలోకనం

ఈ ప్రీ-లాగిన్ సేవ అన్ని పన్ను చెల్లింపుదారులకు అందుబాటులో ఉంది. ఈ మాన్యువల్ ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేసుకుని యాక్సెస్ చేయాలనుకునే అన్ని పన్ను చెల్లింపుదారుల కోసం (ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో మరొక ప్రత్యేకమైన యూజర్ మాన్యువల్ ఉన్న కంపెనీలు తప్ప) ఉద్దేశించబడింది. రిజిస్ట్రేషన్ సేవ పన్ను చెల్లింపుదారునికి పన్ను సంబంధిత కార్యకలాపాలన్నింటినీ యాక్సెస్ చేయడానికి మరియు ట్రాక్ చేయడానికి వీలు కల్పిస్తుంది.

2. ఈ సేవను పొందడానికి ముందస్తు అవసరాలు

  • చెల్లుబాటు అయ్యే మరియు క్రియాశీల PAN
  • చెల్లుబాటు అయ్యే మొబైల్ నెంబర్
  • చెల్లుబాటు అయ్యే ఇమెయిల్ ఐ.డి

3. దశలవారీ మార్గదర్శిని


దశ 1: ఇ-ఫైలింగ్ పోర్టల్ హోమ్‌పేజీకి వెళ్లి, రిజిస్టర్ పైన క్లిక్ చేయండి.

Data responsive



దశ 2: మీ PANని పన్ను చెల్లింపుదారుగా రిజిస్టర్ చేసుకోండి ఎంపిక కింద నమోదు చేసి ధ్రువీకరించండి క్లిక్ చేయండి. ఒకవేళ PAN ఇప్పటికే రిజిస్టర్ చేయబడి ఉంటే లేదా చెల్లనిది అయితే, లోపం ఉందనే సందేశం ప్రదర్శించబడుతుంది.

22.1

PAN మరియు ఆధార్ లింక్ చేయబడి ఉంటే, పాప్ అప్ సందేశంలో, UIDAI డేటాబేస్‌తో వివరాలను ధృవీకరించడానికి నిర్ధారించు అనే చెక్‌బాక్స్‌ను ఎంచుకోండి.

2.2



దశ 3: ప్రాథమిక వివరాల పేజీలో మీ PAN ప్రకారం ఉన్న పేరు, పుట్టిన తేదీ / కంపెనీని నెలకొల్పిన తేదీ, లింగం (వర్తించినట్లైతే), నివాస స్థితితో సహా అన్ని తప్పనిసరి వివరాలను నమోదు చేయండి మరియు కొనసాగించును క్లిక్ చేయండి.

3



దశ 4: PAN ధృవీకరించిన తరువాత, వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకి సంప్రదింపు వివరాలు పేజీ కనిపిస్తుంది. ప్రాథమిక మొబైల్ నంబర్, ఇమెయిల్ ID మరియు చిరునామాతో సహా మీ సంప్రదింపు వివరాలను నమోదు చేయండి.కొనసాగించండి క్లిక్ చేయండి.

4




దశ 5: పేర్కొన్న ప్రాథమిక మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ ID కి రెండు వేర్వేరు OTPలు పంపబడతాయి, మొబైల్ నంబర్ మరియు ఇమెయిల్ IDకి అందుకున్న ప్రత్యేక 6అంకెల OTPలను నమోదు చేసి, కొనసాగించు క్లిక్ చేయండి.

గమనిక:

  • ఇది కేవలం 15 నిమిషాల పాటు మాత్రమే చెల్లుబాటు అవుతుంది.
  • సరైన OTPని నమోదు చేయడానికి మీకు 3 ప్రయత్నాలు ఉన్నాయి.
  • స్క్రీన్‌పై OTP గడువు ముగిసే కౌంట్‌డౌన్ టైమర్ OTP గడువు ఎప్పుడు ముగుస్తుందో మీకు తెలియజేస్తుంది.
  • OTPని తిరిగి పంపండి క్లిక్ చేసిన తరువాత, క్రొత్త OTP జనరేట్ అయ్యి పంపబడుతుంది.

 

దశ 6: అవసరమైతే పేజీలోని వివరాలను సవరించి నిర్ధారించు పై క్లిక్ చేయండి.

6



దశ 7: పాస్‌వర్డ్ సెట్ పేజీలో, పాస్‌వర్డ్ సెట్ మరియు పాస్‌వర్డ్ నిర్ధారణ రెండింటిలోనూ మీకు కావలసిన పాస్‌వర్డ్‌ను నమోదు చేయండి. మీ వ్యక్తిగతీకరించిన సందేశాన్ని నమోదు చేసి, నమోదు చేయండిపై క్లిక్ చేయండి.

7

గమనిక:

  • రిఫ్రెష్ లేదా బ్యాక్ పై క్లిక్ చేయవద్దు.
  • మీ కొత్త పాస్‌‌వర్డ్‌ని నమోదు చేసేటప్పుడు, పాస్‌వర్డ్ పాలసీ విషయంలో జాగ్రత్త వహించండి:
    • ఇది కనీసం 8 అక్షరాలు మరియు అత్యధికంగా 14 అక్షరాలు ఉండాలి.
    • ఇది పెద్ద అక్షరాలు, చిన్న అక్షరాల సమూహం అయి ఉండాలి.
    • దీనిలో ఒక సంఖ్య ఉండాలి.
    • దీనికి ప్రత్యేక గుర్తు ఉండాలి [ఉదా. @#$%]

దశ 8: మీరు విజయవంతంగా రిజిస్టర్ చేసుకున్నాకా, లాగిన్ ప్రక్రియను ప్రారంభించడానికి లాగిన్‌కు కొనసాగించండి క్లిక్ చేయండి.

8

 

4. సంబంధిత అంశాలు

  • లాగిన్ చేయండి
  • డాష్‌బోర్డ్
  • PAN ఆధార్ లింక్
  • ఆదాయపు పన్ను రిటర్న్