1. అవలోకనం
ఇ - ఫైలింగ్ పోర్టల్ లో నమోదైన వినియోగదారులందరికి తమ ప్రొఫైల్ సమాచారాన్ని చూడడానికి, సవరించడానికి / నవీకరించడానికి నా ప్రొఫైల్ / అప్‌డేట్ ప్రొఫైల్ సేవ అందుబాటులో ఉంది. ఈ సేవ వినియోగదారులకు వివిధ రకాలుగా ఉన్న పద్ధతుల ఆధారంగా ప్రొఫైల్ సమాచారాన్ని సవరించడానికి / నవీకరించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది:
- పాన్ వివరాలు, టాన్ వివరాలు, ఆధార్ నంబర్ వంటి మీ వ్యక్తిగత వివరాలను వీక్షించండి / నవీకరించండి
- మొబైల్ నంబర్, ఇ-మెయిల్ ఐడి మరియు చిరునామా వంటి మీ సంప్రదింపు వివరాలను వీక్షించండి / నవీకరించండి
- మీ ఇతర వివరాలను వీక్షించండి / నవీకరించండి:
- బ్యాంక్ ఖాతా మరియు డీమాట్ ఖాతా వివరాలు
- DSC రిజిస్టర్ చేయండి
- ఇ - ఫైలింగ్ వాల్ట్ అధిక భద్రత
- PAN- ఎ.ఓ. (మదింపు అధికారి) అధికార పరిధి వివరాలు
- ఆదాయపు పన్ను రిటర్న్స్ / ఫారంలలో ప్రతినిధి మదింపుదారుడు మరియు అధీకృత సంతకం చేసిన వారి వివరాలు
- ఆదాయ వివరాల మూలం
- రిజిస్ట్రేషన్లు మరియు ధృవపత్రాలు
- ప్రశంసాపత్రాలు మరియు బహుమతులు
- పోర్చుగీస్ సివిల్ కోడ్ వర్తింపు
2. ఈ సేవను పొందటానికి ముందస్తు అవసరాలు
- చెల్లుబాటు అయ్యే వినియోగదారుని ID, పాస్‌వర్డ్‌తో ఇ-ఫైలింగ్ పోర్టల్‌లో నమోదు చేయబడిన వినియోగదారుడై ఉండాలి.
3. దశలవారీ మార్గదర్శిని
దశ 1: మీ వినియోగదారు ID మరియు పాస్‌వర్డ్ ఉపయోగించి ఇ-ఫైలింగ్ పోర్టల్‌లోకి లాగిన్ అవ్వండి.
దశ 2: డాష్‌బోర్డ్ పేజీలో, మీ డాష్‌బోర్డ్ యొక్క ఎగువ కుడి మూలలో, మీ పేరుపై క్లిక్ చేసి, నా ప్రొఫైల్‌పై క్లిక్ చేయండి.
దశ 3: నా ప్రొఫైల్ పేజీలో, మీరు వీటిని వీక్షించవచ్చు మరియు / లేదా నవీకరించవచ్చు:
| పౌరసత్వం, నివాస వివరాలు, పాస్‌పోర్ట్ సంఖ్య వంటి వ్యక్తిగత వివరాలు | సెక్షన్ 3.1 చూడండి |
| మొబైల్ నంబర్, ఇమెయిల్ ఐడి మరియు చిరునామా వంటి సంప్రదింపు వివరాలు | సెక్షన్ 3.2 చూడండి |
| ఆదాయ వివరాల మూలం | సెక్షన్ 3.3 చూడండి |
| పోర్చుగీస్ సివిల్ కోడ్ వర్తింపు | సెక్షన్ 3.4 చూడండి |
| ఆదాయపు పన్ను రిటర్న్స్ / ఫారంలలో అధీకృత సంతకందారుడు |
ఆదాయపు పన్ను రిటర్న్స్ / ఫారమ్‌లలో అధీకృత సంతకందారుపై క్లిక్ చేయండి. వివరాలను అప్‌డేట్ చేయడానికి ఎడిట్ చేసి, సేవ్ క్లిక్ చేయండి. గమనిక: అధీకృత ప్రతినిధి / సంతకందారుని ఎలా రిజిస్టర్ చేయాలో తెలుసుకోవడానికి ప్రతినిధిగా అధికారం ఇచ్చి నమోదు చేయండి యూజర్ మాన్యువల్‌ని చూడండి. |
| ప్రతినిధి మదింపుదారుడు |
ప్రతినిధి మదింపుదారుపై క్లిక్ చేయండి. వివరాలను అప్‌డేట్ చేయడానికి ఎడిట్ చేసి, సేవ్ క్లిక్ చేయండి. గమనిక: ప్రతినిధి మదింపుదారుని ఎలా నమోదు చేయాలో తెలుసుకోవడానికి ప్రతినిధిగా అధికారం ఇచ్చి నమోదు చేయండి యూజర్ మాన్యువల్‌ని పరిశీలించండి. |
| సురక్షిత ప్రాప్యత సందేశాన్ని సెట్ చేయండి (మీరు ఇ-ఫైలింగ్ పోర్టల్‌కు లాగిన్ అయిన ప్రతిసారీ వ్యక్తిగతీకరించిన సందేశం కనిపిస్తుంది. మీరు మీ యూజర్ ఐడి మరియు పాస్‌వర్డ్‌ను నమోదు చేస్తున్న వెబ్‌సైట్ నిజమైన ఇ-ఫైలింగ్ పోర్టల్ అవునా అని తనిఖీ చేయడానికి వ్యక్తిగతీకరించిన సందేశం ఒక ఉపయోగకరమైన మార్గం) |
సురక్షిత ప్రాప్యత సందేశాన్ని క్లిక్ చేయండి. సురక్షిత ప్రాప్యత సందేశ పేజీలో, టెక్స్ట్‌బాక్స్‌లోని వ్యక్తిగతీకరించిన సందేశాన్ని నమోదు చేసి, సేవ్ పై క్లిక్ చేయండి. |
| ఆధార్ OTP లాగిన్ | ఒకే అంశం ప్రామాణీకరణ కోసం ఆధార్ OTP ద్వారా మీ లాగిన్‌ను ప్రారంభించడానికి, ఆధార్ OTP లాగిన్‌ను క్లిక్ చేయండి. ఆధార్ OTP లాగిన్ పేజీలో, అవునుఎంచుకోని సేవ్ చేస్తే, ఆధార్ OTP ద్వారా లాగిన్ కి అనుమతి వస్తుంది. |
| అధికార పరిధి వివరాలు | అధికారపరిధి వివరాలను వీక్షించడానికి అధికార పరిధిని క్లిక్ చేయండి |
| రిజిస్ట్రేషన్లు మరియు ధృవపత్రాలు | ఇ-PAN వివరాలను, స్టార్టప్ గుర్తింపు వివరాలు మరియు ఇ-దాఖలు చేసిన ఫారంల వివరాలు చూడటానికి, డౌన్‌లోడ్ చేయడానికి రిజిస్ట్రేషన్‌లు మరియు సర్టిఫికెట్లు క్లిక్ చేయండి. |
| ప్రశంసలు మరియు బహుమతులు | ప్రశంసాపత్రం డౌన్‌లోడ్ చేయడానికి ప్రశంసలు మరియు బహుమతులు క్లిక్ చేయండి |
| బ్యాంక్ ఖాతా వివరాలు |
బ్యాంక్ ఖాతా వివరాలపై క్లిక్ చేస్తే, మీరు బ్యాంక్ ఖాతా సేవ పేజీకి వెళ్తారు, ఇక్కడ మీరు బ్యాంక్ ఖాతా నుండి EVCని జోడించవచ్చు/తొలగించవచ్చు లేదా ప్రారంభించవచ్చు/ నిలిపివేయవచ్చు. |
| డీమ్యాట్ ఖాతా వివరాలు |
డీమ్యాట్ ఖాతా వివరాలపై క్లిక్ చేస్తే, మీరు డీమ్యాట్ ఖాతా సేవా పేజీకి వెళ్తారు, అక్కడ మీరు డీమ్యాట్ ఖాతా నుండి EVCని జోడించవచ్చు/తీసివేయవచ్చు లేదా ప్రారంభించవచ్చు/ నిలిపివేయవచ్చు. |
| డి.ఎస్.సి. నమోదు చేయండి లేదా డి.ఎస్.సి. ని వీక్షించండి మరియు నవీకరించండి | DSCలో నమోదు పై క్లిక్ చేస్తే, మీరు రిజిస్టర్ డిజిటల్ సిగ్నేచర్ సర్టిఫికేట్ (DSC) పేజీకి తీసుకెళ్లబడతారు. అక్కడ మీరు:
గమనిక: మరింత తెలుసుకోవడానికి DSC రిజిస్టర్ చేయండి యూజర్ మాన్యువల్‌ను చూడండి. |
| ఇ-ఫైలింగ్ ఖజానాలో అధిక భద్రత ఉంటుంది. |
ఇ-ఫైలింగ్ ఖజానా-అధిక భద్రతపై క్లిక్ చేస్తే, మీరు ఇ-ఫైలింగ్ ఖజానా-అధిక భద్రతా పేజీకి వెళ్తారు, ఇక్కడ మీరు మీ ఇ-ఫైలింగ్ ఖాతాకు అదనపు స్థాయి ప్రామాణీకరణను జోడించవచ్చు. |
| స్టాటిక్ పాస్‌వర్డ్ |
స్టాటిక్ పాస్‌వర్డ్ జనరేట్ చేయడానికి స్టాటిక్ పాస్‌వర్డ్‌ను క్లిక్ చేయండి. |
గమనిక:
- బాహ్య ఏజెన్సీలు - బాహ్య ఏజెన్సీ రకం, సేవా రకం, సంస్థ యొక్క PAN, సంస్థ యొక్క TAN, ల్యాండ్‌లైన్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడి వంటి వ్యక్తిగత వివరాలను సవరించవచ్చు / నవీకరించవచ్చు.
- ERIs మరియు TIN 2.0 రిజిస్ట్రేషన్ వాటాదారులు తమ వ్యక్తిగత వివరాలను మాత్రమే చూడగలరు. వ్యక్తిగత వివరాలను వేటినీ సవరించలేరు / నవీకరించలేరు.
- ERIs, బాహ్య ఏజెన్సీలు మరియు TIN 2.0 రిజిస్ట్రేషన్ వాటాదారులు తమ సంప్రదింపు వివరాలను నవీకరించవచ్చు.
- ERIs మరియు బాహ్య ఏజెన్సీలు తమ సంబంధిత ప్రొఫైల్స్ ద్వారా సేవలను జోడించవచ్చు లేదా తీసివేయవచ్చు.
- మరింత తెలుసుకోవడానికి సంబంధిత యూజర్ మాన్యువళ్లను చూడండి.
3.1 వ్యక్తిగత వివరాలు నవీకరించడానికి
దశ 1: నా ప్రొఫైల్ పేజీలో, వ్యక్తిగత వివరాలను నవీకరించడానికి సవరించుపై క్లిక్ చేయండి.
గమనిక: పౌరసత్వం మరియు నివాస స్థితిని మార్చవచ్చు.
దశ 2: కావలసిన వివరాలు సవరించిన తర్వాత, సేవ్‌పై క్లిక్ చేయండి
గమనిక: వినియోగదారు రకాన్ని బట్టి కొన్ని వివరాలు సవరించబడవని దయచేసి గమనించండి.
3.2 ప్రాథమిక మరియు రెండవ సంప్రదింపు వివరాలను నవీకరించడానికి (మొబైల్ నంబర్ మరియు ఇ-మెయిల్ ఐడి)
(మీరు ఆధార్, PAN లేదా బ్యాంక్ వివరాల ప్రకారం మీ మొబైల్ నంబర్‌ను కూడా అప్‌డేట్ చేయవచ్చు)
దశ 1: నా ప్రొఫైల్ పేజీలో, సంప్రదింపు వివరాలను నవీకరించడానికి ఎడిట్ పై క్లిక్ చేయండి.
దశ 2: బ్యాంక్ / ఆధార్ / PAN వివరాల ప్రకారం మొబైల్ నంబర్‌ను నమోదు చేసి, ఇ-వెరిఫైకి కొనసాగండి క్లిక్ చేయండి.
దశ 3a: మీ సంప్రదింపు వివరాలను ధృవీకరించండి పేజీలో, ప్రాథమిక మరియు ద్వితీయ మొబైల్ నంబర్‌లకు అందుకున్న రెండు వేర్వేరు 6-అంకెల OTPని నమోదు చేయండి మరియు మరొకటి ప్రాథమిక మరియు ద్వితీయ ఇమెయిల్ ఐడికి పంపబడింది. OTPలను నమోదు చేసిన తర్వాత “సమర్పించి ధృవీకరణకు కొనసాగండి క్లిక్ చేయండి.
దశ 3b: ఇ-వెరిఫై పేజీలో, మీరు రిటర్న్‌ను ఇ-వెరిఫై చేయాలనుకుంటున్న ఎంపికను ఎంచుకుని, కొనసాగించుపై క్లిక్ చేయండి.
గమనిక: మీరు ప్రవాసులు అయితే PAN కార్డు కలిగి ఉండకపోతే మరియు అవసరం లేకపోతే దశ 3B వర్తించదు.
3.3. ఆదాయ మూలాలు నవీకరించడానికి (పన్ను చెల్లింపుదారుల కోసం మాత్రమే)
దశ 1: నా ప్రొఫైల్ పేజీలో, ఆదాయ మూలం క్లిక్ చేయండి.
దశ 2: వివరాలు జోడించకపోతే, వివరాలను జోడించండి పై క్లిక్ చేయండి.
గమనిక: ఆదాయ మూలం నింపబడితే, మరియు మీరు వివరాలను నవీకరించాలి అనుకుంటే సవరించండి పై క్లిక్ చేయండి. మీరు ఇప్పటికే జోడించిన ఆదాయ మూలాన్ని తొలగించాలనుకుంటే, తొలగించండి పై క్లిక్ చేయండి, మీ ప్రొఫైల్ నుండి వివరాలు తొలగించబడతాయి.
దశ 3: డ్రాప్‌డౌన్ నుండి ఆదాయ మూలాన్ని ( ఉద్యోగి/పెన్షనర్, ఇంటి ఆస్తి, వ్యాపారం / వృత్తి, వ్యవసాయం, ఇతరములు ) ఎంచుకోండి.
దశ 4: డ్రాప్‌డౌన్ నుండి ఎంపికను ఎంచుకున్న తరువాత, అవసరమైన వివరాలను నమోదు చేసి, జోడించండి పై క్లిక్ చేయండి.
- మీరు ఉద్యోగులు / పెన్షనర్‌ను ఎంచుకుంటే, యజమాని / పెన్షనర్ పంపిణీ ప్రాధికారి TAN , ఉపాధి స్వభావం, యజమాని / పెన్షనర్ పంపిణీ ప్రాధికారి యొక్క పేరు మరియు ఉపాధి కాలం వంటి వివరాలను నమోదు చేయండి.
- మీరు వ్యాపారం / వృత్తిని ఎంచుకుంటే, మీరు వ్యాపారం / వృత్తితో అనుబంధం రకం ఎంచుకోవచ్చు, వృత్తిపరమైన వివరాలు మరియు వ్యాపార చిరునామాను నమోదు చేయవచ్చు.
- మీరు ఇంటి ఆస్తిని ఎంచుకుంటే, మీరు ఆస్తి యాజమాన్యం (స్వయం), చిరునామా, గృహాస్తి రకం (స్వీయ ఆక్రమిత / అద్దెకు ఇచ్చారు / అద్దెకు ఇచ్చినట్టు పరిగణన), యాజమాన్య శాతం, ఇతర సహ - యజమానుల సంఖ్య మరియు సహ - యజమాని వివరాలు నివాస స్థితి, PAN వివరాలు మరియు యాజమాన్యం శాతం వంటి వివరాలను నమోదు చేయవచ్చు.
గమనిక: మీరు అనేక ఆదాయ మూలాలని జోడించవచ్చు. అన్ని ఆదాయ మూలాలని జోడించడానికి వివరాలను జోడించండి క్లిక్ చేయండి.
3.4పోర్చుగీస్ సివిల్ కోడ్ వర్తింపును నవీకరించటానికి
దశ 1: నా ప్రొఫైల్ పేజీలో, పోర్చుగీస్ సివిల్ కోడ్ వర్తింపును క్లిక్ చేయండి.
గమనిక: పోర్చుగీస్ సివిల్ కోడ్ అంటే ఏమిటో? క్లిక్ చేయండి ఇది మీకు వర్తిస్తుందేమో తెలుసుకోవడానికి.
దశ 2: సెక్షన్ 5A ప్రకారం పోర్చుగీస్ సివిల్ కోడ్ చేత పరిపాలించబడితే అవును ఎంచుకోండి.
దశ 3: మీ జీవిత భాగస్వామి PAN, ఆధార్ మరియు పేరు వంటి వివరాలను నమోదు చేయండి మరియు జోడించండి క్లిక్ చేయండి.
గమనిక: వ్యక్తులు కాకుండా ఇతర పన్ను చెల్లింపుదారులు, తమ ప్రొఫైల్‌లో ఈ క్రింది వివరాలను నమోదు చేయవచ్చు / నవీకరించవచ్చు:
| పన్ను చెల్లింపుదారుల వర్గం | వివరాలు |
| HUF | కీలక వ్యక్తి వివరాలు |
| సంస్థ | నిర్వాహక భాగస్వామి / నియమించబడిన భాగస్వామి వివరాలు |
| కంపెనీ(సంస్థ) | కీలక వ్యక్తి వివరాలు, హోదా, ప్రధాన సంప్రదింపు, వాటాదారుల వివరాలు |
| AOP | సభ్యుల వివరాలు, ప్రధాన అధికారి వివరాలు |
| ట్రస్ట్ | ట్రస్టీ వివరాలు |
| AJP, స్థానిక అధికారి, పన్ను మినహాయించు మరియు వసూలు చేయు వ్యక్తి, ప్రభుత్వం | ప్రధాన అధికారి వివరాలు |
| CA | సభ్యత్వం సంఖ్య, నమోదు తేదీతో సహా వ్యాపారం / వృత్తిపరమైన వివరాలు |